అసలేముందీ కథలో? అన్నారు.
అసలు కథలో ముఖ్యంగా ఉండవలసినవే పుష్కలంగా ఉన్నాయని సమాధానం.
ఏమిటవి? చదివించే గుణమూ, స్పందింపజేసే గుణమూను.
కథల్లో ఇజాలూ, నిజాలూ, వాదాలూ వివాదాలూ దృక్పథాలూ సిధ్ధాంతాలూ రాధ్ధాంతాలూ సందేశాలూ వంటివి కూరి వ్రాసినంత మాత్రాన అవి మంచికథలుగా తయారు కావు.
ఈమథ్యన చూస్తున్నాను చాలామంది ఏదో ఒక విషయం మీద చిన్నపాటి వ్యాసం ఒకటి తయారు చేసి ఆపైన ఆ విషయాన్నంతా ఒకటి రెండు పాత్రలనోట్లలో క్రుక్కివేసో ఒక లేఖాస్త్రంగా సంధించో అలాంటి మరేదో చిల్లరవేషం వేసి ఆ వ్యాసకళికను కాస్తా కథను చేసిపారేసి హమ్మయ్య అనుకోవటం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే అటువంటి దివ్యరచనలకు బహుమతులూ సంపాదించుకుంటున్నారు.
ఈ చిన్న కథలో తెలుగునాట ఒకనాటి పెళ్ళివారింటి వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అలనాటి మనుషుల తీరుతెన్నులన్నీ కళ్ళకు కట్టినటుగా చూపించారు.
మాటతీర్లూ పెళ్ళిలో జరిగే తంతుల్లో తేడాలు వచ్చి ఉండవచ్చును కాని, మనుష్యుల మనస్తత్త్వాలు అలాగే ఉన్నాయా ఏమన్నా మారాయా అన్న ఆలోచన కలుగుతుంది చదువరికి.
ఈ మాట కొత్త మార్పులకు స్వాగతం.. వెబ్‌పేజీని కొత్త హంగులతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. చాలా బాగుంది. కొత్త సంపాదక వర్గానికి అభినందనలు. అధ్యక్షులవారు మరిన్ని ఆసక్తికరమైన రచనలు పరిచయం చేయాలని ఆకాంక్షిస్తూ…
ఆర్. అన్నయ్య,
కర్నూలు.
పెద్ద కథ. ఇట్టే చదివించింది. అభినందనలు శర్మ గారు!
తెలిసిన సంగతే. ఏమీ చేయలేం కదూ. డ్రామా చూస్తూ కూర్చోడమే కదూ. పైన రావు లక్కరాజు గారు చెప్పినట్లు ఇలాగయినా కొందరికి పని దొరికిందని సంతోషపడడమే ఇక. ఈ వీజీ సంపాదన పనుల్లోకి రాని ‘లేబరోళ్ల’కు నిజమైన సెగ తగిలే వరకు డోకా లేదు.
ఒకనాటి యువ కథ: గోల గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
01/26/2017 12:10 am

పాకశాలలో పాణినీయం గురించి శివగణేష్ అభిప్రాయం:
01/25/2017 4:39 am
చాలా బాగుంది.
గడి నుడి – 3 గురించి Mukundala Balasubramanyam అభిప్రాయం:
01/25/2017 12:03 am
ఈ పదకేళి చాలా బాగుంది! మరిన్ని పజిల్స్ ప్రచురిస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు!
తెగులుకి శిక్ష గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
01/24/2017 1:19 pm
వేమూరి గారు
మీరు, మీ వంటలో అక్కర లేని/యూజ్ చేయని ఇన్ గ్రేడియెంట్సు లిస్టు గివింగు, వై ? 🙂
ఇది చూడండి.
https://manaapnews.blogspot.com/2016/09/blog-post_7.html
సంపాదకులకి – నా బ్రౌజర్లో తెలుగులో టైప్ చేయనీయడం లేదు ఈమాట. అంతకు ముందు వెర్షన్ లో లేఖిని అక్కర్లేకుండా నేరుగా టైప్ చేసే సౌకర్యం ఉండేది. తీసివేసారా?
సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
01/24/2017 12:42 am
మల్లాది నారాయణశర్మగారికి,
కట్టా నరసింహులు గారికి,
ధన్యావాదాలు.
పాకశాలలో పాణినీయం గురించి వీరభద్రం అభిప్రాయం:
01/22/2017 12:26 pm
విందువెన్నెల కాదుకదా, ఏ వరాలిచ్చే మారాజో వచ్చి విందువెన్నెల ని “చిరు విందు వెన్నెల” గా మార్చి ఇచ్చినా సరే ఇందులోని విషయం నాబోటివాడికి అర్థం కాదు.
జనవరి 2017 గురించి R.ANNAIAH అభిప్రాయం:
01/22/2017 7:10 am
ఈ మాట కొత్త మార్పులకు స్వాగతం.. వెబ్‌పేజీని కొత్త హంగులతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దారు. చాలా బాగుంది. కొత్త సంపాదక వర్గానికి అభినందనలు. అధ్యక్షులవారు మరిన్ని ఆసక్తికరమైన రచనలు పరిచయం చేయాలని ఆకాంక్షిస్తూ…
ఆర్. అన్నయ్య,
కర్నూలు.
ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి apparao అభిప్రాయం:
01/22/2017 6:34 am
“అవధాన్లు నిక్కుతూ నీలుగుతూ”…
ఏమిటీ పదజాలం?.యెందులకీ ఆక్రోషం?.
మీ విశ్లేషణా స్థాయిని ఈ విధానం (మీరు వాడిన పదజాలం) తగ్గిస్తున్నది గురువు గారూ!
శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్ గురించి హెచ్చార్కె అభిప్రాయం:
01/21/2017 7:46 pm
పెద్ద కథ. ఇట్టే చదివించింది. అభినందనలు శర్మ గారు!
తెలిసిన సంగతే. ఏమీ చేయలేం కదూ. డ్రామా చూస్తూ కూర్చోడమే కదూ. పైన రావు లక్కరాజు గారు చెప్పినట్లు ఇలాగయినా కొందరికి పని దొరికిందని సంతోషపడడమే ఇక. ఈ వీజీ సంపాదన పనుల్లోకి రాని ‘లేబరోళ్ల’కు నిజమైన సెగ తగిలే వరకు డోకా లేదు.
భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు గురించి yella Ravikanth అభిప్రాయం:
01/21/2017 9:20 am
చక్కగా వివరించారు