పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. సూర్య శతకం గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి అభిప్రాయం:

    02/03/2017 11:08 am

    సూర్యశతకం లోని శ్లోకాలు మై ఇండ్ మీడియా సైట్ లో ఫిబ్రవరి 4, 2017 నుండి స్వరమాలిక వారి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి శనివారం మధ్యాహ్నం 1.30 pm IST శ్లోకాలు భావాలు వినవచ్చును.

    వీటి తాత్పర్యానికి శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు ఇచ్చిన ప్రతిపదార్థం తో ప్రచురింపబడిన పుస్తకం ఆధారం.
    వెబ్ సైట్: (లైవ్) — ఆర్కైవ్స్ప్రతిపదార్థం.

  2. తాటిపండుకల్లు గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    02/02/2017 7:12 pm

    Excellent poem.

    కవిత మొత్తంలో అందంగా ఇమడని ఒకేఒక్క మాట, “బుద్ధిమంతుడు.”

    మరో విషయం. తాటికల్లు గురించి నాకు మరుపురాని అనుభవాలున్నాయి. పండిన తాటిపండునుంచి కల్లు రాదనుకుంటాను. ముదిరిన ముంజెలొస్తాయి. కవి ఉద్దేశం వేరుకావచ్చు.

    ఏది ఏమయినా I am a strong believer in Roland Barthes. It’s the reader that really completes a poem.

    అబినందలతో,
    వేలూరి వేంకటేశ్వర రావు.

    ps: When I was the Chief Editor of eemaaTa, where were you? Hybernating?

  3. గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి Uma Kaundinya అభిప్రాయం:

    02/02/2017 3:51 pm

    In the compilation, “The Best of Mc Sweeney’s” (2013) there were several gaps between the words, in addition to the one (dau ghters) cited by Mr. Ramana Murthy. Here are some: ad opt, yo unger, b uyer, b ig, d inner, and so on.

    I think, the story was first published in The Mc Sweeney’s, 6th issue. And, Mc Sweeney’s is a quarterly, editied by Dave Eggers and Jordan Bass.

    Regards.

    Uma Kaundinya

  4. గులకరాళ్ళు గురించి Deepthi అభిప్రాయం:

    02/02/2017 6:02 am

    చాలా బాగా రాసావు మానసా!

  5. గులకరాళ్ళు గురించి బివివి ప్రసాద్ అభిప్రాయం:

    02/02/2017 3:24 am

    Beautiful poem!

  6. చిత్రం – ‘బాపు’రే విచిత్రం! గురించి వేణు అభిప్రాయం:

    02/02/2017 2:54 am

    ఈ వ్యాసం ఆలస్యంగా చదివాను. ఆధునిక తెలుగు సాహిత్యంలో క్లాసిక్స్ గా పేరుపొందిన పుస్తకాలు చాలావాటికి బాపు ముఖచిత్రాలను వేశారని చెప్పవచ్చు. ఎప్పటికీ గుర్తుండిపోయే ముఖచిత్రాలను ఎన్నో వేశారాయన.

    బాపు బొమ్మల ప్రత్యేకత, పరిణామాల గురించి రాస్తూ వాటిని నిరూపించే చిత్రాలను ఇవ్వటం బాగుంది. బాపు చిత్రాల్లో నచ్చిన విషయాలతో పాటు ఆ బొమ్మల పరిమితులను కూడా చర్చించటం మంచి విషయమే. వీలైనంత సమగ్రంగా, సాధ్యమైనంత సమతూకంగా రాయటానికి ప్రయత్నించిన వ్యాసమిది. రచయితకు అభినందనలు!

  7. నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి రవి అభిప్రాయం:

    02/02/2017 2:45 am

    అమోఘమైన పద్యాన్ని గురించి ఇంపుగా చెప్పారు. ఈ పద్యం తూగులోనే కవి భావం ఉందనిపిస్తుంది.

    ఆ రుచిరాననాబ్జదరహాసవిలాసవికాసభాసినీహారకరాతిభాతిన్ అమలాంగశరీరతుషారదీప్తికాంత – ఇంతవరకూ ఎక్కువభాగం అల్పప్రాణాక్షరాలతో, అనుప్రాసలతో సుకుమారంగా అలరారిన ఆ “ఉరునగంబు” తర్వాత పాదాలలో, ఘర్మజలం ప్రస్తావన రాగానే (సమ్మదరసోత్కటఘర్మజలంబు పర్వి పొల్పారె హిమాచలంబు నమరాధిపవాహిని) శబ్దాలకూర్పులో ఓజోగుణాన్ని సంతరించుకుని “కప్పినట్టిదై” అన్న చివరి క్రియతో, ఒకింత బరువుగా, అద్బుతంగా ముగుస్తోంది.

    సంస్కృతమహాకావ్యం కుమారసంభవాన్ని కూడా ప్రస్తావించి వివరించడం బావుంది.

    ఇదే ఘట్టంలో ఈశ్వరుని అవస్థను సంస్కృత”నాటక”రచయిత వామన భట్టబాణుడు చాలా సులభంగా ఇలా వర్ణించాడు.

    తదను యుగపదీశః పార్వతీవక్త్రపద్మే |
    స్మితవికసితగణ్డే ప్రోహిణోల్లోచనాని ||

    (ఆపై సమయస్వరూపుడైన ఈశ్వరుడు పార్వతి ముఖమనే పద్మమున, చిరునవ్వుతో వికసించిన చెక్కిలియందు తన చూపులను సారించాడు. యుగపత్ = అన్న ప్రయోగం గమనార్హం)

    ఆ వెంటనే పార్వతి –

    పులకితతనురంతర్భావమావేదయన్తీ |
    దరనిమితముఖేందుః సా చ సవ్రీడమస్థాత్ ||

    (మనసున ప్రణయభావమును తలంపుచూ తనువు పులకరింపగా, చిరునవ్వుతో చంద్రబింబమువంటి మోమును దించుకుని, లజ్జ అను అవస్థను పొందెను.)

    పై ఘట్టం నిష్కంభకం. అంటే నారదుడు మహేంద్రునికి శివపార్వతుల గురించి చెప్పిన సందర్భంలోనిది. నారద “ముని” నోట ప్రణయోऽదంతం, వచ్చింది కాబట్టి సంక్షిప్తంగా ముగించాడు కవి. ఈ చిన్న శ్లోకాల్లో కూడా శివుని పక్షాన పద్మముఖం అని, పార్వతి పక్షాన (పద్మవైరి అయిన) ఇందుముఖం అని మెలిపెట్టి చమత్కరించాడాయన.

    – మంచి పద్యాన్ని, అద్భుతమైన భావాన్ని వివరించినందుకు, భట్టబాణుని గుర్తు చేయించినందుకు మరోసారి ధన్యవాదాలు.

  8. నేలసంపెంగ గురించి రవి అభిప్రాయం:

    02/02/2017 12:59 am

    70’s లో వచ్చిన ముగ్ధమైన సినిమాను, దానికి మూలమైన కథను చక్కగా అనువదించి వ్రాశారు. ఈ సినిమా చూసిన తర్వాత విద్యా సిన్హా, లత పాట, ఆ రజనీగంధ పరిమళాలే కొన్ని రోజులు అలా నిలిచిపోయాయి.

    అయితే – మనసుకు నచ్చిన వాడు రజనీగంధ పూలను తీసుకువస్తాడని అందమైన కలలు కంటూ, పక్కింటి బాబు వస్తే వాణ్ణి ఒళ్ళో పెట్టుకుని కథలు చెబుతూ ఉండే అందమైన అమ్మాయి ని – టీవీ సీరియళ్ళూ, ఆఫీసులో ఓవర్టైముల ఈ రోజుల్లో ఊహించలేం.

    పూలు తీసుకు వచ్చే మగవాళ్ళు, కలలు కనే అందమైన అమ్మాయిలూ ఇద్దరూ ఇప్పుడు లగ్జురీ యే. 🙂

  9. చెప్పేదెవరు? గురించి nmrao bandi అభిప్రాయం:

    02/02/2017 12:14 am

    ప్రోత్సాహానికి ధన్యవాదాలు గురువు గారు.
    అవునండి తెలిస్తే అంతకన్నా కావలసినది,
    కోరుకునేది కూడా ఏమీ ఉండదు.

  10. గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి రమణమూర్తి అభిప్రాయం:

    02/01/2017 10:36 pm

    సున్నితమైన హాస్యం, బాగుంది! పునరుక్తి ఇక్కడ దోషం కాకపోగా హాస్యాన్ని పంచింది…

    (Lydia Davis ఈ కథ ఒక్కో పుస్తకంలో ఒక్కోలాగా ఉంది. Samuel Johnson is Indignant (2001) లో ఎలాంటి టైపోగ్రాఫికల్ దోషాలనీ లేకుండా ప్రచురించగా, The Collected Stories of Lydia Davis (2010) పుస్తకంలో మాత్రం మొదటి వాక్యంలో మాత్రమే ‘dau ghters’ అని ప్రచురించారు. ఇది సజెస్టివ్ గా ఉంది. ఇంతకు మించిన తప్పుల్ని ఆవిడ ఆ మూలకథలో ప్రకటించారో లేదో తెలీదు… )