పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. నేలసంపెంగ గురించి venkat అభిప్రాయం:

    02/08/2017 6:16 am

    చాలా బాగుంది , యూట్యూబ్ లో సాంగ్ కూడా చూసా ఈ కథ చదివి.
    అనువాదం లా లేదు అస్సలు . ప్రతీ లైన్ అద్భుతం .

  2. ఓ పెన్నీ, నా పెన్నీ! గురించి Rao Vemuri అభిప్రాయం:

    02/07/2017 10:14 pm

    జయకుమార్ గారు,

    మీరు ఎప్పుడో రాసిన అభిప్రాయాన్ని ఇప్పుడే చూసేను. ఆలస్యంగా. ధన్యవాదాలు.

  3. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Rao Vemuri అభిప్రాయం:

    02/07/2017 10:01 pm

    భాస్కర నాయుడు గారికి
    ధన్యవాదాలు.
    – వేమూరి

  4. అవ్యయ: సౌభాగ్య కుమార మిశ్ర ఒరియా కవితలు గురించి వంశీ అభిప్రాయం:

    02/07/2017 11:22 am

    భూషణ్ గారు,

    ఈ పుస్తకం కినిగేలోగానీ విశాలాంధ్ర(హైదరాబాదు – నవచేతన) లో గానీ దొరకలేదు, దొరుకుచోటు కాస్త తెలుపగలరు.

  5. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి ellanki. bhbhaaskara naidu. అభిప్రాయం:

    02/07/2017 3:22 am

    Vemuri garu, your article is very informative and interesting.

  6. నేలసంపెంగ గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    02/06/2017 11:29 pm

    రవి గారూ, ఎన్నెల గారూ ధన్యవాదాలు.

  7. నేలసంపెంగ గురించి Ennela అభిప్రాయం:

    02/06/2017 8:24 pm

    చాలా బాగుంది. సినిమా చూస్తున్నట్టు అన్నీ స్పష్టంగా ఊహాలోకొచ్చాయి.

  8. రెండు కవిత్వాలు గురించి Html అభిప్రాయం:

    02/05/2017 7:57 pm

    కవిత్వాలు అంటే ఏమిటండి? నిఘంటువు చూసినా అర్ధం దొరకలేదు

  9. తాటిపండుకల్లు గురించి lyla yerneni అభిప్రాయం:

    02/05/2017 10:26 am

    That’s a peach! Lovely!

    I guess “పండు తాటికల్లు” is rightly fermented, ready to drink white toddy. Not ‘moonshine’ which could kill you. The guy is a regular Pinocchio. If it is not for his bad friends, he would be straight and his nose won’t grow so.

    I am enjoying the company of all writers and critics here, who are writing with such good humor and easy grace.

    The magazine is so good looking this year, my compliments and thanks to the eemaata administrative team. Feel like placing more computer screens around, to pump up more power, tech glitz into 2017.

    Having a ball! Have a great Super Bowl Sunday! Enjoy some pizzas soaked in rum and vodka. – Lyla

  10. రెండు కవిత్వాలు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    02/05/2017 4:01 am

    ఉన్నవాళ్ళ లేనివాళ్ళ బతుకు చిత్రాల మధ్యనున్న కాంట్రాస్టుని శక్తివంతంగా పట్టి చూపిన కవిత. బతకడానికి చెమటోడ్చే మనిషికి చెమట రొమాంటిక్‌గా ఉండదేమో కానీ, ఎండకన్నెరుగని సున్నితదేహాలకి అదికూడా రొమాంటిక్ దినుసే!

    ఈ కవిత చదవగానే నాకు మొన్నీ మధ్యనే మళ్ళీ చదివిన పెన్నేటిపాటలో పద్యాలు గుర్తుకొచ్చాయి:

    ఈ యింటనున్నట్టి యిటుకగోడల పాలగారలో అద్దాలు కలిసిపోవు
    ఈ యింటి మహిడీల నెక్కిన చానల వేనలిలో మబ్బుసోన లూరు
    ఈ యింట దిరుగాడు నింత పిల్లియు నూరిపెద్ద రైతుల నిలవేయ జాలు
    ఇచట త్రేన్పులె కాని విన్పింప వూర్పు, లిచట రూకల గలగల లెత్తిపోవు
    ఇచట లక్ష్మీసరస్వతులే వసింతు, రిచట లేనిది మానవహృదయ మొకటె

    ఈ యింటి యజమాని ఎంత విద్యావంతు డెపుడు భాగవతమ్మునే పఠించు
    ఈ యింటి యిల్లాలు పూయించు గన్నుల కొల్లలు కొల్లలు మల్లెపూలు
    ఈ యింటి కొడుకొక్క డింగ్లాండులో ప్రజాస్వామ్యశోధన నెంతొ జరిపి వచ్చె
    ఈ యింటి కూతురు పోయిన యేడె సాంఘికశాస్త్రమున పట్ట మొకటి గొనియె

    ఎచట జూచిన చిత్రాలు నెన్నొ శిల్పఖండములు కనిపించు నెక్కడను మలిన
    మన్నదేలేదు కాని సంపన్నగృహము చొచ్చి చూచిన నాత్మయే శూన్య మిచట

    ఎటు చూచినా ప్రక్కలెండి యున్నారు
    ఎటు చూచినా విలాపించుచున్నారు
    ఎటు చూడలేక తమ కిటికీలు మూసుకొని
    కటు జీవిత యథార్థ కథ చూడకున్నారు

    అయితే, ఈ “రెండు కవిత్వాలు” కవితలో భావకవిత్వాన్నీ (“అన్నీ జాగర్తగా తుడిచి వుంచిన గాజు పదాలు”), భక్తికవిత్వాన్నీ (“దేవుడికీ భక్తుడికీ మధ్య రొమాన్స్ కవిత్వం”) ఒకే గాటకింద కట్టేయడం సబబుగా లేదు. భావకవిత్వంలో భక్తి ఒక భాగమయినా (ఏకేశ్వరోపాసన), భక్తికవిత్వం అంతకన్నా ప్రాచీనమైనదీ, ప్రత్యేకమైన ఉనికి కలదీనూ. ఆ భక్తికవిత్వం పాడిన భక్తులెవరూ చెమట మరకలంటని అందమైన భవనాల్లో ఉండినవారు కారు. అంతెందుకు, ఈ కవితలోనే ఉదాహరించిన ముగ్గురు కవులుకూడా అలాంటివారు కారు. అంచేత ఆ భాగం మిగతా కవితతో అతకలేదు సరికదా ఒక distraction అనిపించింది.