ఇది పూర్తిగా నిజం కాదండి. ఈ ఇంటర్వ్యూ జరిగినప్పుడూ లేదు ఇప్పుడూ అలా లేదు. నేను ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు కొన్ని యూనివర్సిటీలలో ఇలా ఉం(డే)ది కానీ అన్నీ అలా లేవు. ఒకే యూనివర్సిటీలో బి.ఎస్ దగ్గిర్నుంచి పి.హెచ్.డి వరకూ చేసిన వాళ్ళు అదే యూనివర్సిటీలో ఉద్యోగం చేయడం నాకు తెలుసు. (దాదాపు పది పదిహేను చోట్లదాకా ఇది నేను స్వయంగా చూసినది, యూనివర్సిటీలో ఉద్యోగం చేసినప్పుడు). కానీ కొన్నింటిలో ఈ రూల్ ఉంది. రైస్ యూనిర్సిటీ ఇక ఉదాహరణ (అప్పట్లో).
మంచి పనుల గురించి ఏమో గానీ పిహెచ్.డి అయ్యాక అదే స్కూల్లో ఉద్యోగం చేసే కుర్రాడు మాత్రం తన పాత ప్రొఫెసర్ ని తప్పించుకు తిరగడం నేను చూసాను. 🙂 When I spoke to such people, their view of their own professors in the thesis committee was “ah, he is something!” with a click on tongue.
మాన్యులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారికి
నమస్కారములతో,
శివాగ్నిలింగస్కాందాదిపురాణోపదిష్టమైన కథ ఒకటుండగా కాళిదాసు దానిని స్వాయత్తీకరించికొని ఆత్మీయమైన కావ్యశిల్పీకరణకౌశలంతో లోకోత్తరమైన అర్థపుష్టికి, ధ్వనివైభవానికి ఉదాహరణప్రాయంగా మలిచి చెప్పాడన్నది స్పష్టం. మన్మథుడు ధనుస్సుకు బాణాన్ని తొడిగిన సన్నివేశం మాత్రమే కథాగతంగా ఆవిష్కరింపబడింది. పరమశివుని ధైర్యాన్ని కించిన్మాత్రమైనా విలోపింపజేసినది, ఆయనకు ఇంద్రియక్షోభకారకమైనది ఆ మన్మథశరనిపాతమే అన్నది వ్యంజింపబడింది. ధనుశ్శబ్దం కేవలం వింటియందు మాత్రమే గాక ద్వాత్రింశదాయుధాలకు, అష్టావింశత్యుత్తరశతసంఖ్యాకములైన అస్త్రాలకు అనువర్తనీయమని ధనుర్వేదసూత్రం. మన్మథుడు తన ధనుస్సునకు సంధించినది పాణిముక్తాలైన బాణకోటిలోని సామాన్యశిలీముఖాన్ని కాదు. అది బ్రహ్మాస్త్రాదుల వలె ప్రయోగమే తప్ప ఉపసంహారం లేని మంత్రముక్తమైన సంమోహనమనే దివ్యాస్త్రం. శస్త్రాస్త్రములు రెండింటికీ బాణమన్నది వ్యావహారికబోధం. యుద్ధోపక్రమణాన స్వస్తికపాదావస్థితుడైన యోధుడు వామహస్తంతో ధనుస్సును చేతబూని, సప్తవింశత్యంగుళాలు ఉభయపాదాల నడుమనుండగా వైశాఖస్థానంలోకి వచ్చి, శరీరభారమంతటినీ కాలివ్రేళ్ళపై నిలిపి, వింటి క్రిందికొనను నేలకు మోపి, అల్లెత్రాటిని పైకొప్పుకు బిగించటం జరుగుతుంది. ఆ ప్రక్రియను కేవలసాంకేతికమైన ధనుశ్శాస్త్రపరిభాషతో వివరించి కావ్యార్థాన్ని భగ్నం చేయటం ఇష్టం లేక మహాకవి “హరబద్ధలక్ష్యః శరాసనజ్యాం ముహు రామమర్శ” అని దృశ్యాన్ని మాత్రం ప్రకాశింపజేశాడు. అది ప్రమార్జనమనే ధనుష్కరణం. “శరాసనజ్యాం ముహు రామమర్శ” అంటే లక్ష్యభేదనార్థం ఎక్కుపెట్టిన వింటిని, బిగించిన అల్లెత్రాటిని మళ్ళీ ఒకసారి సరిచూసుకొన్నాడని భావం. ఆ తర్వాత అమ్ములపొది నుంచి ‘ఆదానము’ అనే శరగ్రహణక్రియను – ఆ అవసరం లేదు కనుక – మహాకవి ప్రస్తావింపలేదు. నారిని బిగించిన తర్వాత వింటికి తిరుగులేని సంమోహనాన్ని తొడిగాడని శరవిన్యాసాన్ని మాత్రం వర్ణించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడని, సామాన్యబాణకోటికి వలె ఉపచ్ఛేదముతో గాక మంత్రముక్తమైన మహాస్త్రాన్ని విడిచిపెట్టాడని ప్రతీయమానం. అది ధనుఃసంహితలలో ఉపదేశింపబడిన ప్రయోగవిధానం.
అస్త్రప్రభావం వల్ల పరమశివుడు చంద్రోదయారంభం నాటి అంబురాశి వలె ఈషత్పరిలుప్తధైర్యుడు అయ్యాడు. సంమోహనప్రభావం వల్లనే ఆయన ధీరత్వం ఎంతో కొంత సడలిపోయింది. దొండపండు వంటి క్రిందిపెదవిని కలిగిన పార్వతీదేవి ముఖమండలమందు తన మూడుకన్నుల చూపులను నిగుడింపజేశాడు. ఇందుచే భగవంతుడైన పరమశివుని మనస్సులో రతిభావోదయం చెప్పబడినదని మల్లినాథ సూరి వివరించాడు. ఆయన చూపులు సోకి పార్వతీదేవి నిలువెల్లా పులకాంకురాలతో పూచిన లేతకడిమి లాగున కానవచ్చింది. ఆమె మనస్సులో సైతం రతిభావం అంకురించింది. “న కేవలం హరస్యైవ దేవ్యా అ ప్యుదితో రతిభావ ఇతి భావః” అని మల్లినాథ సూరి.
అప్పుడు పరమశివుడు ఎంతో ప్రయత్నం మీద మనస్సును నిగ్రహించికొని, తన ఇంద్రియవికారానికి (రతిభావోదయానికి) కారణమేమిటని నలుదెసల కలయజూశాడు. దండయాత్రను మొదలుపెట్టి, ఆలీఢస్థానంలో నిలబడి, వింటిని వలయాకారంగా ఆకర్షించి, శరమోక్షణానికి అభ్యుద్యతుడై ఉన్న మన్మథుని చూశాడు. ఇది పరమశివుడు వీక్షించిన దృశ్యం.
అయితే, చతుర్థసర్గంలో విలాపావస్థలో ఉన్న రతిదేవికి గుర్తున్న దృశ్యం వేరు. మన్మథుడు ధనుస్సును తొడయందు నిలిపి, ఒకవైపు శరానికి వంకతీర్చుతూ, మరొకవైపు వసంతునితో చిరునవ్వు నవ్వుతూ – అతనితో మాట్లాడుతూనే, నయనోపాంతవిలోకనాలతో (కడకంటి చూపులతో) ఆమెకేసి చూశాడు. ఆలీఢస్థానంలో ఉన్న మన్మథుడు దక్షిణపాదాన్ని కుంచితం చేసినప్పుడు ధనుస్సు ఒడిలో (ఉత్సంగమందు) ఉన్నట్లుగా ఆమెకు కానవచ్చినదన్నమాట. అది ప్రత్యాలీఢస్థానంలో ఉన్న మన్మథుని విక్షేపక్రియ. ప్రయోక్తచే శరమోక్షణం జరిగినదని ప్రతీయమానం. అప్పుడు మనస్సంచలనాన్ని పొందిన పరమశివుడు కన్నువిప్పి చూసే సరికి మన్మథుడు క్రీగంటితో ధనుస్సునకు బిగించిపట్టిన తన పిడికిటిని చూస్తూ (దక్షిణాపాంగనివిష్టముష్టియై), ఆకుంచితసవ్యపాదుడై, మండలీకృతచారుకోదండుడై, బాణం వేయటానికి మళ్ళీ ఆలీఢస్థానకంలో ఉన్నాడు. పునర్విక్షేపక్రియకు సంసిద్ధంగా నిలబడి ఉన్నాడన్నమాట. తపోభంగం చేయటానికి సాహసించాడని పరమశివుడు భ్రూభంగదుష్ప్రేక్ష్యముఖుడు అయ్యాడు. ప్రయోగింపబడినది అమోఘమైన సంమోహనం అయినప్పటికీ ఆయన ధనుర్వేదస్వరూపుడు కాబట్టి మోహావస్థ కలుగలేదు. ఇంద్రియవికారం మాత్రమే కలిగింది. దానినే “త్రినేత్రస్య స్మరశరనిపాతక్షోభః” అని క్షేమేంద్రుడు వివరించాడు.
క్షణలేశంలో మన్మథదహనం సంభవించింది. అది రతిదేవికి గుర్తుండిపోయిన దృశ్యం కాదు.
కాళిదాస మహాకవి అక్షరాక్షరం వాచ్యం చేయక, ప్రకాశ్యార్థప్రకాశకంగా దృశ్యాన్ని నిర్వహించినందువల్ల ఇన్ని రకాల ప్రతిపాదనలకు ఆస్కారం కలిగింది.
అన్నట్లు, శ్రీ దంతుర్తి శర్మగారు జరుగనున్న వ్యాజ్యంలో తమను ముద్దాయిగా భావించినట్లున్నది కాని, మౌలికమైన శివపురాణకథాప్రస్తావన వల్ల వారిని ముత్+దాయి (సంతోషకారకులు) గానే పరిగణింపవలసి ఉన్నది.
అందువల్ల కాళిదాసు అమ్మవారినీ అయ్యవారినీ చాలా జాగ్రత్తగా చూపిస్తాడు తన శ్లోకాల్లో. మరో విషయం ఏవిటంటే శుద్ధమైన మనస్సున్న పరమేశ్వరుణ్ణి, తనని అంతటి పండితుణ్ణి చేసిన జగన్మాతనీ మామూలు మన్మధుడూ ఆయన తుఛ్ఛమైన బాణాలూ ఏవీ చేయలేవు అని చెప్పడం కోసం అలా అని ఉంటాడని నేననుకుంటున్నా.
ఈ పాయింటు మీద కాళిదాసు గురించి పెద్ద వివాదమే ఉంది. శర్మ గారూ, మీరొకసారి కాళిదాసు కుమారసంభవానికి అనువాదం చదవాల్సిందే, అన్ని సర్గలూను.
శర్మగారుః “రామాయణం చదివి లవకుశల గురించి వేరేగా రాసినా ఆది మొదలు రామాయణమే కదా?”
ఇది కాలిదాసు పైనా లేక ఒక సామాన్య అభిప్రాయమా అన్నది నా సందేహము. కొందఱు అంటారు మొట్టమొదట కాలిదాసమహాకవియే ఉత్తరరామాయణ కథను రఘువంశములో వ్రాసినాడని. మనము ఇప్పుడు వాల్మీకి ఉత్తరరామాయణముగా చదువునది పిదప వ్రాయబడినదని. లవకుశుల కథ రఘువంశమా లేక రామాయణమా?
కాళిదాసుకి కుమార సంభవం రాయడానికి ఐడియా ఎలా వచ్చిందంటారు? శివపురాణం లోంచేనా లేకపోతే ఆయన స్వంతంగా రాసాడా? రామాయణం చదివి లవకుశల గురించి వేరేగా రాసినా ఆది మొదలు రామాయణమే కదా? అలా ఆలోచిస్తే వేల్చూరి వారికి మరింత మంట ఎక్కడానికి నేనే కారణం. 🙂
నాలిక మీద బీజాక్షరాలు రాయించుకున్నాడు కనక కాళిదాసుకి అమ్మవారంటేనూ, అయ్యవారంటేనూ భక్తి (లైలాగారు ఏమన్నా సరే! :-)) అని నా ఉద్దేశ్యం. అందువల్ల కాళిదాసు అమ్మవారినీ అయ్యవారినీ చాలా జాగ్రత్తగా చూపిస్తాడు తన శ్లోకాల్లో. మరో విషయం ఏవిటంటే శుద్ధమైన మనస్సున్న పరమేశ్వరుణ్ణి, తనని అంతటి పండితుణ్ణి చేసిన జగన్మాతనీ మామూలు మన్మధుడూ ఆయన తుఛ్ఛమైన బాణాలూ ఏవీ చేయలేవు అని చెప్పడం కోసం అలా అని ఉంటాడని నేననుకుంటున్నా. ఈ లైన్లో (కాళిదాసుకి ఐడియా ఎలా వచ్చిందో అవన్నీ అనవసరం. ఆయన ఏం రాసాడో అనేది ఒక్కటే చూడాల్సింది) అయితే వేలూరివారిదే విజయం. 🙂 ఆయన వెంఠనే లా ఆఫీసు తెరిచేయవచ్చు.
కాళిదాసుకి మనం ఇలా కొట్టుకుంటాం అని తెలుసో తెలియదు కానీ నేను వేలూరి గారికి పురాణాల్లోంచి అవీ ఇవీ ఎత్తుకొచ్చి పురి ఎక్కిస్తానని తప్పకుండా తెలుసని అనిపిస్తోంది ఎందుకో.
‘ఉద్ధతుల మధ్య పేదల కుండ తరమె’ అని మొదలుపెట్టిన వేలూరివారు ఇప్పుడు ఒక అభిమన్యు’కుమారు’నిలా, ‘బాల’చంద్రునిలా యిందరి మధ్య ఒంటరిపోరాటం చేయడం చాల ముచ్చటగా ఉంది 🙂 యుద్ధం పూలబాణాల గురించి కాబట్టి పారేది ‘రక్తి’ తప్ప ‘రక్తం’ కాదు, అంచేత యిబ్బందేమీ లేదు!
ఇక్కడ చర్చ కాళిదాస కుమారసంభవంలో మన్మథుడు శివునిమీద బాణాన్ని విడిచాడా లేదా అనే తప్ప, మిగతా పురాణ కావ్యాల గురించి కాదు. వాటి ద్వారా కాళిదాసు శ్లోకాలని అన్వయించుకొనే మాటయితే, కాళిదాసు ప్రత్యేకత ఎలా తెలుస్తుంది? కాళిదాసు ప్రత్యేకత చూసే ఉద్దేశం లేనప్పుడు అతని రచన చదవడం అనవసరం కదా!
కాళిదాసు చాలా అల్లరివాడు! తన తర్వాత, ఏ రెండువేల సంవత్సరాలకో యిలా ఈమాట పూల రణరంగంగా మారాలని కోరి మరీ అలా రచించాడు! 🙂
ఆ సందర్భంలో మన్మథ రూపాన్ని వర్ణించే రెండు పద్యాలలోనూ (శివుడు కించిత్ పరిలుప్త ధైర్యుడు అయ్యే ముందూ, అయిన తర్వాత) మన్మథుడు బాణాన్ని సంధించి విడవడానికి సంసిద్ధుడై ఉన్నట్టుగానే వర్ణించాడు. విడిచిపెట్టాడని చెప్పలేదు. అంచేత అది కోరుండి, చాలా జాగ్రత్తగా కవి చేసిన పనే. కొందరు రెండవ శ్లోక వర్ణనని రెండవ బాణం విడవడానికి సిద్ధమయిన మన్మథుడు అని అన్వయించారు. కొందరు మొదటి బాణాన్ని విడిచిపెట్టనే లేదు అని అన్వయించారు.
ఇక, పార్వతీదేవి చెలికత్తె మాటలను ఉత్ప్రేక్షగా పరిగణించాలే తప్ప నిజంగా భావించలేం. అక్కడకూడా, మన్మథబాణాన్ని శివుని తాకనివ్వలేదు కాళిదాసు! శివుని పరిలుప్త ధైర్యానికి మన్మథబాణం కారణం కాదని చెప్పడం కాళిదాసు ఆశయం అన్నది సుస్పష్టం. (కాళిదాసుని తుచ తప్పకుండా తన హరవిలాసంలో అనుసరించాడు శ్రీనాథుడు.)
పద్యం గురించీ, అన్వయం గురించీ చెప్పేంత దాన్ని కాదు.
కానీ పురాణాలను ఒప్పుకోని కోర్టు, అసలు పురాణాల ఆధారంగా వ్రాసిన కావ్యం గురించి విచారించడం మాత్రం ఎలా ఒప్పుకుందని సందేహం అయితే కలిగింది.
శ్రీ మురళీధర రావు అంటే నాకెంతో గౌరవం, భయం కూడాను. చెప్పొద్దూ! ఆయన రాసిన ప్రతివాక్యానికీ నేను నిఘంటువులు, ప్రౌఢవ్యాకరణం తిరగేసుకుంటాను. ఆరకంగానన్నా ఆప్టే, మోనియర్ లని చూడటం జరుగుతుంది!
(మురళీధర రావు ధర్మవా అని, నా మోనియర్ విలియం పేజీలు కుక్క చెవుల్లా తయారయ్యాయి!)
అయితే అసలు విషయం:
ఈ వివాదంలో ఆయనకూడా “పప్పులో కాలు వేసారు,” అని అనను గాని, వివాదాన్ని తిరకాసు మార్గానికి deliberateగా మళ్ళిస్తున్నారని, నిరాఘాటంగా చెప్పగలను.
మన వివాదం కాళిదాసు రాసిన కుమారసంభవానికి సంబంధించినది. కుమారసంభవం కావ్యం. శివ పురాణం, స్కాంద పురాణం, ఇంకేదయినా పురాణం కానీయండి … అవి పురాణాలు. అంటే, అవి పసుపు రాసి భక్తిగా పూజాగృహంలో దేవుడి ముందు పెట్టుకోవలసిన గొప్ప గ్రంథాలు. ఏదన్న పండగో, పబ్బమో, సరస్వతీ పూజో, విఘ్నేశ్వర పూజో వస్తే, ఎండిన పసుపు పీకేసి, మళ్ళీ వాటికి కొత్తపసుపు రాసి దేవుడిముందు పెట్టుకోవటం ఆచారం.
కావ్య వివాదంలో పురాణప్రసక్తి తేవటం ఏ కోర్టూ ఒప్పుకోదు. ఎంత చవట దక్షిణాది అమెరికన్ జడ్జీ అయినా సరే, సాక్ష్యంగా పురాణాలు వల్లించటం ఒప్పుకోడు/ ఒప్పుకోదు. ఒకవేళ Defense Lawyer object చెయ్యకపోయినా, జడ్జీ గారే పురాణాలని సాక్ష్యాధారాలుగా తీసుకోరావటం “అప్రస్తుతం,” irrelevant అని అంటారు.
కుమారసంభవంలో మన్మధుడు శివుడిపై బాణం వేసినట్టు రుజువు లేదు. That is a FACT.
అయితే, మురళీధర రావు ప్రస్తుతించిన కాళే వ్యాఖ్యాన గ్రంథం, అమరుకోశం వివరణా నేనూ తిరగేసి చూసాను. కాళే కూడా మన్మథుడు బాణం వేసాడని ఘంటాపథంగా చెప్పలేదు. ఆయన వ్యాఖ్యానంలో ఊహించుకున్న మాటలు రాసాడు. అంతే. కాళే అంటే నాకూ చాలా గౌరవం. (అయితే, ఆయన పుస్తకాలు అచ్చు వేసిన ప్రచురణకర్తలంటే నాకు చాలా అసహ్యం. ఆ విషయం ప్రస్తుత వాదనకి అప్రస్తుతం!)
తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్‌వ్యూ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
03/02/2017 8:17 am
ఇది పూర్తిగా నిజం కాదండి. ఈ ఇంటర్వ్యూ జరిగినప్పుడూ లేదు ఇప్పుడూ అలా లేదు. నేను ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు కొన్ని యూనివర్సిటీలలో ఇలా ఉం(డే)ది కానీ అన్నీ అలా లేవు. ఒకే యూనివర్సిటీలో బి.ఎస్ దగ్గిర్నుంచి పి.హెచ్.డి వరకూ చేసిన వాళ్ళు అదే యూనివర్సిటీలో ఉద్యోగం చేయడం నాకు తెలుసు. (దాదాపు పది పదిహేను చోట్లదాకా ఇది నేను స్వయంగా చూసినది, యూనివర్సిటీలో ఉద్యోగం చేసినప్పుడు). కానీ కొన్నింటిలో ఈ రూల్ ఉంది. రైస్ యూనిర్సిటీ ఇక ఉదాహరణ (అప్పట్లో).
మంచి పనుల గురించి ఏమో గానీ పిహెచ్.డి అయ్యాక అదే స్కూల్లో ఉద్యోగం చేసే కుర్రాడు మాత్రం తన పాత ప్రొఫెసర్ ని తప్పించుకు తిరగడం నేను చూసాను. 🙂 When I spoke to such people, their view of their own professors in the thesis committee was “ah, he is something!” with a click on tongue.
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
03/01/2017 10:37 pm
మాన్యులు శ్రీ వేలూరి వేంకటేశ్వరరావు గారికి
నమస్కారములతో,
శివాగ్నిలింగస్కాందాదిపురాణోపదిష్టమైన కథ ఒకటుండగా కాళిదాసు దానిని స్వాయత్తీకరించికొని ఆత్మీయమైన కావ్యశిల్పీకరణకౌశలంతో లోకోత్తరమైన అర్థపుష్టికి, ధ్వనివైభవానికి ఉదాహరణప్రాయంగా మలిచి చెప్పాడన్నది స్పష్టం. మన్మథుడు ధనుస్సుకు బాణాన్ని తొడిగిన సన్నివేశం మాత్రమే కథాగతంగా ఆవిష్కరింపబడింది. పరమశివుని ధైర్యాన్ని కించిన్మాత్రమైనా విలోపింపజేసినది, ఆయనకు ఇంద్రియక్షోభకారకమైనది ఆ మన్మథశరనిపాతమే అన్నది వ్యంజింపబడింది. ధనుశ్శబ్దం కేవలం వింటియందు మాత్రమే గాక ద్వాత్రింశదాయుధాలకు, అష్టావింశత్యుత్తరశతసంఖ్యాకములైన అస్త్రాలకు అనువర్తనీయమని ధనుర్వేదసూత్రం. మన్మథుడు తన ధనుస్సునకు సంధించినది పాణిముక్తాలైన బాణకోటిలోని సామాన్యశిలీముఖాన్ని కాదు. అది బ్రహ్మాస్త్రాదుల వలె ప్రయోగమే తప్ప ఉపసంహారం లేని మంత్రముక్తమైన సంమోహనమనే దివ్యాస్త్రం. శస్త్రాస్త్రములు రెండింటికీ బాణమన్నది వ్యావహారికబోధం. యుద్ధోపక్రమణాన స్వస్తికపాదావస్థితుడైన యోధుడు వామహస్తంతో ధనుస్సును చేతబూని, సప్తవింశత్యంగుళాలు ఉభయపాదాల నడుమనుండగా వైశాఖస్థానంలోకి వచ్చి, శరీరభారమంతటినీ కాలివ్రేళ్ళపై నిలిపి, వింటి క్రిందికొనను నేలకు మోపి, అల్లెత్రాటిని పైకొప్పుకు బిగించటం జరుగుతుంది. ఆ ప్రక్రియను కేవలసాంకేతికమైన ధనుశ్శాస్త్రపరిభాషతో వివరించి కావ్యార్థాన్ని భగ్నం చేయటం ఇష్టం లేక మహాకవి “హరబద్ధలక్ష్యః శరాసనజ్యాం ముహు రామమర్శ” అని దృశ్యాన్ని మాత్రం ప్రకాశింపజేశాడు. అది ప్రమార్జనమనే ధనుష్కరణం. “శరాసనజ్యాం ముహు రామమర్శ” అంటే లక్ష్యభేదనార్థం ఎక్కుపెట్టిన వింటిని, బిగించిన అల్లెత్రాటిని మళ్ళీ ఒకసారి సరిచూసుకొన్నాడని భావం. ఆ తర్వాత అమ్ములపొది నుంచి ‘ఆదానము’ అనే శరగ్రహణక్రియను – ఆ అవసరం లేదు కనుక – మహాకవి ప్రస్తావింపలేదు. నారిని బిగించిన తర్వాత వింటికి తిరుగులేని సంమోహనాన్ని తొడిగాడని శరవిన్యాసాన్ని మాత్రం వర్ణించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడని, సామాన్యబాణకోటికి వలె ఉపచ్ఛేదముతో గాక మంత్రముక్తమైన మహాస్త్రాన్ని విడిచిపెట్టాడని ప్రతీయమానం. అది ధనుఃసంహితలలో ఉపదేశింపబడిన ప్రయోగవిధానం.
అస్త్రప్రభావం వల్ల పరమశివుడు చంద్రోదయారంభం నాటి అంబురాశి వలె ఈషత్పరిలుప్తధైర్యుడు అయ్యాడు. సంమోహనప్రభావం వల్లనే ఆయన ధీరత్వం ఎంతో కొంత సడలిపోయింది. దొండపండు వంటి క్రిందిపెదవిని కలిగిన పార్వతీదేవి ముఖమండలమందు తన మూడుకన్నుల చూపులను నిగుడింపజేశాడు. ఇందుచే భగవంతుడైన పరమశివుని మనస్సులో రతిభావోదయం చెప్పబడినదని మల్లినాథ సూరి వివరించాడు. ఆయన చూపులు సోకి పార్వతీదేవి నిలువెల్లా పులకాంకురాలతో పూచిన లేతకడిమి లాగున కానవచ్చింది. ఆమె మనస్సులో సైతం రతిభావం అంకురించింది. “న కేవలం హరస్యైవ దేవ్యా అ ప్యుదితో రతిభావ ఇతి భావః” అని మల్లినాథ సూరి.
అప్పుడు పరమశివుడు ఎంతో ప్రయత్నం మీద మనస్సును నిగ్రహించికొని, తన ఇంద్రియవికారానికి (రతిభావోదయానికి) కారణమేమిటని నలుదెసల కలయజూశాడు. దండయాత్రను మొదలుపెట్టి, ఆలీఢస్థానంలో నిలబడి, వింటిని వలయాకారంగా ఆకర్షించి, శరమోక్షణానికి అభ్యుద్యతుడై ఉన్న మన్మథుని చూశాడు. ఇది పరమశివుడు వీక్షించిన దృశ్యం.
అయితే, చతుర్థసర్గంలో విలాపావస్థలో ఉన్న రతిదేవికి గుర్తున్న దృశ్యం వేరు. మన్మథుడు ధనుస్సును తొడయందు నిలిపి, ఒకవైపు శరానికి వంకతీర్చుతూ, మరొకవైపు వసంతునితో చిరునవ్వు నవ్వుతూ – అతనితో మాట్లాడుతూనే, నయనోపాంతవిలోకనాలతో (కడకంటి చూపులతో) ఆమెకేసి చూశాడు. ఆలీఢస్థానంలో ఉన్న మన్మథుడు దక్షిణపాదాన్ని కుంచితం చేసినప్పుడు ధనుస్సు ఒడిలో (ఉత్సంగమందు) ఉన్నట్లుగా ఆమెకు కానవచ్చినదన్నమాట. అది ప్రత్యాలీఢస్థానంలో ఉన్న మన్మథుని విక్షేపక్రియ. ప్రయోక్తచే శరమోక్షణం జరిగినదని ప్రతీయమానం. అప్పుడు మనస్సంచలనాన్ని పొందిన పరమశివుడు కన్నువిప్పి చూసే సరికి మన్మథుడు క్రీగంటితో ధనుస్సునకు బిగించిపట్టిన తన పిడికిటిని చూస్తూ (దక్షిణాపాంగనివిష్టముష్టియై), ఆకుంచితసవ్యపాదుడై, మండలీకృతచారుకోదండుడై, బాణం వేయటానికి మళ్ళీ ఆలీఢస్థానకంలో ఉన్నాడు. పునర్విక్షేపక్రియకు సంసిద్ధంగా నిలబడి ఉన్నాడన్నమాట. తపోభంగం చేయటానికి సాహసించాడని పరమశివుడు భ్రూభంగదుష్ప్రేక్ష్యముఖుడు అయ్యాడు. ప్రయోగింపబడినది అమోఘమైన సంమోహనం అయినప్పటికీ ఆయన ధనుర్వేదస్వరూపుడు కాబట్టి మోహావస్థ కలుగలేదు. ఇంద్రియవికారం మాత్రమే కలిగింది. దానినే “త్రినేత్రస్య స్మరశరనిపాతక్షోభః” అని క్షేమేంద్రుడు వివరించాడు.
క్షణలేశంలో మన్మథదహనం సంభవించింది. అది రతిదేవికి గుర్తుండిపోయిన దృశ్యం కాదు.
కాళిదాస మహాకవి అక్షరాక్షరం వాచ్యం చేయక, ప్రకాశ్యార్థప్రకాశకంగా దృశ్యాన్ని నిర్వహించినందువల్ల ఇన్ని రకాల ప్రతిపాదనలకు ఆస్కారం కలిగింది.
అన్నట్లు, శ్రీ దంతుర్తి శర్మగారు జరుగనున్న వ్యాజ్యంలో తమను ముద్దాయిగా భావించినట్లున్నది కాని, మౌలికమైన శివపురాణకథాప్రస్తావన వల్ల వారిని ముత్+దాయి (సంతోషకారకులు) గానే పరిగణింపవలసి ఉన్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి nagamurali అభిప్రాయం:
03/01/2017 10:19 pm
ఈ పాయింటు మీద కాళిదాసు గురించి పెద్ద వివాదమే ఉంది. శర్మ గారూ, మీరొకసారి కాళిదాసు కుమారసంభవానికి అనువాదం చదవాల్సిందే, అన్ని సర్గలూను.
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి మోహన అభిప్రాయం:
03/01/2017 4:04 pm
శర్మగారుః “రామాయణం చదివి లవకుశల గురించి వేరేగా రాసినా ఆది మొదలు రామాయణమే కదా?”
ఇది కాలిదాసు పైనా లేక ఒక సామాన్య అభిప్రాయమా అన్నది నా సందేహము. కొందఱు అంటారు మొట్టమొదట కాలిదాసమహాకవియే ఉత్తరరామాయణ కథను రఘువంశములో వ్రాసినాడని. మనము ఇప్పుడు వాల్మీకి ఉత్తరరామాయణముగా చదువునది పిదప వ్రాయబడినదని. లవకుశుల కథ రఘువంశమా లేక రామాయణమా?
విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
03/01/2017 3:38 pm
కామేశ్వర రావుగారు
కాళిదాసుకి కుమార సంభవం రాయడానికి ఐడియా ఎలా వచ్చిందంటారు? శివపురాణం లోంచేనా లేకపోతే ఆయన స్వంతంగా రాసాడా? రామాయణం చదివి లవకుశల గురించి వేరేగా రాసినా ఆది మొదలు రామాయణమే కదా? అలా ఆలోచిస్తే వేల్చూరి వారికి మరింత మంట ఎక్కడానికి నేనే కారణం. 🙂
నాలిక మీద బీజాక్షరాలు రాయించుకున్నాడు కనక కాళిదాసుకి అమ్మవారంటేనూ, అయ్యవారంటేనూ భక్తి (లైలాగారు ఏమన్నా సరే! :-)) అని నా ఉద్దేశ్యం. అందువల్ల కాళిదాసు అమ్మవారినీ అయ్యవారినీ చాలా జాగ్రత్తగా చూపిస్తాడు తన శ్లోకాల్లో. మరో విషయం ఏవిటంటే శుద్ధమైన మనస్సున్న పరమేశ్వరుణ్ణి, తనని అంతటి పండితుణ్ణి చేసిన జగన్మాతనీ మామూలు మన్మధుడూ ఆయన తుఛ్ఛమైన బాణాలూ ఏవీ చేయలేవు అని చెప్పడం కోసం అలా అని ఉంటాడని నేననుకుంటున్నా. ఈ లైన్లో (కాళిదాసుకి ఐడియా ఎలా వచ్చిందో అవన్నీ అనవసరం. ఆయన ఏం రాసాడో అనేది ఒక్కటే చూడాల్సింది) అయితే వేలూరివారిదే విజయం. 🙂 ఆయన వెంఠనే లా ఆఫీసు తెరిచేయవచ్చు.
కాళిదాసుకి మనం ఇలా కొట్టుకుంటాం అని తెలుసో తెలియదు కానీ నేను వేలూరి గారికి పురాణాల్లోంచి అవీ ఇవీ ఎత్తుకొచ్చి పురి ఎక్కిస్తానని తప్పకుండా తెలుసని అనిపిస్తోంది ఎందుకో.
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
03/01/2017 11:24 am
‘ఉద్ధతుల మధ్య పేదల కుండ తరమె’ అని మొదలుపెట్టిన వేలూరివారు ఇప్పుడు ఒక అభిమన్యు’కుమారు’నిలా, ‘బాల’చంద్రునిలా యిందరి మధ్య ఒంటరిపోరాటం చేయడం చాల ముచ్చటగా ఉంది 🙂 యుద్ధం పూలబాణాల గురించి కాబట్టి పారేది ‘రక్తి’ తప్ప ‘రక్తం’ కాదు, అంచేత యిబ్బందేమీ లేదు!
ఇక్కడ చర్చ కాళిదాస కుమారసంభవంలో మన్మథుడు శివునిమీద బాణాన్ని విడిచాడా లేదా అనే తప్ప, మిగతా పురాణ కావ్యాల గురించి కాదు. వాటి ద్వారా కాళిదాసు శ్లోకాలని అన్వయించుకొనే మాటయితే, కాళిదాసు ప్రత్యేకత ఎలా తెలుస్తుంది? కాళిదాసు ప్రత్యేకత చూసే ఉద్దేశం లేనప్పుడు అతని రచన చదవడం అనవసరం కదా!
కాళిదాసు చాలా అల్లరివాడు! తన తర్వాత, ఏ రెండువేల సంవత్సరాలకో యిలా ఈమాట పూల రణరంగంగా మారాలని కోరి మరీ అలా రచించాడు! 🙂
ఆ సందర్భంలో మన్మథ రూపాన్ని వర్ణించే రెండు పద్యాలలోనూ (శివుడు కించిత్ పరిలుప్త ధైర్యుడు అయ్యే ముందూ, అయిన తర్వాత) మన్మథుడు బాణాన్ని సంధించి విడవడానికి సంసిద్ధుడై ఉన్నట్టుగానే వర్ణించాడు. విడిచిపెట్టాడని చెప్పలేదు. అంచేత అది కోరుండి, చాలా జాగ్రత్తగా కవి చేసిన పనే. కొందరు రెండవ శ్లోక వర్ణనని రెండవ బాణం విడవడానికి సిద్ధమయిన మన్మథుడు అని అన్వయించారు. కొందరు మొదటి బాణాన్ని విడిచిపెట్టనే లేదు అని అన్వయించారు.
ఇక, పార్వతీదేవి చెలికత్తె మాటలను ఉత్ప్రేక్షగా పరిగణించాలే తప్ప నిజంగా భావించలేం. అక్కడకూడా, మన్మథబాణాన్ని శివుని తాకనివ్వలేదు కాళిదాసు! శివుని పరిలుప్త ధైర్యానికి మన్మథబాణం కారణం కాదని చెప్పడం కాళిదాసు ఆశయం అన్నది సుస్పష్టం. (కాళిదాసుని తుచ తప్పకుండా తన హరవిలాసంలో అనుసరించాడు శ్రీనాథుడు.)
పుస్తక పరిచయం: స్వప్నసాకారం గురించి నండూరి సుందరీ నాగమణి అభిప్రాయం:
03/01/2017 11:09 am
గ్రంథాన్ని చాలా బాగా సమీక్షించారు సోమశంకర్ గారూ… మీ సునిశిత పరిశీలన అమోఘం. వెంటనే పుస్తకాన్ని కొని చదివేయాలన్నంత ఆసక్తి, ఉత్సుకత కలుగుతున్నాయి.
శబ్దాన్ని జయించి రా! గురించి నాగలక్ష్మి అభిప్రాయం:
03/01/2017 10:11 am
అభినందనలు
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
03/01/2017 1:25 am
పద్యం గురించీ, అన్వయం గురించీ చెప్పేంత దాన్ని కాదు.
కానీ పురాణాలను ఒప్పుకోని కోర్టు, అసలు పురాణాల ఆధారంగా వ్రాసిన కావ్యం గురించి విచారించడం మాత్రం ఎలా ఒప్పుకుందని సందేహం అయితే కలిగింది.
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి VeluriVenkateswara Rao అభిప్రాయం:
02/28/2017 7:22 pm
శ్రీ మురళీధర రావు అంటే నాకెంతో గౌరవం, భయం కూడాను. చెప్పొద్దూ! ఆయన రాసిన ప్రతివాక్యానికీ నేను నిఘంటువులు, ప్రౌఢవ్యాకరణం తిరగేసుకుంటాను. ఆరకంగానన్నా ఆప్టే, మోనియర్ లని చూడటం జరుగుతుంది!
(మురళీధర రావు ధర్మవా అని, నా మోనియర్ విలియం పేజీలు కుక్క చెవుల్లా తయారయ్యాయి!)
అయితే అసలు విషయం:
ఈ వివాదంలో ఆయనకూడా “పప్పులో కాలు వేసారు,” అని అనను గాని, వివాదాన్ని తిరకాసు మార్గానికి deliberateగా మళ్ళిస్తున్నారని, నిరాఘాటంగా చెప్పగలను.
మన వివాదం కాళిదాసు రాసిన కుమారసంభవానికి సంబంధించినది. కుమారసంభవం కావ్యం. శివ పురాణం, స్కాంద పురాణం, ఇంకేదయినా పురాణం కానీయండి … అవి పురాణాలు. అంటే, అవి పసుపు రాసి భక్తిగా పూజాగృహంలో దేవుడి ముందు పెట్టుకోవలసిన గొప్ప గ్రంథాలు. ఏదన్న పండగో, పబ్బమో, సరస్వతీ పూజో, విఘ్నేశ్వర పూజో వస్తే, ఎండిన పసుపు పీకేసి, మళ్ళీ వాటికి కొత్తపసుపు రాసి దేవుడిముందు పెట్టుకోవటం ఆచారం.
కావ్య వివాదంలో పురాణప్రసక్తి తేవటం ఏ కోర్టూ ఒప్పుకోదు. ఎంత చవట దక్షిణాది అమెరికన్ జడ్జీ అయినా సరే, సాక్ష్యంగా పురాణాలు వల్లించటం ఒప్పుకోడు/ ఒప్పుకోదు. ఒకవేళ Defense Lawyer object చెయ్యకపోయినా, జడ్జీ గారే పురాణాలని సాక్ష్యాధారాలుగా తీసుకోరావటం “అప్రస్తుతం,” irrelevant అని అంటారు.
కుమారసంభవంలో మన్మధుడు శివుడిపై బాణం వేసినట్టు రుజువు లేదు. That is a FACT.
అయితే, మురళీధర రావు ప్రస్తుతించిన కాళే వ్యాఖ్యాన గ్రంథం, అమరుకోశం వివరణా నేనూ తిరగేసి చూసాను. కాళే కూడా మన్మథుడు బాణం వేసాడని ఘంటాపథంగా చెప్పలేదు. ఆయన వ్యాఖ్యానంలో ఊహించుకున్న మాటలు రాసాడు. అంతే. కాళే అంటే నాకూ చాలా గౌరవం. (అయితే, ఆయన పుస్తకాలు అచ్చు వేసిన ప్రచురణకర్తలంటే నాకు చాలా అసహ్యం. ఆ విషయం ప్రస్తుత వాదనకి అప్రస్తుతం!)
I rest my case.
వేలూరి వేంకటేశ్వర రావు వ్రాలు.