పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి వేలూరి వేంకటేశ్వరరావు అభిప్రాయం:

    04/03/2017 12:50 pm

    Thanks Ramarao. It is my fault. I could blame the current editor(s), but I do not want to take that escapist route.

    By the way, you know I am horrible at proofreading. You may not remember, but you proofread మూడు ప్రార్థనా పద్యాలు, a few years ago for me.

    Thanks again.

    [Typo corrected – Ed.]

  2. పాకశాలలో పాణినీయం గురించి సుబ్రహ్మణ్యం కెందోళె, బెంగళూరు అభిప్రాయం:

    04/03/2017 12:13 pm

    వరరుచి గురించి వెదకుతూ ఉంటే “ఈ మాట” దొరికింది. “పాకశాలలో పాణినీయం” నన్ను ఆకట్టుకుంది. మళ్ళీ మళ్ళీ చదివాను.

    దీనిని నా కన్నడ మిత్రులు చదవాలనిపించింది. వారికోసం ఈ కథను కన్నడంలో అనువదించాలి అనుకొంటున్నాను. మీ అభిప్రాయం తెలుపండి.

  3. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి Ramarao Kanneganti అభిప్రాయం:

    04/03/2017 10:50 am

    గురువు గారు, ఒక typo correct చెయ్యాలి:
    And voices singing
    out of empty cisterns
    And exhausted well

    ఆ రెండో And capitalize చెయ్యకూడదు. ఇంకా, well -> wells

    అద్భుతంగా ఉంది. బాగా ఉంది.

  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 4 గురించి Ramakrishna Reddy Garlapati అభిప్రాయం:

    04/03/2017 9:39 am

    ధన్యవాదాలండి….ఇప్పుడు అన్నీ కుదిరాయి…సంతోషం….మరొక్కసారి ధన్యవాదాలు.

  5. అంతా కొత్తగా… గురించి Suparna mahi అభిప్రాయం:

    04/02/2017 11:52 pm

    చాలా చక్కని పోయెమ్ సర్. ధన్యవాదాలు.

  6. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 4 గురించి Ramakrishna Reddy Garlapati అభిప్రాయం:

    04/02/2017 11:15 am

    ఈ గడులు తప్పినందువల్ల ‘సరి చూడు’ జవాబుల్ని తప్పు చూపిస్తున్నదండి. గమనించ ప్రార్ధన.

    [ఒక గడిలో అక్షరం తప్పిపోయినందున ‘సరి చూడు’ కాస్తా సడలిపోయింది. ఇప్పుడు సవరించాము. తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. — సం.]

  7. విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి C.Chandrasekhar అభిప్రాయం:

    04/02/2017 8:36 am

    Overall a good introduction – (1) there are too many generalisations in the earlier part (2) to my mind there are no inconsistencies or linguistic errors on account of Vishwanatha’s dictation – those who knew him know that he had fabulous memory, and the writers who took down the dictation were also scholars and poets in their own right (3) an understated fact – both the novels are highly satirical – a style that was popular in contemporary English / European literature, but was rarely found in Indian languages.

  8. అంతా కొత్తగా… గురించి J.V.RAMANA అభిప్రాయం:

    04/02/2017 5:43 am

    కొత్త కొత్తగా కవిత చాలా బాగుంది. అక్షరం అక్షరంలో కవి హృదయం ఆవిష్కృతమవుతోంది.

  9. అంతా కొత్తగా… గురించి Vadrevu Chinaveerabhadrudu అభిప్రాయం:

    04/02/2017 12:09 am

    చక్కటి అభివ్యక్తి.

  10. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి vaadrevu chinaveerabhadrudu అభిప్రాయం:

    04/01/2017 9:33 pm

    నూతిచుట్టూరా చెట్లు.
    పాతవానల రహస్య నిద్రల్ని తట్టి
    పాతస్మృతుల సుడిగుండాల్ని గాలించి
    ఆ తపించే వర్తమానం కోసం
    శైతల్యాన్ని తెస్తాయి, చెట్టూ, బావీ.

    ఈ మధ్య సూర్యలంకలో కొందరు తెలుగు కథకులు ఒక శిబిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి నేను ఈ ఎక్ ఫ్రాసిస్ ని పరిచయం చెయ్యవలసి వచ్చింది. డొనాల్డ్ బార్తెల్మి రాసిన ‘టాల్ స్టాయి మ్యూజియం దగ్గర ‘అనే కథని పరిచయం చేసినప్పుడు. ఈ పదాన్ని తనంతట తనుగా మొదటిసారి వాడిన తెలుగు కవి ఇదుగో వేలూరి వారే కనిపిస్తున్నారు. చిత్రలేఖనాన్ని, సంగీతాన్ని , శిల్పాన్ని కవిత్వంతో వివరైంచే ప్రయత్నం యూరోపియన్ కవులు చాలా తరచు చేసే పని. తెలుగు లో తక్కువ. ఒకరూ అరా రాసినా యూరోపియన్ చిత్రలేఖనాల్నో, కళాకృతుల్నో ఉద్దేశించి మటుకే చేసి ఉంటారు. కాని ఇక్కడ ఒక తెలుగు చిత్రకారుడి పదహారణాల తెలుగు బొమ్మని తెలుగులో చిత్రించిన కవిత. చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా పైన నేను మళ్ళా ఎత్తి రాసిన వాక్యాల్లో కవి అంతరంగమంతా బావిలో నీళ్ళల్లా లోతుగా, చల్లగా కనిపిస్తున్నది. వెంకటేశ్వరరావుగారు గొప్ప చిత్రరహస్యవేత్త కాబట్టి ఆయనిట్లాంటి కవితలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను.