పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. అంతా కొత్తగా… గురించి Vijay Koganti అభిప్రాయం:

    04/10/2017 1:02 pm

    ధన్యవాదాలండీ.

  2. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    04/09/2017 4:12 pm

    Many many thanks to all the erudite readers for enlightening me about the beautiful poetry, “citra maalikalu” of Sri Setti Lakshminarasimham.

    Regards.

    Veluri Venkateswara Rao

  3. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి VSTSayee అభిప్రాయం:

    04/09/2017 11:56 am

    ఏల్చూరి మురళీధరరావుగారు said:

    దృశ్యవర్ణనాత్మకమైన సెట్టి లక్ష్మీనరసింహకవి గారి ‘చిత్రమాలికలు’ సంపుటం మనస్సులో మెదిలింది

    ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక దుర్ముఖిసంవత్సర మార్గశిర్ష-పుష్యమాసముల సంచికలో “శ్రీ సెట్టి మేష్టరుగారి” రచనలోని చమత్కృతులను వివరించే రాజేశ్వరిగారి వ్యాసము –

    చిత్రమాలికలు – 1956 (pdf 3MB)

    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  4. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    04/09/2017 12:18 am

    మాన్యులు శ్రీ తః తః గారికి
    నమస్కారములతో,

    వెన్నెల అంజలిగ్రాహ్యమూ (దోసిళ్ళతో పట్టుకోదగినది), కుంభగ్రాహ్యమూ (కడవలలో నింపుకోదగినది) అని; చకోరపక్షి వెన్నెల కిరణాలను గ్రోలి జీవిస్తుందని ఉన్నవి కవిసమయాలు. వెన్నెలలో చంద్రకాంతశిల ద్రవిస్తున్నట్లుగా కనబడటం అటువంటి లోకవిరుద్ధమైన కవిసమయం కాదు. ఆనుభవికమైన దృగ్విషయమే. నేను చూచిన లక్షణగ్రంథాలలోని కవిసమయకోటిలో ఇది చేరినట్లుగా గుర్తురాలేదు. “కనంబడ ఱాల్ కరగంగజేసె” అని కవి సార్థకంగానే అన్నాడు. వెన్నెలలో పాలరాళ్ళు కరుగుతున్నట్లు కనబడటం వాస్తవికమే.

    “పునరుద్భవద్దంతముగ్ధచిక్కణకపోలక్షీరకాంతివేలాసుధాబ్ధి” అన్న విశ్వనాథ పద్యం ఊహలో ఉన్న అపురూపమైన మసృణత్వం దాని అభివ్యక్తిలో స్ఫుటగోచరం కాకపోవచ్చును. అది రసనిర్భరమైన ఆయన కావ్యగంభీరిమ లక్షణం. ఒకానొక కవి శైలి పైకి ఎంతో మెత్తగా కనబడి, అందులో ఏ మాత్రం తరచి చూడవలసిన లోతు లేకపోవటం కూడా ఉన్నదే. ఆ విధంగా ప్రసన్నతా సౌకుమార్యాలు బాహ్యచిహ్నాలుగా “కనంబడు” రచనలను చేయటం వెన్నెలలో రాళ్ళను కరుగుతున్నట్లుగా తోపజేయటం వంటిదే. పైగా అన్యులను మెచ్చలేకపోవటం వారి వ్యక్తిత్వంలోని లోపం. వారి రచనలేమైనా శాశ్వతికాలా? అంటే, వసంతుని వంటివారి రచనలలోని ఔదార్య రసోపగుంభితపదగంధత్వాదులకు అవి సాటి రావు.

    కవి “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా” అన్నాడు. మనము “స, ద్గతి రచియించిరేని కలకాలము వారలు మెత్తురే కదా” అనే అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే సమకాలం వారు (చంద్రుని వలె) మెచ్చుకోకపోయినా, నిరవధికమైన కాలంలో అనంతమైన భూమండలంలో తనతో సమానధర్ముడు జన్మించితీరుతాడన్న నమ్మకం.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    తా.క. మీరు ప్రస్తావించిన వేంకటకవి కులాన్ని గురించి పూర్వం విమర్శకులు వ్రాసినది చదివిన తర్వాత దానిని గురించిన స్థిరాభిప్రాయమేదీ నాకు కలుగలేదు. అందువల్ల ఆ అంశాన్ని గురించి చర్చింపలేను. కవి మనస్సుకు కష్టం కలిగిన మాట వాస్తవం. మెరుగైన వసంతుని రచనను చంద్రుడు మెచ్చుకోకపోవటం, ఆ మెచ్చుకోనివాని రచన అంతకంటె మేలైనదేమీ కాకపోవటం ఇందులోని చిత్రితాంశాలు. వసంతుడు కూడా ఆ వాగ్వాదంలోకి దిగలేదు కాబట్టి, సమకాలంలో మెచ్చనివారి జాతిలో అతడు లేడు. కాలిక కవిచంద్రులు శ్లాఘింపలేకపోయినా, తన రచన కాలపు ఇనుపతెరలను చీల్చుకొని చిరకాలం జీవిస్తుందని కవికి ఆత్మవిశ్వాసం ఉన్నది.

    పద్యంలో వ్యాఖ్యాతల దృష్టికి రాని శబ్దచిత్రం ఒకటున్నదని, అది కామేశ్వరరావు గారి ఉత్తమపరిచాయికకు పరిపూరకం కాగలదని ఈ మాటలను ఉద్దేశించాను. శ్రీమతి లక్ష్మీదేవి గారి అనుమోదానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  5. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి తః తః అభిప్రాయం:

    04/08/2017 7:23 pm

    శ్రీ మురళీధరరావుగారూ!

    “జాగ్రత్తగా చూస్తే కఠినమైన చంద్రకాంత శిల నిజంగా కరగటం జరగలేదు” కవి సమయాలను జగ్రత్తగా చూడకూడదు. ‘వారక ఈశ్వరుండు తలపైన… చంద్ర కాంతముల్ నీరగునే…’లో వారిజవైరి ఏమై పోవాలి?

    నమస్కారాలతో
    తః తః

  6. మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి Sujata అభిప్రాయం:

    04/08/2017 3:05 pm

    Leo Tolstoy, Stories and Fablesలో ఈ కధ 2007లో చదివాను. మళ్లీ పదేళ్ల తరవాత తెలుగులో చదవగలగడం నా అదృష్టం. అద్భుతమైన కధ. చాలా కుదురుగా అనువదించారు. కళ్లలో నీరు తిరక్కుండా ముగించడం కష్టం.

  7. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి తః తః అభిప్రాయం:

    04/08/2017 2:38 pm

    శ్రీ మురళీధరరావుగారూ! సదరు పద్యమూ శ్రీకామేశ్వరరావు గారి వ్యాఖ్యానమూ చదివి “సమకాలము వారలు మెచ్చరే గదా” అన్న మాట, ఆపైన మూడు పాదాల్లో చెప్పిన దానికి ఏమాత్రం పొసగదు అని అనుకుంటూ మీ అభిప్రాయం చూసిన నాకు వచ్చిన ధైర్యంతొ ఇలా రాస్తున్నాను:

    వేంకట కవి అబ్రాహ్మణుడు. అబ్రాహ్మణుడు వేదంతో సమానమైన మాటలు రాసినా బ్రాహ్మణులు మెచ్చరన్న విషయమే కవి చెప్పాలనుకున్నాడని తేలికగానే తెలుస్తున్నది. ఇది అలా ఉంచి, శ్రీ కామేశ్వరరావు గారన్న ‘స్పర్థ’లో ‘బ్రసన్నతయును సౌకుమార్యము’ ఇముడుతాయా? ‘మెచ్చుచు చంద్రుడు మిన్నునం బ్రసన్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె! ‘యీ గతి రచి/ చరి యించిరేని సమకాలము వారలు సౌఖ్యమౌ గదా!’ అని వేంకట కవి వ్రాసి యుండి యుంటే ఆయన చెప్పదలచుకున్న విషయం బాగా హత్తుకుని ఉండేది.

    నమస్కారాలతో
    తః తః

  8. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి P. Mohan అభిప్రాయం:

    04/08/2017 1:45 am

    Thanking you Srinivaasudu gaaru

  9. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి శ్రీనివాసుడు అభిప్రాయం:

    04/07/2017 8:54 pm

    పి. మోహన్ గారూ,
    “సారంగ” మూతబడిన తరువాత ఈ ఏప్రిల్ 6 నుండి క్రొత్త లంకెలో పాతవన్నీ లభ్యమవుతున్నాయి.
    ఆ లంకె http://saarangabooks.com/retired/

    అలాగే, “సారంగ” లో మీ రచనలన్నీ ఈ లంకెలో లభ్యం:
    Archives for పి. మోహన్

    ఇక మీరు పైన ఉదహరించిన వ్యాసం ఈ లంకెలో లభ్యం:
    రంగుల భోజనం…గొంతులో వీణలు!

    సందర్భం కాకపోయినా, ఈ సమయంలో తప్పితే నా ఉద్దేశాన్ని చెప్పడం సాధ్యంకాదు గనక మీకు చెబుతున్నాను. మీలాంటి రచయితలు పూనుకుని, బాధ్యతగా తీసుకుని, ఏకపక్ష వ్యాసాలను ఆ పత్రికలో పరిహరించబడేటట్లు గతంలోనే కృషిచేస్తే ఇప్పుడీ స్థితి వచ్చేది కాదు, అందరూ ఆ మహోన్నత ప్రయత్నానికి సహకరించేవారు. పత్రిక బాద్యత పాఠకులది, రచయితలది, అంతేగాని నిర్వాహకులది కాదని నా దృఢమైన నమ్మకం. అందుచేత, అది ఏమైనా తప్పులు చేస్తుంటే మనమందరం కూడా పూనుకోవాలని చెప్పడమే నా ఉద్దేశం.

  10. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    04/07/2017 11:25 am

    ఈ వ్యాఖ్యానమూ పద్యానికి మరింత వన్నెను తెచ్చింది.
    కావ్యప్రౌఢిని గుర్తించిన కవి అంతరంగాన్ని గమనించి పద్యం యొక్క అర్థగౌరవాన్ని, పంచభూతములను గుర్తుచేసే శబ్దచయనాన్ని కవి ఔచిత్యంతో చేసిన విధానాన్ని గమనించి పద్యం యొక్క శబ్దసౌందర్యాన్ని ప్రస్ఫుటం చేసి ఆనందం కలిగించారు. మురళీధరరావుగారికి వందనములు.