ఒక చిన్న విన్నపం.
ఏమంటే – గడి-నుడి పూరించి పంపిన తర్వాత తద్ గడి-నుడిని పంపినవాళ్ళ e-mail కు కూడా ఆందేట్లు చూడగలరని మనవి. మీకు technical problem ఐతే నా ఈ విన్నపాన్ని విస్మరించగలరు.
“1838 నాటి ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర నుంచి……” I vaguely remember to have read that Veeraswamayya started his journey in July1930 and concluded in August or in September 1931.
ఆవు చురుకైన జంతువు. బర్రె మందమైన జంతువు. ప్రకృతిలోని యా మాంద్యము దాని రక్తమందున్నది. ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. వాని రెండింటికీ నవినాభావ సంబంధమున్నది. బ్రాహ్మణుని చూడగానే బ్రాహ్మణుడని తెలియుచున్నది. తుని వైపు క్షత్రియులను చూడుము. వెంటనే క్షత్రియుడని తెలియును… క్రైస్తవుడు క్రైస్తవునివలె కనిపించుచున్నాడు. అది భేదమే. అది వర్ణమే… అందరమొక్కటి యను సిద్ధాంతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది… అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవి.
నేను ఈ వ్యాసపరంపర పూర్తీగా చదవలేదు కానీ ఈ సంచికలో పైన ఉటంకించిన వాక్యాల ద్వారా ’వేయిపడగల’ అంతరార్థాన్ని ఈ వ్యాసరచయిత సరిగ్గా పట్టుకున్నారని అనిపించింది. ఆ భాగం చదివినప్పుడు నేను రాసుకొన్న నోట్స్ యిది.
జంతువులు భిన్నలక్షణాలతో పుట్టటం ప్రకృతిలోని వైవిధ్యం. జంతువులే కాదు, ఒకే చెట్టులో, ఒకే కొమ్మపైని ఏ రెండు పత్రాలూ ఒకేలా ఉండవు. రంగులోనో, రూపంలోనో, వాటికి గల ఈనెలలోనో, సూక్ష్మవైవిధ్యం ఉండనే ఉంటుంది. అట్లే ఆహారపు అలవాట్లను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి, చుట్టు ఉన్న వాతావరణపరిస్థితులను బట్టి క్షత్రియులు, బ్రాహ్మణులు, కర్మజీవులు విభిన్నంగా కనిపించవచ్చు. నిత్యమూ యుద్ధాలలో పాల్గొని, ప్రజలను శాసించే క్షత్రియుడి దేహం కర్కశంగా, మొఖం రౌద్రంగా, గంభీరంగా ఉంటుంది.(ఏతావతా ఇటువంటివే కావ్యాలలో ఉత్తమ క్షత్రియునికి గల లక్షణాల రూపంలో నిమంత్రించబడినాయి). ఏ కాలంలో అయినా బయట ఎండలో శ్రమించే శ్రమ జీవి కమిలిన దేహంతో నల్లగానే ఉంటాడు. నియమనిష్టలతో, భూశయ్య, ఏకభుక్తుడై శుచిగా, తక్కువ అవసరాలతో జీవించేవాడు తదనుగుణ్యమైన దేహంతోనే ఉంటాడు.
వైవిధ్యం వేరు. సమానత్వం వేరు. వైవిధ్యం ప్రాకృతికం/లేదా కొన్ని అలవాట్లను బట్టి ఏర్పడే శారీరకమైన గుణాలైతే సమానత్వం – అనేది సామాజిక మనుగడ కోసం మనుషులు ఏర్పరుచుకున్న ఒక సభ్యత, సంస్కారం.
ఒకే అడవిలో నివసించే జంతువులు, ఆ అడవిలో పారే నది నీటిని ’సమానంగా’ పంచుకుని దాహం తీర్చుకుంటాయి. ఒక గ్రామంలో ఒకే చెరువు ఉంటే ఆ నీరు అన్ని వర్గాల వారు సమానంగా పంచుకోవటం ఒక సంస్కారం. (ఈ విషయంపైనే ’కొల్లాయి గట్టితేనేమి?’ నవల కూడా వచ్చింది).అలాగే దైవం అందరికీ సమమైనప్పుడు దేవాలయ ప్రవేశార్హత అందరికీ సమం అన్నది ఒక సభ్యత.
ప్రాకృతికమైన లేదా ఆచారవ్యవహారాలతో/భోజనపు అలవాట్లతో వచ్చిన అంతరాలను చూపి సమానత్వం అనే సామాజిక మనుగడను తిరస్కరించటం అనేది ఆ నవలలో ధర్మారావు ఆలోచనలోని కూటనీతిని, కాపట్యాన్ని ఎత్తి చూపుతుంది. ఈ ధూర్తత్వాన్ని వేయిపడగలు నవలలో ధర్మారావు సిద్ధాంతీకరిస్తాడు.దానికి ఆధ్యాత్మికత (అధి+ఆత్మికత) స్పర్శను తీసుకొచ్చి ముడిపెడతాడు. మత పరంగా వ్యాఖ్యానిస్తాడు. ధర్మారావు దృష్టిలో కొందరికి సౌలభ్యాలన్నీ పుట్టుకతోటే ’హక్కులు’, కొందరికి జన్మతోనే ’వర్జ్యాలు’. ఈ ’అరేంజ్ మెంట్’ సహజమైనదని, దైవమే ఏర్పరిచిందని అతని తీర్పు, శాసనం.
గౌతమబుద్ధుని సంఘంలో సారిపుత్రుడనే బ్రాహ్మడు, ఉపాలి అనే క్షురకుడు, అంగుళీమాలుడనే ఒక కిరాతకుడు – అందరూ కలిసి ధ్యానం చేస్తారు. కలిసి భిక్ష పంచుకుంటారు. ఆధ్యాత్మికత (అధి ఆత్మికత – అనగా ఆత్మను అధికరించిన విషయం)లో, అదే లక్ష్యంగా గల సంఘంలో అందరూ సమానం. ఆధ్యాత్మికత విషయంలో అందరూ సమానమని అన్నాడు కాబట్టి గౌతమబుద్ధుని మతం కూడా ధర్మారావుకు/లేదా ఆ నవలారచయితకు గర్హ్యం అన్నమాట.
శూద్రులకు దేవాలయప్రవేశార్హత ను నిరాకరిస్తూ ధర్మారావు తన అభిప్రాయాలను శాసిస్తాడు. “ఆత్మలు ఒక్కటే. కానీ ఉపాధులు వేరు. అందుకని కొందరు బ్రాహ్మలుగా, కొందరు శూద్రులుగా పుడతారు”. ఇలా ఉండాలని దేవుడే ప్లాన్ చేశాడు కాబట్టి ’వివక్షత’ సహజధర్మమని ఆతని తీర్పు. ధర్మారావు చెప్పే కూటనీతులకు స్పష్టమైన మూలాలు “భగవద్గీత”లోనూ, ఇతర ప్రామాణిక పురాణ గ్రంథాలలోనూ ఉండవు.అలాంటి ప్రమాణాలను చూపించమని అతనికి ఎదురుపడే పాత్రలు అడుగవు. అతను చెప్పిందే ధర్మం. ఆరెస్ సుదర్శనం గారు చాలా కాలం క్రింద విమర్శించినట్టు “ధర్మారావుకు తపస్సు, ధ్యానం, అలాంటి ప్రయత్నం, పరిశ్రమ ఏవీ ఉండవు. ఏ పరిశ్రమ లేకపోయినా అన్ని విషయాలమీద ధారాళంగా అభిప్రాయాలు చెప్పేస్తూ, శాసిస్తూ ఉంటాడాయన.”
నిజానికి మూల మతధర్మాలు ఈ రకమైన వివక్షతను చెప్పవు. “సహ నా భవతు, సహ నౌ భునక్తు..”, “ఆ నో భద్రాః క్రతవో యాన్తి విశ్వతః”, “పశ్యేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం…” ఇత్యాది వేదమంత్రాలు/హైందవ మతం తాలూకు మూలతత్వం సమానత్వాన్నే చెబుతుంది. అందరూ కలిసి సామరస్యంగా ఉండాలనే చెబుతుంది. తదనంతర కాలంలో సమాజంలో మార్పులు, స్వార్థపరుల వల్ల మతం రూపం మారి ఉండవచ్చు గాక.
అష్టావక్ర సంహితలో అష్టావక్రుడు జనకునికి ఉపదేశిస్తూ వర్ణధర్మాలకు అతీతంగా ఎదగమని ఆధ్యాత్మిక బోధ చేస్తాడు.
ధర్మారావు గారి వాక్ప్రవాహాలకు మాత్రం మూలాధారాలు ఉండవు. నవలలో ఆయనకు ఎదురుపడే పాత్రలూ అతణ్ణి తరచి ప్రశ్నించవు.వాదం చెయ్యవు. ఒకవేళ ప్రశ్నించినా పేలవంగా ఉంటాయి. ఆ పాత్రలు భారతంలో ధర్మవ్యాధుడు వంటి ఉదంతాలను గుర్తుకు తెచ్చుకోవు.
“ఒక్క మాటలో చెప్పాలంటే, నవల మొత్తంలో ధర్మారావు చేసింది, ప్రతి విషయంలోనూ ‘మనమూ-వాళ్ళూ’ అన్న తేడా తీసుకొచ్చి తీర్పరి పాత్రను నిర్వహించడమే. మనుషులు, దేశాలు, సంస్కృతులు, సాహిత్యాలు, భాషల మధ్య హెచ్చుతగ్గుల తేడాలను తీసుకురావడమే కాదు, వాటిని సిద్ధాంతీకరిస్తాడు:”
వేయిపడగలు చదివినప్పుడు ఆ నవల తాలూకు మూలతత్వం ఇలాంటిదే అని నాకు అనిపించింది. ఆ నవల్లో వర్ణనలు, ఉదాత్తత, ఇతరత్రా విషయ సంగ్రహమూ దండిగా ఉండవచ్చు గాక, అద్భుతంగా అమరి ఉండవచ్చు గాక! మూలతత్వం మాత్రం పైనున్నదే.
వర్షా పాత్ర స్వభావం ఎటువంటి వాతావరణంలో నైనా సమస్యలు తెస్తుంది. ఇలాంటి ప్రవర్తనని ఎవరికి వారే సరిదిద్దుకొవాలి ఎప్పటికప్పుడే. Narration is very interesting.
కిటికీ పక్క ఆకాశం గురించి థింసా అభిప్రాయం:
06/09/2017 1:15 pm
కవితకి గుండెకాయైన మాయమైన మట్టి హృదయాన్ని పట్టుకున్నారు. అభినందనలు.
గడి నుడి – 8 గురించి P C Ramulu అభిప్రాయం:
06/09/2017 1:07 pm
ఈమాట
సంపాదకులకు
నమస్కారములు
ఒక చిన్న విన్నపం.
ఏమంటే – గడి-నుడి పూరించి పంపిన తర్వాత తద్ గడి-నుడిని పంపినవాళ్ళ e-mail కు కూడా ఆందేట్లు చూడగలరని మనవి. మీకు technical problem ఐతే నా ఈ విన్నపాన్ని విస్మరించగలరు.
సవినయంగా
పి. సి. రాములు
కళకాలమ్: 1. కళగని… గురించి madhavi అభిప్రాయం:
06/09/2017 5:52 am
అసలు ‘చూడటం’ మొదలుపెడితే ‘కనబడటం’ మొదలై అది అనంతంగా మనం చచ్చేదాకా సాగుతుంది.
పై వాక్యం చాల వరకు కనుమరుగైపొతున్న కళలకు వర్తిస్తుంది. వ్యాసం బాగుంది శివాజి గారు.
పుస్తక పరిచయం: సరమాగో నవల ది ఎలిఫెంట్’స్ జర్నీ గురించి Anil అట్లూరి అభిప్రాయం:
06/08/2017 11:23 pm
పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
కళకాలమ్: 1. కళగని… గురించి కోట ప్రసాద్ అభిప్రాయం:
06/05/2017 10:11 pm
చాలా బాగున్నది. బాగా నచ్చింది!
తెలుగులో యాత్రాసాహిత్యం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
06/05/2017 3:22 am
చాలా చక్కటి సమీక్ష.
“1838 నాటి ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర నుంచి……” I vaguely remember to have read that Veeraswamayya started his journey in July1930 and concluded in August or in September 1931.
వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం గురించి రవి అభిప్రాయం:
06/05/2017 2:57 am
నేను ఈ వ్యాసపరంపర పూర్తీగా చదవలేదు కానీ ఈ సంచికలో పైన ఉటంకించిన వాక్యాల ద్వారా ’వేయిపడగల’ అంతరార్థాన్ని ఈ వ్యాసరచయిత సరిగ్గా పట్టుకున్నారని అనిపించింది. ఆ భాగం చదివినప్పుడు నేను రాసుకొన్న నోట్స్ యిది.
జంతువులు భిన్నలక్షణాలతో పుట్టటం ప్రకృతిలోని వైవిధ్యం. జంతువులే కాదు, ఒకే చెట్టులో, ఒకే కొమ్మపైని ఏ రెండు పత్రాలూ ఒకేలా ఉండవు. రంగులోనో, రూపంలోనో, వాటికి గల ఈనెలలోనో, సూక్ష్మవైవిధ్యం ఉండనే ఉంటుంది. అట్లే ఆహారపు అలవాట్లను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి, చుట్టు ఉన్న వాతావరణపరిస్థితులను బట్టి క్షత్రియులు, బ్రాహ్మణులు, కర్మజీవులు విభిన్నంగా కనిపించవచ్చు. నిత్యమూ యుద్ధాలలో పాల్గొని, ప్రజలను శాసించే క్షత్రియుడి దేహం కర్కశంగా, మొఖం రౌద్రంగా, గంభీరంగా ఉంటుంది.(ఏతావతా ఇటువంటివే కావ్యాలలో ఉత్తమ క్షత్రియునికి గల లక్షణాల రూపంలో నిమంత్రించబడినాయి). ఏ కాలంలో అయినా బయట ఎండలో శ్రమించే శ్రమ జీవి కమిలిన దేహంతో నల్లగానే ఉంటాడు. నియమనిష్టలతో, భూశయ్య, ఏకభుక్తుడై శుచిగా, తక్కువ అవసరాలతో జీవించేవాడు తదనుగుణ్యమైన దేహంతోనే ఉంటాడు.
వైవిధ్యం వేరు. సమానత్వం వేరు. వైవిధ్యం ప్రాకృతికం/లేదా కొన్ని అలవాట్లను బట్టి ఏర్పడే శారీరకమైన గుణాలైతే సమానత్వం – అనేది సామాజిక మనుగడ కోసం మనుషులు ఏర్పరుచుకున్న ఒక సభ్యత, సంస్కారం.
ఒకే అడవిలో నివసించే జంతువులు, ఆ అడవిలో పారే నది నీటిని ’సమానంగా’ పంచుకుని దాహం తీర్చుకుంటాయి. ఒక గ్రామంలో ఒకే చెరువు ఉంటే ఆ నీరు అన్ని వర్గాల వారు సమానంగా పంచుకోవటం ఒక సంస్కారం. (ఈ విషయంపైనే ’కొల్లాయి గట్టితేనేమి?’ నవల కూడా వచ్చింది).అలాగే దైవం అందరికీ సమమైనప్పుడు దేవాలయ ప్రవేశార్హత అందరికీ సమం అన్నది ఒక సభ్యత.
ప్రాకృతికమైన లేదా ఆచారవ్యవహారాలతో/భోజనపు అలవాట్లతో వచ్చిన అంతరాలను చూపి సమానత్వం అనే సామాజిక మనుగడను తిరస్కరించటం అనేది ఆ నవలలో ధర్మారావు ఆలోచనలోని కూటనీతిని, కాపట్యాన్ని ఎత్తి చూపుతుంది. ఈ ధూర్తత్వాన్ని వేయిపడగలు నవలలో ధర్మారావు సిద్ధాంతీకరిస్తాడు.దానికి ఆధ్యాత్మికత (అధి+ఆత్మికత) స్పర్శను తీసుకొచ్చి ముడిపెడతాడు. మత పరంగా వ్యాఖ్యానిస్తాడు. ధర్మారావు దృష్టిలో కొందరికి సౌలభ్యాలన్నీ పుట్టుకతోటే ’హక్కులు’, కొందరికి జన్మతోనే ’వర్జ్యాలు’. ఈ ’అరేంజ్ మెంట్’ సహజమైనదని, దైవమే ఏర్పరిచిందని అతని తీర్పు, శాసనం.
గౌతమబుద్ధుని సంఘంలో సారిపుత్రుడనే బ్రాహ్మడు, ఉపాలి అనే క్షురకుడు, అంగుళీమాలుడనే ఒక కిరాతకుడు – అందరూ కలిసి ధ్యానం చేస్తారు. కలిసి భిక్ష పంచుకుంటారు. ఆధ్యాత్మికత (అధి ఆత్మికత – అనగా ఆత్మను అధికరించిన విషయం)లో, అదే లక్ష్యంగా గల సంఘంలో అందరూ సమానం. ఆధ్యాత్మికత విషయంలో అందరూ సమానమని అన్నాడు కాబట్టి గౌతమబుద్ధుని మతం కూడా ధర్మారావుకు/లేదా ఆ నవలారచయితకు గర్హ్యం అన్నమాట.
శూద్రులకు దేవాలయప్రవేశార్హత ను నిరాకరిస్తూ ధర్మారావు తన అభిప్రాయాలను శాసిస్తాడు. “ఆత్మలు ఒక్కటే. కానీ ఉపాధులు వేరు. అందుకని కొందరు బ్రాహ్మలుగా, కొందరు శూద్రులుగా పుడతారు”. ఇలా ఉండాలని దేవుడే ప్లాన్ చేశాడు కాబట్టి ’వివక్షత’ సహజధర్మమని ఆతని తీర్పు. ధర్మారావు చెప్పే కూటనీతులకు స్పష్టమైన మూలాలు “భగవద్గీత”లోనూ, ఇతర ప్రామాణిక పురాణ గ్రంథాలలోనూ ఉండవు.అలాంటి ప్రమాణాలను చూపించమని అతనికి ఎదురుపడే పాత్రలు అడుగవు. అతను చెప్పిందే ధర్మం. ఆరెస్ సుదర్శనం గారు చాలా కాలం క్రింద విమర్శించినట్టు “ధర్మారావుకు తపస్సు, ధ్యానం, అలాంటి ప్రయత్నం, పరిశ్రమ ఏవీ ఉండవు. ఏ పరిశ్రమ లేకపోయినా అన్ని విషయాలమీద ధారాళంగా అభిప్రాయాలు చెప్పేస్తూ, శాసిస్తూ ఉంటాడాయన.”
నిజానికి మూల మతధర్మాలు ఈ రకమైన వివక్షతను చెప్పవు. “సహ నా భవతు, సహ నౌ భునక్తు..”, “ఆ నో భద్రాః క్రతవో యాన్తి విశ్వతః”, “పశ్యేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం…” ఇత్యాది వేదమంత్రాలు/హైందవ మతం తాలూకు మూలతత్వం సమానత్వాన్నే చెబుతుంది. అందరూ కలిసి సామరస్యంగా ఉండాలనే చెబుతుంది. తదనంతర కాలంలో సమాజంలో మార్పులు, స్వార్థపరుల వల్ల మతం రూపం మారి ఉండవచ్చు గాక.
అష్టావక్ర సంహితలో అష్టావక్రుడు జనకునికి ఉపదేశిస్తూ వర్ణధర్మాలకు అతీతంగా ఎదగమని ఆధ్యాత్మిక బోధ చేస్తాడు.
“న త్వం విప్రాదికో వర్ణో నాశ్రమీ నాక్షగోచరః।
అసఙ్గోఽసి నిరాకారో విశ్వసాక్షీ సుఖీ భవ॥
ధర్మారావు గారి వాక్ప్రవాహాలకు మాత్రం మూలాధారాలు ఉండవు. నవలలో ఆయనకు ఎదురుపడే పాత్రలూ అతణ్ణి తరచి ప్రశ్నించవు.వాదం చెయ్యవు. ఒకవేళ ప్రశ్నించినా పేలవంగా ఉంటాయి. ఆ పాత్రలు భారతంలో ధర్మవ్యాధుడు వంటి ఉదంతాలను గుర్తుకు తెచ్చుకోవు.
ఓ విధంగా ధర్మారావు “మాటే శాసనం.”
స్థూలంగా ధర్మారావు/వేయిపడగల మూలతత్వం వ్యాసరచయిత మాటల్లోనే –
వేయిపడగలు చదివినప్పుడు ఆ నవల తాలూకు మూలతత్వం ఇలాంటిదే అని నాకు అనిపించింది. ఆ నవల్లో వర్ణనలు, ఉదాత్తత, ఇతరత్రా విషయ సంగ్రహమూ దండిగా ఉండవచ్చు గాక, అద్భుతంగా అమరి ఉండవచ్చు గాక! మూలతత్వం మాత్రం పైనున్నదే.
కోడ్ కూలీ గురించి Gorthi Surya Prasad అభిప్రాయం:
06/04/2017 4:28 pm
వర్షా పాత్ర స్వభావం ఎటువంటి వాతావరణంలో నైనా సమస్యలు తెస్తుంది. ఇలాంటి ప్రవర్తనని ఎవరికి వారే సరిదిద్దుకొవాలి ఎప్పటికప్పుడే. Narration is very interesting.
కడవ గురించి S A RAHMAN. అభిప్రాయం:
06/04/2017 12:18 pm
ముచ్చటైన కవిత. చాలా బాగుంది.
ఎస్. ఎ. రహమాన్.
కిటికీ పక్క ఆకాశం గురించి S A RAHMAN. అభిప్రాయం:
06/04/2017 12:15 pm
ఆకాశం నుండి రాలి కిటికీ ద్వారా ఇంట్లో పడ్డ మంచి కవిత. చాలా బాగుంది. మరీ మరీ చదవాలనిపిస్తోంది.
ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు.