పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:

    08/01/2017 10:41 pm

    మళ్ళా ఇన్నాళ్ళకు శ్రీ రాజారాం గారి కథ చదివాను. ఈ మధ్య ఏ కథలూ చదవడం లేదు గాని ఒక పది పదిహేనేళ్ళ క్రిందటివరకూ విరివిగా కథలు చదివే వాడిని. నవలలకంటె నాకు కథలే ఇష్టం. ఆరోజుల్లో నాకిష్టమైన ముగ్గురు కథకుల పేర్లు చెప్పమంటే తడుముకోకుండా శ్రీ రావిశాస్త్రి, కాళీపట్నం, మధరాంతకం రాజారాం గార్ల పేర్లు చెప్పేవాడిని. శ్రీ రాజారాం గారు కథ చెప్పే పధ్దతి నాకు నచ్చుతుంది. 1950-60 మధ్యలో భారతిలో ప్రచురింప బడ్డ ఆయన కతలు సర్కసు డేరా, ప్రజాపతి వంటివాటితో మొదలు పెట్టి ఆయన కథలన్నీ చదివాను. 1958-60 ల మధ్యలో ఎప్పుడోఆంధ్ర పత్రికలోనే ప్రభలోనో ఆయన కథ చేదుమాత్రకి బహుమతి వచ్చినట్లు గుర్తు. రాతిలో తేమ, శబ్ద సందేశం వంటి కథలు ఎన్నెన్నో. ఈ కథ ఎందుకో నాకు నిడివి మరీ ఎక్కువైనట్లు అనిపించింది. నిడివి ఎక్కువైతే కథలో బిగువు తగ్గుతుంది. కథ సగం చదివేసరికి ఆయన ముగింపు ఎలా ఉండబోతోందో అర్థమైపోతుంది. ఇది ఒకరకంగా చెప్పాలంటే తాను వ్రాసిన తాను వెలిగించిన దీపాలు కథనే మరో రకంగా చెప్పినట్లు ఉంది. ఇన్నాళ్ళకు నా అభిమాన రచయిత కథను నాచేత చదివింపజేసినందుకు ధన్యవాదాలు.

  2. హైకూ గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/01/2017 1:12 pm

    నిరాశతో వెళ్లిపోయినట్టున్నాడు తొందరగా.
    డబ్బాలోని ఎర్రరంగు ఒలికిపోయింది. కుంచె ముక్కలు ముక్కలయింది.

  3. నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం గురించి Ramarao Kanneganti అభిప్రాయం:

    08/01/2017 1:03 pm

    The background of the poem, as you described brought back the memories of reading the same in my childhood. The poem and your description made it even more vivid. Thank you. Btw, there may be అచ్చు తప్పు — మోదకైస్తాడయ.

    [అచ్చుతప్పు సవరించాము. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. — సం. ]

  4. నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం గురించి విజయ సారధి జీడిగుంట అభిప్రాయం:

    08/01/2017 10:35 am

    మీ వ్యాఖ్యానం చదివాకా ఆ పద్యం మరో సారి చదివినప్పుదు అందు లోని ఆర్ద్రత కళ్ళ నీళ్ళ పర్యంతం చేసింది. చాలా చక్కని పద్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే కథాసరిత్సాగరం వెనుక నున్న కథ గురించి తెలిపినందుకు మీకు మరిన్ని నెనర్లు, భైరవభట్ల గారు .

  5. గడి నుడి – 10 గురించి P C Ramulu అభిప్రాయం:

    08/01/2017 10:34 am

    మీరు వెలిబుచ్చిన తొందరగా (అంటే గడువు లోపల) గడి నుడి-9కి తప్పుల్లేని పరిష్కారాలు వచ్చాయన్నప్పుడు, అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ (ఆ) అయిదుగురు విజేతలని ప్రకటించకపోవడంలో ఆంతర్యమూ, ఇది మీ సూచనలకు షరతులకు భిన్నంగా మీరు భావించక పోవడంలోని అంతరార్థమేమిటి?

    ఇక్కడ ప్రస్తావించడం భావ్యమూ సాహిత్య మర్యాదా కాదుగానీ ఒక్కో సారి పజిల్ వ్యూహ కర్తల క్రిప్టిక్ క్లూస్ లోనే పొరపాట్లు దొర్లడం పూరించే వారి మనస్తాపానికి హేతువు కావడం శోచనీయం. ఇది నా మనో భావన మాత్రమే .. దీనికేదో ఏమో ప్రేరేపితమూ కాదనీ .. ఎవర్నీ ఎవర్నో ఉద్దేశించినది అంతకంటే కాదనీ నా వినయ పూర్వక విజ్ఞప్తిగా అర్థం చేసుకోగలరని ప్రార్థన.

    [రాములు గారు, అయిదుగురు విజేతలని ప్రకటించడంలో జాప్యానికి చింతిస్తున్నాము. ఇకనుండి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాము. — సంపాదకులు. ]

  6. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    08/01/2017 2:49 am

    ఐపోయిందా? అప్పుడే? సగంలోనే వదిలేశారని కూడా అనలేము. అసలిది ప్రారంభమేగా శ్రీరమణగారూ?

  7. గెలుపు గురించి Hari అభిప్రాయం:

    08/01/2017 1:15 am

    The story titled Gelupu (Victory) by Jayamohan is an attempt to expose the fragility of human will and the subordination of trust to penury. The storyline in its most superficial form is a lightning rod for femi-nazis of the 21st century. The most incendiary line in the story comes from a part where Rangappa declares to the fellow patrons of the club how most women are easy and loose. Rangappa goes on to state that there is no woman he knew of who will not surrender to money provided one knows how to offer it without hurting the woman’s self-esteem. Therein lays the crux of the story as well as the watershed moment that forever transforms Namasivvam’s life within and without. The plot evolves well from here on and ends up with a lasting climax that forever lingers in the mind of the vulnerable reader leaving him in utter disbelief and self-doubt.

    The story has several layers and subtleties to explore. The vulnerabilities the author explores in the story are gender agnostic, although the fallacies of the female appear more prominently due to taboos and moral impositions. The protagonist Namasivvam is torn between his self-righteousness, his want to escape poverty, and his urge to restrain his redoubtable wife Lata from committing a transgression without letting her know the truth. As most or all people, Namasivvam approaches his life with preconceived positive notions about marriage, wealth, and values, while fully discounting the underlying motivations that perpetuate these notions. A realization dawns on him when his narratives are challenged. It starts with Namasivvam becoming more and more insecure with the passing days. The insecurity manifests in to anger and despair followed by a gradual and growing acceptance of his defeat. This becomes evident to the reader when Namasivvam chides Lata calling her a ‘whore’ when she grows curious about Rangappa’s visit to their home. This story once again reinforces that most people have a narrow existence in life not because they choose it, but because the circumstances do not dish them out broader opportunities.

    The story is an off-shoot of a genre exploring the rich – poor divide. The power of the story lies not in its plot but in its slow and impressive narration. The context is set in the pre-liberation era and the objects chosen to accentuate the life in those times are appropriate. References to the influence of pedagogical backgrounds (UK returned vs. US returned) on the attitudes of the rich towards the common man are also well captured in the narrative. Overall, it’s a riveting read.

  8. గోళం గురించి S A RAHMAN అభిప్రాయం:

    08/01/2017 12:50 am

    నిద్రలోనె
    మేలూకున్నా
    చదువుకున్నా
    నవ్వుకున్నా
    అందుకే
    అభినందించకుండా
    ఉండలేకున్నా.
    ముచ్చటైన కవిత చాలా బాగుంది.

    ఎస్.ఎ.రహమాన్.

  9. నాకు నచ్చిన పద్యం: కైలాసాన్నే కాదన్న వీరవనిత గురించి vvadi అభిప్రాయం:

    07/31/2017 12:31 pm

    Off the tangent here. This was an extremely violent time(late 11th century to early 14th century) for common people.

    Jangamaiah’s are local landlord’s(Siva’s) goons. Landlords demand extreme loyalty. Just imagine the cruelty in the story of Siriyala. What is the mental state of the parents to kill their own progeny and also to cook the flesh. This story never happened. But the fear mongering is evident, and it always happens to the people at the bottom of the pyramid. It is truly a dark age in south indian history.This violence was not only among Veera Shaivas and Veera Vaishnavas. These two sects also committed innumerable atrocities on sramanic religions (Jainism and Buddhism).

  10. ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    07/30/2017 3:11 pm

    సౌమ్య గారు,

    చేరావారి అముద్రిత తెలుగు భాషా వ్యాకరణం నాకు తెలిసినంతవరకూ ఇంకా ముద్రణకు నోచుకోలేదు. దాని గురించి వారి అమ్మాయిని అడిగితే తెలుస్తుందేమో.

    సురేశ్.