పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి VSTSayee అభిప్రాయం:

    08/12/2017 1:45 pm

    “తః తః”

    కవిత కేవలం గుర్తు మీద రాశాను . ఆ సంచికను పారేసుకుని దశాబ్దాలు గడిచి పోయాయి.

    అంతర జాతీయం

    క్యూబెక్‌లో పడుకున్నా
    చెవుల్లో బంగాళాఖాతం రొద
    మాంట్రియల్‌లో జెట్‌ దిగి
    కాబ్‌ కోసం నడుస్తున్నా
    ఎల్లమ్మ తోటలో మొదటిసారి బస్‌ దిగి
    చిత్రాలయ వైపు టికెట్‌కోసం నడుస్తున్నట్టే
    గతాగతాల మధ్య
    గ్రంథులు విప్పలేనివాణ్ణి
    నీవీ మోక్షణ వేళలో
    వస్త్ర మూల్య పరీక్షణం నేర్పిన
    పాఠశాల విద్యార్థిని
    ఎన్ని సమ్మర్లపాటు
    ఏడ్మాంటన్‌ చిన్నది ఎండలో తడిసినా
    తెలుపు తెలుపేకాని నలుపుకానట్టు
    ‘బాన్‌ జోర్‌’ ‘బాన్‌ సాయిర్‌’ కరచాలనాల మధ్య
    పరిచయానుద్రిక్త పరిరంభ సమయాలు
    స్మరించి
    చెమరించేవాణ్ణి
    ఎంత చెడ్డా
    తంతే
    గారెల బుట్టలో పడేవాణ్ణి
    —తః తః
    (2-10-87 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, పుట 71.)


    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  2. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    08/12/2017 9:08 am

    పెద్దలు శ్రీ వాసుదేవరావు ఎరికలపూడి గారికి నమస్కరిస్తూ,
    ( తః తః అనేది మీ కలం పేరు అని భావిస్తూ ),
    “ఈమాట” అంతర్జాల పత్రిక నవంబర్ 2013 సంచికలో వచ్చిన యీ క్రింది మరువరాని వ్యాసాన్ని పాఠకులందరూ మరోసారి చూడాలని ఆకాంక్షిస్తూ …

    ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం
    http://eemaata.com/em/issues/201311/2433.html?allinonepage=1

  3. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి ‘తః తః అభిప్రాయం:

    08/12/2017 5:54 am

    1987 జున్ జులై రొజుల్లో ఎడ్మంటన్‌లో ఒక సమావేశానికి వెళ్లి, వెనువెంటనే (ఫ్రెంచ్ కెనడా) లవాల్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ శాఖలో అతిథిగా గడిపాను. ఎండాకాలంలో అక్కడి పగళ్ళకు రాత్రంటూ ఉండేది కాదు. నిద్ర వచ్చేది కాదు. పైగా అటూ ఇటూ పరుగులు తీస్తున్న కార్ల చక్రాల చప్పుడు విశాఖ పట్నపు సముద్రపు రొదలాగా చెవులకు చుట్టుకొనేది. ఎడ్మంటన్, కుబెక్, మాంత్రేల్ అన్న మాటల్ని ఇంగ్లిష్ లిపి లోనే ఉంచుతూ “కుబెక్‌లో పడుకున్నా చెవుల్లో బంగాళా ఖాతం రొద, మాంత్రేల్‌లో జెట్ దిగి కాబ్ కోసం పరుగెడుతున్నా ఎల్లమ్మ తోటలో బస్సు దిగి చిత్రాలయకు పరుగెడు తున్నట్టే, ఎడ్మంటన్ చిన్నది ఎన్ని సమ్మర్ల పాటు ఎండలో తదిసినా తెలుపు తెలుపేగాని నలుపు కానట్టు గతాగతాల మధ్య గ్రంథులు విప్పలేనివాణ్ణి, నీవీ మోక్షణ వేళ వస్త్ర మూల్య పరీక్షణం నేర్పిన పాఠశాల విద్యార్థిని… అంతరిక్ష నౌక లోంచి అమాతం తన్నినా సూటిగా వచ్చి బూరెల బుట్టలో పడేవాణ్ణి” అంటూ ‘అంతర జాతీయం’ అని ఒక కవితతో – శ్రీ ఫురాణం సుబ్రహ్మణ్య శర్మ, సంపాదకులు, ఆంధ్ర జ్యోతి వార పత్రిక,విజయవాడ, ఏ.ఫ్. ఇండీయా. అన్న చిరునామాకు – తః తః గా ఒక ఎన్వలప్ పొస్ట్ చేశాను. ఈ విషయం మరిచే పోయాను. ఆగస్టు నెలలో అంధ్ర విశ్వకళా పరిషత్ టీచర్స్ క్వార్టర్స్ లో ఇంటికి వచ్చేశాను. ఆంధ్రజ్యోతి 1987 అక్టోబర్ 2 సంచిక పోస్ట్‌లో ఇటికి వచ్చింది అందులో -ఇంగ్లిష్ లిపి లోవన్నీ తెలుగు లిపిలోకి మార్చబడి- ‘అంతర జాతీయం’ తః తః*.

    శ్రీరమణ గారికి నమస్కారాలతో
    తః తః

    * కవిత కేవలం గుర్తు మీద రాశాను . ఆ సంచికను పారేసుకుని దశాబ్దాలు గడిచి పోయాయి. తః తః గా రాస్తున్న నేను అక్టొబర్ 2-3ల మధ్య పుట్టాను. ఆశ్చర్యం! తః తః పుట్టుక కూడా అక్టొబర్ 2)

  4. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    08/11/2017 9:52 am

    ఆంధ్రజ్యోతి వారపత్రిక స్వర్ణయుగం మధర జ్ఞాపకాలని, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని తలపోతకు తెచ్చిన యీ వ్యాసానికి శ్రీరమణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారు.

    తెలుగు వెలుగు చలం గారిపై పురాణం గారు రాసిన పుస్తకం గొప్పతనాన్ని కూడా స్మరించారు.

  5. పాట ఒకటి… గురించి chandra naga srinivasa rao desu అభిప్రాయం:

    08/11/2017 6:14 am

    ఈ కవిత చాలా బాగుంది. అభినందనలు.

  6. వలయం గురించి chandra naga srinivasa rao desu అభిప్రాయం:

    08/11/2017 6:13 am

    కాలం మరియు జీవితం ఏవిధం గా ముడిపడి ఊన్నాయో చక్కగా వివరించారు

  7. వాళ్ళు… గురించి amarendra dasari అభిప్రాయం:

    08/10/2017 12:39 am

    థాంక్స్ శారద గారూ

  8. వాళ్ళు… గురించి శారద అభిప్రాయం:

    08/09/2017 2:59 pm

    చాలా చాలా బాగుంది.

    మనుషులనీ, జీవితాన్నీ, చదవడంలోనూ అర్థం చేసుకోవడంలోనూ ఆసక్తి వున్నవాళ్ళకి బ్రతుకంతా చాలా ఉత్సాహంగా వుండే ప్రయాణం అనిపిస్తుంది కదా?

    మంచి అనుభవాలని పంచుకున్నందుకు ధన్యవాదాలు అమరేంద్ర గారూ.

    శారద

  9. చావు నవ్వు గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:

    08/09/2017 12:38 pm

    చాలా బావుంది కథ. బాగ చెప్పారు కొన్ని నిజాలని.

  10. గాయం గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:

    08/09/2017 12:28 pm

    చాలా బావుందండి ఓ కవితలా అనిపించింది.