పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. Breakrooమోపాఖ్యానము గురించి ns murty అభిప్రాయం:

    09/13/2017 11:51 pm

    ఇంద్రాణి గారూ

    వ్యంగ్యం, హాస్యం, ఆంగ్ల- తెలుగు పదాల సముచ్చయమూ , అన్నీ చాలా బాగున్నాయి.

    అభినందనలు.

  2. Breakrooమోపాఖ్యానము గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    09/13/2017 11:35 am

    కవయిత్రిగానే మచ్ తెలిసిన ఈమె ఉపాఖ్యానము జదివి అమేజ్మెంట్‌నకు గురికాలేదని జెప్పిన నా శిరస్సు వేయి వ్రక్కలవగలదని తెలిసి తెలిసి ఆపాయమును దప్పించుకొనుటకు ఇచ్చోట కామెంటుతున్నానని సభాముఖమున విన్నవించుకుంటున్నవాడను.

  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 2 గురించి భట్టారం రవీంద్ర బాబు అభిప్రాయం:

    09/12/2017 12:27 pm

    ఈ శీర్షికలో ఎంత గొప్ప సాంకేతిక సహాయకాలని వాడకానికి మాకిచ్చారు!

  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 2 గురించి భట్టారం రవీంద్ర బాబు అభిప్రాయం:

    09/12/2017 12:20 pm

    శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక 2 లో నిలువు 27 యొక్క ఆధారంలో అక్షర దోషం ఉంది. “ముందుగా” అని ఉండవలసినది అనుకుంటాను. “మౌండుగా” అని ఉంది. సవరించ గలరు.

    ధన్యుడను.

    [అచ్చుతప్పు సవరించాము. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. — సం. ]

  5. బ్రేక‌ప్ గురించి suryanarayana murthy Akella అభిప్రాయం:

    09/12/2017 9:10 am

    చెత్త కథ, ఎడిటింగ్ లో ఎలా ఫిల్టర్ అయ్యిందో?

  6. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి ఆంజనేయులు మాష్ఠర్ అభిప్రాయం:

    09/12/2017 6:42 am

    నేను కాటిసీనులో పాడుతున్నపుడు నాకు కన్నీళ్ళు వస్తుoటాయి.

  7. నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు గురించి K V SESHA KUMAR అభిప్రాయం:

    09/11/2017 7:28 am

    నమస్కారం కామేశ్వరరావుగారూ,

    కవయిత్రి హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ వ్రాశారు.ధన్యవాదాలు.

    దాదాపుగా కావ్య సమీక్ష చేస్తూ పూర్తిగా ఆ కావ్యాన్ని చదవడానికి ఆసక్తిని ఉద్దీపనంచేశారు.

    శ్రీవేంకటేశ్వర స్వామి వారి మహాభక్తురాలైన మాతృశ్రీ వెంగమాంబ, మీరు ఉదహరించిన ఘట్టాలలో స్వామి వారిని నిందాస్తుతి చేసినట్లు అనిపిస్తుంది.అంతే గానీ స్త్రీ పక్షపాత ధోరణి కాదనుకుంటాను.

  8. నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు గురించి తః తః అభిప్రాయం:

    09/11/2017 4:19 am

    కామేశ్వర రావు గారూ! శ్రీనివాసుడనని చెప్పుకోవటం శ్రీ తన నివాసమని -తన నివాసాన్ని వెతుక్కుంటున్నానని చెప్పకనే- చెప్పటం. ఇదో మరో దొంగ వేషం . డబ్బు లేని చోట తను ఉండ లేడు. నిజంగా యోగి అయినట్లయితే చిత్తశుద్ధి తో ఈశ్వరార్చన చేసుకుంటూ ఉండే వాడు. ఆ తల్లి – ఐశ్వర్య దేవత – అర్థంపు పెన్నిక్క , ‘ మన్నించు ఇల్లాలు’ భర్త దగ్గరకు తనే వచ్చేది.
    నమస్కారాలతో
    తః తః

  9. గుర్రాల మావయ్య గురించి imdrakanti pinakapani అభిప్రాయం:

    09/11/2017 1:17 am

    మరో మిథునం… మరింకో మాట లేదు!

  10. తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి పసుపులేటిsrinivasarao అభిప్రాయం:

    09/10/2017 7:22 pm

    పసుపులేటి, ఆలేటి, పాలేటి, వెలగలేటి, పొంగులేటి, కాకిలేటి, అసిలేటి, ఏలేటి మొదలైనవి ఏర్లపేరుమీదేర్పడినవి.