పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. ఒక పాట – రెండు బాణీలు గురించి విశ్వనాధ్ అభిప్రాయం:

    09/22/2017 4:48 pm

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు,
    మంచి అనుభూతి కలిగించారు.

  2. పునరావృతమ్ గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    09/22/2017 3:11 pm

    చాలా బాగా రాసారు.

  3. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి RAVI KRISHNA C అభిప్రాయం:

    09/22/2017 9:24 am

    శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి నమస్సులు. సర్ కుశలమా? లలితగీతాలలో శ్రీమతి పి. సుశీలమ్మ గారు పాడిన “నిదురబో నా తండ్రి, నిదురించే జగమంతా నిఖిల ప్రాణులతో” ఉంటే తెలియజేయండి. మిత్రులు కీ .శే. ప్రొఫెసర్. శ్రీ టీ. వి. రావుగారు శ్రీ. మల్లిక్ పాడినది తన ఛానల్ లో ఉంచారు. దానిలో చివర్లో ఇది మొదట పి. సుశీల గారు మద్రాస్ లో పాడారని చెప్పడము గమనించవచ్చు.

    రిగార్డులు,
    రవికృష్ణ చారేపల్లి
    తిరుపతి

  4. రైలు అమ్మాయి గురించి సునీల్ భైరిశెట్టి అభిప్రాయం:

    09/21/2017 1:02 pm

    ఆకలికి కుల మత ప్రాంతాలతో పని లేదు. అలాగే ప్రేమకు, ఆకర్షణకు కూడా.. రెండింటినీ వాస్తవికతతో సున్నితంగా స్పృశించారు. కళ్ళ మధ్య ప్రయాణించే, కలల తీరాల్లో ఊహించుకునే భావాలు కెనడాలో అయినా, కొలొంబోలో అయినా ఒకటే.. అనువాద ఛాయలు కనిపించకుండా నేర్పుగా రాయడం ఆకట్టుకుంది..

  5. రైలు అమ్మాయి గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:

    09/20/2017 12:57 am

    కథ చాలా బావుందండి. అనువాదం అని చెప్తే కానీ తెలియదేమో అనిపించింది.

  6. పేకాట గురించి రాఘవేంద్ర అభిప్రాయం:

    09/19/2017 5:38 pm

    అబ్బో బ్రహ్మాండం. చాలా మంది కళ్ళు తుడుచుకొని ఉంటారు. టిం రసర్ట్ ని తలచుకొని కాదండోయ్.

  7. యుద్ధం గురించి A S Murthy అభిప్రాయం:

    09/19/2017 8:54 am

    Reminded me of a friend in my high school, who used to write shortest essays in Telugu, yet come 1st, nice writing.

  8. Breakrooమోపాఖ్యానము గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    09/18/2017 5:55 pm

    భలే రాశారు. సులభ గ్రాంధికం బాగా పండించారు.

  9. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి K V SESHA KUMAR అభిప్రాయం:

    09/18/2017 6:42 am

    నమస్తే శ్రీసురేశ్ కొలిచాల గారికి,

    తరువాతి భాగాల కోసం ఎదురు చూస్తున్నాను . ఇంతమంది పాఠకుల/పండితుల సందేహాలు/అభిప్రాయాలు ఎలా సమన్వయం చేసి వ్రాస్తారోనని ఆసక్తి గా ఉంది.

  10. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి C. Chandrasekhar అభిప్రాయం:

    09/14/2017 6:22 pm

    ఈ శ్లోకానికి సరియైన సాంకేతికార్థము విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య సురభి లోని వ్యాఖ్యానము చూడండి. విష్ణు పదానికి విశ్వవ్యాపకుడన్న అర్థమే చెప్పుకోవాలి.

    గణపతి ఆరాధన తంత్ర శాస్త్రానికి సంబంధించినది. కుండలినీ శక్తి మూలాధారమునుండి ఊర్ధ్వగతిలో పయనించడానికి మొదట నున్న ఆటంకమునే గణపతిగా భావించి స్తుతించినారు. పార్వతి స్నానము చేయబోతూ గణపతిని ద్వారపాలకునిగా నియమించినదన్న కథ కూడా ఈ తత్త్వానికి సంకేతమే. (సరియైన వివరములు యోగా వ్యాసకులు, దేవీ ఉపాసకులు మాత్రమే చెప్పగలరు.)

    శ్రీశంకరుల కాలానికే – అనగా 7వ శతాబ్దానికి పూర్వమే – గాణాపత్యము తాంత్రిక సాధనలలో సనప్రసిధ్ధమైనది. షణ్మత స్థాపకులుగా శంకరులు సంస్కరించిన ఆరు మతాలలో గాణాపత్యము కూడా ఉన్నది.

    వేదాలలో సంగ్రహంగా చెప్పబడిన ఉపాసనలనుండే పురాణకాలంలో దేవతలకు మూర్తి కల్పన జరిగింది. అందులోనూ గణపతి, స్కందుడు, ఆంజనేయుడు, నరసింహస్వామి వంటి కొందరు కేవల మంత్ర స్వరూపులుగా ఉపాసింపవలసినవారు.

    కథారూపంలో వ్రాసిన పై వ్యాసంలో సరియైన పరిశోధన చేసినట్లు కనిపించదు. It is not proper to deal with serious topics in a casual manner, without seeking guidance from the learned scholars in relevant field.