పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. Walmart గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/03/2017 2:33 pm

    అయ్యో సగం రాసి అసలు కధ వదిలేస్తే ఎలా?.. ఇలా కంటిన్యూ చేయండి.

    —–

    approved. Please take your receipt and come back again. Thank you for shopping at Walmart.

    నాకీ షర్టూ, గిన్నె, దిండూ, పిల్లకి కొన్న కార్ సీటు నచ్చలేదు. తిరిగిచ్చేయండి.

    సరే, బిల్లెక్కడ ఉంది?

    బిల్లా, నాదెగ్గరెందుకుంటుంది? అయినా అదెందుకు? వాళ్ళు బిల్లు లేకుండా వెనక్కి తీసుకుంటారు. వెళ్లండి వెళ్ళండి.

    నాన్నా కొనేటప్పుడు అమ్మ వస్తుందిగా మనకూడా, కానీ రిటర్న్ ఇచ్చేటప్పుడు నిన్ను వెళ్ళమంటుందే?

    [ఏడుపుగొట్టు నవ్వు.] అది అంతేరా నాన్నా. పెళ్ళైతే నీకూ తెలుస్తుంది.

    ఎందుకండీ ఇది రిటర్న్ చేస్తున్నారు?

    ఇవన్నీ మా ఆవిడ కొంది. రాంగ్ సైజు షర్టూ, ఈ సీటు పనిచేయట్లేదు, దిండు తలకింద పెడితే గాలి పోతోంది. కౌంటర్ కి ఇరువైపులా జనానికి తెలిసిపోయే శుభ్రమైన తెల్లటి అబద్ధం.

    సరే కార్డు మీద ఇవ్వడం కుదరదు వాపసు. స్టోర్ క్రెడిట్ ఇస్తాము సరేనా?

    అదే భాగ్యం, అంత కన్నానా? వినదభీషణ శంఖము దేవదత్తమే

    ఇక్కడో సంతకం తగలేయండి, హావ్ ఏ గుడ్ డే, నెక్స్ట్ ప్లీజ్, మే ఐ హెల్ప్ యూ?

    పదరా నాన్నా ఈ కార్డుతో మరోసారి కురుక్షేత్రం చూసి వద్దాం

    కురుక్షేత్రం అంటే ఏంటి నాన్నా?

    ఏవిటా, థేంక్స్ గివింగ్ తర్వాత రోజూ పీకిపారేసిన వస్తువులు వాల్ మార్టు లో క్షతగాత్రుల్లా లేవూ? అదే కురుక్షేత్రం. ఇదే మన జీవితం, తరం తరం నిరంతరం పోరాటం. పదపోదాం.

    థేంక్ యూ ఫర్ షాపింగ్ ఎట్ వాల్మార్ట్. మళ్ళీ రండి. మళ్ళీ మళ్ళీ తప్పకుండా రండి, రండోయ్, రారండొయ్.

    వాల్మార్ట్ అంటే ఏవిటో తెల్సురా?

    ఏంటి నాన్నా?

    వాలం అంటే తోక, ఆర్ట్ అంటే తెలుసు కదా? కోతి వెనక్కి తిరిగి తోక అనే కుంచెతో రంగు రంగులతో వేసే మహాద్భుతమైన ఆర్టు ఇది. క్రిస్మస్ కో రంగూ, హాలోవీన్ కో రంగూ, అలా మారుతూ ఉంటాయి షాపులో రంగులు. మూడు నెలల ముందు నుంచీ బాకా ఊదుతూ ఉంటారు కొనండి, విసరండి మళ్ళీ కొనండి, మరోసారి విసరండి . అయినా ఏ కాలంలో నైనా క్షతగాత్రులు తప్పరు. అందుకే కురుక్షేత్రం లా కనబడుతూ ఉంటుంది

    డాడ్ అర్ యూ వోకే?

    [వెర్రినవ్వు,] ఇప్పటిదాకా బాగానే ఉందిరా. హూ నోస్ వాట్ ఫ్యూచర్ హోల్డ్స్?

  2. కొత్త కథకులు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    10/03/2017 9:57 am

    ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారు! తెలుగు సాహిత్యంలోని కొత్త కధకుల గురించి మీరు చేసిన సమీక్ష వ్యాసం సామాన్యమైన విషయం కాదు. హృదయపూర్వక అభినందనలు.

    సారంగ అంతర్జాల పత్రికలో “ఈదేసిన గోదారి” శీర్షికన కధలు రాసి పాఠకుల, సాటి రచయితల అభినందనల వెల్లువలను (అసలు సిసిలైన తెలుగు హాస్యరచనలు — చాలా ఏండ్ల తరువాత మళ్లి భానుమతి గారి అత్తగారి కథలు చదివిన అనుభూతి) అందుకున్న “రామిండ్రి సిన్నయ్యగోరు” (శ్రీమతి దాట్ల లలిత గారు) ని యీ సందర్భంలో తలపొయ్యకుండా ఉండలేను.

    “దాట్ల లలిత గారు ప్యూర్ హ్యూమర్ రాయగల చాలా మంచి రచయిత్రి. పతంజలి మిస్ చేసిన రాజుల లోగిళ్ళలోని స్త్రీల జీవితాలను ఆమె బాగా పట్టుకుంటున్నారు. స్త్రీలు అట్లా రాస్తుంటే గర్వంగా ఉంటుంది” ~ జాజిమల్లి డా. మల్లీశ్వరి

  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 10 గురించి కోడీహళ్లి మురళీమోహన్ అభిప్రాయం:

    10/03/2017 9:57 am

    ఈ గడి కూడా తప్పుగా ఉంది. అడ్డం 15, 17 ఒక సారి సరి చూడండి.

    [గడి సవరించాము. ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. — సం.]

  4. ℞: మారేజ్ గురించి amarendra dasari అభిప్రాయం:

    10/03/2017 7:10 am

    విలక్షణమైన కథ… అభినందనలు.

  5. కొత్త కథకులు గురించి amarendra dasari అభిప్రాయం:

    10/03/2017 5:43 am

    “మీరు కథకులందరినీ చదవలేదు”

    నిజం. కానీ ఒక మాట – చదివిన అందరి గురించి ఈ వ్యాసంలో రాయలేదు.

  6. కొత్త కథకులు గురించి kurmanath అభిప్రాయం:

    10/03/2017 12:17 am

    Good gesture by a senior writer. It makes a lot of difference for the young writers. As you said, it can’t be a comprehensive one. It’s responsibility of several critics to cover all. Good attempt, nevertheless, particularly when one considers your hectic globe-trotting schedules.

  7. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2 గురించి వురుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    10/02/2017 10:48 pm

    చాలా బావున్నది. టీజర్‍లోనే శుక్లాంబరధరం చెప్పుకున్నారు కాబట్టి ఈ వ్యాసపరంపర నిర్విఘ్నంగా కొనసాగుతుంది. 🙂

    1. “మాలాచ్చక్రే గజాననమ్ (28.58).” – “మలాచ్చక్రే” అని ఉండాలి కదా.
    2. స్కాంద పురాణం నుంచి ఉట్టంకించిన శ్లోకంలో కూడా తప్పులు ఉన్నాయి. ఒకసారి చూడండి. తాత్పర్యాన్ని కూడా ఒకసారి సరిచూడాలేమో.
    3. వినాయకుడిని పూజించకుండా చవితి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయన్న కథ భాగవతంలోనిది కాదని, స్కాందపురాణంలోనిదని తెలుసుకున్నాను. మీ వ్యాసం చదివాక, తెలిసిన వారిని అడిగి.
    4. ఉత్తర దక్షిణ దేశాల గణపతి పరికల్పనలో ఉండే తేడాల గురించి ముందు ముందు వ్రాస్తారనుకుంటాను. అలాగే, విష్వక్సేనుడి గురించి కూడా.

  8. పవిత్ర గురించి జ్యోతి అభిప్రాయం:

    10/02/2017 8:59 pm

    Different story 🙂 Thanks for translating Bhaskar garu.

  9. శిక్ష గురించి జ్యోతి అభిప్రాయం:

    10/02/2017 8:24 pm

    సిరంజీగారు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే 🙂 ఎప్పట్లాగే ఆపకుండా చదివించేసారు 👏

  10. కొత్త కథకులు గురించి Amarendra అభిప్రాయం:

    10/02/2017 3:32 pm

    Vempara-Vangmoolam-Radhika-Swathi

    I have got into a loop around a loop !!
    My apologies