పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. ℞: మారేజ్ గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    10/06/2017 7:31 am

    ప్రిస్కిప్షనులో ఉండే విషయాల గురించి ఇన్ని కామెంట్లు చదివాక, నాకూ ఆసక్తి కలిగి, నా ప్రిస్క్రిప్షన్లూ, నాకు తెలుసున్న వాళ్ళ అందరి ప్రిస్కిప్షన్లూ అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాను.

    ఎక్కడా ఎప్పుడూ ఎందులొనీ ఏ డాక్టరూ “Marriage” ని రాసిన గుర్తు లేదు! అసలు అలా రాయడం చట్టరీత్యా నేరం అనుకుంటా!

    దాని గురించి ఎవరూ తప్పని ఎత్తిచూపక పోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది! :))

  2. శిక్ష గురించి varma అభిప్రాయం:

    10/06/2017 6:37 am

    థ్యాంక్సండి… జ్యోతిగారూ, లైలాగారూ, వంశీగారూ.

  3. ఏదో కనికట్టు గురించి Dasaradhi Koganti అభిప్రాయం:

    10/06/2017 6:14 am

    చక్కగా ఉంది. మరి కొంత జత చేయాల్సింది….

  4. ℞: మారేజ్ గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:

    10/06/2017 6:07 am

    శర్మ గారి వ్యాఖ్య, తదితరుల వ్యాఖ్యలు చూసాను. నేను గమనించినదాన్ని / నా అనుభవాన్ని గురించి వ్రాద్దామనిపించింది.

    నేను భారతదేశ నివాసిని. Ethical / legal కోణాల గురించి నాకు తెలియదు గానీ, ఇక్కడ డాక్టర్లు చీటీ మీద :-
    (1). రోగి పేరు, జెండర్ వరకూ అయితే వ్రాస్తారు.
    (2). కొండొకచో వయసు కూడా పేర్కొంటారు.
    (3). ఎత్తు, బరువు, అడ్రస్ వ్రాసినట్లు నా అనుభవంలో చూడలేదు. రోగి మరీ నీరసంగా కనిపిస్తుంటే అప్పుడు ప్రత్యేకించి బరువు చూసి వ్రాస్తారేమో తెలియదు మరి. రొటీన్ గా మాత్రం చూడరని నా భావం.
    (4). బీపీ చూడండని రోగి అడిగితేనో, బీపీ చూడవలసిన అవసరం ఉందని డాక్టర్ కు అనిపిస్తేనో, చూసి, చీటీ మీద ఆ రీడింగ్ వ్రాస్తారు (వచ్చిన ప్రతి రోగికీ రొటీన్ గా బీపీ, టెంపరేచర్ కొలవడం నేను చూడలేదు).
    (5). ఇక రోగి వయసుని బట్టో, రోగి వివరించుకున్న లక్షణాలని బట్టి డాక్టర్ మీకు డయాబిటీస్ ఉందా అని అడిగి ఉందని జవాబు వస్తేనో, లేదా డాక్టర్ అడగకపోయినా తన ఆదుర్దా కొద్దీ రోగే తనకు డయాబిటీస్ ఉందని చెబితేనో, అప్పుడు ఆ సంగతి Known diabetic అనో, DM అనో చీటీ మీద వ్రాస్తారు.
    (6). తలమానికం :- రోగి ఏ కంప్లైంట్ తో వచ్చాడో చాలా మంది డాక్టర్లు చీటీ మీద పేర్కొనరు. అక్కడా అక్కడా కొద్ది మంది మాత్రమే c/o (complaining of) అని వ్రాస్తారు. ఇక తను చేసిన రోగనిర్ధారణ (diagnosis) ఏమిటో మందుచీటీ మీద వ్రాయటమనేది చాలా … చాలా … అరుదుగా కనిపిస్తుంది, ఏదో మరీ పాతకాలపు ముసలి ‘చాదస్తపు’ డాక్టర్ అయితే తప్ప.

    పైవన్నీ ఇక్కడ డాక్టర్ల క్లినిక్ ల్లో నా అనుభవాన్ని ఆధారం చేసుకుని వ్రాసాను. బహుశా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇవన్నీ వ్రాస్తారేమో తెలియదు – కార్పొరేట్ హాస్పిటల్స్ కు వైద్యం నిమిత్తం వెళ్ళే అవసరం కలగలేదు touch wood.

    [శర్మ గారి డిస్-క్లైమర్ స్ఫూర్తితో, వారికి కృతజ్ఞతలతో నా డిస్-క్లైమర్ :– నా అనుభవాలు అందరి అనుభవాలూ కాకపోవచ్చు. వైస్ వెర్సా.]

  5. జిక్కి పాడిన మూడు పాటలు గురించి amarendra dasari అభిప్రాయం:

    10/06/2017 4:51 am

    లేటు గా విన్నాను…vintage జిక్కి !! ముఖ్యంగా మూడో పాట…బోలెడు కృతజ్ఞతలు.

  6. ℞: మారేజ్ గురించి amarendra dasari అభిప్రాయం:

    10/05/2017 10:04 pm

    this is w.r.t Lyla Yerneni’s comment di4 oct – directly addressing me

    i feel this is an outburst which i should ignore, but still tempted to clarify a few points

    1. it is my experience over 50 years that life can be as simple as you want it to be. This is not just an ‘encapsulated wisdom at the end of a travel essay’, but an expression of experience at the the end of a life journey

    2. I don’t take the ill-advised unsolicited advise regarding allowing the cabdriver to concentrate on road etc.

    3. all my conversations are not from the back seat ( except in the auto) but from the seat alongside.

    4. I don’t tip the drivers in general, definitely not when ‘their life style meets my approval’

    i am still not able to understand the reason behind this outburst !!

  7. శిక్ష గురించి lyla yerneni అభిప్రాయం:

    10/05/2017 9:45 pm

    చాలా బాగుంది కథ.

    ఇంతకు ముందే ఈ సంచికలో, urban setting, urban vocabulary తో ఒక కథ చదివి ఆ రచయిత్రి భలేగా రాసారనుకున్నా.

    ఇప్పుడు rural setting, rural vocabulary తో మీరు రాసిన కథ చదివి, భలేగా రాసారనుకుంటున్నా. కథలో భాష, భాగోతం బాగా అర్ధమయింది.

    The little guy in this story is absolutely adorable. – లైలా

  8. ℞: మారేజ్ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/05/2017 12:05 pm

    రవి కారుమంచి: అడిగారు కనక చెప్తున్నా. కధా వస్తువు అద్భుతం. కానీ కధలో రాసిన పదాలు, కధలో ఆవిణ్ణి చూపించిన విధం నాకు పెర్సనల్ గా నచ్చలేదు. [డిస్-క్లైమర్ – నాకు నచ్చినవి అందరికీ నచ్చవు, వైస్ వెర్సా. :-)] ఈ కధలో ఆవిణ్ణి బేలగా చేతకానిదానిలా చూపించారు. రోజుకో రేప్ జరుగుతున్న ఈ రోజుల్లో అది మహిళలని అవమానించం అని నాకు అనిపించింది. మహిళలకి ఉండే పీరియడ్స్, హార్మోన్ గొడవలు, యువర్ లిబిడో, ఇంకా కొంచెం ముందుకి పోయి పోర్న్, మాస్టర్బేషన్ అనే పదాలు వాడి చెడగొట్టారు కధని. నిజమే అవన్నీ ఉన్నాయి కానీ ఆ పదాలు వాడక్కర్లేకుండా ఇంకా హుందాగా చెప్పొచ్చు కధని.

    చివరిగా మనసులో అనిపించిన మాట – మహిళా రచయితలే మహిళలని ఇలా చూపిస్తే ఎలా? మహిళలకి ప్రోబ్లెంస్ లేవు అని నేను అనటంలేదు. ఉన్నాయి కానీ పెళ్ళే పరమావధి, హార్మోన్స్, డాక్టర్ ఇచ్చిన కాయితం మీద ఏమి రాశాడో చూసుకోలేనట్టి బేలతనం, బాస్ ఏదైనా అంటే నోరుమూసుక్కూర్చోవడం, తనకన్నా పదేళ్ళ జూనియర్ ఏదో అంటే పొనీలే అని ఊరుకోవడం ఇవన్నీ చూస్తే కధలో అమ్మాయిని చేతకానిదానిగా చూపించారు. పదో క్లాసు చదువుకోని అమ్మాయి కూడా ఎవరైనా ఇలా అంటే మహాకాళిలాగా విరుచుకు పడుతుంది.

    కింది పోస్టులో మర్చిపోయిన మరో విషయం చెప్పడం – అమరేంద్ర గారు చెప్పినట్టు జీవితం ఎంత సింపుల్ గా కావాలిస్తే అంత సింపుల్ గా మలుచుకోవచ్చు. అది మనచేతిలోనే ఉంది. నిజం. ఓ సారి వెనక్కి చూసుకుంటే ఎవరికేనా సరే తెలిసేది ఏమిటంటే – ఈ జీవితం మనది. దాన్ని ఎలా కావాలిస్తే అలా మలుచుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇలా ఉంది అంటే దాదాపు 90% శాతం దానిక్కారణం మనమూ మనకి తీరిన/తీరని కోరికలూను.

    మొదట్లో చెప్పిన డిస్ క్లైమర్ మరో సారి చదుకోమని చెప్తూ. 🙂 శెలవు.

  9. ℞: మారేజ్ గురించి సౌమ్య అభిప్రాయం:

    10/05/2017 9:57 am

    శర్మ గారికి: మీ మొదటి కామెంటు చూసినప్పుడే వ్యాఖ్య రాద్దామనుకుని ఆగాను. రెండో వ్యాఖ్య చూసాక ఇంక రాయాలనిపిస్తోంది. ప్రిస్క్రిప్షన్ మీద వయసు బరువు వగైరా కనీసం హైదరాబాదు లో రాస్తారు. రెండు మూడు నెలల క్రితమే నేను మా అమ్మ ప్రిస్క్రిప్షన్ లో చూశాను. బీపీ ఉందో లేదో గుర్తులేదు. ఈ కథ ఎక్కడ జరిగిందీ కథలో స్పష్టంగా లేదనుకుంటాను. కనుక మీరు చెప్పిన రూల్సు అవీ కథలోని పరిస్థితులకి వర్తించాలని లేదు కదా?

  10. ℞: మారేజ్ గురించి Ravi Karumanchi అభిప్రాయం:

    10/05/2017 9:31 am

    Sarma Danturthy Garu, You definitely seem knowledgeable about HIPAA and PII and other medical stuff..and I may be wrong but I believe they are applicable to US residents.

    If you read the story more closely Purnima Garu never says the protagonist is based in US… She doesn’t even specify the location of the story..

    Given the fact that the protagonist gets into an auto.. We can infer that it is definitely not in the US.

    You may want to consider the possibility that things may work or done differently elsewhere, if it is a right thing to do or not is debatable.

    You seem knowledgeable and well educated and had your share of life experiences .. Love to see your critique on the rest of the story..