పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. ℞: మారేజ్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    10/29/2017 9:57 am

    కధపై దంతుర్తి శర్మ, దాసరి అమరేంద్ర, దివ్య, మధు ఛిత్తర్వు గార్ల అభిప్రాయాలతో ఏకీభవిస్తూ … రచయిత్రి పూర్ణిమ తమ్మిరెడ్డి గారిని అభినందిస్తూ …

  2. కొత్త కథకులు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    10/29/2017 9:43 am

    చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు గారి కధలను పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారు చదివి ఆస్వాదించటమే కాక ఎంతగానో నచ్చుకుంటున్నారు, మెచ్చుకుంటున్నారు.

  3. పవిత్ర గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    10/29/2017 9:36 am

    థాంక్యూ అవినేని భాస్కర్! మరో అద్భుత ఆనుసృజనకు.

    “ మానసిక వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి సైకోసిస్.. అందులోను మరింత ముఖ్యమైనది స్కిజోఫ్రినియా. దీనినే మన అచ్చ తెలుగులో పిచ్చి లేదా ఉన్మాదము అని పిలుచుకుంటాము. స్కిజోఫ్రీనియా మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఎప్పుడూ ఎవరో ఒకరు కనిపించి భయపెడుతూ ఉంటారు. తమకు కనిపించేవారితో వ్యాధి గ్రస్థులు మాట్లాడుతూ ఉంటారు. కానీ చూసేవారికి మాత్రం ఎవరూ కనిపించరు. “

    డచ్ చిత్రకారుడు విన్సెట్ వాంగో, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమెరికా గణిత శాస్త్రజ్ఝుడు జాన్ నాష్ వంటి ప్రముఖులు స్కిజోఫ్రినియా వ్యాధి బాధితులు అని అంటారు కదా.

  4. గడి నుడి -12 గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:

    10/28/2017 12:58 pm

    ఆంధ్రభారతి లో “కమలాకరము” అన్న పదానికి శ్రీహరి గారు “సముద్రము” అన్నారు గానీ శంకరనారాయణ గారు మాత్రం “lake or tank abounding in lotuses” (సరస్సు లేదా చెఱువు) అనే అర్ధమే చెప్పారండి.

  5. తిలక్ కవితా మూలాలు – ఆయన సాధించిన సౌందర్యం గురించి తః తః అభిప్రాయం:

    10/28/2017 12:46 pm

    సి యస్ రావు గారూ, తన (వచన) కవిత్వంలో అక్షరం అక్షరానికీ మొగలి పూ పరిమళం అద్దిన కవి తిలక్. నేను విస్తృతంగా చదివిన వాణ్ణి కాను గానీ తను ఎంచుకున్న వస్తువును అందిచటంలో ఆధునిక పద్యకవులలో నాకు అంత శబ్దార్థ సౌందర్యాన్ని సాధించిన కవిగా కాటూరి కనబడతాడు. వచన కవుల్లో ‘చితి – చింత’లో వేగుంట సాధించిన కవితా సౌందర్యం విలక్షణమైనది.
    నమస్కారాలతో
    తః తః

  6. గడి నుడి -12 గురించి Madhav అభిప్రాయం:

    10/28/2017 10:22 am

    కమలాకరము అన్న పదానికి (ఆంధ్రభారతి వెబ్‌సైట్‌లో) సముద్రము అని రవ్వా శ్రీహరి నిఘంటువు (౨౦౦౪) శంకరనారాయణ నిఘంటువు (౧౯౫౩) అర్థం ఇచ్చివున్నాయి. కూర్పరి ఆ అర్థాన్ని తీసుకున్నారు.

  7. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి kavana sarma అభిప్రాయం:

    10/27/2017 7:59 pm

    నాకు సహాయ పడుతుంది

  8. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2 గురించి kavana sarma అభిప్రాయం:

    10/27/2017 7:42 pm

    జ్ఞాన దాయకం

  9. గడి నుడి -12 గురించి మంజరి.లక్శ్మి అభిప్రాయం:

    10/27/2017 2:22 am

    27లో సముద్రము అని ఇచ్చారు. కమలాకరము అంటే చెరువు కదా!

  10. తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా! గురించి lyla yerneni అభిప్రాయం:

    10/22/2017 5:01 pm

    Reading You, Sivaji. Looking at the different paintings you are bringing to us in this magazine, with interest. Thank you.

    I dislike the heading of this article. ‘తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా’ Just like, I disliked this title of another essay in a previous issue of this magazine, on Bapu’s art- ‘చిత్రం – ‘బాపు’రే విచిత్రం’ Punning based on Artist’s name is more boring than repeatedly copied calendar art. These kind of titles to articles, is a ‘Traditional’ disease, in a Telugu magazine. See some issues in this magazine. You would notice how prevalent it is. కళకాలమ్ should be included, when you take the head-count.

    Turning to the subject of Art:
    I like to hear your opinion on a drawing of Bapu, titled అమ్మ. You can access this drawing from the above mentioned essay on artist Bapu in this magazine. There is a Sanskrit poem. And there is a Telugu translation next to it. The Telugu poetry goes like this. (I have no idea who wrote it. Don’t know how many ‘అమ్మ’ drawings there are all together.)

    “ప్రసవ పర్యంతం నెలనెలా కష్టం కలిగించినందుకు
    ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.”

    ఆ కవిత్వపు మాటలకు, బాపు – బొమ్మ వేసారు. మీకు సంస్కృతం, తెలుగు తెలిస్తే ఆ కవిత్వాలకు కూడా సందేహించకుండా అర్ధం చెప్పండి.

    1. మాతృపిండం అంటే ఏంటి? ఆ కవిత్వానికి అర్థం ఏమిటి?

      I think this Bapu’s drawing is an abhorrence, beyond words. Bapu has no clue about the relationship of size of foetus, to uterus, to the size of a woman’s tummy in a term pregnancy. Am I turned off, just by that technicality? May be. Is this a colored cartoon? It cannot be a caricature of a pregnant woman? Can it? What kind of feelings does this drawing evoke in you, with or without the words next to it?

    2. చిత్రకళా పరిభాషలో గీతకూ, రేఖ కూ తేడా ఉన్నదా?
    3. ముక్తకంఠం, దగ్ధమౌతున్న బాగ్దాద్, మౌనం యుద్ధ నేరం, జెన్ కథల పుస్తకం, మీరూ జర్నలిస్ట్ కావచ్చు – అన్న పుస్తకాల మీద మోహన్ ఆర్ట్ ఉందట. ఆ ఆర్ట్ చూపగలరా? మోహన్ – ఆరు రుతువులు చూపిస్తూ కేలండర్ బొమ్మలు వేసారట. వాటిని చూపగలరా.
    4. చిత్తప్రసాద్ ఎవరు? ఆ ఆర్టిస్ట్ ఎవరో తెలియనందుకు నిందించకుండా, ఆయన ఆర్ట్ ను ఇక్కడ మాకు పరిచయం చెయ్యమని మరో కోరిక. ( గొప్ప తెలుగు వాళ్లని గూర్చి గర్వపడాలనీ, గొప్ప తెలుగువాడని తెలియనందుకు పాఠకులు సిగ్గు పడాలనీ – ఇలాటి మాటలతో తలకాయ వాసిపోయింది.)

    Lyla

    PS:
    “కార్టూనిస్ట్‌గా మీ సాధన ఎలాంటిది?”

    “సాధన అంటూ పత్యేకంగా ఏం లేదు. గీయగా గీయగా ఒక బెటర్ ప్రజంటేషన్‌కి సెటిల్ అయిపోతాం. వేయగా వేయగా వికారపు కేరికేచర్‌క్కూడా జనం సెటిల్ అవుతారు.” మోహన్ (Words taken from an interview attached to an article on artist మోహన్, by journalist గోవిందరాజు చక్రధర్ in this issue. Very good interview. Thanks.)