పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    02/09/2018 11:35 pm

    ‘ఆమె మీద వాడికి ఆ మాత్రం స్వల్పమైన ఆధిక్యత గనక ఉండకపోతే అది వాడికి చావుతో సమానం.’
    – 🙂 గుర్తుండిపోయే వాక్యం!

  2. నిర్నిమిత్తం గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    02/09/2018 11:28 pm

    బావుందండి కవిత.

  3. పది రోజులు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    02/07/2018 7:44 pm

    ఆవినేని భాస్కర్ చేస్తున్న అద్బుత అనుసృజనల సాహితీ సేవలను బేరీజు వెయ్యగల, ప్రశంసించి ప్రోత్సహించగల (“కధ, కధనం, అనువాదం మూడూ మంచి కధగా నిలబెట్టాయి”) అర్హతగల పెద్దలు గౌరి కిరుబనందన్ గారి స్పందనకు ధన్యవాదాలు.

    కానీ అమ్మా, ఇది అనువాదం కాదేమో తన స్వంత రచనేమో అన్నంతగా క్రమం వీడకుండా యెలా రాయగలుగుతున్నాడీ భాస్కరుడు … ఆధునిక ప్రపంచంలో ఊపిరాడని పనుల వత్తిడుల మధ్య ఉండి కూడా.

    ‘ఆత్మాభిమానం వదులుకోవడంవల్ల పేదలెప్పుడూ నడుం వంచుకున్నట్టే కనబడతారు’. అలాంటి దుర్భర పరిస్థితులు మారడానికి సృజనాత్మక జీవులు, ముఖ్యంగా రచయితలు కూడా సాయపడతారని నాకనిపిస్తుంది.

    ఆవినేని భాస్కర్ ఇప్పటివకూ అందించిన అన్ని (అనువాద) కధల్లోనూ మానవత్వము, జీవన మౌలిఖ విలువలు అంతర్లీనంగా గుబాలించటానికి కారణం మాతృకల లోని గొప్పదనమే కాదు, గ్రామీణ మట్టివాసనలు పీల్చి పెరిగిన తనలోని సుగుణము కూడా కదా అమ్మా! (నాకు తెలుసు … ఇంతలా నన్ను పొగడకండి అంటూ వినయంతో వంగిపోతూ భాస్కర్ సిగ్గుపడతాడు. కానీ ఇది నా బలహీనత.)

  4. అమృతం – అనన్యం గురించి punna krishnamurthy అభిప్రాయం:

    02/07/2018 6:54 am

    కుంచె నుంచి జాలువారిన ‘అమృత’బిందువులు

  5. మాట్లాడుకుంటాం సరే గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    02/05/2018 8:32 pm

    ” ఎన్ని – – – – – కుక్కినా
    ఒక మనిషికి సరిపడా స్థలం మిగిలిపోవడాన్ని
    ఎవరికీ తెలీనీకుండా తెరలుకట్టి దాచేయొచ్చు ”

    ఎవరికీ తెలీనీకుండా ఆ తిరిపాన్ని గుండెలో దాచెయ్యటం
    ఆ పర్వతరాజ తనయ వల్ల కాలేదు
    యీ నా త్రిపురాంతకేశ్వరుడి తనయకి వల్ల కాదు.

    సీ.
    హిమశైల శిఖరోన్నత మహా వృషభవాహ
    నాధిరోహణుఁడు, విశ్వాధినేత,
    నిరతార్ధగాత్ర సన్నిహిత పర్వతరాజ
    పుత్రీ ద్వితీయానుభూతిరతుఁడు,
    కైలాస పర్వతాగ్రనివాస పరితోషి,
    వరవీరగణవార పరివృతుండు,
    సర్వభూతవ్రాత సర్వవిద్యాజాత
    నిర్ణేత, మహిత కృక్కర్ణభూషుఁ,
    తే.గీ.
    డిష్టసఖుఁడు కుబేరున, కిందుధరుఁడు,
    గగనకేశుఁ, డతిస్వచ్ఛ కాంతితనుఁడు,
    ఈశ్వరుండు, మహానటుం డెల్లవేళ
    సర్వసౌఖ్యంబు లిడి మమ్ము సాఁకుఁగాక!

    ( అజ్ఞాతకవి – శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ‘చాటుపద్య మణిమంజరి’ నుండి )

  6. నీళ్ళ బయ్యం గురించి venu ancha అభిప్రాయం:

    02/04/2018 7:13 am

    Intresting thought sir. While reading this, felt like a thriller for some time. These days I am reading your writings. I never realised that you have this much hidden talent. You have a different person inside who is very much fond of culture and writing. Great going… Hope to see a full novel/book publishing from you.

    All the best!!

    Venu Ancha

  7. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 14 గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:

    02/03/2018 7:56 pm

    పూర్తి చేశాను

  8. ఒకటి నుంచి పదిల దాకా… గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    02/03/2018 7:39 pm

    ఎంత బావుందో.

  9. అమృత షెర్-గిల్: ఆకృతి చిత్రాలలో ఆత్మాన్వేషణ గురించి మంగు శివరామ ప్రసాద్ అభిప్రాయం:

    02/03/2018 12:47 pm

    “అమృత షెర్-గిల్: ఆకృతి చిత్రాలలో ఆత్మాన్వేషణ” అనే వ్యాసం భైరవభట్ల కామేశ్వరరావు గారి రచన అనువాదంలా కాక మూల రచనలా భాసిస్తూ కళాకారిణి కళా నైపుణ్యాన్ని మరియు విలక్షణమైన వ్యక్తిత్వాన్ని మనోహరంగా ఆవిష్కరిస్తోంది. 19వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రాచ్య కళలకు ఒక చైతన్య వెలుగు వారథిగా షెర్ గిల్ ను ఈ వ్యాసంద్వారా దర్శింపజేయడంలో రచయిత కృతకృత్యులైనారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇటువంటి చక్కటి వ్యాసాన్ని అందించిన భైరవభట్ల కామేశ్వరరావు గారికి, దీన్ని ప్రచురించిన ఈమాట అంతర్జాల పత్రికకు ధన్యవాదాలు.

  10. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 14 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    02/03/2018 8:44 am

    10 నిలువుకు ఆధారం ఇవ్వలేదు. ఇవ్వమని మనవి.

    టి. చంద్రశేఖర రెడ్డి
    [ఇప్పుడు జత చేసాం. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు — సం. ]