సంస్కృతములో నపుంసక పదాలన్నీ చాలా మటుకు జడ పదార్థములే అన్నారు. కానీ చాలా జడ పదార్థములు పుంలింగములో, స్త్రీ లింగములో కూడా వున్నాయి. ఈ సూత్రం ప్రకారమైతే ప్రథమా, ద్వితీయా సమాన రూపములో వుండవు. ఇంకా, ఆకారంత మరియు కొన్ని హలంత స్త్రీలింగ పదములకు ప్రథమా విభక్తి లో, ద్వితీయా విభక్తి లో ద్వి, బహు వచన రూపములు సమానము. ఉదాహరణమునకు ఏతాహా: లతా: పశ్యంతి. “వీరు లతలను చూచుచున్నారు” లేదా “ఈ లతలు చూచుచున్నారు” అని అర్థము వస్తుంది. సర్వనామము కాకుండా సుందర్య: బాలికా: పృచ్ఛంతి, వాక్యాన్ని చుసి మాత్రమే సకర్మక క్రియ వాడినప్పుడు కర్మ చెప్పలేము. ఏతాహా: లతా: హసంతి లో ఏతాహా: లతా: అనేది కర్తృ పదము. హస్ ధాతు అకర్మక ధాతువు కాబట్టి. నాకు తెలిసింది కొంచెమే, తెలిసింది సూచించినాను. నేర్చుకుందామని.
నమస్కారం! దేశికాచార్యులు గారు. ఈ పత్రికలో మీ రచనలన్నీ నేను చదువుతూ ఆనందిస్తున్నాను. పాటలన్నీ విన్నాను.
మీరు స్టేజ్ పైన ప్రదర్శనకు అనుకూలపరిచిన బిల్హణీయము గేయనృత్యనాటిక (9/2017)కన్నా, నాకు బిల్హణీయము (7/2014) ఎక్కువ నచ్చినది. ఈ కింది ఒక్క వాక్యం మాత్రమే అందులో out of place అనిపించింది. I felt, the whole spin of story is undone by that single sentence. After all the ordeal, we readers come to believe, the king has learned a lesson not to use money and power as threats to subjugate others. He is a changed man. Then almost at the end, when we are all ready to go home, suddenly the king utters this sentence. It appeared, we are all pulled once again into the ‘greed’ territory. What’s the point? Is our happiness any lesser if we did not hear this following sentence from the king, then and there?
కెనడా లో మీరు రచించిన “బిల్హణీయము” ప్రదర్శన ఎప్పుడైనా జరపదలిస్తే, దయచేసి తెలియచేస్తే, నేను తప్పక వచ్చి చూస్తాను.
I am going to see “Cosi Fan Tutte” at the Met in New York, in about couple of weeks. I will read your writing ఇంతులందఱు నింతయే once again after that, to augment the pleasure.
(Also excited about listening to Anushka Shankar’s Sitar – as part of Pacific Symphony at Carnegie hall, during that trip of mine.)
శ్రీనివాస్ గారు మంచి లలితగేయాలు అందించారు, ధన్యవాదాలు, వీటిల్లో 1,2,4 గేయాలకు సాహిత్యం “శోభనాచల” బ్లాగులో పోస్ట్ చెయ్యటం జరిగింది. మొదటి గేయం రచయిత బసవరాజు అప్పారావు గారు, రెండవ గేయం రచయిత కందుకూరి రామభద్రరావు గారు (“వేదన” పుస్తకం లోనిది).
ఈ యుదాహరణములను సామాన్యదృష్టితోఁ జూచినచో ‘పువ్వులను’ అను ద్వితీయకు ‘పువ్వులు’ అని ప్రథమ వచ్చుటమాత్రమే గోచరించును. కాని, యీ సూత్రమందలి పదములకూర్పును, ఉదాహరణవాక్యరీతిని, గలిపి నిదానముగా పరికించినచో, ఇది యొక చిన్న వినోదఘట్టముగా స్ఫురించును.
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి రాధిక అభిప్రాయం:
04/06/2018 11:02 am
కర్మపదం ఏకవచనమా బహువచనమా అన్న విషయం మీద ఆధారపడి విభక్తులలో మార్పులు వస్తాయా! ఆ పరిశీలన ఏమైనా చేశారా?
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి sumalatha అభిప్రాయం:
04/05/2018 12:56 pm
సంస్కృతములో నపుంసక పదాలన్నీ చాలా మటుకు జడ పదార్థములే అన్నారు. కానీ చాలా జడ పదార్థములు పుంలింగములో, స్త్రీ లింగములో కూడా వున్నాయి. ఈ సూత్రం ప్రకారమైతే ప్రథమా, ద్వితీయా సమాన రూపములో వుండవు. ఇంకా, ఆకారంత మరియు కొన్ని హలంత స్త్రీలింగ పదములకు ప్రథమా విభక్తి లో, ద్వితీయా విభక్తి లో ద్వి, బహు వచన రూపములు సమానము. ఉదాహరణమునకు ఏతాహా: లతా: పశ్యంతి. “వీరు లతలను చూచుచున్నారు” లేదా “ఈ లతలు చూచుచున్నారు” అని అర్థము వస్తుంది. సర్వనామము కాకుండా సుందర్య: బాలికా: పృచ్ఛంతి, వాక్యాన్ని చుసి మాత్రమే సకర్మక క్రియ వాడినప్పుడు కర్మ చెప్పలేము. ఏతాహా: లతా: హసంతి లో ఏతాహా: లతా: అనేది కర్తృ పదము. హస్ ధాతు అకర్మక ధాతువు కాబట్టి. నాకు తెలిసింది కొంచెమే, తెలిసింది సూచించినాను. నేర్చుకుందామని.
ఇంతులందఱు నింతయే గురించి lyla yerneni అభిప్రాయం:
04/05/2018 10:37 am
నమస్కారం! దేశికాచార్యులు గారు. ఈ పత్రికలో మీ రచనలన్నీ నేను చదువుతూ ఆనందిస్తున్నాను. పాటలన్నీ విన్నాను.
మీరు స్టేజ్ పైన ప్రదర్శనకు అనుకూలపరిచిన బిల్హణీయము గేయనృత్యనాటిక (9/2017)కన్నా, నాకు బిల్హణీయము (7/2014) ఎక్కువ నచ్చినది. ఈ కింది ఒక్క వాక్యం మాత్రమే అందులో out of place అనిపించింది. I felt, the whole spin of story is undone by that single sentence. After all the ordeal, we readers come to believe, the king has learned a lesson not to use money and power as threats to subjugate others. He is a changed man. Then almost at the end, when we are all ready to go home, suddenly the king utters this sentence. It appeared, we are all pulled once again into the ‘greed’ territory. What’s the point? Is our happiness any lesser if we did not hear this following sentence from the king, then and there?
“మదన: ఆ! మఱచినాను చెప్పడం. మీపుత్రుడే ఈరాజ్యానికి పట్టభద్రుడౌతాడు.”
కెనడా లో మీరు రచించిన “బిల్హణీయము” ప్రదర్శన ఎప్పుడైనా జరపదలిస్తే, దయచేసి తెలియచేస్తే, నేను తప్పక వచ్చి చూస్తాను.
I am going to see “Cosi Fan Tutte” at the Met in New York, in about couple of weeks. I will read your writing ఇంతులందఱు నింతయే once again after that, to augment the pleasure.
(Also excited about listening to Anushka Shankar’s Sitar – as part of Pacific Symphony at Carnegie hall, during that trip of mine.)
Thanks, and Have a nice day! – Lyla
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి నాగమురళి అభిప్రాయం:
04/04/2018 12:16 pm
వ్యాసం చాలా బాగుంది.
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి Rao Vemuri అభిప్రాయం:
04/04/2018 10:45 am
చాలా బాగుంది. ఉత్కంఠభరితంగా ఉన్న కథని చదువుతూన్నట్లు అనిపించింది.
లలిత గీతాలు గురించి వెంకటరమణ అభిప్రాయం:
04/03/2018 12:12 pm
శ్రీనివాస్ గారు మంచి లలితగేయాలు అందించారు, ధన్యవాదాలు, వీటిల్లో 1,2,4 గేయాలకు సాహిత్యం “శోభనాచల” బ్లాగులో పోస్ట్ చెయ్యటం జరిగింది. మొదటి గేయం రచయిత బసవరాజు అప్పారావు గారు, రెండవ గేయం రచయిత కందుకూరి రామభద్రరావు గారు (“వేదన” పుస్తకం లోనిది).
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి VSTSayee అభిప్రాయం:
04/03/2018 11:22 am
దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారి “రమణీయము” (బాలవ్యాకరణసమీక్ష) నుండి ..
చిన్నయసూరి – ఉక్తిలాలిత్యము
చిన్నయసూరి మంచివివేచనముతోపాటు నిదానమగు చూపును, లౌకికానుభవ పరిణతియునుగలవ్యక్తి. శాస్త్రీయవిషయములు క్లిష్టములయి దురవగాహములయి యారంభదశలో నున్నవారికెంత విసువు జనింపఁజేయునో గుర్తించిన తత్త్వజ్ఞుఁడు. కనుకనే లోకవృత్తములను, మనోహరసన్నివేశములను, దన యుదాహరణములలో నతినిపుణతతోఁ బొదిగి చక్కని కావ్యలాలిత్యము గోచరించునట్లు వ్యాకరణము రచించెను.
కారకపరిచ్ఛేదమున “జడంబుద్వితీయకుఁ బ్రథమ బహుళంబుగా నగు” అను సూత్రమునకు
“వాఁడు పువ్వులు దెచ్చె” (వాఁడు పువ్వులను దెచ్చె)
“ఆకె సొమ్ములు దాల్చె” (ఆకె సొమ్ములను దాల్చె)
“వాఁడిల్లు వెడలె” (వాఁడింటిని వెడలె)
అను వాక్యములు ఉదాహరణములు.
ఈ యుదాహరణములను సామాన్యదృష్టితోఁ జూచినచో ‘పువ్వులను’ అను ద్వితీయకు ‘పువ్వులు’ అని ప్రథమ వచ్చుటమాత్రమే గోచరించును. కాని, యీ సూత్రమందలి పదములకూర్పును, ఉదాహరణవాక్యరీతిని, గలిపి నిదానముగా పరికించినచో, ఇది యొక చిన్న వినోదఘట్టముగా స్ఫురించును.
మనదేశమున సాధారణముగా సంసారభారమువహించుటలో భర్త మొదటివాఁడుగను, భార్య రెండవదిగను నుండుట పరిపాటి. దీనినిబట్టియే భార్యకు ‘ద్వితీయ’ అనుపేరుగూడ నేర్పడియుండును. కాని, జడసంబంధి ద్వితీయ (భార్య) ప్రథమగా మాఱును. అనఁగా సంసారనిర్వహణమున ప్రధానురాలు కావలసియుండును. భర్త జడుఁడు. సంసారమును జక్కదిద్దుకొననేరఁడు. ఆభారముసహితము తానే వహింపవలసివచ్చుటచే, ఆమెకుఁ గొంత విసుగును, భర్తపైని అలక్ష్యభావమును నేర్పడుట సహజము. అట్టిభార్యకు నేదేనొకమార్గమున నాతఁడు ప్రీతిని గలిగింప యత్నించుటయు సహజము. అందులకే గాఁబోలును, పాపము అమెయిచ్చకమునకై వాఁడు పూవులు దెచ్చెనఁట. ఆమె, అతఁడు తెచ్చినపూవులు ముడుచుకొన నిచ్చగింపక, తనకున్న మఱేవోసొమ్ములు దాల్చెనఁట. అతఁడెంత జడుఁడైనను, తాను దెచ్చిన పూవులు నిరాకరింటవలనఁ జిన్నవోక తప్పదుగదా! చిన్నవోయి, ఏమియుఁ జేయలేక, ఏమాటయుఁ బలుకలేక వాఁడిల్లు వెడలెనఁట.
—
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
అద్దెకిచ్చి చూడు గురించి Krishna Veni అభిప్రాయం:
04/03/2018 2:06 am
నరసింహ రావుగారు,
ధన్యవాదాలు.
లేదండి. ఆ సినిమా చూడలేదు.
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి sumalatha అభిప్రాయం:
04/02/2018 10:26 pm
స్థూలంగా కాదు సూక్ష్మంగా
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 16 గురించి Kartik Chandra Pvs అభిప్రాయం:
04/02/2018 5:49 am
గౌరవ సంపాదకులకు
నమస్కారం.
16 నిలువూ. 25 అడ్డం ….మీ సరిచూడులో తప్పు చూపిస్తున్నాయి..(వివరణల్లోకి పో దలచుకో లేదు) దయచేసి ఒక సారి సరి చూడ గలరని విన్నపం.