విజయ భాస్కర రెడ్డి గారూ, మనకి బడిలో వ్యాకరణం నేర్పే తీరు ఇలాంటి సందేహాలకు దారి తీస్తోంది! డు, ము, వు, లు అనేవి ప్రత్యయాలు. కొన్ని రకాలైన పదాలకు ప్రథమావిభక్తిలో ఆ ప్రత్యయాలు వస్తాయి. కొన్ని పదాలకు ప్రథమా విభక్తిలో ఏ ప్రత్యయాలు రావు. అంచేత డు, ము, వు, లు లేకపోయినా చెట్టు, చీర మొదలైన పదాలు ప్రథమావిభక్తిలోనే ఉంటాయి.
తఃతఃగారు,
1. నాకు తెలిసినంతవరకూ ఈ సూత్రానికి తత్సమ, తద్భవ, ఆచ్ఛికమనే భేదం లేదు. ఈ సూత్రం కారక పరిచ్ఛేదంలో వస్తుంది.
2. ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా?” – ఈ వాక్యాన్ని ఇంకొకరు కూడా ఈ వ్యాస సందర్భంలోనే నాతో ప్రస్తావించారు 🙂 నేను అర్థం చేసుకున్నంత వరకూ, పద్య సందర్భాన్ని బట్టి, ఇది పిల్లిని తిన్న కోడి కాదు, పిల్లి తినేసిన కోడి. కాబట్టి ఇక్కడ పిల్లి కర్మ కాదు. అంచేత ఇక్కడ ద్వితీయా విభక్తి అవసరం లేదు. అలాగే “పలుకునా” అనే క్రియకు కర్త కోడి. దానికీ ద్వితీయ రాదు. “పిల్లిని తిన్న కోడి” అనే భావం రావాలంటే అక్కడ కచ్చితంగా “పిల్లిఁ దిన్న కోడి” అని సరళాదేశం జరిగి అరసున్న రావాలి.
3. నేను వ్యాసంలో ప్రస్తావించినట్లు, ఒక సూత్రంలో, ‘వైకల్పికం’, ‘బహుళం’ అనే పదాలు ప్రయోగించకుండా ‘అగు’ అని ఊరుకుంటే అది నిత్యమనే అర్థం. ‘కర్మంబున ద్వితీయయగు’ అనే సూత్రం ప్రకారం కర్మ వాచకానికి నిత్యంగా ద్వితీయ వచ్చి తీరాలి. కాని అలా రాని సందర్భాలు ఉండబట్టే, ఏయే సందర్భాలలో రాకుండా ఉంటుందో చెప్పడానికి ‘జడంబు…’ అన్న సూత్రం అవసరమయ్యింది. సూత్రంలో చెప్పిన కార్యం, కొన్ని చోట్ల ‘వైకల్పికం’గా జరగడమూ, కొన్ని సందర్భాలలో ‘నిత్యంగా’ జరగడమో, లేదా అసలు జరగకుండా ఉండడమో జరిగితే దాన్ని ‘బహుళం’ అంటారు. ఒక సూత్ర కార్యం బహుళంగా జరిగేటప్పుడు, ఏయే సందర్భాలలో నిత్యమో, ఏయే సందర్భాలలో వైకల్పికమో, ఏయే సందర్భాలలో ఆ కార్యం జరగదో చెప్పి తీరాలి. కనీసం కొన్ని ఉదాహరణలిచ్చి ఇలాంటి సందర్భాలలో ఇలా జరుగుతుంది అనయినా చెప్పాలి. ‘జడంబు ద్వితీయ…’ సూత్రంలో కూడా ఏయే సందర్భాలలో ఈ సూత్ర కార్యం జరగదో, అంటే పదం జడమైనా ద్వితీయ కచ్చితంగా వచ్చి తీరుతుందో చిన్నయ్యసూరి వివరించాడు. అయితే అవి నేనీ వ్యాసంలో చెపుతున్న అపవాదాలు కావు కాబట్టి, అతను పేర్కొన్నవి సరికావని నేను భావిస్తాను కాబట్టి, దానికి ఈ వ్యాస విషయంతో సంబంధం లేదు కాబట్టి, వాటిని ఇక్కడ వివరించ లేదు. మీరు కారక పరిచ్ఛేదంలో ఈ సూత్ర వివరణ చూడండి.
4. భాషను పరిపూర్ణంగా ఒదిగించడానికి ఎన్ని సూత్రాలైనా ‘కొద్ది’ సూత్రాలుగా మిగిలిపోతాయని!
తజ్జనని లోగిటం గల
రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్
బొజ్జ దిరిగి రాదయ్యె జ
గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే? :-))
శ్రీ కామేశ్వర రావు :
1. మొదలుబెడుతూ మీరు చెప్పిన వాక్యాల లో అన్నీ – కర్త, కర్మ,,క్రియ – మూడూ అచ్చ తెలుగు పదాలు గా ఉన్నవి కావు . ‘వెలుంగు అర్చింతు’లలో ఒక మాట ‘ తెలుగు ‘ కాదు . పరవస్తు వారి తెలుగు వ్యాకరణ సూత్రం సంకరాలకు వర్తిస్తుందా? మీరు ఈ సూత్రం ఏ పరిచ్ఛేదం లోదో చెప్పిఉండ వలసినది.
2. “అందుకే కర్త కర్మ రెండూ చైతన్యపదార్థాలే అయినప్పుడు వాటి మధ్య భేదం తెలియడానికి ద్వితీయా విభక్తి తప్పనిసరి అవుతుంది. ”
ఈ వేమన పద్యపాదం చూడండి : ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా? ” (‘బడు’ లేని ‘చైతన్య’ వంతమైన అచ్చ తెలుగు మాట).
3. “కర్మ జడమైనా ద్వితీయా ప్రత్యయం కచ్చితంగా వచ్చి తీరాల్సిన సందర్భాలు మనకు వ్యవహారంలో కొన్ని కనిపిస్తాయి. వాటిని ఈ సూత్రంలో చిన్నయ్యసూరి పేర్కొనలేదు.” అవసరం లేదు .అలా పేర్కొనే పక్షాన ‘ నిత్యము ‘ అని ఒక సూత్రం చేయాలి. కచ్చితంగా రాని సందర్భాలు పేర్కొనాలి : చూ : ‘ బహుళ గ్రహణము చేత స్త్రీ వాచక…. సంధి లేదు. ఆమ్మ యిచ్చెను.
4. “సహజంగా ఏర్పడిన ఏ మానవభాష కూడా ఏ కొద్ది సూత్రాలలోనో పరిపూర్ణంగా ఒదిగిపోదు.” ‘కొద్ది’ అని అనటం లో ఒదిగే టట్టు చేయగలిగేటన్ని సూత్రాలు చేయగలిగే అవకాశం ఉండ వచ్చనే నేనా!
నమస్కారాలతో
తః తః
ధన్యవాదములు. ఈ మాసపు పాటలు కూడా అందించాలని నా విన్నపము. సుశీల గారు పాడిన సంక్రాంతి పాట, ఋతువుల పాట మరియు అల నీల గగనాన అనే పాట post చెయ్యగలరని ఆశిస్తున్నాను.
నేను తెలుగు వాడిని అయినా తెలుగు వ్యాకరణం అంతగా తెలియదు. కానీ నాకూ తెలిసి ప్రథమా విభక్తి డు ము వు లు అని చదువుకున్నాను. పై వ్యాసంలో చీర, చెట్టు లాంటి వాటిల్లో ప్రథమావిభక్తి ఎక్కడ వుందో తెలియపరచగలరు.
ఆసక్తితో ఈ వ్యాసాన్ని చదివి స్పందించిన అందరికీ ధన్యవాదాలు. నేను పరిశీలించిన అంశాలకు సంబంధించి మరింత చర్చను ఆలోచనను పురికొలిపే దిశగా మీ ఆలోచనలను పంచుకున్నందుకు మరిన్ని కృతజ్ఞతలు. ఈ చర్చ మరికొంత స్పష్టతకు, మరిన్ని కొత్త ఆలోచనలకూ దారి తియ్యాలని ఆకాంక్షిస్తూ, పై వ్యాఖ్యలలో లేవనెత్తిన కొన్ని అంశాలను నాకు తెలిసిన మేర వివరించే ప్రయత్నం చేస్తాను:
1. ముందుగా పినాకపాణిగారి ఈ ప్రశ్న గురించి:
“అంచేత ఇక్కడ శిల అనే పదం విడిగా జడమే అయినా, ఈ వాక్యంలో అది చేతనత్వం పొందింది. అందువల్ల జడ ద్వితీయకు ప్రథమ వస్తుందన్న సూత్రం ఇక్కడ వర్తించదు.” అని సూత్రీకరించడం ఎందుకు? ఇక్కడ కూడా అర్థావబొధ కోసం మాత్రమే ద్వితీయా విభక్తి ప్రత్యయం తప్పనిసరి ఐంది. దానివల్ల శిల అనేది కర్తకాదని కర్మేనని స్పష్టమౌతుంది.
“గుడిలో శిల పూజించడం ఎందుకు?” అనే వాక్యంలో అర్థావబోధ ఎందుకు లేదు అన్నది నా ప్రశ్న. “నువ్వు గుడిలో శిల పూజించడం ఎందుకు” అనే వాక్యంలో నువ్వు అనే పదం కర్త, శిల అనే పదం కర్మ అన్నది స్పష్టమే. అక్కడ అర్ధాబోధకు పెద్ద ఇబ్బంది లేదు, అయినా ఆ వాక్యం సరికాదని నా అభిప్రాయం. దానికి కారణం ఆ వాక్యంలో కర్మ అని నా ప్రతిపాదన. మరింత స్పష్టత కోసం మరొక ఉదాహరణ చూద్దాం: “దుష్టులు గుడిలో శివలింగం పగలుగొట్టేసారు”, “మార్కండేయుడు శివలింగం పూజించాడు” – ఈ రెండు వాక్యాలలో ఏది సరైనది, ఏది కాదు, ఎందుకు?
“కిశోర్ గోడ గుద్దుకున్నాడు” – నాకు తెలిసినంత వరకూ ఈ వాక్యం సరైనదే, ‘కుక్క పురుగు తిన్నది’ – ఇది కచ్చితంగా తప్పే! ప్రత్యేక సందర్భాలలో, సందర్భాన్ని బట్టి అర్థం తెలుస్తూ ఉన్నా, సామాన్య భాషా లక్షణాన్ని బట్టి ఉండాల్సిన ప్రత్యయం ఉండకపోతే అది భాషా స్వరూపానికి విరుద్ధంగా ఉండి, తప్పే అవుతుంది. నాకు తెలిసినంత వరకూ, కేవలం అర్థబోధ ఒక్కటే భాష స్వరూపాన్ని, దాన్ని అనుసరించి దాని ప్రయోగంలో తప్పొప్పులని నిర్ణయించదు. దీని గురించి మరింత చర్చ అవసరం!
2. విశ్వనాథవారి పద్యం గురించి:
సుమలతగారు, పినాకపాణిగారూ సూచించినట్లు, మొత్తం పద్యమంతా కర్మను సూచించే పదాలే, ‘వెలుంగు’తో సహా. ఏ పదానికీ ద్వితియా విభక్తి లేదు. వరుసలో వచ్చే పదాలకు ఒకే విభక్తి ప్రత్యయం వర్తిస్తే, చివరిపదానికి మాత్రమే దాన్ని చేర్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క “వెలుంగు’ పదాన్నే ప్రస్తావించాను. సుమలతగారు అన్నట్టుగా ‘అయిన నిన్ను’ అన్న పదాలను అధ్యాహారంగా తెచ్చుకుంటే కానీ అర్థం పొసగదు. కానీ “వెలుంగర్చింతు” అని సంధి కలిసిపోవడం వల్ల, మధ్యలో ఆ అధ్యాహారం చేర్చడానికి మరింత ఇబ్బంది ఏర్పడింది. వ్యాసంలో పేర్కొన్నట్టు, ఆ పద్యం వ్యాకరణపరంగా తప్పు కాకపోయినా, నిర్మాణ పరంగా అర్థబోధకు ఇబ్బంది కలిగిస్తోంది అని నా ఉద్దేశం. దీని ముందరి “శ్రీమంజూషిక” పద్యం కూడా ఇలాంటిదే. అక్కడ “శ్రీమంతంబయి పోల్చు వెల్గునొకడే” అని వాక్యం ఆగి, “సేవింతు విశ్వేశ్వరా” అని పూర్తవుతుంది. అందువల్ల అక్కడ ‘అలాంటి వెలుగును సేవింతును’ అని అధ్యాహారంతో పూరించుకోవడం సులువవుతుంది.
3. సంస్కృతంలో నపుంసక పదాల విషయమై సుమలతగారి వ్యాఖ్య గురించి:
వారన్నది నిజమే, సంస్కృతంలో ఈ సూత్రం సర్వత్రా వర్తించదు. అలా వర్తిస్తుందని చెప్పడంకూడా నా ఉద్దేశం కాదు. ఇక్కడే భాషా స్వరూప విషయమై వ్యాకరణవేత్తల దృష్టి, భాషాశాస్త్ర వేత్తల దృష్టి కొద్దిగా వేరుగా ఉంటుంది. భాషలో కచ్చితంగా కనిపించే లక్షణాలను సూత్రాల ద్వారా నిర్వచించే ప్రయత్నం వ్యాకరణానిది. భాషాశాస్త్రంలో కచ్చితత్వం కన్నా, ఎక్కువగా కనిపించే లక్షణాల గురించి విశ్లేషించి వాటి వెనకనున్న కారణలు వెతకడం ముఖ్యం. ఆ దృష్టితో చూస్తే, సంస్కృతంలో నపుంసకలింగ పదాలకు ప్రథమ, ద్వితీయ విభక్తులు ఒకటే కావడం, నపుంసకలింగ పదాలు ఎక్కువగా జడాలే కావడం ఆసక్తికరమైన అంశం. ఇది కచ్చితంగా ఇతర భాషల్లో కనిపించే DOM లక్షణమే అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. దీనికీ దానికీ సంబంధం ఉండవచ్చునన్నదే నా ప్రతిపాదన. దీని గురించి కొంత పరిశోధన ఇప్పటికే జరిగింది. నపుంసకలింగానికి కర్త, కర్మల ప్రత్యయ స్వరూపం ఒకటే కావడం మిగతా ఇండో-యూరోపియన్ భాషలైన లాటిన్, గ్రీకు మొదలైన వాటిలో కూడా కనిపిస్తుంది. ఇది త్రిలింగాలున్న IE భాషల్లో ప్రాచీనంగా కనిపించే లక్షణమనీ, DOM కొంత ఆధునికంగా వచ్చిన లక్షణమనీ కొందరు భాషశాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే నపుంసకలింగ పదాలలో కర్త కర్మల ఏక స్వరూపానికీ, అవి ఎక్కువగా జడాలే కావడానికీ కచ్చితంగా సంబంధం ఉంది. పుంస్త్రీ లింగ పదాల ద్వితియా విభక్తిలో ఎక్కువగా కనిపించే ‘మ్’ ప్రత్యయం, నపుంసకలింగ పదాల ప్రథమ/ద్వితీయలలో ఎక్కువగా కనిపించడం కూడా యాదృచ్చికం కాదని కొందరు భాషపరిశోధకుల అభిప్రాయం. ఇదికూడా, సంస్కృతంలోనే కాక లాటిన్ వంటి ఇతర IE భాషల్లో కనిపిస్తుంది. దీని గురించి మరింత వివరంగా వేరే వ్యాసం అవసరం. ఆసక్తి ఉన్న వాళ్ళు దీన్ని చదవవచ్చు: http://www.uk-cla.org.uk/files/proceedings/Manoliu.pdf
4. “కర్మపదం ఏకవచనమా బహువచనమా అన్న విషయం మీద ఆధారపడి విభక్తులలో మార్పులు వస్తాయా! ఆ పరిశీలన ఏమైనా చేశారా?” అన్న రాధికాగారి ప్రశ్న గురించి:
నేను చూసినంత వరకూ, ద్వితియా విభక్తి ప్రత్యయంపై వచనాల ప్రభావం ఏమీ కనిపించలేదు. మీకు ప్రత్యేకంగా ఏమైనా కనిపిస్తే తప్పక ఇక్కడ పంచుకోండి.
5. “సూపర్ ఉంది” (“సూపర్ గా ఉంది” కాదు), “లైట్ తీసుకో” (“లైట్ గా తీసుకో” కాదు) వంటి ప్రయోగాలు బాగా వాడుకలోకి వచ్చాయి. ఇటువంటి ఆధునిక భాషా పరిణామాల విశ్లేషణ కోసం ఎదురు చూస్తున్నా! – అన్న వేణుగారి అభిప్రాయం గురించి:
అవును ఆధునిక తెలుగు పరిణామాన్నీ, అందులో ప్రయోగాలనీ తప్పకుండా పరిశోధించాల్సిన అవసరం ఉంది! ఇది అంత ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా, తెలుగుపై ఒకప్పుడు సంస్కృతం చూపిన ప్రభావాన్ని, ఇప్పుడు ఇంగ్లీషు చూపిస్తున్న ప్రభావాన్ని పోల్చి, వాటి మధ్యనున్న మౌలిక భేదాన్ని వివరంగా విశ్లేషించాలని చాలా కాలంగా నా కోరిక. ఎప్పుడు సాధ్యమవుతుందో!
6. శాయిగారూ, నేనీ వ్యాసం రాస్తున్నప్పుడే, దువ్వూరివారి రమణీయాన్ని ఎవరో వ్యాఖ్యలలో ప్రస్తావిస్తారని కచ్చితంగా అనుకున్నాను! నా నమ్మకాన్ని వమ్ము చెయ్యనందుకు ధన్యవాదాలు :-)) ఇదే సందర్భంలో ‘కర్మంబున ద్వితీయ యగు’ అన్న అసలు సూత్రం వెనకనున్న ద్వంద్వార్థం కూడా పాఠకులు గమినించే ఉంటారని ఆశిస్తున్నాను 🙂
నమస్తే సార్. నిస్సందేహంగా మంచి చిత్రకారులు మీరు. నిజంగానే కొన్ని బొమ్మలు కథ ఏమిటి అని హాంట్ చేయిస్తాయి.కానీ కథలోకి పూర్తిగా పోలేని మేము విజువల్ కోసం బొమ్మను ఆధారం చేసుకుంటాము. అప్పుడు మాకు మీ బొమ్మలో కూడా ఇంత గొప్ప ఉంటే ఎలా అర్థం చేసుకోగలం? మీరు వివరిస్తే చాలా బాగుంది. చేతికి ఐదు వేళ్ళ లాగా దేవుడు అన్ని స్థాయిల వారి కోసం అన్ని రకాల చిత్రకారులును సృష్టించాడు.కళను గౌరవించడంలోనే కళాకారుడి గొప్పదనం. మీరు గీసిన మల్లాదిగారి గాడిద మీద కనిపించని నంబర్ మీదే అందరికీ ఆసక్తి. అలాటి మంచి బొమ్మలు మీ చేతి వేళ్లనుండి దేవుడు ఎప్పుడూ జాలువార్చాలి అని కోరుకుంటూ మీలోని రచయితను, చిత్రకారుడిని ఇద్దరినీ అభినందిస్తున్నాను👌👍
వ్యాసం చాలా బాగుంది. కానీ (నాకు) కొంత తికమకగా ఉంది. కైలాసాచలసానువాసము, వృషస్కంధాగ్రసంస్థాయి, తత్ప్రాలేయాచలకన్యకాకుచతటీపర్యంకనిద్రాగతంబు, ఆలోలాగ్రజటాతటీఘటితనాకౌకస్సరిత్కంబు, దేహాలంకారితలేలిహానము, (ఇవన్నీ కర్మలే!) వీటన్నిటికీ లేని ద్వితీయా విభక్తి ప్రత్యయం ఒక్క వెలుంగుకే ఎందుకు కావలసి వచ్చిందో నాకర్థం కాలేదు. బహుశ: వ్యాస రచయిత వెలుం గర్చింతు అని సంధి వల్ల ఇలా అభిప్రాయ పడ్డారా! లేక వీటన్నిటిలో కైలాసాచలసానువాసమున్ అని ఉండి నకారానికి లోపం వచ్చిందనా! ( అలాగైతే దత్ప్రాలేయాచల అని సంధి జరగాలి!) లేక క్రియ ఐన అర్చింతు అనేది వెలుగుకు అత్యంత సమీపంలో ఉందనా! ఈ విశేషణాల వరస మారి వెలుంగు మధ్యలో ఎక్కడైనా ఉండి ఉంటే అప్పుడు కూడా వ్యాస రచయిత ఇలాగే అభిప్రాయపడే వారా!
“‘పూజించడం’ అనే క్రియ ఎప్పుడూ చైతన్యమైన కర్మ పదాన్నే ఆశిస్తుంది. ” ఇలాగనుకొని “అంచేత ఇక్కడ శిల అనే పదం విడిగా జడమే అయినా, ఈ వాక్యంలో అది చేతనత్వం పొందింది. అందువల్ల జడ ద్వితీయకు ప్రథమ వస్తుందన్న సూత్రం ఇక్కడ వర్తించదు.” అని సూత్రీకరించడం ఎందుకు? ఇక్కడ కూడా అర్థావబొధ కోసం మాత్రమే ద్వితీయా విభక్తి ప్రత్యయం తప్పనిసరి ఐంది. దానివల్ల శిల అనేది కర్తకాదని కర్మేనని స్పష్టమౌతుంది. ఉదాహరణకు మసీదులొ కాజా తినడం ఎందుకు అనే వాక్యం లో కాజా అంటే అదొక మనిషి పేరు కావచ్చు. లేదా ఒక పదార్థం పేరు కావచ్చు. అందుకని స్పష్టత కోసం కర్మార్థంలో ‘కాజాను’ అనీ కర్త్రర్థంలో ‘కాజా’ అనీ వాడాల్సి వస్తుంది కానీ తినడం అనే క్రియతో దానికి ఏ సంబంధం ఉండదు.
ఎక్కడైనా అర్థావబోధ ముఖ్యం- జాడ్యం చైతన్యం వంటి ప్రమాణలకంటే! “‘కిశోరు గోడ(ను) గుద్దుకున్నాడు’ అనేది సరైన వాక్యమే” అయితే కుక్క పురుగు తిన్నది కూడా సరైన వాక్యమే! ఇక్కడ రెండూ చేతనాలే! కాబట్టి అర్థస్పష్టతకు లోపం లేనంత వరకు “ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం” అనేదే ప్రమాణం.
వేణు గారు ఉదాహరించిన “సూపర్ ఉంది” >“సూపర్ గా ఉంది” కి గూడా ఇదే వర్తిసుంది. జీవద్భాష ఏదైనా మరింత వేగం పొందడానికి చేసే ప్రయత్నాల్లో ప్రత్యయాలను సాధ్యమున్నంతవరకు నివారించడం ఒకటి. దీని వల్ల కొంచెం అర్థక్లిష్టత ఏర్పడినపుడు తిరిగి కొన్ని నియమాలను చేసుకుంటూ పోవడమూ మామూలే!
ఒక మంచి వ్యాసం ద్వారా కొత్త ఆలోచనలను రేకెత్తించినందుకు కృతజ్ఞతలు.
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
04/14/2018 1:36 am
విజయ భాస్కర రెడ్డి గారూ, మనకి బడిలో వ్యాకరణం నేర్పే తీరు ఇలాంటి సందేహాలకు దారి తీస్తోంది! డు, ము, వు, లు అనేవి ప్రత్యయాలు. కొన్ని రకాలైన పదాలకు ప్రథమావిభక్తిలో ఆ ప్రత్యయాలు వస్తాయి. కొన్ని పదాలకు ప్రథమా విభక్తిలో ఏ ప్రత్యయాలు రావు. అంచేత డు, ము, వు, లు లేకపోయినా చెట్టు, చీర మొదలైన పదాలు ప్రథమావిభక్తిలోనే ఉంటాయి.
తఃతఃగారు,
1. నాకు తెలిసినంతవరకూ ఈ సూత్రానికి తత్సమ, తద్భవ, ఆచ్ఛికమనే భేదం లేదు. ఈ సూత్రం కారక పరిచ్ఛేదంలో వస్తుంది.
2. ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా?” – ఈ వాక్యాన్ని ఇంకొకరు కూడా ఈ వ్యాస సందర్భంలోనే నాతో ప్రస్తావించారు 🙂 నేను అర్థం చేసుకున్నంత వరకూ, పద్య సందర్భాన్ని బట్టి, ఇది పిల్లిని తిన్న కోడి కాదు, పిల్లి తినేసిన కోడి. కాబట్టి ఇక్కడ పిల్లి కర్మ కాదు. అంచేత ఇక్కడ ద్వితీయా విభక్తి అవసరం లేదు. అలాగే “పలుకునా” అనే క్రియకు కర్త కోడి. దానికీ ద్వితీయ రాదు. “పిల్లిని తిన్న కోడి” అనే భావం రావాలంటే అక్కడ కచ్చితంగా “పిల్లిఁ దిన్న కోడి” అని సరళాదేశం జరిగి అరసున్న రావాలి.
3. నేను వ్యాసంలో ప్రస్తావించినట్లు, ఒక సూత్రంలో, ‘వైకల్పికం’, ‘బహుళం’ అనే పదాలు ప్రయోగించకుండా ‘అగు’ అని ఊరుకుంటే అది నిత్యమనే అర్థం. ‘కర్మంబున ద్వితీయయగు’ అనే సూత్రం ప్రకారం కర్మ వాచకానికి నిత్యంగా ద్వితీయ వచ్చి తీరాలి. కాని అలా రాని సందర్భాలు ఉండబట్టే, ఏయే సందర్భాలలో రాకుండా ఉంటుందో చెప్పడానికి ‘జడంబు…’ అన్న సూత్రం అవసరమయ్యింది. సూత్రంలో చెప్పిన కార్యం, కొన్ని చోట్ల ‘వైకల్పికం’గా జరగడమూ, కొన్ని సందర్భాలలో ‘నిత్యంగా’ జరగడమో, లేదా అసలు జరగకుండా ఉండడమో జరిగితే దాన్ని ‘బహుళం’ అంటారు. ఒక సూత్ర కార్యం బహుళంగా జరిగేటప్పుడు, ఏయే సందర్భాలలో నిత్యమో, ఏయే సందర్భాలలో వైకల్పికమో, ఏయే సందర్భాలలో ఆ కార్యం జరగదో చెప్పి తీరాలి. కనీసం కొన్ని ఉదాహరణలిచ్చి ఇలాంటి సందర్భాలలో ఇలా జరుగుతుంది అనయినా చెప్పాలి. ‘జడంబు ద్వితీయ…’ సూత్రంలో కూడా ఏయే సందర్భాలలో ఈ సూత్ర కార్యం జరగదో, అంటే పదం జడమైనా ద్వితీయ కచ్చితంగా వచ్చి తీరుతుందో చిన్నయ్యసూరి వివరించాడు. అయితే అవి నేనీ వ్యాసంలో చెపుతున్న అపవాదాలు కావు కాబట్టి, అతను పేర్కొన్నవి సరికావని నేను భావిస్తాను కాబట్టి, దానికి ఈ వ్యాస విషయంతో సంబంధం లేదు కాబట్టి, వాటిని ఇక్కడ వివరించ లేదు. మీరు కారక పరిచ్ఛేదంలో ఈ సూత్ర వివరణ చూడండి.
4. భాషను పరిపూర్ణంగా ఒదిగించడానికి ఎన్ని సూత్రాలైనా ‘కొద్ది’ సూత్రాలుగా మిగిలిపోతాయని!
తజ్జనని లోగిటం గల
రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్
బొజ్జ దిరిగి రాదయ్యె జ
గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే? :-))
అది నాది గురించి Sasikala అభిప్రాయం:
04/13/2018 11:35 pm
చక్కని శైలితో రీడర్స్ ఆలోచనకు స్పేస్ ఇచ్చారు. ఒక్క వాక్యం అదనంగా లేదు. స్టిల్ హాంటింగ్ స్టోరీ 👌👌
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి తః తః అభిప్రాయం:
04/13/2018 1:15 pm
శ్రీ కామేశ్వర రావు :
1. మొదలుబెడుతూ మీరు చెప్పిన వాక్యాల లో అన్నీ – కర్త, కర్మ,,క్రియ – మూడూ అచ్చ తెలుగు పదాలు గా ఉన్నవి కావు . ‘వెలుంగు అర్చింతు’లలో ఒక మాట ‘ తెలుగు ‘ కాదు . పరవస్తు వారి తెలుగు వ్యాకరణ సూత్రం సంకరాలకు వర్తిస్తుందా? మీరు ఈ సూత్రం ఏ పరిచ్ఛేదం లోదో చెప్పిఉండ వలసినది.
2. “అందుకే కర్త కర్మ రెండూ చైతన్యపదార్థాలే అయినప్పుడు వాటి మధ్య భేదం తెలియడానికి ద్వితీయా విభక్తి తప్పనిసరి అవుతుంది. ”
ఈ వేమన పద్యపాదం చూడండి : ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా? ” (‘బడు’ లేని ‘చైతన్య’ వంతమైన అచ్చ తెలుగు మాట).
3. “కర్మ జడమైనా ద్వితీయా ప్రత్యయం కచ్చితంగా వచ్చి తీరాల్సిన సందర్భాలు మనకు వ్యవహారంలో కొన్ని కనిపిస్తాయి. వాటిని ఈ సూత్రంలో చిన్నయ్యసూరి పేర్కొనలేదు.” అవసరం లేదు .అలా పేర్కొనే పక్షాన ‘ నిత్యము ‘ అని ఒక సూత్రం చేయాలి. కచ్చితంగా రాని సందర్భాలు పేర్కొనాలి : చూ : ‘ బహుళ గ్రహణము చేత స్త్రీ వాచక…. సంధి లేదు. ఆమ్మ యిచ్చెను.
4. “సహజంగా ఏర్పడిన ఏ మానవభాష కూడా ఏ కొద్ది సూత్రాలలోనో పరిపూర్ణంగా ఒదిగిపోదు.” ‘కొద్ది’ అని అనటం లో ఒదిగే టట్టు చేయగలిగేటన్ని సూత్రాలు చేయగలిగే అవకాశం ఉండ వచ్చనే నేనా!
నమస్కారాలతో
తః తః
అది నాది గురించి Anil అట్లూరి అభిప్రాయం:
04/13/2018 7:17 am
Brevity thy name is Chandra! 🙂
లలిత గీతాలు గురించి Chandana అభిప్రాయం:
04/10/2018 4:50 am
ధన్యవాదములు. ఈ మాసపు పాటలు కూడా అందించాలని నా విన్నపము. సుశీల గారు పాడిన సంక్రాంతి పాట, ఋతువుల పాట మరియు అల నీల గగనాన అనే పాట post చెయ్యగలరని ఆశిస్తున్నాను.
జిగిరీ – 6వ భాగం గురించి dasaraju ramarao అభిప్రాయం:
04/08/2018 12:53 pm
గుండె తడిలొ మునిగింది, కంటిరెప్పలు కొట్టుకోవడం మానేసాయి. బాల్యం గుర్తొచ్చింది . గుడ్దెలుగు, ఇమాంలు చరిత్రలొ నిలిచి వుండవలసిన వారే. ఈ సత్యమె నవలకు బలం. పెద్దింటి కి అభినందన.
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి విజయ భాస్కర రెడ్డి మలుచూరు అభిప్రాయం:
04/08/2018 5:21 am
నేను తెలుగు వాడిని అయినా తెలుగు వ్యాకరణం అంతగా తెలియదు. కానీ నాకూ తెలిసి ప్రథమా విభక్తి డు ము వు లు అని చదువుకున్నాను. పై వ్యాసంలో చీర, చెట్టు లాంటి వాటిల్లో ప్రథమావిభక్తి ఎక్కడ వుందో తెలియపరచగలరు.
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
04/08/2018 5:20 am
ఆసక్తితో ఈ వ్యాసాన్ని చదివి స్పందించిన అందరికీ ధన్యవాదాలు. నేను పరిశీలించిన అంశాలకు సంబంధించి మరింత చర్చను ఆలోచనను పురికొలిపే దిశగా మీ ఆలోచనలను పంచుకున్నందుకు మరిన్ని కృతజ్ఞతలు. ఈ చర్చ మరికొంత స్పష్టతకు, మరిన్ని కొత్త ఆలోచనలకూ దారి తియ్యాలని ఆకాంక్షిస్తూ, పై వ్యాఖ్యలలో లేవనెత్తిన కొన్ని అంశాలను నాకు తెలిసిన మేర వివరించే ప్రయత్నం చేస్తాను:
1. ముందుగా పినాకపాణిగారి ఈ ప్రశ్న గురించి:
“గుడిలో శిల పూజించడం ఎందుకు?” అనే వాక్యంలో అర్థావబోధ ఎందుకు లేదు అన్నది నా ప్రశ్న. “నువ్వు గుడిలో శిల పూజించడం ఎందుకు” అనే వాక్యంలో నువ్వు అనే పదం కర్త, శిల అనే పదం కర్మ అన్నది స్పష్టమే. అక్కడ అర్ధాబోధకు పెద్ద ఇబ్బంది లేదు, అయినా ఆ వాక్యం సరికాదని నా అభిప్రాయం. దానికి కారణం ఆ వాక్యంలో కర్మ అని నా ప్రతిపాదన. మరింత స్పష్టత కోసం మరొక ఉదాహరణ చూద్దాం: “దుష్టులు గుడిలో శివలింగం పగలుగొట్టేసారు”, “మార్కండేయుడు శివలింగం పూజించాడు” – ఈ రెండు వాక్యాలలో ఏది సరైనది, ఏది కాదు, ఎందుకు?
“కిశోర్ గోడ గుద్దుకున్నాడు” – నాకు తెలిసినంత వరకూ ఈ వాక్యం సరైనదే, ‘కుక్క పురుగు తిన్నది’ – ఇది కచ్చితంగా తప్పే! ప్రత్యేక సందర్భాలలో, సందర్భాన్ని బట్టి అర్థం తెలుస్తూ ఉన్నా, సామాన్య భాషా లక్షణాన్ని బట్టి ఉండాల్సిన ప్రత్యయం ఉండకపోతే అది భాషా స్వరూపానికి విరుద్ధంగా ఉండి, తప్పే అవుతుంది. నాకు తెలిసినంత వరకూ, కేవలం అర్థబోధ ఒక్కటే భాష స్వరూపాన్ని, దాన్ని అనుసరించి దాని ప్రయోగంలో తప్పొప్పులని నిర్ణయించదు. దీని గురించి మరింత చర్చ అవసరం!
2. విశ్వనాథవారి పద్యం గురించి:
సుమలతగారు, పినాకపాణిగారూ సూచించినట్లు, మొత్తం పద్యమంతా కర్మను సూచించే పదాలే, ‘వెలుంగు’తో సహా. ఏ పదానికీ ద్వితియా విభక్తి లేదు. వరుసలో వచ్చే పదాలకు ఒకే విభక్తి ప్రత్యయం వర్తిస్తే, చివరిపదానికి మాత్రమే దాన్ని చేర్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క “వెలుంగు’ పదాన్నే ప్రస్తావించాను. సుమలతగారు అన్నట్టుగా ‘అయిన నిన్ను’ అన్న పదాలను అధ్యాహారంగా తెచ్చుకుంటే కానీ అర్థం పొసగదు. కానీ “వెలుంగర్చింతు” అని సంధి కలిసిపోవడం వల్ల, మధ్యలో ఆ అధ్యాహారం చేర్చడానికి మరింత ఇబ్బంది ఏర్పడింది. వ్యాసంలో పేర్కొన్నట్టు, ఆ పద్యం వ్యాకరణపరంగా తప్పు కాకపోయినా, నిర్మాణ పరంగా అర్థబోధకు ఇబ్బంది కలిగిస్తోంది అని నా ఉద్దేశం. దీని ముందరి “శ్రీమంజూషిక” పద్యం కూడా ఇలాంటిదే. అక్కడ “శ్రీమంతంబయి పోల్చు వెల్గునొకడే” అని వాక్యం ఆగి, “సేవింతు విశ్వేశ్వరా” అని పూర్తవుతుంది. అందువల్ల అక్కడ ‘అలాంటి వెలుగును సేవింతును’ అని అధ్యాహారంతో పూరించుకోవడం సులువవుతుంది.
3. సంస్కృతంలో నపుంసక పదాల విషయమై సుమలతగారి వ్యాఖ్య గురించి:
వారన్నది నిజమే, సంస్కృతంలో ఈ సూత్రం సర్వత్రా వర్తించదు. అలా వర్తిస్తుందని చెప్పడంకూడా నా ఉద్దేశం కాదు. ఇక్కడే భాషా స్వరూప విషయమై వ్యాకరణవేత్తల దృష్టి, భాషాశాస్త్ర వేత్తల దృష్టి కొద్దిగా వేరుగా ఉంటుంది. భాషలో కచ్చితంగా కనిపించే లక్షణాలను సూత్రాల ద్వారా నిర్వచించే ప్రయత్నం వ్యాకరణానిది. భాషాశాస్త్రంలో కచ్చితత్వం కన్నా, ఎక్కువగా కనిపించే లక్షణాల గురించి విశ్లేషించి వాటి వెనకనున్న కారణలు వెతకడం ముఖ్యం. ఆ దృష్టితో చూస్తే, సంస్కృతంలో నపుంసకలింగ పదాలకు ప్రథమ, ద్వితీయ విభక్తులు ఒకటే కావడం, నపుంసకలింగ పదాలు ఎక్కువగా జడాలే కావడం ఆసక్తికరమైన అంశం. ఇది కచ్చితంగా ఇతర భాషల్లో కనిపించే DOM లక్షణమే అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. దీనికీ దానికీ సంబంధం ఉండవచ్చునన్నదే నా ప్రతిపాదన. దీని గురించి కొంత పరిశోధన ఇప్పటికే జరిగింది. నపుంసకలింగానికి కర్త, కర్మల ప్రత్యయ స్వరూపం ఒకటే కావడం మిగతా ఇండో-యూరోపియన్ భాషలైన లాటిన్, గ్రీకు మొదలైన వాటిలో కూడా కనిపిస్తుంది. ఇది త్రిలింగాలున్న IE భాషల్లో ప్రాచీనంగా కనిపించే లక్షణమనీ, DOM కొంత ఆధునికంగా వచ్చిన లక్షణమనీ కొందరు భాషశాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే నపుంసకలింగ పదాలలో కర్త కర్మల ఏక స్వరూపానికీ, అవి ఎక్కువగా జడాలే కావడానికీ కచ్చితంగా సంబంధం ఉంది. పుంస్త్రీ లింగ పదాల ద్వితియా విభక్తిలో ఎక్కువగా కనిపించే ‘మ్’ ప్రత్యయం, నపుంసకలింగ పదాల ప్రథమ/ద్వితీయలలో ఎక్కువగా కనిపించడం కూడా యాదృచ్చికం కాదని కొందరు భాషపరిశోధకుల అభిప్రాయం. ఇదికూడా, సంస్కృతంలోనే కాక లాటిన్ వంటి ఇతర IE భాషల్లో కనిపిస్తుంది. దీని గురించి మరింత వివరంగా వేరే వ్యాసం అవసరం. ఆసక్తి ఉన్న వాళ్ళు దీన్ని చదవవచ్చు:
http://www.uk-cla.org.uk/files/proceedings/Manoliu.pdf
4. “కర్మపదం ఏకవచనమా బహువచనమా అన్న విషయం మీద ఆధారపడి విభక్తులలో మార్పులు వస్తాయా! ఆ పరిశీలన ఏమైనా చేశారా?” అన్న రాధికాగారి ప్రశ్న గురించి:
నేను చూసినంత వరకూ, ద్వితియా విభక్తి ప్రత్యయంపై వచనాల ప్రభావం ఏమీ కనిపించలేదు. మీకు ప్రత్యేకంగా ఏమైనా కనిపిస్తే తప్పక ఇక్కడ పంచుకోండి.
5. “సూపర్ ఉంది” (“సూపర్ గా ఉంది” కాదు), “లైట్ తీసుకో” (“లైట్ గా తీసుకో” కాదు) వంటి ప్రయోగాలు బాగా వాడుకలోకి వచ్చాయి. ఇటువంటి ఆధునిక భాషా పరిణామాల విశ్లేషణ కోసం ఎదురు చూస్తున్నా! – అన్న వేణుగారి అభిప్రాయం గురించి:
అవును ఆధునిక తెలుగు పరిణామాన్నీ, అందులో ప్రయోగాలనీ తప్పకుండా పరిశోధించాల్సిన అవసరం ఉంది! ఇది అంత ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా, తెలుగుపై ఒకప్పుడు సంస్కృతం చూపిన ప్రభావాన్ని, ఇప్పుడు ఇంగ్లీషు చూపిస్తున్న ప్రభావాన్ని పోల్చి, వాటి మధ్యనున్న మౌలిక భేదాన్ని వివరంగా విశ్లేషించాలని చాలా కాలంగా నా కోరిక. ఎప్పుడు సాధ్యమవుతుందో!
6. శాయిగారూ, నేనీ వ్యాసం రాస్తున్నప్పుడే, దువ్వూరివారి రమణీయాన్ని ఎవరో వ్యాఖ్యలలో ప్రస్తావిస్తారని కచ్చితంగా అనుకున్నాను! నా నమ్మకాన్ని వమ్ము చెయ్యనందుకు ధన్యవాదాలు :-)) ఇదే సందర్భంలో ‘కర్మంబున ద్వితీయ యగు’ అన్న అసలు సూత్రం వెనకనున్న ద్వంద్వార్థం కూడా పాఠకులు గమినించే ఉంటారని ఆశిస్తున్నాను 🙂
సిలబస్: 3. ఊహ అనే ఇమాజినేషన్ గురించి Sasikala అభిప్రాయం:
04/08/2018 2:59 am
నమస్తే సార్. నిస్సందేహంగా మంచి చిత్రకారులు మీరు. నిజంగానే కొన్ని బొమ్మలు కథ ఏమిటి అని హాంట్ చేయిస్తాయి.కానీ కథలోకి పూర్తిగా పోలేని మేము విజువల్ కోసం బొమ్మను ఆధారం చేసుకుంటాము. అప్పుడు మాకు మీ బొమ్మలో కూడా ఇంత గొప్ప ఉంటే ఎలా అర్థం చేసుకోగలం? మీరు వివరిస్తే చాలా బాగుంది. చేతికి ఐదు వేళ్ళ లాగా దేవుడు అన్ని స్థాయిల వారి కోసం అన్ని రకాల చిత్రకారులును సృష్టించాడు.కళను గౌరవించడంలోనే కళాకారుడి గొప్పదనం. మీరు గీసిన మల్లాదిగారి గాడిద మీద కనిపించని నంబర్ మీదే అందరికీ ఆసక్తి. అలాటి మంచి బొమ్మలు మీ చేతి వేళ్లనుండి దేవుడు ఎప్పుడూ జాలువార్చాలి అని కోరుకుంటూ మీలోని రచయితను, చిత్రకారుడిని ఇద్దరినీ అభినందిస్తున్నాను👌👍
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి indrakanti pinakapani అభిప్రాయం:
04/07/2018 4:34 pm
వ్యాసం చాలా బాగుంది. కానీ (నాకు) కొంత తికమకగా ఉంది. కైలాసాచలసానువాసము, వృషస్కంధాగ్రసంస్థాయి, తత్ప్రాలేయాచలకన్యకాకుచతటీపర్యంకనిద్రాగతంబు, ఆలోలాగ్రజటాతటీఘటితనాకౌకస్సరిత్కంబు, దేహాలంకారితలేలిహానము, (ఇవన్నీ కర్మలే!) వీటన్నిటికీ లేని ద్వితీయా విభక్తి ప్రత్యయం ఒక్క వెలుంగుకే ఎందుకు కావలసి వచ్చిందో నాకర్థం కాలేదు. బహుశ: వ్యాస రచయిత వెలుం గర్చింతు అని సంధి వల్ల ఇలా అభిప్రాయ పడ్డారా! లేక వీటన్నిటిలో కైలాసాచలసానువాసమున్ అని ఉండి నకారానికి లోపం వచ్చిందనా! ( అలాగైతే దత్ప్రాలేయాచల అని సంధి జరగాలి!) లేక క్రియ ఐన అర్చింతు అనేది వెలుగుకు అత్యంత సమీపంలో ఉందనా! ఈ విశేషణాల వరస మారి వెలుంగు మధ్యలో ఎక్కడైనా ఉండి ఉంటే అప్పుడు కూడా వ్యాస రచయిత ఇలాగే అభిప్రాయపడే వారా!
“‘పూజించడం’ అనే క్రియ ఎప్పుడూ చైతన్యమైన కర్మ పదాన్నే ఆశిస్తుంది. ” ఇలాగనుకొని “అంచేత ఇక్కడ శిల అనే పదం విడిగా జడమే అయినా, ఈ వాక్యంలో అది చేతనత్వం పొందింది. అందువల్ల జడ ద్వితీయకు ప్రథమ వస్తుందన్న సూత్రం ఇక్కడ వర్తించదు.” అని సూత్రీకరించడం ఎందుకు? ఇక్కడ కూడా అర్థావబొధ కోసం మాత్రమే ద్వితీయా విభక్తి ప్రత్యయం తప్పనిసరి ఐంది. దానివల్ల శిల అనేది కర్తకాదని కర్మేనని స్పష్టమౌతుంది. ఉదాహరణకు మసీదులొ కాజా తినడం ఎందుకు అనే వాక్యం లో కాజా అంటే అదొక మనిషి పేరు కావచ్చు. లేదా ఒక పదార్థం పేరు కావచ్చు. అందుకని స్పష్టత కోసం కర్మార్థంలో ‘కాజాను’ అనీ కర్త్రర్థంలో ‘కాజా’ అనీ వాడాల్సి వస్తుంది కానీ తినడం అనే క్రియతో దానికి ఏ సంబంధం ఉండదు.
ఎక్కడైనా అర్థావబోధ ముఖ్యం- జాడ్యం చైతన్యం వంటి ప్రమాణలకంటే! “‘కిశోరు గోడ(ను) గుద్దుకున్నాడు’ అనేది సరైన వాక్యమే” అయితే కుక్క పురుగు తిన్నది కూడా సరైన వాక్యమే! ఇక్కడ రెండూ చేతనాలే! కాబట్టి అర్థస్పష్టతకు లోపం లేనంత వరకు “ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం” అనేదే ప్రమాణం.
వేణు గారు ఉదాహరించిన “సూపర్ ఉంది” >“సూపర్ గా ఉంది” కి గూడా ఇదే వర్తిసుంది. జీవద్భాష ఏదైనా మరింత వేగం పొందడానికి చేసే ప్రయత్నాల్లో ప్రత్యయాలను సాధ్యమున్నంతవరకు నివారించడం ఒకటి. దీని వల్ల కొంచెం అర్థక్లిష్టత ఏర్పడినపుడు తిరిగి కొన్ని నియమాలను చేసుకుంటూ పోవడమూ మామూలే!
ఒక మంచి వ్యాసం ద్వారా కొత్త ఆలోచనలను రేకెత్తించినందుకు కృతజ్ఞతలు.
తప్పులుంటే తెలియజేయగలరు.