పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. కథా ఉత్సవాలు పన్నెండు గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    05/02/2018 9:28 pm

    పన్నెండు “రైటర్స్ మీట్” గురించిన ఈ సమీక్ష బాగానే ఉంది.

    సీరియస్ సాహిత్యమూ కార్పొరేట్ ధోరణులూ చుక్కెదురు కావూ? అనే వాక్యంలో కావు అన్నదే గట్టిగా వినబడుతోంది.

    వ్యాసకర్త ‘సీరియస్ సాహిత్యం’ లోని ‘సీరియస్’కి ఇచ్హే నిర్వచనం ఏమిటో తెలిస్తే కార్పొరేట్ ధోరణులూ గురించి మాట్లాడుకోవచ్హు.

    తా క:
    2017 లో హైద్రాబాదులో జరిగిన రైటర్స్ మీట్ లో పాల్గొన్న వారి రచనలతో ఈ మే నెలలో, పదమూడో తారీఖున కొత్తకధ 2018 ని ఆవిష్కరించుకుంటున్నారు.

  2. అహం బ్రహ్మాస్మి గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    05/02/2018 8:15 am

    కరోడా ఎన్నాళ్లకి వినపడింది, కనపడింది ఈ పదం!
    ఆ గ్రామీణ నేపధ్యం, ఆ ప్రకృతి వర్ణన చదువుతుంటే అక్కడున్నట్టే ఉంది.
    మడుషులు దూరవైపోతేనేరా ఆళ్ళ విలుం తెలుత్తాది. నిజమేగా!
    బాగుంది, వ్రాస్తూ ఉండండి, రాజు గారు.

  3. తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన గురించి షణ్ముఖన్ అభిప్రాయం:

    05/02/2018 6:03 am

    6 నుంచి పది వరకున్న అంకెల వ్యాసాలు “అమెరికాభారతి”లో ఈమధ్యనే వచ్చాయి. లంకె ఇవ్వండి.

  4. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి శ్రీకాంత్ గడ్డిపాటి అభిప్రాయం:

    05/02/2018 12:16 am

    సురేశ్ గారి ప్రశ్నకు నవలలోనే ఒక అద్భుతమైన సమాధానం..
    -ఈ చెట్లన్నీ కొట్టి పడేస్తే పిట్టలన్నీ యాడికి బోవాల? గూడు లేక చావవా?

    -అరెక చేలో పెరిగిన రేగుచెట్ల పొదల్లోంచి పెద్ద కుందేలు ఒకటి చావుబతుకులమీద పారిపోయి దూరాన్నించి వెనుదిరిగి చూస్తూ ఉంటే నర్సయ్య చెప్పాడు: “దాని పిల్లలు పొదల్లో ఉంటాయి. ఆ పొద జోలికి పోగాకండి” అని.

    నగరాల్లో – స్ధలాభావం, సమయాభావం ముఖ్యంగా. అన్నీ కుదుర్చుకుని ఉన్నంతలోనే ఇంటిలోనే మొక్కలనో పక్షులనో జంతువులనో పెట్టుకుందామన్నా, వాటి సహజ జీవనం కుదరదు. నియంత్రిత జీవనమే ఉంటుంది.

    పార్కులూ, మొక్కలూ, చెట్లూ, పక్షులూ, పెంపుడు జంతువులూ, అన్నీ ఒక చట్రానికి లోబడి ఉంటాయి. అవీ మనమూ కూడా జైల్ మేట్సే అవుతాం గానీ సోల్ మేట్స్ అవ్వలేము.

    నిజానికి పల్లెలలో కూడా ఇప్పుడున్న పరిస్ధితి కూడా ఒపెన్ జైల్ తరహానే. నగరాల కంటే కొంచెం ఫరవాలేదంతే. మరి ఎలా అనే ఆలోచన వస్తుంది. అపుడు పైన అమరేంద్ర గారి ప్రశ్న వస్తుంది. అది ఈ నవల రచయితనో ఈ సమీక్షకుడినో అడగాల్సిన ప్రశ్న కాదు. మనిషిని అడగాల్సినది.

    ఇక వివిన మూర్తిగారు వ్యాఖ్యానించినది అక్షర సత్యం.

  5. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి G. K. Ananthasuresh అభిప్రాయం:

    05/01/2018 7:09 pm

    ఒక మంచి నవల గురించి రాసిన మంచి సమీక్ష. థాంక్స్, శ్రీకాంత్ గారూ. ఒక ప్రశ్న: ప్రకృతిలో మమైకం కావాలంటే, పల్లెలకే పోవాలా? వ్యవసాయమే చేయాలా? నగర వాతావరణంలో అది సాధ్యపడదా?

  6. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 17 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    05/01/2018 11:43 am

    జనవరి 2017 ఈమాటలో ప్రచురించిన శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక-1నే, తిరిగి శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక-17 గా మే 2018 ఈమాటలో ప్రచురించారు. కావాలనే ప్రచురిస్తే ఇబ్బంది లేదు. కాదు అంటే, ఇంతకుముందు ప్రచురించని మరో శ్రీశ్రీ పదబంద ప్రహేళికని అందించే ప్రయత్నం చేయండి.

    టి. చంద్రశేఖర రెడ్డి

    [శ్రీశ్రీ గారు పదబంధ ప్రహేళిక – 17 గా ప్రచురించింది ఈ ప్రహేళికనే. అయితే, ఇది జనవరి 2017 సంచికలోని ప్రహేళికకు కాపీ అని మేము గుర్తించలేదు. అందుకని కొత్త ప్రహేళికను అందజేసాం. మా తప్పు చూపినందుకు ధన్యవాదాలు. — సం. ]

  7. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి వివినమూర్తి అభిప్రాయం:

    05/01/2018 10:08 am

    రసపట్టులో తర్కం కూడదుట. తియ్యటి ఇష్టమైనదేదో తిన్నాక ఆలోచన లేకుండా ఉంటే బాగుండేది. కానీ ఆలోచనాప్రాణులు అమరేంద్ర ప్రశ్న కి గురవుతారు నాలాగా మీలాగా. 30 ఎకరాల కమతాల లెక్క నంజ పుంజ భూములకి నప్పదు. కాంత్ గారూ మదుపరుల ప్రపంచం సేద్యానికి గిట్టుబాటు లేకుండా చేస్తుంది. కార్పొరేట్ వ్యవసాయం కనుచూపు మేరలో ఉంది. భూమిపై హక్కు స్టాక్ అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు నిజమైన సరుకు అవుతాయి. వారు గిట్టుబాటు ధరలు అడగరు ప్రభుత్వాలను ధరల నియంత్రణ చేయనీయరు. ఈ విషాద వాస్తవం చూడబోతున్నాం.

  8. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి Amarendra Dasari అభిప్రాయం:

    05/01/2018 7:11 am

    నాదో ఆలోచన: ఎంత ప్రకృతిని ధ్వంసం చెయ్యకపోతే మనిషి అయిదు వేల యేళ్ల క్రితం వ్యవసాయం చేపట్టగలిగాడూ…

  9. విశ్వనాథ నర్తనశాల గురించి శ్రీనివాసరావు అభిప్రాయం:

    05/01/2018 4:44 am

    నాకు ఈ నాటక pdf ఉంటే మెయిల్ కి పంప ప్రార్థన

  10. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS అభిప్రాయం:

    04/29/2018 10:10 pm

    నారాయణస్వామిగారు: మెచ్చుకున్న మీకు ధన్యవాదాలు!
    జ్యోతి: చాలా థాంక్స్!