పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. మరోసారి గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    06/04/2018 11:51 am

    ఓ చెందరం గారొ,
    మరీ ఆ దొర “For sale: baby shoes, never worn”, కధ లాగా, మీ కధలు కూడా ఇంకా చిక్కనైతే పాఠకులలో కొంత మంది తలలు పగలగొట్టుకుంటారు అర్ధం కాక! చి. న.

  2. సెలవు మాస్టారూ! గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    06/04/2018 11:28 am

    సత్యవతి గారు,

    మీరు ప్రస్తావించిన త్రిపుర గారి కవితని వారి అల్లుడు, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు మొన్నామధ్య ఫేస్‍బుక్ లో ఒక టపా ద్వార పంచారు. అది ఇక్కడ ఆసక్తి ఉన్న పాఠకుల కోసం ఇస్తున్నాను.

    ఓ కాఫ్కా సుబ్బరామయ్య గారి యింగువ వృత్తాంతం – త్రిపుర

    అతనిప్పుడు ఒక ఎముకల గూడు
    ఎవరీ ప్రపంచంలో
    తమ పాదముద్రలొదిలేసి పోయారు
    ఎవరెవరో ఎందరెందరో ఎక్కడెక్కడికో
    అనంత కాల ప్రవాహంలో కొట్టుకపోయారు’

    అతనోసారి ఎన్నేళ్ల క్రితమో
    రోడ్డుమీద నడుస్తూ
    ఉన్నట్లుంది అన్నాడు నీతో
    జీవితంలో ఎన్నో విషయాలు
    తెలుసుకోకుండానే వెళ్లిపోతాం
    నువ్వు రోడ్డు మీద పోతూంటావ్
    అవతల దూరంగా వెళ్తున్న ఎవరినో
    చూడాలనుకుంటావ్
    కాని ఏ లారీయో ట్రక్కో అడ్డువస్తుంది
    అంతే, ఆ మనిషిని ఎప్పటికీ చూడలేవు
    ఏదో తెలుసుకోవాలనో చూడాలనో
    అనుకుంటూనే
    కాలం గడిచిపోతుంది
    చివరకు అట్లాగా చచ్చిపోతాం
    ఆఖరుగా ఒక ప్రశ్న:
    యింతకీ ‘యింగువ’ ఏమిటి?

    ఒక కుడివైపు చిన్నగదిలో
    కిటికీ పక్కన నవ్వారు మంచానికి
    అతడిపుడొక అంటుకున్న బల్లి
    మగత లోంచీ దగ్గు లోంచీ
    ఎప్పుడో ఒకసారి పైకి చూస్తూ
    వచ్చిన వాళ్లందర్నీ
    ఏదో అడుగుతున్నాడు

    అతని గుండెలమీదికి వంగి విందామని
    నువ్వు ఏమిటి కావాలని అడిగితే
    ఆఖరి గరగర ఊపిరితో
    యింగువ ఏమిటి అన్నాడు
    తరవాత రెండుసార్లు తల ఎగరేసి
    దేన్నో వెతుకుతున్నట్లు చూసి
    అంతా అయిపోయిందనిపించాడు

    యింగువ ఏమిటో అతనికి తెలియలేదు
    సుబ్బరామయ్యగారు కూడా చెప్పలేదు
    నీక్కూడా చాలా తెలుసు
    కాని యింగువ ఏమిటో యిప్పటికీ తెలియదు

    అదొక కుట్ర
    అదొక విద్యుత్ రహస్యం
    అదొక మాయావి చెలగాటం
    అదొక పులులు తిరిగే రాత్రి
    ఏదేనా అవవచ్చు
    తెలుసుకోవాల్సిన అవసరం
    వుందోలేదో కూడా తెలియదు
    నవ్వారు మంచం మీదో
    హాస్పిటల్ ఆక్సిజన్ టెంట్ లోనో
    ఆఖరి శ్వాస విడుస్తున్నప్పుడైనా

    (‘త్రిపుర కాఫ్కా కవితలు’, ప్రచురణ సాహితీ మిత్రులు, విజయవాడ, 2001)

  3. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/04/2018 11:13 am

    శర్మగారూ:

    నేను చదివే తెలుగు పత్రిక ఒక్క ‘ఈమాట’ మాత్రమే. నాకు సాహిత్యం మీద ఆసక్తితో మాత్రమే ఇక్కడకు వచ్చేది. ఈమాట సంపాదకుల లాగానే నేను. సాహిత్యం మీదే ఆసక్తి.

    ఈ లోపల ఈ పత్రికలో వేరే ఆర్టికల్స్ చదువుతూనే ఉంటాను. వాటి మీద అభిప్రాయాలు ఈ మేగజీన్ లో రాస్తూనే ఉంటాను. ఎప్పటి మాదిరే. కొన్నేళ్లుగా ఈ పత్రికలో నేను రచన చేస్తూనే ఉన్నాగా. ఈ ఒక్క కామెంట్ మీద ఎక్కువ తక్కువ ఇంట్రస్ట్ ఏమీలేదు. ఇదీ అన్ని రచనల్లానే.

    ప్రపంచంలో తెలుగు పరిస్ధితిలో నాకు అసలు ఆసక్తి లేదు. ఇంకో మేగజీన్ కు తెలుగులో రాయాలన్న ఆలోచన లేదు.

    Nice to hear from you. – Lyla

    [Thank you for your kind words. The respect is mutual.

    We do agree that all rights belong the writer. It has always been the policy of eemaata. So, you are free (not that you need our permission) to publish your poem in any other public forum to continue the discussion there (or, for that matter write an article right here in eemaata explaining your views on posthumous celebrations of artists and why you abhor them). However, we are sorry that we cannot delete/alter the published comment history here. -Ed.]

  4. జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/04/2018 8:58 am

    మాల్ ప్రాక్టీసు అన్నారు కనక ఈ ముక్క చెప్దామనిపించింది. ఆ మధ్యన ఒక పెద్దాయన మెక్ డొన్నాల్డ్ వారిని కోర్టుకీడ్చాడు(ట) – కారణం ఏమిటంటే, అక్కడ అమ్మే తిండి తింటూ ఈయన లావు అయిపోయాడు. మరి అక్కడ ఎందుకు తిన్నావయ్యా మగడా అంటే అక్కడ చవక కనక. అలా చవగ్గా అమ్మడం వల్లే నేను ఇలా అయ్యాను. ఇన్ని మిలియన్లు ఇప్పించండి అని వాదన. జడ్జ్ గారు పది నిముషాల్లో దీన్ని విసిరికొట్టారు.

    ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మీరు కనక కోర్టుకి వెళ్తే – ఏదో రామాయణం సినిమాలో డయలాగు గుర్తుకొస్తోంది – “నా తోకమీద ఈకలు కూడా పీకలేవురా.” జడ్జ్, కోర్టు దాకా ఎందుగ్గానీ ఓ (ఆ! చెట్టుకింద వాడే) లాయర్ ని అడిగి చూడండి. మీకు నిజంగానే “ఉన్నదున్నట్టు ప్రచురించుకోవాలనుంటే ఓ బ్లాగో, ట్వీటొ ఫేసు బుక్కో మొదలుపెట్టండి. అయితే వాటినెంతమంది చూస్తారో ఎలా మిమ్మల్ని అభినందిస్తారో, పేడనీళ్లు జల్లుతారో అనేది ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. ముఖే ముఖే సరస్వతి అన్నారు కదా? అలా మొదట్లో ఈమాట దగ్గిర తమ రచనలు మొదలుపెట్టి, ఉత్తరోత్తరా మరో చోటకి – ఈ సంపాదక వర్గం తీరు నచ్చక – వెళ్ళినవారు ఉండి ఉండవచ్చు. అది ఊరి చెరువుమీద వచ్చే కోపం లాంటిది.

    ఆఖరిగా ఈ ముక్క కూడా చెప్పనివ్వండి – ఏమీ లాభాపేక్ష లేకుండా అష్టకష్టాలూ పడుతూ తెలుగుకి ఏదో తమవంతు సాయం చేద్దాం అనుకుంటూ, పంటికింద ఇంగువముక్కల్లా ఎడ్వర్ టైజ్ మెంటులు తగలకుండా (బ్లాగుల్లో, ట్వీటుల్లో, ఫేసు బుక్కులో అలా కుదరదు అని మీకు తెలియకపోతే) ఉచితంగా సాహిత్యం (అదే, తమకి దొరికినంతలో మంచివి ప్రచురిస్తూ) అందిచ్చే పత్రికలో మీర్రాసిన ఒక ఆఫ్టరాల్ చిన్న కామెంటు ప్రచురించకపోతే మీకింత కోపం/దుగ్ధ ఎందుకొస్తున్నాయో తెలుసుకోవచ్చా? సంపాదకులు ఎవరికీ కారణం చెప్పక్కర్లేదు కానీ మీకు చేతనైనంతలో చెప్పారని నాకు అనిపించింది. ఇంకా దీన్ని కెలుకుతారెందుకు?

  5. జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/04/2018 8:05 am

    సాహిత్యరంగంలో నిన్నటి తరం నేటి తరానికి అందించిన వారసత్వం ఎటువంటిది, అది రేపటికి ఎలా ఉండాలి?

    సరదాగా “నేను సైతం” ఓ రాయి విసుర్దామని రాస్తున్నా ఆ మధ్య దేశం వెళ్లి వచ్చాక – అంటే రాష్ట్రం వేరు పడక ముందే లెండి – “తెలుగు సాహిత్యం చచ్చిపోయినట్టుంది, నేను చూసిన ఊళ్లలో కానీ నగరాల్లో కానీ ఆఖరికి న్యూసు పేపర్లలో కానీ తెలుగు అనేది ఎవరికీ అఖ్ఖర్లేకుండా పోతోంది. ఇలా అయితే కొంతకాలానికి తెలుగు సాహిత్యం చచ్చి ఊరుకుంటుంది. ఎవరికీ దీనిమీద ఇంటరెస్టు లేదు..”. అలా కొన్ని చితుకులు వేసి మంట పెట్టాను ఒక ఇంటర్నెట్టు గ్రూపులో. చూసుకోండి తస్సాదియ్యా ఎంతమంది నా మీద ఎగిరారో! ఆఫ్టరాల్ల్ నువ్వెవడివోయ్ చెప్పడానికి అంటూ. ప్రస్తుతం ఓ సారి విజైవాడ, విశాఖ, హైద్రాబాదు వెళ్ళి ఏ స్కూల్లో కుర్రాణ్నైనా పట్టుకుని “ఒరే అబ్బాయ్ మీ తెలుగు వాచకంలో ఓ పద్యం వినిపించు నాయనా” అని అడిగి చూడండి. “తెలుగా?, నేను ఫ్రెంచి, జెర్మనూ, సంస్కృతం తీసుకున్నా” అనడానికి 80 శాతం ఛాన్సు ఉంది – నాకు తెలిసినంత బావి కప్ప దృష్టిలో నండి సుమా. పోనీ సంస్కృతం చదువుతున్నాడు కదా, దాని గురించి అడగండి. పూర్తిగా తెలుగు రాసే పత్రిక – ఈనాడు తో సహా – ఒకటి చూపించండి. వాటిల్లో వచ్చే భాష ఇలా ఉంది – “ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది,” “దీన్ని షాకింగ్ కామెంటు గా యూజ్ జేస్తన్నారు …”

    సాహిత్యం మాట అటుంచి ఒక యాభై సంవత్సరాల్లో తెలుగు అనే భాష ఉంటే అప్పటికి సంతోషమే.

    ఇంతకీ లైలా గారూ, ఇదంతా మీ కామెంటు సరిగ్గా ప్రచురించనందుకా? ఇదే కామెంటు మీరు అచ్చుపత్రికకి పంపిస్తే వాళ్ళు ఎడిట్ చేసి ప్రచురించారనుకోండి రెండు నెలల తర్వాత, మీరేం చేస్తారు? చేయగలరు? ఇంతకీ ఓనర్ ఎవరైతేనేం గానీ ఈమాటకి మాల్ ప్రాక్టీస్ ఇన్స్యూరెన్స్ ఉంటే మీరు కోర్టుకి వెళ్తున్నారా? అహ అసలు ఉత్తినే అడుగుతున్నాను లెండి. 🙂

    శర్మ దంతుర్తి

  6. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/04/2018 5:56 am

    చదువుతున్న పాఠకులకు, పత్రిక యజమాని, ఇతర అధికారులకు మరి కొన్ని వివరాలు తెలియటం కోసం:

    “తొక్కిపట్టి ఆపి ఉంచుతారో తెలియదు.

    ఇంతకన్నా అత్యాచారం సాహిత్యం పట్ల ఘోరాపచారం ఒక సాహితీజీవి పట్ల ఇంకోటి ఉంటుందా?”

    నేను రాసి పంపిన పైదానిలో ‘తెలియదు’. ‘ఇంతకన్నా’ అన్న మాటల మధ్య ఇంకా పన్నెండు మాటలున్నాయి. అవి ప్రచురించనూ లేదు. కత్తిరించామని సంపాదకులు చెప్పనూ లేదు. కత్తిరిస్తే ఎందుకో తెలియదు. అవి ఎక్కడకు పోయాయో తెలియదు.

    ఇప్పటి సాహిత్యం తీరుతెన్నులు ఏవో బాగులేవని, సాహిత్యవిమర్శ కావాలని, రచయితలు మారాలని వారి ఆశ అని రాసిన సంపాదకీయం చదివినాక, నేను సంపాదకీయం లోని చివరి భాగం ఉదహరిస్తూ, సాహిత్యంలోని ఒక ప్రత్యేక అంశాన్ని చర్చలోకి తేవటానికి, కొన్ని ఆలోచనలు, సంశయాలు కలిగిఉన్న ఆధునిక కవితా రూపంలో, సంపాదకీయం కింది అభిప్రాయాల బాక్స్లోనే దానిని సబ్మిట్ చేసాను.

    పత్రిక సంపాదకులు నా రచనను ముక్కలు, మార్పులు చేసి, ప్రచురించి, పైగా, సరిచేసి పూర్తిగా ప్రచురించటానికి నిరాకరిస్తున్నారు. పద్యం పూర్తిగా ప్రచురిస్తే నేను సాహిత్య చర్చ కొనసాగిస్తాను.
    ఈ పత్రికకు నా రచన, తదనంతర చర్చ అవసరం లేకపోతే, వారు ఎడిట్ చేసిన నా రచన ఇతర ఉత్తరపత్రాలు తొలగిస్తే నేను వేరే చోట నా పద్యం ప్రచురించుకుని, నా సాహిత్య చర్చ కొనసాగించుకుంటాను. రచన మీద హక్కులు రచయితవే. I reserve my legal rights.

    పత్రిక నిర్ణయాలు తీసుకోటానికి వారం రోజుల వ్యవధి సరిపోతుందని నేననుకుంటున్నాను.

    లైలా

  7. జూన్ 2018 గురించి VSTSayee అభిప్రాయం:

    06/04/2018 2:31 am

    Sri Amarendra Dasari said:

    I appreciate the balance and firmness with which the Editors handled this discussion.

    The “And no!” was not necessary to express their firmness; the next sentence would have been enough.
    Regards,
    VSTSayee.

  8. జూన్ 2018 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    06/04/2018 12:32 am

    I appreciate the balance and firmness with which the Editors handled this discussion. All the best

  9. కలలు ఇచ్చిన బలిమి గురించి నీలిమ అభిప్రాయం:

    06/03/2018 10:24 pm

    యద్దనపూడి గారి సుపరిచితమైన రచనలన్నింటిని ఒక్కచోట గుదిగుచ్చి ఎంత చక్కగా విశ్లేషించారు !!!

    ఆవిడిక లేరు అని తెలియగానే మనసంతా అలముకున్న ఒక తెలియని నిస్పృహ, వేదన, బాధ… నా ఇంటి పుస్తకాల సేకరణ లోంచి సెక్రెటరీ నవల తీసుకొని చదవడం మొదలెట్టాను…..అంతే అలా రాత్రి 2 గంటలకి మొత్తం పూర్తిచేసాక కానీ పుస్తకాన్ని మూయలేకపోయా. 52 ఏళ్ల క్రితం రాసిన నవలకి, ఈనాటికీ ఎంత చదివించే గుణం – అదీ ఇప్పటికే ఎన్నోసార్లు చదివిందైనా !! ఇదనే కాదు , ఆవిడ చాలా రచనలు అంతే.

    మన తరువాతి తరాలు తెలుగు మీది మమకారాన్ని బ్రతికించుకోవాలే కాని, కొన్ని తరాలకి సరిపోయే రచనలని వదిలివెళ్లారు ఆ నవలారాణి 🙏🙏

  10. సిలువ గుడి గురించి amarendra dasari అభిప్రాయం:

    06/03/2018 10:03 pm

    నిజమే మూర్తిగారు, ఇది ఇష్టంతో రాసిన సమీక్ష …thankyou