పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. కాకిబొడ్డు గురించి B.S.V. Prasad అభిప్రాయం:

    09/22/2018 11:27 pm

    ఏమి వ్రాశారు సార్! అద్భుతం!

  2. ప్రేమల కథలు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    09/20/2018 8:43 am

    “…sailing into a keen
    city which nobody’s ever visited, where
    always it’s Spring , and everyone’s
    in love and flowers pick themselves”

    తఃతః గారూ, థాంక్స్.

  3. కాకిబొడ్డు గురించి Indira అభిప్రాయం:

    09/20/2018 7:03 am

    చాల బాగుంది.

  4. కాకిబొడ్డు గురించి మేరుసోమయాజుల ఫణి కుమార్ అభిప్రాయం:

    09/19/2018 1:05 am

    వర్మ గారు కథ అద్భుతం. ఆ నాటి గోషా పద్ధతిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. రాజుల ఊర్లలో ఉండే వారికి మాత్రమే తెలిసిన విషయాలని కథ ద్వారా చక్కగా చెప్పారు.

  5. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి వీరభద్రం అభిప్రాయం:

    09/16/2018 6:51 am

    అయ్యా! ఈ సముద్రపుటొడ్డునున్న “కాల్” పట్టణం ఎక్కడ ఉంది? ఉమాకాంత విద్యాశేఖరులు “ఇది పశ్చిమ సముద్ర తీర పట్టణమై కర్ణాటములోఁ జేరియుండును”,అన్నారు.ఈ వూరు ఇప్పుడు ఏమై ఉండచ్చు?

  6. తూరుపుగాలులు గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    09/14/2018 5:28 pm

    సమ, ఈక్షణము=సమీక్షణము. అర్థం చక్కగా చూచుట, వెదకుట. సమీక్ష అనే పదం శబ్దరత్నాకరంలో లేదు. సమీక్షణము మాత్రమే ఉంది. సమీక్ష అనేది నేననుకోవటం, సమీక్షణానికి హ్రస్వరూపమని.

    అవును. పరిచయానికీ, సమీక్షకీ తేడా ఉంది. ఒకటి పైపైన వెదకటం. రెండోది లోలోన చూడటం.

    టి. చంద్రశేఖర రెడ్డి

  7. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి Veturi Ravi Prakash అభిప్రాయం:

    09/14/2018 11:02 am

    ఫ్రియమైన మిత్రులకు,

    సిరికాకొలను చిన్నది సంగీత రూపకం మొత్తం 1 గం 30 నిముషాలు, ఈ రూపకాన్ని ఆకాశవాణి వారు తమ archives లొకి తీసుకున్నారు. వారి ముఖ్య కేంద్రములలో ఇది CD రూపములో లభ్యమౌతుంది, గమనించగలరు.

    వేటూరి రవి ప్రకాశ్.

  8. తూరుపుగాలులు గురించి amarendra dasari అభిప్రాయం:

    09/13/2018 7:26 pm

    Thanks Chandrasekhara Reddy garu…It may be wrong, but some how i am not too keen about giving such details in a Pustaka Parichayam…i believe a parichayam has its own ‘tune’ different from a Book Review. Thanks again for giving details in a crisp manner…this i explained to Anil, but, obviously he is not convinced !!

  9. నాకు నచ్చిన పద్యం: మారన వరూధిని కామన గురించి విశ్వం-విష్ణుర్వ -షట్కారో అభిప్రాయం:

    09/13/2018 10:57 am

    అయ్యా మాగంటి గారు:

    నేను మొదట్లో పెట్టిన వ్యాఖ్య రచయిత కి సంపాదకులకి చేసిన సూచన “మా-త్ర-మే.” ఎవర్నీ కించపరచలేదు. అటువంటి ఉద్దేశ్యమే లేదని చెప్పాను కూడా తర్వాత. ఎందుకు ఎలా వేళ్ల సందుల్లోంచి పదాలు జారిపోతాయో కూడా చెప్పాను. అది పట్టుకుని నా పేరు తో సహా అన్నీ ముక్కలు విరగ్గొట్టి, ఓ ఏపిల్ కంపెనీనీ, అందులో మరో పండితులవారినీ నా పండిత పుత్ర పరిజ్ఞానాన్నీ బయటకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినది, అసలు మొత్తం ఈ వ్యాఖ్య ఇంత పెద్దదవడానికి కారణం ఎవరండి? ఇప్పుడు నేను సమాధానం చెప్తే “ఠాట్ నువ్వింక ఏం చెప్పినా వినేది, చెప్పేది లేదు” అన్నదీ, ఇది చాలనట్టు నేను ఓ శ్లోకం రాయగానే, సంస్కృతంలో ఎంత గొప్పవాణ్ణో (అక్కడకి మీకు నాగురించి బాగా తెలిసినట్టు), ఇంకేం చేయచ్చో రాసినదీ ఎవరండి? మీరిచ్చిన ఉచిత అభిప్రాయం పట్టుకుని నేను రాస్తే ఎవరు, ఎక్కడ, ఎలా వేసుకుంటారో అనేది అసలు ఆలోచించారా?

    అది కాక నాలిక బయటపెట్టి వెక్కిరిస్తున్నట్టూ పేరు మరో సారి విరగ్గొట్టి అబ్బే వెక్కిరించట్లేదని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చారు. మీరు దీనికి రచయిత కాదు, సంపాదకులూ కాదని ఈమాట పుటల్లో ఉంది. మరి మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో ఇలా శల్యపరీక్షలు చేసి?

    అసలు ఈ వ్యాఖ్య కూడా రాయడం అనవసరం అనుకున్నాను కాని నా మీద ఓ అభిప్రాయం వెలిబుచ్చారు కనక సమాధానం చెప్పుకుందాం అనిపించింది. మొత్తానికి కాళ్ళు కడుక్కునే పరిస్థితి కల్పించారు. శుభాభినందనలు.

  10. తూరుపుగాలులు గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    09/13/2018 10:39 am

    పుస్తకం ఖరీదు రూ. 180-. ప్రచురణ కర్తలు-ఛాయ రిసోర్సస్ సెంటర్, హైదరాబాద్-040-23742711. ప్రతులు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ముఖ్య పుస్తక విక్రయ కేంద్రాల్లో దొరుకుతాయి.

    టి. చంద్రశేఖర రెడ్డి