పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. బేతాళ కథలు: కథన కుతూహలం – 5 గురించి శివకుమార శర్మ అభిప్రాయం:

    10/05/2018 11:32 am

    నాకు తెలిసిన బేతాళ కథల్లో బేతాళుడు చెప్పిన కథ పాఠకులకు కూడా పూర్తిగా తెలుస్తుంది. అయితే, దానిలో సూక్ష్మంగా దాగివున్న రహస్యాన్ని సగటు పాఠకులకు అందజెయ్యడం బేతాళుడి ప్రశ్నలలోని అంతరార్థం. కథని బేతాళుడి ప్రశ్నల వద్ద ఆపి, జవాబు ఏమయ్యుంటుందబ్బా అని ఆలోచించడానికి పాఠకులకి అవకాశం లభిస్తుంది. అలా కాక క్లూలని వేటినీ పాఠకులకు అందించకుండా పరిశోధకుడి చేతే చెప్పించడం Angela Lansbury నటించిన మర్డర్ షి రోట్ అన్న టీవీ సీరియల్లో నాకు కనిపించింది. అయితే, అక్కడ, గంటసేపున్న ఎపిసోడ్లో మొదట పాత్రల చేత కథ నడిపించి, కొన్ని చోట్ల చూసేవాళ్లని తప్పుదారి పట్టించడానికి కొన్ని సంఘటనలని మరీ సృజించి, చివరి రెండు నిముషాలు మాత్రమే సొల్యూషన్ ఇవ్వడానికి కేటాయించేవాళ్లు.

    మొదటి మూడు, ఇప్పుడు అయిదో విడతా చదివిన తరువాత నాకు అర్థమయింది, ఇక్కడ పరిస్థితి తారు మారు. కథ అంతా విక్రమార్కుడి నోట్లోంచే వస్తుంది. దానివల్ల పాఠకుల మెదడుకు పదును పెట్టే అవకాశం అరుదు. విక్రమార్కుడు మోడర్న్ అయ్యాడు గనుక, ప్రశ్నలు కూడా రివర్సులో బేతాళుడికి వేసి, సరయిన జవాబు చెప్పకపోతే నిన్ను కారు వెనకాల తాడుతో కట్టేసి, రోడ్లమీద ఈడ్చుకుంటూ పోతానని విక్రమార్కుడో లేదో మరెవరో బేతాళుడిని బెదిరించేలా కథని మార్చవచ్చు. అలా అయితే శ్రధ్ధగా సమకూర్చిన గణాంకాల వివరాలు కొంచెం తేలికగా చేరే అవకాశ ముండేది.

    “బంధుమిత్రులు ఇంతకుముందు ఎప్పుడూ చూపెట్టని ప్రేమతో ఏర్పాటు చేసిన అగ్నిజ్వాలల కౌగిలింతలలో…” అన్న విసురు చెప్పుకోదగ్గది.

  2. సమవుజ్జీ గురించి merusomayajulaphanikumar అభిప్రాయం:

    10/05/2018 4:34 am

    కథ రాయడంలో వర్మగారి స్టైల్ వేరు, వర్మ గారు రాసిన ప్రతికథకి మొదటి పాఠకుడ్నినేనే. అయితే లేటెస్ట్ కథ సమవుజ్జి చదువుతున్నప్పుడు రాజుల కుటుంబంలో ఉన్నట్టుగానే ఉంది. ఆ నాటి పల్లె వాతావరణం, గ్రామీణ రాజకీయం, రాజుల పెట్టుపోతలు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు వర్మ. కథ నిడివి కొంచం ఎక్కువుగా ఉన్నా, నడిపించిన తీరుతో ఏకధాటిగా చదివించింది. ముఖ్యంగా అంతరించిపోతున్న గ్రామీణ యాసతో కథని నడిపించిన తీరు అమోఘం.

  3. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5 గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    10/03/2018 7:13 am

    This remark may be taken as a trivial digression of no importance. As to the name of the region , we wonder two variations do exist>On the analogy of the names of the regions that fall in its vocational proximity, Kamboja is spelt. Parhia, Gandhara and Sindhu are refered in witten form with an aspirated consonant, where as Kamboja is seldom referred to in a form incorporating an aspirated consonant.

  4. ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద గురించి udaya అభిప్రాయం:

    10/02/2018 12:51 am

    అవును రైల్వేస్టేషన్ .. జీవితానికో అలవాటు.. మనస్సుకో తెలియని ఆలంబన– కదూ– ఎవ్వరో వస్తారు ఎమిటేమిటో అడుగుతారు. మనమెవరిమో తెలియకపోయినా– ఏదో చెపుతాము అవసరంగానో తెలిసో– ఎందుకోతెలియని నిరాసక్తతొ ఇచ్చే సమాధానాలేఅన్ని– ఎవ్వరికోసమో ఈ ఎదురుచూపులు ..అవును మీరన్నట్లు.. నేను కూడ నాన్న కొసమే– మీలా కాదు నాలా–

  5. సమవుజ్జీ గురించి amarendra dasari అభిప్రాయం:

    10/02/2018 12:31 am

    మాటలు రావడం లేదు. ఒకేపూట ప్రెసిడెంటు మునసబుల బోయినాలు చేసినట్టు ఉంది. జింజరు బుడ్డి చాలదు.

  6. విశ్వనాథ కథన కౌశలం: రచయిత్రితో ముఖాముఖి గురించి yaddanapudi kameswari అభిప్రాయం:

    10/01/2018 10:49 pm

    ఈ సమాచారం నాకు తెలియదండీ. కనుక్కుంటాను. ధన్యవాదాలు.

  7. సమవుజ్జీ గురించి రఘుబాబు అభిప్రాయం:

    10/01/2018 7:21 pm

    కథ.. అంతకు మించి కథనం. అద్బుతం! వర్మగారి కథలు ఇంతకు ముందు కొన్ని చదివాను. నిజంగా రాజుల దర్పం, వాళ్ళ లోగిళ్ళలో వాళ్ళతో గడుపుతున్నట్టుగానే అనిపించింది. కథ చదువుతూ ముందుకు వెళ్తున్న కొద్దీ టైటిల్‌ని బట్టి కొంతేదో ఉహించటానికి వీలయినా లాస్ట్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. కథనంలో పట్టు ఎక్కడా సడలిపోక ఏకబిగిన చదివించేదిగా ఉంది. కథను ఏవిధంగా చెప్పాలో నూరుకి నూటిశాతం మున్సబుగారిలాగా పక్కా లెక్క తేల్చేశారు వర్మ.

    ప్రతీపాత్రను ఎంతో శ్రద్ధతో మలచిన తీరు, వాటి అంతరంగ ఆవిష్కరణ, వారి మాటల్లోని మట్టివాసనలు అత్యంత సహజత్వంతో నిండి ప్రాణం పోసుకున్నాయి. కథ చదివాక నిజంగా వాళ్ళంతా ఎక్కడున్నారూ, ఉంటే బావుణ్ణు అనిపించింది. కానీ ఇంత దెబ్బా తగిలించుకున్న పీతరాజుగారు స్వభావం నిన్న తిన్న దప్పళంలో తక్కువైన కాస్త రవ్వప్పు గురించి “చిటికెడు ఉప్పిసరుకే అంత కక్కుర్తేవిటోయ్ వెధవ గాడిదకొడుక్కి!” అనే పీతరాజు పీకులాడటంలో ఎంత గొప్పగా చెప్పారనిపించిది. ఆ ఉప్పు గురించి పక్కనున్నవాడితో “సర్లెండి. పోయేటప్పుడు కూడా పట్టుకుపోతాడేమో” అనిపించటం, అంతమందికి అంత అన్నదానంలా పెళ్ళిభోజనాలు జరుగుతూ ఉన్నా చూస్తూ వాళ్ళింట్లోనే పడి తినొచ్చి అలా మాట్లాడేసే సగటు మనిషి అవకాశవాద ధోరణి అలాగే ఉంటుందనిపిస్తుంది. మొత్తానికి రాజుల దర్పం వాళ్ళు తలచుకుంటే అంతర్వేది లాంటివారి కలలనీ నిజం చేయగలరు. పీతరాజులాంటివారి స్థాయినీ అలవోకగా నిర్దేశించగలరని చెప్పిన తీరు బావుంది. ఒక మంచి కథ…👌

  8. విశ్వనాథ కథన కౌశలం: రచయిత్రితో ముఖాముఖి గురించి తః తః అభిప్రాయం:

    10/01/2018 2:15 pm

    “వారి నవలల్లో చలనచిత్రంగా వచ్చినది ఏకవీర మాత్రమే- ” – ‘జయసింహ ‘ అన్న పేరుతో విశ్వనాథ వారి వీరపూజ వచ్చినట్టు గుర్తు(?)
    తః తః

  9. ఏకవీర నవలకు, నవలానాయికకు ఆ పేరే ఎందుకు? గురించి తః తః అభిప్రాయం:

    10/01/2018 11:49 am

    ఒక విషయం చెప్పనా కామేశ్వరి గారూ! విశాఖపట్టణంలో ఒకప్పటి ‘ఎల్లమ్మ తోట’ ఇప్పుడు ‘జగదంబా సెంటర్’ అయింది. పేరును కొంత ఆధునికంగా మార్చుకుని అమ్మవారు అక్కడే ఉంది.
    గుండె, తలా రెంటినీ జోడించి రాసిన వ్యాసం!
    నమస్కారాలతో – తః తః

  10. గడినుడి – 24 గురించి Ravichandra అభిప్రాయం:

    10/01/2018 1:47 am

    5 నిలువు ఆధారం లేదా?
    [5 నిలువు ఆధారం 4 నిలువు అని తప్పుగా అచ్చుపడింది. ఇప్పుడే సరిచేసాము. ధన్యవాదాలు. — సం.]