పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. అటో యిటో గురించి ramya అభిప్రాయం:

    06/02/2008 9:13 am

    santhosh గారు థాంక్యు.
    murali lekkala గారు మీరు రాసిన విషయం చదివి నాకు చాలా బాధ కలిగింది. మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  2. పాప గురించి శ్రావ్య అభిప్రాయం:

    06/01/2008 11:53 pm

    చాలా బాగుందండి. మా నాన్నగారు కూడా మొక్కల విషయము లో ఇలాగే అంటూ ఉంటారు.

  3. లింకన్ తో ఓ రాత్రి గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:

    06/01/2008 6:37 am

    సౌమ్య గారికి,

    ఎంత సెక్సిస్టు ఆలోచన సరళి నుంచి తప్పుకున్నావని అనుకున్నా, తెలీకుండానే ఏ హానీలేదనిపించే, అమాయకవైన పద ప్రయోగంతో బయటపడే మురికిని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. నేను కూడా మాలతి గారికి జవాబిస్తూ రచయిత్రి బదులు రచయిత పదం వాదటం జరిగింది. రచయిత(త్రి) అనే పద ప్రయోగం కాకుండా లింగబేధం సూచించని తెలుగు పదం ఎవరన్నా సూచిస్తే బాగుండు రచయిత(త్రి) బదులు.

    [ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఫెమినిస్టుల ఉద్యమాల కారణంగానే ఇంగ్లీషులో authoress, actress, waitress, stewardess వంటి పదాల వాడుక దాదాపు కనుమరుగైపోయింది. రచయిత అన్న పదాన్ని లింగరహిత (gender neutral) నామవాచకంగా ప్రయోగించడం తెలుగులో కొంత కాలం నుంచే ఉందన్న అభిప్రాయం తోనే, ఈమాటలో కూడ రచయిత్రికి బదులుగా రచయిత అన్న పదాన్ని ఈ మధ్య కాలంలో వాడుతూ వచ్చాము. – సంపాదకులు]

  4. ఈమాట మే 2008 సంచిక విడుదల గురించి ప్రవీణ్ గార్లపాటి అభిప్రాయం:

    05/31/2008 1:30 am

    ఈ మాట కొత్త లోగో బాగుంది.

    కానీ లోగో ఫ్లాష్‌లో అవసరం లేదనిపిస్తుంది. నెమ్మదిగా లోడవుతుంది. ఆనిమేషను లాంటివి లేనప్పుడు పీఎన్జీ లేదా జేపెగ్ ఫార్మాట్లలో ఉన్న బొమ్మని వాడితే సరిపోతుంది.

  5. అటో యిటో గురించి murali lekkala అభిప్రాయం:

    05/31/2008 12:31 am

    మీ కధ చాలా బావుంది; సగటు మనిషి ఆలోచనను తెలియజేసింది. ఇటువంటి సంఘటనలు నాకు ఎదురుకానప్పటికి, నా ఎదురుగా జరిగిన సంగతిని మీకు వివరిస్తాను.

    నా ఊరు విజయవాడ దగ్గర పల్లెటూరు. ఓ రోజు విజయవాడలో పని ముగించుకోని సరదాగా సినిమా చూసి వచ్చేసరికి మా ఊరి బస్సు వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటూ ఆటో కోసం నిలబడగా, నా పక్కన ముగ్గురు వ్యక్తులు కూడా ఆటో కోసం చూస్తున్నారని అర్ధమైంది. ఇంతలో సడన్ గా ఓ ఆటో వచ్చి ఆగటం అందరం దానిలో కూర్చోవటం జరగింది. ఆటో బయలుదేరటంతో వస్తున్న గాలికి నిద్ర ముంచుకురాగా తల పక్కకు వాల్చాను. మళ్ళీ జేబులో ఉన్న డబ్బులు గుర్తుకురాగా నిద్ర తూచ్ మన్నది. నా ఎదురుగా కూర్చున్న వ్యక్తులు మూడు ముక్కలాట మొదలుపెట్టారు. వాళ్ళ ఆటను చూస్తున్న నా పక్కన వ్యక్తి కూడ డబ్బులు పెట్టడం మొడలుపెట్టాడు. కొద్ది సేపటికే డబ్బు కోల్పోతున్న అతనిని వద్దు అని వారించకుండా నాకెందుకులే అని నిద్ర నటించా. నేను అతను కలిసి ఒకేచోట దిగాము.

    చివరిగా నాకు తెలిసింది ఏమిటంటే మిర్చి అమ్ముకువస్తున్న అతను మొత్తం సోమ్ము పోగొట్టుకున్నాడని . వాళ్ళ చెళ్ళి పెళ్లికి బంగారం కోసం ఆ డబ్బులు అంట. చివరిగా అతను “సార్ మీరు అన్నా వారించక పొతిరి . డబ్బులు పోయి, నేను ఇంటికి ఎలా వెళ్ళాలి?” అన్నాడు. నేను ఏదో సర్ది చెప్పి నా ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత రోజు తెలిసింది అతను పురుగుల మందు తాగి చనిపోయాడని!

    నిజంగా ఆరోజు నేను వారించి ఉంటే ఏమి జరిగేదో…

  6. లింకన్ తో ఓ రాత్రి గురించి Sowmya అభిప్రాయం:

    05/30/2008 9:09 pm

    @praveen: నేను రచయిత్రిని. రచయితను కాను :).

    లింకన్ నే ఎందుకు పెట్టాను? ఇంకెవరినన్నా పెట్టుండొచ్చు. నిజమే. కానీ, ముందే చెప్పినట్లు, లింకన్ ఆత్మ గురించి ప్రచారంలో ఉన్న కథలే ఈ కథకి inspiration. కనుక నేను ఇంకోళ్ళని పెట్టుకోలేను. ఇది లింకన్ ని కించపరచడం కాదు అని మరోసారి మనవి చేసుకుంటున్నా.

  7. వ్యవహారిక భాషా ఉద్యమంపై ఈమాట ప్రత్యేక సంచిక గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/30/2008 7:17 am

    రెండు వారాల వ్యవధి ఇచ్చి రాయమంటే ఎలాగండీ!

  8. 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/30/2008 6:40 am

    నేను ఈ సదస్సుకి వెళ్ళేను. రెండవ వరసలోనే కూర్చుని ఉండటం వల్ల కాబోలు సదస్సు కిటకిటలాడిపోయిందన్న విషయం నాదృష్టిలోకి రానే లేదు. వక్తలు తెలుగులో అంతబాగా మాట్లాడుతూ ఉంటే దిక్కులు చూడవలసిన ఆవసరం కనిపించలేదు. పోనీ “మా తాతల్నాడు నేతులు తాగేం, కావలిస్తే మా మూతులు వాసన చూసుకోండి” అనే బాపతేమో ఈ పూర్వ వైభవపు ప్రసంగాలు అని అనుకుందామా అంటే, “అబ్బే అదీ కాదు, చూడండి మా తడాఖా” అంటూ స్వీయ కవితా పఠనంతో అదరగొట్టేసేరు. కనీసం ఈ సదస్సుకి హాజరయిన తరం వాళ్ళు ఉన్నంత వరకూ తెలుగుకి ఢోకా లేదు .. అమెరికాలో. భారీ ఎత్తున జరుగుతూన్న తిరునాళ్ళ కంటె ‘పీల ఎత్తు’లో జరుగుతూన్న ఈ సదస్సులే మేలేమో.

  9. పాప గురించి రానారె అభిప్రాయం:

    05/30/2008 6:38 am

    బ్యూటిఫుల్. ఒక మంచి పాట వింటే మూడ్ ఎలా మారిపోతుందో ఈ కథ చదివాక అలాగయ్యింది. శుభోదయం. 🙂

  10. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి నాగమురళి అభిప్రాయం:

    05/29/2008 7:41 am

    లక్ష్మన్న గారూ,
    Nature-Nurture చర్చ గురించి ఇంగ్లీషులో పాప్యులర్ సైన్సు పుస్తకాలు చాలానే ఉన్నాయి అనుకుంటున్నాను. నేను స్టీవెన్ పింకర్ అభిమానిని. అసలీ నేచర్ నర్చర్ విభజనే ఒక ఆభాస (False Dichotomy) అని ఆయన అంటాడు. మీకు వీలైతే అతను రాసిన `How The Mind Works’, ‘The Blank Slate’ పుస్తకాలు చదవండి. (How The Mind Works లో కొద్ది పేజీలు మాత్రమే దీని గురించి కేటాయించబడింది.) అలాగే జీన్సు కి సంబంధించిన విశేషాలు తెలియజేసే పుస్తకం ఒకటి కొన్నేళ్ళ క్రితం చదివాను (పేరు గుర్తు లేదు ప్రస్తుతం). అందులో కూడా ఇదే భావాన్ని చదవడం జరిగింది. ఇటువంటి పుస్తకాల్లో ఈ విషయమై కవలల గురించిన విశేషాలు, వారిపై జరిగిన పరిశోధనల వివరాలు కూడా చాలా ఉంటాయి.
    నమస్కారాలతో,
    నాగ మురళి.