పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. సర్పనీతి గురించి nagaraju అభిప్రాయం:

    07/01/2008 3:52 am

    చాలా బాగుంది.

  2. చివరకు మిగిలేది గురించి Surya అభిప్రాయం:

    07/01/2008 3:39 am

    చాల బాగున్నది
    ఇట్ల్లు
    సూర్య

  3. అంతర్మథనం గురించి సాగర్ రెడ్డి అభిప్రాయం:

    06/29/2008 7:49 pm

    కథ చాలా బాగుందండి. ఇలాగే మంచి కథలు వ్రాస్తుండండి

  4. కళాపూర్ణోదయం -4: సుగాత్రీశాలీనులు గురించి sabavat ravi అభిప్రాయం:

    06/29/2008 8:58 am

    ఇది చాల ఉపయోగకరమైంది. ముఖ్యంగా, దూరంగా ఉండే వారికి. దీన్ని మరింత సమగ్రంగా, విశ్లేషనాత్మకంగా తెలుగు భాష అభిమానులకు అందించాల్సిందిగా కోరుతున్నాను.

  5. మాండలిక వృత్తి పదకోశం గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:

    06/29/2008 6:47 am

    “ఈ వ్యాసంలో చెప్పినది కాక వృత్తిపదకోశపు సంపుటాలింకా ప్రచురించారా అకాడమీవారు?”

    1. వ్యవసాయ పదాలు – 1962 – భద్రిరాజు కృష్ణమూర్తి; సహాయకుడు: తూమాటి దొణప్ప
    2. చేనేత పదాలు – 1971 – భద్రిరాజు కృష్ణమూర్తి; సహాయకుడు: పోరంకి దక్షిణామూర్తి
    3. మత్స్య పరిశ్రమ – ? – తూమాటి దొణప్ప
    4. వాస్తు పదజాలం – 1968 – బూదరాజు రాధాకృష్ణ
    5. కుమ్మరం – 1976 – జి. యన్. రెడ్డి; సహాయకుడు: జి. నాగయ్య
    6. వడ్రంగం – 1997 – జి. యన్. రెడ్డి
    8. మేదర – 1992 – పోరంకి దక్షిణామూర్తి
    12. లోహకార వృత్తి – 1991 – జి. నాగయ్య
    15. కళలు – 1997 – బూదరాజు రాధాకృష్ణ

    కొనటానికి, తెలుగువిశ్వవిద్యాలయంవారి ప్రచురణల పట్టికను చూడండి.

  6. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/28/2008 10:12 pm

    రోహిణీప్రసాద్ గారూ,

    పొరబాటయింది. మీ బ్లాగు చూశాను కాని, ఏపీ వీక్లీ చదివే అలవాటు లేక, అభాసు పాలయ్యాను. మూడు వందల వ్యాసాలే?! మీ పుస్తకం తెప్పించుకుంటున్నాను. మీనుంచి మరిన్ని పుస్తకాలొస్తాయని ఆసిస్తాను.

    నేను హాల్డేన్ మాటలు ఉటంకించింది ఆయన వ్యాసం, “How to Write a Popular Scientific Article,” నుండని చెప్పడం మరిచాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  7. ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి Rohiniprasad అభిప్రాయం:

    06/28/2008 3:01 am

    భద్రిరాజువారి మీద ప్రముఖులు రాసిన వ్యాసాలు చాలా బావున్నాయి. ఆయన పుస్తకాలకు ఎవరైనా సులభపరిచయం రాస్తే బావుంటుంది. ఆయన తయారుచేసిన మాండలిక వృత్తి పదకోశాలను నేను తెప్పించుకున్నాను. అందులో మనం ఎన్నడూ ఉపయోగించని అచ్చతెలుగు పదాలు ఎన్ని ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం కలిగింది. మత్స్యకార, తదితర వృత్తులలో లేనివారికి వాటిలో చాలామటుకు పనికిరావేమోగాని అవసరాన్ని బట్టి సంస్కృతం జోలికి పోకుండా తెలుగు పదాలు ఎలా తయారుచేసుకోవచ్చో కొంతవరకూ అర్థమౌతుంది. తమిళంలో ద్రావిడ రాజకీయపార్టీలు పూనుకోవడంతో లెక్కలేనన్ని అచ్చ తమిళ పదాలు వాడకంలోకి వచ్చాయి. తెలుగులో ఇటువంటి ప్రయత్నాన్ని ఎవరూ మొదలుపెట్టినట్టు కనబడదు.

  8. చాదస్తం గురించి Bhushan అభిప్రాయం:

    06/27/2008 10:19 pm

    కథ నాకు బాగా నచ్చింది. ఎటొచ్చీ కామేశ్వర్రావుగారి అభిప్రాయం్ “ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు” – ఆవిడ జీవితం మాత్రమే కాదు, ఆవిడ భర్త జీవితం ఈవిడతో ముడిపడలేదా? ఆవిడ స్నేహాలు తన భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని ఆలోచించే మనిషి, తన భర్త స్నేహాలు కూడా తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని అనుకోదా? అది అహంభావమా? ఆత్మోన్నతా ?

    రంగనాయకమ్మగారు తన పేరు ముందు ఇంటి పేరు వొదిలేసి చాలా కాలమైంది. ఈ విషయం రచయిత్రి తన ఒకానొక వ్యాసంలో కూడా చెప్పారు.

  9. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    06/27/2008 6:49 pm

    శ్రీనివాస్ గారూ
    మీ కొటేషన్ గుర్తులు గమనించాను కానీ కాస్త ఆంబిగ్యుటీ ఉన్నట్లనిపించి, పై అభిప్రాయం పోస్ట్ చేసాను. ఆంగ్లంలో వాడే sic లాంటి పదాలు తెలుగులో ఉన్నాయా? సృష్టించుకోవాలా?
    మీ
    శ్రీనివాస్

  10. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    06/27/2008 12:15 pm

    శ్రీనివాస్ గారు,

    మీరు చెప్పినట్లు జార్జ్ ఇలియట్ అనేది Mary Ann (Marian) Evans అన్న రచయిత్రి మారుపేరే!
    కాకపోతే ఆ వాక్యం నాది కాదు. “విజయచిత్ర” సంచికలోనుండి ఉన్నదున్నట్లుగా కోట్ చేసాను. అందువల్లే ఆ వాక్యం మొదట్లో, చివరిలో ” గుర్తులు :-). ఏదైనా ఆ పత్రికలోని తప్పుని (తెలిసికూడా) సరిదిద్దక పోవడం నా తప్పే. క్షంతవ్యుణ్ణి!

    మహేష్ కుమార్ గారు: “స్వర్గసీమ”కు షా నవల స్ఫూర్తి అన్నది ఆ సినిమా తీసిన పెద్ద మనిషే చెప్పారు. నేను కూడా “కొంత” పోలిక వుందనే నమ్ముతాను. మీ యీ వాక్యంతో
    “ఇది ఒక కుటుంబాన్ని ముక్కలుచేసే పడతి కథ కదా!” మాత్రం అంగీకరించలేను. దానిపైన మరోచోటెక్కడైనా మాట్లాడుకుందామ్.

    పరుచూరి శ్రీనివాస్