పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. బంధుత్వం గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    07/03/2008 12:01 am

    చాలా బాగుందీ కవిత.

  2. స్పందన: పత్రికా ప్రభుతా మనం గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/02/2008 10:58 pm

    మహేశ్ కుమార్ గారూ, మీకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం (Ad Revenue) గురించి తెలిసే ఉండాలి.

    ఆంధ్రజ్యోతి సంఘటన గురించిన మంచి వ్యాసం:
    http://kadalitaraga.wordpress.com/2008/06/26/bhavaprakatana_sweccha/

  3. స్పందన: పత్రికా ప్రభుతా మనం గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/02/2008 9:54 pm

    ప్రింటు చెయ్యడానికి దాదాపు 9 రూపాయల ఖర్చు అయ్యే దినపత్రికని, కేవలం 2-3 రూపాయలకు ఇవ్వగలగటంలో, ఏ విధమైన బిజినెస్ సెన్స్ లేదు. మరి అలాంటిది ఈ పత్రికా యాజమాన్యాలు ఇన్నాళ్ళూ ఎలా నెగ్గుకొస్తున్నారూ? అంటే, ఇక్కడ పత్రికను అడ్డం పెట్టుకుని వేరే విధానాలలో డబ్బు సంపాదిస్తున్నారన్నమాట.

    మన పత్రిక పరిస్థితి ఇంత తేటతెల్లంగా కనబడుతుంటే, మళ్ళీ దానికొక philosophical చర్చ అవసరమా? చర్చించినా అది మన ఆత్మతృప్తికే గానీ అసలు సమస్యని మనం ఆర్చలేమూ, తీర్చలేము. “వార్తల్ని వార్తలుగా రాస్తే 10 రూపాయలిచ్చి కొనడానికి మేను సిద్దం, లేకపోతే అస్సలు దిన పత్రికలు కొనం” అని ఒక నిర్ణయానికొద్దామా? అది మన వల్ల కాదు. ఎందుకంటే, ఈ ‘సరదా’ వార్తా పత్రికలకి మనం అలవాటుపడిపోయాం. పొద్దున్నే ఈ అవాకులు చదవకపోతే మనకూ తోచదు. రోజంతా చర్చించుకోవడానికి కొన్ని విషయాలు మనకూ కావాలిగా!

    అందుకే, ‘గాయం’ సినిమాలో “నిగ్గ దీసి అడుగు, ఈ సిగ్గులేని జనాన్ని. నిప్పుతోటి కడుగు, ఈ సమాజ జీవఛవాన్ని. మారదు లోకం, మారదు కాలం” అని ‘సిరివెన్నెల’ చేత మన రాంగోపాల్ వర్మ పాడించేశాడు. అప్పటికీ ఇప్పటి స్థితిలో మార్పులేదు, ఇంకా చెడటం తప్ప.

  4. ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/02/2008 9:20 pm

    ‘పత్రికా స్వాతంత్ర్యం’ అనే ఉసుగులో కొన్ని ప్రముఖ వార్తా పత్రికలు తమ రాజకీయ, ఆర్థిక పబ్బాలు గడుపుకోవడం మొదలైనప్పుటి నుంచీ, మన రాష్ట్రంలో వాటి credibility ప్రశ్నార్థకంగా మారింది. ఇక ‘సాక్షి’ లాంటి బ్రాండెడ్ రాజకీయ పత్రికలు రావడం ఈ స్థితికి చరమాకంగా మారింది. పత్రిక యాజమాన్యాలు తమ బలిమికి ఉపయోగకరంగా పత్రికల్ని ఉపయోగించుకుని, పత్రికా స్వాతంత్ర్యం అనే ముసుగు తగిలించుకుని ఇష్టారాజ్యం చెయ్యాలంటే ఎలా?

    ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన సంపాదకులు కావాలి. కానీ ఉద్యోగం చేసే సంపాదకులేగానీ, ఉద్యమంగా పత్రికల్ని నడిపే సంపాదకులు ఇప్పుడు లేరుగా! అందుకే, యాజమాన్యాలు చెప్పిందే వేదం, రాయమన్నదే వార్త. మరి పత్రికా స్వాతంత్ర్యం గురించి ఒకే మూసలో మనం మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నామా?

  5. విలువలు గురించి subbarao అభిప్రాయం:

    07/02/2008 7:26 pm

    మనుషుల్లొ దేవుళ్లంటే Scott లాంటి వారే. రవి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్థూ..

  6. వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    07/02/2008 2:26 pm

    మోహనరావుగారు: “మేలుకొనుమీ భరతపుత్రుడ” అన్నది మంగిపూడి వెంకటశర్మ రచన. ఈ పాట పూర్తిపాఠం, రచయిత యింటిపేరు (మాత్రమే) మీ గ్రంథసూచిలో పేర్కొన్న “జాతీయగీతాలు – గురజాడ రాఘవశర్మ” అన్న పుస్తకంలో (12 పే) వున్నాయి. ఇదే సంచికలో ఆ పాటలోని మొదటి రెండు చరణాలను “తెలుగు వార్తాపత్రికలు” అన్న ప్రసంగంలో శ్రీరంగం గోపాలరత్నం కంఠంలో వినవచ్చు.

    – కొల్లాయి గట్టితేనేమి” పాఠం సినిమాలో స్వల్పమైన మార్పులకు గురయ్యింది.

    — శ్రీనివాస్

  7. ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    07/02/2008 11:24 am

    నిజమే. సభ్య సమాజంలో హింసకు, దాడులకు చోటు లేదు. కాదని హింసకు, దాడులకు చోటిస్తే సభ్య సమాజం ఉనికికే చేటు. హింస జరిపిన వారికన్నా వారిని ఉపేక్షించే చట్టాలు, న్యాయ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం వల్లనే ఎక్కువ హాని. దాడి చేసిన వాళ్ళ దౌష్ట్యం ఆ దాడికే పరిమితం. ఉపేక్షించి నిరోధించని వ్యవస్థ, మరిన్ని దాడులకు అవకాశం ఇస్తుంది. దాడులను మించిన క్రియాశీలతతో, న్యాయ వ్యవస్థ, పాలనా యంత్రాంగాలను దిద్దుకోనంతవరకు పత్రికా స్వేచ్చకే కాదు, పౌరుల స్వేచ్చకూ ఇటువంటి పోట్లు, తిప్పలు తప్పవేమో.
    విధేయుడు
    -Srinivas

  8. ఆరుద్ర తో ముఖాముఖీ గురించి mOhana అభిప్రాయం:

    07/02/2008 9:09 am

    చాలా బాగుంది, దీనిని అందించినందులకు ధన్యవాదాలు. ఆధునిక కవిత – అభిప్రాయవేదిక అనే పుస్తకంలో ఆరుద్రగారు మరి కొందరితో చర్చను జరిపారు. దీనిని నా వ్యాసములో కూడ ఉదహరించాను. ఇందులో రాయప్రోలు, దాశరథి, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె, దివాకర్ల, శేషేంద్ర్రశర్మ, కుందుర్తి, వేదుల, మహీధర, నార్ల, ఆధునిక కవిత్వంపై తమ భావాలను వెలిబుచ్చారు. ఈ ఆడియోలో ఉన్నవి కొన్ని ఇంకా విడమర్చబడి ఉన్నాయి పుస్తకంలో. తప్పక చదవండి. – మోహన

  9. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/02/2008 9:06 am

    శ్రీ గారు, మీ నిశిత దృష్టికి జోహార్లు. ఇలాంటి తప్పుల్ని goof-ups (గూఫులు) అంటారు. అసిస్టెంట్ డైరెక్టర్లు కంటిన్యుటీ సరిగ్గా రాసుకోక, ఇలా ఓకే ప్రొడక్షన్ కారుని రెండు సీన్లలో ఉపయోగించేసుంటారు. నిజానికి అది రాంగోపాల్ వర్మ తప్పుకాకపోయినా, కేప్టెన్ ఆఫ్ ద షిప్ గా బాధ్యత మాత్రం తనదే !

    ‘కంపెనీ’ మంచి సినిమానే. ఇక్కడ నేను తీసుకున్న విషయం, వర్మ తెలుసుకున్న సమాజంలోని మాఫియా పార్శ్వం, తద్వారా మారిన తన చిత్ర కథానాయకుడి పరిణామక్రమం, ‘సత్య’ వర్మ యొక్క most evolved protagonist అని నా అభిప్రాయం. ఆ తరువాత వచ్చిన, లేక ఇప్పటికీ తీస్తున్న ఏ సినిమాలోనూ వర్మ ఇంత profound statement ఇవ్వలెదని నా భావన. సత్య తరువాత వచ్చిన సినిమాలన్నీ శివ, గాయం, సత్య సినిమాలలోని పాత్రల్నీ, భావాల్నీ, ఆలోచనల్నీ కొనసాగించిన చిత్రాలుగా మాత్రమే అనిపిస్తాయి. Other films are just a continuation or reminiscences of what he has already done in Shiva, Gaayam and Satya.

    ఇంకా చెప్పాలంటే, ‘సత్య’ అనే ఉన్నత శిఖరాన్నెక్కిన వర్మ, అక్కడి నుండీ క్రిందకి దిగుతున్నట్టుందే తప్ప, దాన్ని మించిన ఎత్తుకు ఆ తరువాత తీసిన సినిమాలు, సృష్టించిన పాత్రలూ ఉన్నాయంటారా?

  10. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి కొత్తపాళీ అభిప్రాయం:

    07/02/2008 8:09 am

    మొదటి పేజీ చదివి, కొంచెం ఈ నాటి కవిత్వం లోనించి కూడా ఉదాహరణలు ఇస్తే బాగుండునే అనుకున్నాను. తరువాతి పేజీల్లో ఈ ముచ్చట కూడ తీర్చారు. వ్యాసం సమగ్రంగా ఉంది. ఉదాహరణలు యథోచితంగా ఉన్నాయి.
    ఆముక్తమాల్యదలో రాయల వారు భాష పరంగా చేసిన్ ఇంకో ప్రక్రియ నేను గమనించాను. ఈయన పదాల్ని ఒక ప్రెస్సులో పెట్టి నొక్కేస్తాడు. ఇల్లాంటి నొక్కుళ్ళు విచిత్రమైన పదబంధాల్ని సృష్టిస్తాయి. అలాంటి పలుకుబళ్ళు ఇంకెక్కడా కనబడవు.
    ఉదా. మంగళ కైశికి ఉపాఖ్యానం నుండి మాలదాసరి భగవంతుని స్తుతించే వర్ణన
    శా. గండా భోగముల న్ముదశ్రులహరుల్గల్ప న్నుతుల్పాడి యా
    దండ న్వ్రేగులు డించి భక్తిజనితోద్యత్తాండవం బాడు నా
    చండాలేతర శీలుడుత్పులకియై చాండాలికన్మీటుచున్
    గుండుల్నీరుగనెండ గాలి పసి తాకుం జూడ కాప్రాహ్ణమున్.