పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి chandra అభిప్రాయం:

    07/03/2008 8:37 am

    మీరు company అండ్ అంతం సినిమా గురించి చెప్పాలసింది. company is one of the most meticulously directed gangster movie in any indian language. ఇంకా అంతం అంతా ఒక underworld killer యొక్క అంతర్మధనాన్ని చాలా బాగా చూపించడు director.

  2. 88 ఏళ్ళ యువకులు గురించి T.Raja gopal అభిప్రాయం:

    07/03/2008 8:29 am

    Sri.Rohini Prasad garu,
    మాకు తెలియని చాలా మంచి విషయాలు వ్రాసారు !! చాలా సంతోషం. నేను శ్రీ సంగీత రావు గారి C.D. కొంటాను. ధన్యవాదాలు,
    Raja gopal

  3. 88 ఏళ్ళ యువకులు గురించి Raghu Echempati అభిప్రాయం:

    07/03/2008 7:57 am

    నాకు ఈ వ్యాఖ్యానం చాల బాగుంది. మీరు చాల బాగా వ్రాసారు. నాకు మీరు వ్రాసిన జీ వీ ఆర్ గారి భగవద్గిత కొనవలె నున్నది.

    రఘు ఈచెంపాటి,
    మిషిగన్

  4. నాకు నచ్చిన పద్యం: పోతనామాత్యుని జీవన దృక్పథం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/03/2008 7:52 am

    బృందావన రావు గారికి:

    మీ శీర్షికల పద్యాల పరిచయం ఎప్పుడూ చదవబుద్ది అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు పరిచయం చేసి విడమరిచిన రచన చాలా బాగుంది. పోతన భాగవతం నాకు నచ్చిన పద్య రచనల్లో ముఖ్యమైనది.

    పద్య రచనలని నేను స్వయంగా చదివి అర్ధం చేసుకోగలిగిన పాండిత్యం నాకు లేదు. అందుకే ఈ శీర్షికల్లో చేసే పరిచయాలు నాకు ఇష్టం.

    స్వర్గీయ శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు ఒక సందర్భంలో “మనుచరిత్ర గ్రంధకర్త అల్లసాని పెద్దనకి తెలుగు సాహిత్యంలో విశిష్టస్థానం ఉంది” అన్నారు.

    దీని గురించి ఎవరైనా వివరణ ఇవ్వగలిగితే చదవాలని ఉంది.

    రచయితకి ధన్యవాదలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. ప్రజాస్వామ్యం – పత్రికాస్వాతంత్ర్యం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    07/03/2008 6:35 am

    ఉద్యోగం చేసే సంపాదకులుంటే చాలు, ఉద్యమాలు చేయాల్సిన వారి అవసరం ఏమీ లేకుండానే అమెరికాలో ప్రత్రికా స్వేచ్చ ఉంది. ఒకరకంగా చూస్తే system సరిగ్గా లేకపోవడానికి మరియు దాన్ని దిద్దుకోవడానికి, ఉద్యమాలు ఎత్తిచూపే ఆనవాలుగాను, అనివార్యమైన అవసరాలుగానూ కనిపిస్తాయి.

    ఈ జరిగిన ఉదంతమే తీసుకుందాం. న్యాయవ్యవస్థ గంపెడు బరువు మోస్తున్న ఎడ్లబండిలాగా గాక, ప్రతిష్టాత్మకమైన స్ఫూర్తితో, సత్వరంగా న్యాయాన్యాయాలను అరెస్టుల వార్త వెలువడిననాడే (suo moto అయినా కాకపోయినా) లేదా మరునాడో తేల్చి, తప్పుగా చట్టాన్ని దురుపయోగం చేసిన పోలీసు యంత్రాంగాన్ని నియంత్రించి, వారికి కఠిన శిక్ష, జరిమానతో ముకుతాడువేసివుంటే ఇంకొకసారి ఇటువంటివి అంత సులభంగా జరిగే అవకాశమేలేదు. ప్రజలు, పత్రికలు గగ్గోలు పెట్టకముందే ఇట్లాంటివే, కళ్ళు లేకున్నా, వొళ్ళంతా కళ్ళు చేసుకొని చూసే బాధ్యత న్యాయవ్యవస్థలో పూర్తిగా లోపించకపోయినా, బాగా నీరసించినందువల్లే ఇది ఇంతగా ముదిరింది, కుళ్ళింది.

    సరే, న్యాయవ్యవస్థ తమకు సరిగ్గా వనరులు లేవని, వారి వృత్తిని కొనసాగించడానికి కావాల్సిన అంగబలం అర్థబలం ప్రభుత్వం ఇవ్వడంలేదని, ఎంతో ఇరుకున పెడుతుందని వాళ్ళ గోల వాళ్ళకూ ఉంది. మొత్తానికి మన దేశంలో ప్రజాస్వ్యామ్యం ఇంకా experiment దశలోనే ఉంది. దిద్దుకోవల్సింది కొండంత అని ఇటువంటి సమస్యలు తమ అద్దంలో చూపే దృశ్యం లాగా అనిపిస్తుంది, కనిపిస్తుంది.

    విధేయుడు
    – Srinivas

  6. కలల మైకంలో గురించి Achalla Srinivasarao అభిప్రాయం:

    07/03/2008 6:17 am

    సాధనల ఎడారిలో నే జీవిత జీవం మెటీరియలిస్టిక్ గా యింకిపోతున్న రోజులలో
    నిశ్శబ్దపు ధాత్రి లో నీరవపుటర్ధరాత్రి గుండె లో ఏవో జ్నాపకాల పొరలు కదిలి కదిలే నీలి మేఘం కనులలోనే కరిగి….’కలల మైకం’ లో తేలి పోవడం మంచి అనుభూతి కవిత్వపు లక్షణ మనుకుంటా… చాలా బావుంది . కవిత తిలక్ గుర్తుకొచ్చారు.

  7. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి శ్రీ అభిప్రాయం:

    07/03/2008 5:38 am

    ఓహ్… గూఫులు, ఒక కొత్త పదం తెలుసుకున్నాను.

    మీరన్నది నిజమే! కంపెనీ లో కుడా సత్య నీడలు కనిపిస్తుంటాయి. రాం గోపాలవర్మ మళ్ళీ తెలుగులో సినిమాలు తీస్తే బాగుణ్ణు.

  8. ఆరుద్ర తో ముఖాముఖీ గురించి Dr.Darla VenkateswaraRao అభిప్రాయం:

    07/03/2008 1:56 am

    ఆరుద్ర గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఆయన గొంతుని అందించి మంచి పని చేశారు. రచయితల సంఘం, సాహిత్య వర్గీకరణ అవసరాల గురించి ఆరుద్ర స్పష్టంగా చెప్పడం బాగుందిశంఆయన నిబద్దతను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అభిప్రాయం ఉపయోగ పడుతుంది. తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం రచనావిధానంలో పాలకుల పద్దతిని ఎందుకు పాటించారో కూడా బాగా వివరించారు. దీన్నివివరిస్తూ నా పరిశోధనలో ఆరుద్రగారిది మార్క్సిస్టు దృక్పథం అన్నాను. http://dspace.vidyanidhi.org.in:8080/dspace/handle/2009/1171
    మొత్తం మీద సేకరించిన పరుచూరి శ్రీనివాస్ గార్కి, అందించిన ఈమాట వార్కి నా అభినందనలు. అలాగే ఇంటర్వ్యూ చేసిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు మంచి ప్రశ్నలను అడిగారు. అయితే.. ఆరుద్ర ఎదురు ప్రశ్న వేసిన తరువాత భాగం ఏమైంది? దొరికితే దాన్ని కూడా పెట్టే ప్రయత్నం చేయండి.ఏది ఏమైనా
    ఇది సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ఇంటర్వ్యూ కాగలదు!
    డా//దార్ల వెంకటేశ్వరరావు,
    లెక్చరర్, తెలుగుశాఖ,
    హైదరాబాదు విశ్వవిద్యాలయం,
    గచ్చిబౌలి,హైదరాబాదు-500046,. భారతదేశం

  9. మీ ఘంటసాల గురించి nishtala Subrahmanyam అభిప్రాయం:

    07/03/2008 1:27 am

    మీ కృషి అభినందనీయం. మీలాంటి వాళ్ళుండ బట్టే ఈ ప్రపంచం లో తరువాతి తరాల వారికి చరిత్ర తెలుస్తుంది. మీకు నా నమశ్శతాంజలి

  10. బంధుత్వం గురించి S. Mallinath అభిప్రాయం:

    07/03/2008 1:02 am

    వంశవృక్షం ఆధారంగా బంధుత్వ సంబంధాలను నెలకొల్పే Geni.com, Amiglia వంటి వెబ్ సైట్ లకు వాణిజ్య ప్రకటనగా వాడుకోగలిగేంత బాగుందీ కవిత.