పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu అభిప్రాయం:

    08/11/2008 11:18 am

    కామేశ్వర రావు గారూ,
    దాసన్నపేటతో మొదలెట్టి, గుమ్ చీ మీంచి, బొంకులదిబ్బ దాటి, మూళ్ళాంతర్లు దాటి, గంటస్తంభం మీంచి, కన్యకాపరమేశ్వరి కోవెల దాకా వచ్చినా, మీరు “ఈ పద్యాన్ని చదవడం గురించి..” రాసిన వ్యాసం దొరకలేదు.
    పెచ్చెరువు దాటి, రైల్వే స్టేషను మీంచి, “కంటోన్మెంటు” వెళ్ళమంటే వెళ్తాను.
    “చాలా కష్టపడ్డావొయ్” అని “ఈ పద్యాన్ని” ఎలా చదవాలో చెబ్తే “ధన్యోస్మి” అనుకుంటాను.
    దాంతో పాటూ, రాసీ ఛందస్సుకీ, “రిసైట్” చేసీ పధ్ధతికీ తేడా తెలిపితే, నేనూ నాతోపాటూ చాలా మంది “క్రుతార్థులవుతారు”.
    మీ దయ, మా ప్రాప్తి.

  2. మంచులో తడిసిన ఉదయం గురించి baabjeelu అభిప్రాయం:

    08/11/2008 10:57 am

    వైదేహిగారూ,
    అద్భుతవయిన చమత్కారం చూపించేరు. వుదాసీన ప్రేయసి చూడ్డానికి ఎంత బాగున్నా, వుత్సాహంగా మది తలుపు తీస్తే, కరడు కత్తి లాటి కఠిన వీక్షణం తో గుండెల్ని వణికిస్తుంది.

    సవ్వడి లేని రవ్వలు ధరించి మీ తోటలో తిరుగాడిన హేమసుందరికీ, మిక్కిలి మక్కువగా ఆవిడని సన్నజాజులతో అలంకరించిన హేమంతుడికీ, రాత్రంతా అవిశ్రాంతంగా కష్టపడ్డ అవ్వకీ, మిగిలిన వాటికీ ఇదే మా ఆహ్వానం, మా పెరట్లో కూడా తిరగొచ్చుకదా? తిరిగినా మాబోంట్లు పట్టించుకోవనేమో?

    మామూలు కవులయితే, వుత్సాహంగా తలుపుతీసిన తరవాత కూడా “ఆహా, వోహో” అని రాస్తారు. మీరు కాబట్టి, తలుపు తీసేక కరడు కత్తి లాటి కఠిన వీక్షణాన్ని చూడగలిగేరు.

  3. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి independent అభిప్రాయం:

    08/10/2008 7:15 pm

    “The third-person narrative is a narrative that is not from a player in the story, hence, assumed to be providing the illusion of subjectivity to the story”

    illusion of objectivity అనా మీ ఉద్దేశం?

    వర్మ చిత్రాల్లో నా మట్టుకు నాకు బాగా నచ్చిన సినిమా “Company”.

    అలాగే గోవింద నిహ్లానీది ద్రోహి సినిమా కూడా నాకు ఇష్టమైన చిత్రం..అందులోనూ ఆఖరి సీన్…”డ్యూటీ(కర్తవ్యం)” అనే దానికి అల్టిమేట్ నిర్వచనం.

    Good work Mahesh.

  4. డాలర్ దేహాన్నొదిలి గురించి Suresh అభిప్రాయం:

    08/10/2008 12:55 am

    చాలా బాగా వుంది

  5. అతిథి వ్యయో భవ గురించి Madhusudana rao అభిప్రాయం:

    08/09/2008 9:39 pm

    నెల్లాళ్ళ క్రితం ఆటాకి విచ్చేసిన “మంది” లో కొందరికి ఆతిధ్యం ఇచ్చి మా పాట్లు మేం పడ్డాం. ఈ కథలో వెంకీ లాగే మాకూ జరిగింది.

  6. సన్మాన లాటరీ గురించి baabjeelu అభిప్రాయం:

    08/09/2008 5:19 am

    మురళీగారూ,
    “హయ్య బాబోయ్ మురళీగారూ” అని రాజేంద్రకుమార్ గారి అభిప్రాయం చదివడంవల్ల మీ విన్యాసం చూడగలిగేను. మీరు రాసింది చదివేక, రాజేంద్రగారి అభిప్రాయం లో “యురేకా” అని అరుస్తూ పరుగులెట్టిన “ఆర్కిమెడిస్” కనిపించేడు.
    పదిసార్లు చదివుంటాను. గొప్ప “టెక్నిక్”. అద్భుతవయిన “టెక్నిక్”. రచయిత మధ్యలో జొరబడకుండానే, కథ నడిపించడం సులువు కాదు. మీరు నడిపించేరు

    “క్ స్ గ్ ర్ ” మీద మన పేరు తగిలిందండీ. పెద్దపులుల్లాటి కుర్రకవులు… సై అనగానే “రంకెలేస్తూ” ( పులులు రంకెలెయ్యవుకదా, అయినా పాపం ఆకలి మీదున్నకుర్రకవులు కళ్ళ ముందు కనబడి, పగలబడి నవ్వుకున్నాను).
    “విమర్శా? అదెందుకులెండి” వాక్యంలో “భవిష్యద్సన్మాన గ్రహీత” మొహం వొకేసారి చికాగ్గానూ, సంతోషంగానూ కనిపించింది. చరిత్రదుందుభి, సంగీతకోకిల,నాట్యతటల్లిత, ఉత్తమపుత్ర పుచ్చుకోకతప్పలేదా?

    మీ వాక్యాల్లోనే ఆ వాక్యం తాలూకూ “టోన్ & టెనర్” వుండడం గొప్పవిషయం. ఎదురుగుండా “సన్మాన గ్రహీత”, “సరస్వతీ స్వామిదేవ” మాట్లాడుకున్నట్టనిపించింది. “రేసీ ప్రోజ్”
    వుపసంహారం అద్భుతం. వొక్కసారి, నవ్వాపుకోలేక దొర్లుతున్న నాలాటివాడిని, టక్కున నవ్వాపించి నిజమేనేమో అనిపించింది. “ఇగటాలు” మాయవయిపోయేయి.

    మీ “టెక్నిక్” గురించి: దేవులపల్లి క్రుష్ణశాస్త్రి గారు రాసిన సినిమా పాట లా వుంది.
    ఏమిరామకథ శబరీ, శబరీ/ఏదీ మరియొకసారి లాటి “టెక్నిక్”
    అందులోని చరణాలు చూడండి,
    “వాలుకనుల ఆ జానకిని, ఓరకనుల ఒకసారిగని, కేల శివుని విల్లందుకొని…”
    “మౌని భార్య మరియాద చెడి, ధూలిపడి, రాయైన జాలిపడి…”

    క్రియాశబ్దాలు నడకకి అడ్డుబడకుండా, ఆయన పాట, మీ “సన్మాన లాటరీ”
    ధన్యోస్మి.

  7. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu అభిప్రాయం:

    08/08/2008 7:01 pm

    కాశీనాథుని రాజాశంకర్ గారూ
    క్షమించండి, మీ పేరు తప్పు రాసేను. క్షమించండి.

  8. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి baabjeelu అభిప్రాయం:

    08/08/2008 6:53 pm

    కామేశ్వర రావు గారికి,
    ఈమాట అభిప్రాయవేదిక లో నెమలి వాలింది. బంగారు వాన కురుసింది. చాలా “కన్స్ట్రక్టివ్ గా” “పాజిటివ్” గా రాసేరు. విష్ణుమూర్తికి గిరజాలు వుంటాయి కదండీ, బహుశా అవయుండొచ్చు. “త” కి “గ” కీ లఘువే కదా, అక్కడ దొరికిపోయేను.
    ఇవాళ “డ్యూటూ బేడ్ వెదర్” సెలవు. మీ వ్యాసం కోసం హాయిగా వెతుక్కుంటాను, ఆ వెతుకులాటలో మరిన్ని ఆణిముత్యాలు దొరుకుతాయి.

    “భైరవభట్ల” వారేనని నా నమ్మకం. ఒకవేళ కాకపోతే మీరిరువురూ క్షమించగలిగినధైర్యం వున్న వాళ్ళు.
    “అణా” ల గొడవ సరైనది కాదని నా నమ్మకం.

  9. సన్మాన లాటరీ గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:

    08/08/2008 11:33 am

    హయ్యబాబోయ్ మురళీ గారు!!

  10. ఛందోధర్మము గురించి baabjeelu అభిప్రాయం:

    08/08/2008 8:23 am

    అయ్యా,
    మీరు వ్రాసిన వ్యాసం చాలా చక్కగా వుంది.
    “ప్రసాదు” గారు వ్రాసిన అభిప్రాయం సరైనది. దానికి మీరు ప్రతిస్పందించకపోవడం బాధాకరమయిన విషయం.
    “రాజాశంకర్ ” గారు వ్రాసిన “పదదారిద్ర్యం తో బాధపడే” కవుల విషయం అన్యాయం.
    కవిత్వం కోసం ఛందస్సా, ఛందస్సు కోసం కవిత్వమా? కవిత్వం కోసం ఛందస్సు వదులుకోడం తప్పా? ఛందస్సు కోసం కవిత్వాన్ని బలి చేయడం ఒప్పా?

    కవికి ఛందస్సుతో పాటూ, సంస్క్రుతం, కరాటే, భరతనాట్యం, వుర్దూ, ఇటాలియన్, గోంగూర పచ్చడి చేయడం, వూడిపోయిన గుండీలు కుట్టడం, పుస్తకాలకి అట్టలేయడం, పిల్లలకి అన్నాలు పెట్టడం, చిత్రలేఖనం, మేజిక్ చేయడం, పిల్లిమొగ్గలేయడం వగైరాలలో అద్వితీయ ప్రతిభ వుంటే, ఆ కవిగారి కవిత్వానికి మీలాటి పండితులూ, “ప్రసాదు” గారిలాటివాళ్ళు, మా బోంట్లు మైమరచిపోతం.

    మీవంటివారు శ్రీశ్రీ కవిత్వాన్ని పరామర్శించి, శ్రీశ్రీ కూడా చందస్సనే పాముకాటుకి గురయ్యాడని రాయడం భావ్యమా? మధ్యలో కాళోజీ గారి “గొడవ”, “జయప్రభ” గారు కూడా “గతి” తప్పలేదని తెలిసి “హమ్మయ్య” అనుకున్నను.

    శ్రీశ్రీ ఛందస్సు చదువుకుని వచ్చినవాడేకదండీ? అందుకే తొలిరోజుల్లో రాసిన కవిత్వం వుత్పలమాల, చంపకమాల వగైరాలలో వుండకపోయినా “గతి”లో వుంటుంది. శ్రీశ్రీ కూడా “గతి” తప్పలేదని “ప్రూవ్” చేసెస్తే ఛందస్సు గొప్పదయిపోతుందా?

    మారుతున్న కాలంతో పాటూ మారిన కవులందరూ ఇవాల్టికీ బతికేవున్నారు.
    నన్నయ తెలుగులో కవిత్వం మొదలెట్టిన రోజుల్లో ఎన్నితిట్లు తిని వుంటాడండీ, సంస్క్రుత పండితుల వల్ల. అలాగే మాములు ప్రజలు మాట్లాడే భాషలో కవిత్వం రాయడం మొదలెట్టిన కవులు, నన్నయ “పధ్ధతిలో” వ్రాసిన కవుల తిట్లు తినేవుంటారు.
    అంతెందుకు, యండమూరి వీరేంద్రనాథ్ మొదట్లొ తిట్లుతిని, తరవాత, తరవాతి తరం వాళ్ళని “సాహిత్యాన్ని భ్రష్టు పట్టించెస్తున్నారు” అని అనడం కాల మహిమ కదూ? వింత కదూ?
    పానుగంటి వారు వ్రాసిన “కాల స్వరూపుడు” చదివితే, నన్నయని తిట్టిన వాళ్ళూ, తరవాతి వాళ్ళని తిట్టిన వాళ్ళూ, వీరేంద్రనాథూ అందరూ “సర్వేజనా సుఖినో భవంతు” అనుకునుండే వారు. (“సర్వేజనా” అంటే “సర్వే” డిపార్ట్మెంటే కాదు “రెవిన్యూ” వారు కూడా అని మనవి.)
    “ధారణ” గురించీ, కంఠతా పట్టవలసిన అవసరం లేకపోవడం గురించీ ఇక్కడ వ్రాయడం మీ లాటివాళ్ళ విజ్నతని అనుమానించడవే. అంత సత్తువ నా దగ్గర లేదు.