పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. “చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    08/14/2008 9:13 pm

    ఈమధ్యనే విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ దాసరి సుబ్రహ్మణ్యంగారిని చాలా ఏళ్ళ తరవాత కలుసుకున్నాను. చందమామ ఒరిజినల్ టీమ్ లో ఆయనొక్కరే మిగిలినట్టున్నారు. 1948లో మా నాన్నగారి ఆంధ్రపత్రిక కొలీగ్ గా పనిచేసిన నండూరి రామమోహనరావుగారిని కూడా కలుసుకున్నాను.

  2. విలువలు గురించి sateesh.kothuri అభిప్రాయం:

    08/14/2008 10:40 am

    I’m deeply moved by the story..it must be real incident.

  3. బంధుత్వం గురించి A. Prasuna అభిప్రాయం:

    08/13/2008 6:22 am

    చాలా బాగుంది. మా తాతయ్య గారే గుర్తొచ్చారు.

  4. అమ్మ గురించి sri అభిప్రాయం:

    08/13/2008 4:06 am

    మనసుకు హత్తుకునేలా, మైమరపించే అమ్మ జోలపాటలా వుంది మీ కవిత.

  5. “చందమామ” జ్ఞాపకాలు గురించి peddada sundera raamakrishna అభిప్రాయం:

    08/13/2008 3:55 am

    రోహిణీ ప్రసాద్ గారికి ,
    చందమామ గురించి మీరు వ్రాసిన వ్యాసం మమ్మల్ని మా బాల్యం లొకి
    తీసుకెళ్ళింది.మా ఊళ్ళొ పేపర్ బొయ్ సైకిల్ లొ వీధి చేరుతున్నప్పుడే మేము పరుగెత్తి కెళ్ళి ఛందమామని లాగేసుకుని చదివే వాళ్ళం. ఒకరు చదివేవాడు, పక్కన ఇద్దరు, వెనకాల ఇద్దరు కలిసి. చదివేవాళ్ళం.
    ముందు కంచుకోట, తరవాత మహాభారతం, ఆ తరవాత భేతాళకథలు అన్నీవరుసగా చదివేవాళ్ళం.
    ఆప్పటి బొమ్మలు ఇప్పటికీ మా మదిలొ వున్నాయి.
    మా బాధ ఏమిటంటే మా పిల్లలకి తెలుగు చదవటం రాదు.
    మీ తండ్రి గారు చందమామ కు (తద్వారా మాకు) చేసిన సేవ అమోఘం.
    వారి ఋణం తీర్చుకొలేము.

  6. హంస ధ్వని గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    08/12/2008 11:18 pm

    ఎంత బాగా రాసారు!!! చాలారోజుల తర్వాత ఒక గొప్ప కథ చదివాను. కనక ప్రసాదు గారు, మీరు మరింత విస్తృతంగా రాయాలి మా కోసం.

  7. మంచులో తడిసిన ఉదయం గురించి jayaprabha అభిప్రాయం:

    08/12/2008 10:11 am

    వైదేహి, చాలా బాగుంది మీ కవిత. చాలా రోజుల తరువాత originality వున్న images చూస్తున్నాను. మంచి హేమంతం, చంద్రునిలో అవ్వ రాట్నం వడకడం (వహ్!), అదంతా మంచులా రాలిపడటం!! గొప్ప ఊహా చిత్రం సుమా.

    మీరు మీ కవితలతో కవ్విస్తున్నారు నన్ను. మరీ చెలరేగి వస్తున్నాయి మీ వూహలు. వాటిని రానివ్వండి అలా. కానీ తలుపు తీయను నేను. మంచు గాలి వణుకుకి జడిసి. మరి మీ హేమంత సుందరి తో చేయి కలపటం ఎలా? మీరే ఏదైనా వుపాయం చెప్పాలి.

    జయప్రభ.

  8. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Ramakrishna అభిప్రాయం:

    08/11/2008 2:01 pm

    కృష్ణుడికి వాడిన పర్యాయపదం “సరసిజనాభ” – అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తే నాకు సోదరుడై కూడా నాకీ గతి పట్టిందే అన్న ద్రౌపది వేదనని యీ పదం స్ఫురింపజేస్తుంది.

    ఇదే ఊహ నాకు శ్రీనాదుడి పద్యం ‘కుల్లా యుంచితి, కోక చుట్టితి …. కన్నడ రాజ్యలక్ష్మి, దయలేదా, నేను శ్రీనాధుడన్ ‘ లో కనిపించింది (లేకపోతే ఎక్కడో ఆ మాట చదివి ఉంటాను). ఒక వేఫు, నేను శ్రీనాధుడను అనటమే కాక, కన్నడ రాజ్యలక్ష్మి అని సంబోధించినందువల్ల ఎవరో third party తో కాకుండా, direct-గా తనతో (మోటుగా చెప్పాలంటే ‘నేను నీ మొగుణ్ణి!’) అంటున్నది స్పష్టం చేస్తున్నాడు.

  9. నాకు నచ్చిన పద్యం: పోతనామాత్యుని జీవన దృక్పథం గురించి rAmakRshNa అభిప్రాయం:

    08/11/2008 1:45 pm

    లక్ష్మన్నగారికి,
    విశ్వనాధ సత్యనారాయణ గారి ‘అల్లసాని వాని అల్లిక జిగిబిగి’లో మీకు కావలసిన వివరణ ఉంటుందనుకుంటాను.

  10. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి rAmakRshNa అభిప్రాయం:

    08/11/2008 11:23 am

    దీనికి నేను విన్న పాఠం “పర్ణాని, స్వర్ణ వర్ణాని, కర్ణాంతాకీర్ణ లోచనే”. ఒక అణా ఎక్కువుంది 🙂

    ఇద్దరూ స్నేహితుల లాగా ఉన్నారు, ఒక అణా అటూ-ఇటూ అవుతే ఏం?