పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. ఛందోధర్మము గురించి mOhana అభిప్రాయం:

    08/25/2008 12:41 pm

    నన్నయ కాలములో ఋ-కారాన్ని రి-కారముగా పలికేవారు.
    అందుకే ఆ కాలపు శాసనాలలో కూడ ఋణము అనృ దానికి
    బదులు రిణము అని వాడారు. కాని తిక్కన కాలానికే ఋ-కారాన్ని
    రు-కారముగా పలకడానికి ఆరంభించారు. తిక్కనగారు కొన్ని
    చోటులలో ఋ-కారానికి రు-కారానికి యతి కూడ చెల్లించారు.
    సామాన్యముగా ఛందస్సులో ఇది నిషిద్దము. ఋ-కారానికి
    రి-కారానికి, ఇ, ఈ, ఎ, ఏ, హి, హీ, హె, హే, యి, యీ, యె,
    యే, ఋ-కారము ఉన్న అన్ని హల్లులకు యతి చెల్లుతుంది.
    కాబట్టి అమ్రుతము అని పలికేటప్పుడు, వ్యావహారిక భాషలో
    అమృతమునకు బదులు అలా రాయడములో తప్పు లేదని
    నా భావన. గ్రాంథికముగా మాత్రము అది సరి కాదు, అంతే.
    తెలుగువారు మాత్రమే కాదు, కన్నడ, మరాఠీ, ఒరియా భాషలలో
    ఋ-కారాన్ని రు-కారముగా పలుకుతారు. మిగిలిన ఉత్తర
    భాషలలో రి-కారముగా పలుకుతారు.
    విధేయుడు – మోహన

  2. తెల్ల కాయితం గురించి murthy అభిప్రాయం:

    08/25/2008 12:00 pm

    నమస్కారం. నేను ఈ స్టోరీ చదివాక చాలా బాగా నచ్చింది. కోటి పాత్ర సూపర్. ఫాదర్, మదర్ పాత్రలు బాగా వున్నాయి. Totally story matter super!

  3. ఛందోధర్మము గురించి baabjeelu అభిప్రాయం:

    08/25/2008 7:16 am

    విప్లవ్ గారూ,
    “రాసే తెలుగు” గురించి: ఇది “అమ్రుతం”, “క్రుష్ణుడు” అని నేను రాసిన వాటిగురించి అనుకుంటాను. వుప్పల లక్ష్మణరావుగారి ప్రభావం. ఈ మాట సంపాదక వర్గం వారే హెచ్చరించేరు. మా గురువుగారు కూడా “స్పెల్లింగ్” దిద్దించేరు.అమృతం అని రాయడం కష్టవని నేననుకోవటంలేదు. నిజానికి అంత పట్టింపూ లేదు. మిగిలిన కవుల/రచయత(త్రు)ల, వ్యాసుళ్ళ తల్లిదండ్రులు ఈ మాట సంపాదకవర్గాన్ని కలిసి ఇలాటి “స్పెల్లింగులు” రాసే వాళ్ళ అభిప్రాయాలు మీ పత్రికలో వేస్తే కుదరదు, కాదూ కూడదంటే మాపిల్లల “టీసీ” లిచ్చేయండి అని బెదిరించేరనుకోండి, అప్పుడు నేను మారిపోవచ్చు లేదా ఈ మాట లో నేను అభిప్రాయాలు రాయకపోవొచ్చు.
    ఇహ “క్రెడిబిలిటీ” గురించి: “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్నదీ, దాని గురించి మిగిలినవాళ్ళందరూ రాసింది, రాసే వాళ్ళ రాయగలిగే సత్తువ గురించి. ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి. ఇదంతా “గుంచీ” దగ్గరో, “బొంకులదిబ్బ” దగ్గరో, “ఐకోనేరు గట్టు” మీదో (పెద్దాంజనేయస్వామి గుడి దగ్గర) సాయింత్రం కలుసుకుని కబుర్లాడుకునే వాళ్ళ వ్యవహారం. మిగతా పరిస్తితులన్నీ మారకుండా వుంటే అప్పుడు కవికి కావల్సిన “అర్హత” ల గురించి.

    మీరు చెప్పిన జారుడుబండ సంగతి: జీవితంలో మిగిలిన వ్యవహారాల్లో కవి ఎలావుండాలన్నది. చాలా కష్టం. జీవితం “డైనమిక్” వ్యవహారం కదా? అందులోనూ “ఫోర్త్ డైమన్షన్” ని పట్టుకుని అప్పుడు “త్రీడైమన్షన్” లో కవిగారి సంగతి తేల్చడం “కమ్నిస్టులు” కూడా చెయ్యలేరేమో? ఎందుకంటే “ఫోర్త్ డైమన్షన్” ని పట్టుకుని ఆపగలగడం కుదరదు. అందుకే, తెలిసిన వారు కాబట్టి “జారుడు బండ” అని చక్కగా చెప్పేరు. (“కమ్నిస్టులు” అంటే మిగిలిన అందరికన్నా తెలివయిన వాళ్ళని చిన్నపట్నించీ “బ్రైన్ వాష్” అవడంవల్ల వాడేను.)
    మీరు రాసిన “ఛైల్డ్ మోలెస్టర్స్” చిన్న పిల్లల కథలు రాయడానికి పనికిరారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళకోసం కథలు రాస్తే పర్వాలేదా?

  4. ఛందోధర్మము గురించి Ravikiran Timmireddy అభిప్రాయం:

    08/25/2008 6:34 am

    “ఇదిగో, బతుకంటే ఇదీ బతుకు, ఇలా బతకడవే బతుకు.” ఫలాని విధంగా బ్రతకటవే గొప్ప, ఫలాని దార్లో ప్రయాణించడవే వొప్పు, బతుక్కి ఫలాని నిర్వచనవే కరక్టు. ఒక అనంతవైన అనుభవానికి దిశ నిర్దేశం చేసే ప్రయత్నం. ఎల్లలు లేనటువంటి ఒక అద్భుతానికి చట్రాలు బిగించే ప్రయత్నం. నియమితవైన సంఘంలో, పరిమితవైన అవకాశాలున్న సంఘంలో (బతుకవసరాలు తీర్చుకోడానికి) ఈ రకవైన దిశనిర్దేశం సహజవే. కానీ కొందరుంటారు వాళ్ళని నియమాల్తోనూ, అవకాశాల్తోనూ ఆపడం సాద్యంకాదు. అకాశాన్నీ, గాలిని, అనంతాన్ని నింపుకుని పుట్టిన వాళ్ళు, ఆన్ని చట్రాలని పగల కోడ్తారు, అన్ని నియమాల్ని చిందరవందర చేస్తారు. వాళ్ళకి బ్రతుకొక స్వప్నం, వాళ్ళు బ్రతుకుని, బ్రతకడాన్ని వేరువేరుగా చూడరు, వాళ్ళు కవితని, వచన కవితని విడదీసి చూడరు. నా ద్రుష్టిలో బ్రతుకుని అనుభవించి పలవరించడవే కవిత్వం. ఆ పలవరింతకి వొక నియమావళి అక్కరలేదు, ఒక రెఫరెన్సు అక్కరలేదు. దానికో ప్రణాలిక, పాఠ్య గ్రంధం అక్కరలేదు, దానికో సర్టిఫికేట్ అక్కరలేదు. ఆ అనుభూతి, ఆ పలవరింత ఎదుటి మనసుని తాకగలిగితే చాలు (తాకకపోయినా పరవాలేదు). అది ఏ రూపంలో వుంది, ఏ భాషలో వుంది, ఎవరి బతుకును తనలో పొదువుకునొచ్చింది అనేవి అవసరవని నేననుకోను. ఛందోధర్మాలు, వ్యాకరణ సూత్రాలు వుంటే వుండనివ్వండి, కానీ అవి లేకపోవడం బలహీనత కాదు. భావప్రసరణ జరిగిందా లేదా అనేదే కావాలిగానీ, గడిచిపోయిన దినాల్లో, నడిచిపోయిన కవుల రెఫరెన్సులు అవసరం వుందని నేననుకోను.

    నామిని, రావీ శాస్త్రి రచనల్లో నాకా బతుకు పలవరింతే కనపడుతుంది, నాకు కవిత్వవే కనపడుతుంది. అది వచనవా అంటే వచనవే కానీ అది నిస్సండేహంగా కవిత్వవే. మన అనుభవాన్ని వ్యక్థం చేయడానికి రోజువారీ పదాలు సరిపోకపోవడవేవిటో నాకు తెలీదు. అక్కడా, ఇక్కడా గతంలోనూ, గ్రంధాల్లోనూ వెతకనక్కరలేదు. ఈమాటలో ప్రచురితవైన కవితల్లో (కవితలన్నీ నచ్చాలని కాదు), నాకెక్కడా పదదారిద్ర్యం కనపడలేదు. మామూలు మనుషుల, మామూలు బ్రతుకుల, మామూలు మాటల్లో వ్యక్తీకరించలేని జీవితానుభవం వొకటుందా?

  5. తడి గురించి Tarakaram అభిప్రాయం:

    08/23/2008 8:18 pm

    మాస్టారూ,
    ఇలాంటి కథలు మా univలో సహాయాన్ని పొంది, అన్నీ మరిచిపోయి, US వెళ్ళి సెటిల్ ఐనవాళ్ళు కాస్త చదివితే, ఒకరిద్దరికైనా సహాయం చేస్తారేమో.
    కాని, వాళ్ళు గొప్పవాళ్ళు … తెలుగు చదువుతారా?

  6. పలాయనం గురించి Anjaneyulu అభిప్రాయం:

    08/23/2008 2:22 pm

    మనసు కోరుకునే రుచులకీ అభిరుచులకీ, పరుగులు తీసే నిజ జీవితానికీ మధ్యన నలిగే మనిషికి ఉన్న ఒకే ఒక్క బలహీనత బద్ధకం అని చాలా హృద్యంగా చెప్పిన కవి గారికి శుభాభినందనలతో.

  7. నువ్వు నాకొద్దు గురించి vedavathi అభిప్రాయం:

    08/23/2008 1:30 am

    It is a nice story. It tells doctors should know the patient psychology.Then only the patients will satisfy with the treatment.

  8. తెలుగు సినిమా? తెగులు సినిమా? గురించి vedavathi అభిప్రాయం:

    08/23/2008 1:14 am

    నేను కూడ మీ అభిప్రాయము తొ ఏకీభవిస్తున్నాను. కానీ ఇందుకు ప్రేక్ష కుల పాత్ర కూడా వుంది. మనము చూసినపుడే కద సినిమాలు తీస్తారు. మంచి సినిమాలని మాత్రమే చూడాలి. చెత్త సినిమాలని బహిష్కరించాలి.

  9. ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    08/22/2008 1:00 pm

    నా వ్యాసం పై స్పందనల్ని ఇప్పుడే చదివాను! నిజానికి నా వ్యాసం అసలు పేరు “ఘంటసాల – బాలసుబ్రమణ్యం”. ఈమాట పాత రచనల్లో ముందులేని కొన్ని అచ్చుతప్పులు తరవాత ఉండటం జరిగింది. బహుశా, పాత రచనలని పొందుపరచటంలో ఏర్పడిన పొరపాట్లు కావచ్చు.

    ఎప్పుడో రాసిన ఈ వ్యాసం పై ఇంత చర్చ ఇప్పుడు జరగటం ఆశ్చర్యంగా ఉంది.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. ఛందోధర్మము గురించి విప్లవ్ అభిప్రాయం:

    08/22/2008 10:31 am

    బాబ్జీలు గారూ,

    “రాసేవాళ్ళకి అర్హత అక్కర్లేదు.” అనేది అంత డెఫినిటివ్ గా చెప్పటం కష్టమేమో?

    రాసింది గొప్పదయితే దానికదే నిలబడుతుంది, అన్నది బాగానే ఉంది.

    కానీ,

    పిల్లలకొరకు ‘నీతి పుస్తకాలు’ రాయటానికి child molestors పనికి రారు, రాసిన విషయం ఎంత గొప్పదయినా సరే. రాసే వాళ్ళకు credibility ఉండాలి కాబట్టే ఎవర్రాసారు అన్నది ముఖ్యం.

    ఇక “క్రెడిబిలిటీ” అన్నది ఒక జారుడుబండే కదా అంటే, అది కూడా నిజమే. రాసిన విషయానికున్న తీవ్రతను బట్టి రాసిన వారిని ప్రశ్నించటం జరుగుతుంది, కాదంటారా?

    నిన్నీమధ్యే ఈ కామెంట్లు చదవటం మొదలు పెట్టాను. మీర్రాసే భాషకు మంచి స్పందన ఉంటుంది అన్నది వేరే ఎవరూ చెప్పాల్సిన పనిలేదు.
    ఎవరైనా “రాసే తెలుగు” కు ఒక స్టాండర్డ్ ఉండాలి అని అంటే మీరేమంటారు, ఈమాట యూనికోడ్ అలవాటైనాక? మీ అభిప్రాయం మీ భాషలో చెప్పండి.

    విప్లవ్