ప్రమేయం అంటే ఒక ఫంక్షన్ కదా, ఫంక్షన్ అంటే కొన్ని విలువలని ఇన్పుట్ గా తీసుకుని ఒక అవుట్పుట్ ఇచ్చేది కదా, ఆ అవుట్పుట్ కి అవును కాదు అని ఎందుకు అవ్వాలి, అది బూలియన్ ఫంక్షన్ అయితే అయ్యే అవకాశం ఉంది కాని. మీరు చెప్పిన సూత్రం ప్రవచనాలకి సరిపోతుంది, ఏదైనా ప్రవచనం అవును కాని లేదా కాదు కాని తప్పక అయితీరాలి.
శ్రీనివాస్ గారన్నట్టు, నాక్కూడా అసలు స్టోరీ మీనింగ్ ఏమిటో తెలియలేదు. ఆ అందమైన అమ్మాయి ఏడ్చే సీనుకీ, వీళ్ళ పార్టీకీ ఏమిటీ సంబంధం? ఏదో వుంది రచయిత దృష్టిలో. అది నాకర్థం కాలేదంతే అని అనిపిస్తుంది. ఒక పురుషుడి పెత్తనం వల్ల ఆ అమ్మాయి ఏడ్చిందని మాత్రం అర్థం అయింది. అయినా ఎవరన్నా అలా రెస్టారెంట్లో అంత బావురుమని ఏడుస్తారా? ఆ పురుషుడి పెత్తనం గురించి అప్పుడే మొదటిసారిగా తెలిసిందా, ఏమన్నానా?
ఆ కోటీశ్వరులకీ, ఆ పేద పంతులికీ మధ్య వున్న స్నేహం కూడా విచిత్రంగానే వుంది. ఆ తాగుళ్ళకీ, తిండికీ బిల్లు కట్టేది ఆ కోటీశ్వరులే కదా ఎప్పుడూ? ఇదేదో డబ్బున్న వారి వెంట లేని వారు తిరగడం లాగానే వుంది తప్ప, స్నేహం లాగా లేదు. ఇక, “దానికీ కారణం కేవీఆర్ మేష్టారే, మా నాన్న, మాస్కూల్లో టీచరు.” అన్న వాక్య నిర్మాణం వల్ల, విషయం మొదట్లో అర్థం కాలేదు.
ఈ కధని మెచ్చుకున్న వాళ్ళెవరైనా, దీనర్థం కాస్త విపులీకరిస్తే, బాగుంటుందనుకుంటున్నాను.
ఖరీదైన రెస్టారెంట్లో పడ్డ ఆ అమ్మాయి కష్టానికి వీళ్ళు చలించలేదనా?
రచయితా, ఈ కధని ఇష్ట పడ్డవాళ్ళూ క్షమించాలి. విషయం అర్థం కానివారు వుంటారని మాత్రం గ్రహించాలి.
శ్రీ బాలమురళి పై ఇంత సాధికారంగా రోహిణీప్రసాద్ గారు రాయగలరని నాకు తెలుసు. అయినా, “ఈమాట” కోసం రాసినందుకు ధన్యవాదాలు.
ఈ వ్యాసంలో ముచ్చటించిన ఒకటి, రెండు విషయాలను మళ్ళీ మీ ముందుంచాలని:
1. “గాయకుడిగా శ్రీబాలమురళీ దరిదాపులకు వచ్చేవాళ్ళు లేకున్నా, శ్రీ బాలమురళీకి మరిన్ని సుగుణాలు ఉంటే బాగుండేది” అన్న వ్యాసకర్త మాటలు, గమనించతగ్గవి. ఆలోచింపతగ్గవి. సంగీతంతో (పుస్తక జ్ఞానమేకాక) అన్ని రకాలుగా ఎంతో గాఢమైన పరిచయం, అనుభవం ఉంటే కాని ఇటువంటి వాక్యాలు రాయలేరు.
2. శ్రీ బాలమురళి సంగీతం, జీవితం తరవాత తరాల కోసం డాక్యుమెంటేషన్ విషయమై, రోహిణీప్రసాద్ గారు చేసిన సూచనలు ఆలోచించి, ఆచరణలో పెట్టవలసినవి. నాకు ఉన్న పరిచయంలో, తెలుగు సంఘాలకి గాని, సంస్థలకి గాని అటువంటి దమ్ము, ఆసక్తి ఉన్నాయని నే అనుకోను.
అడిగిన వెంటనే, “చెయ్యి” చేసుకున్నందుకు చాలా సంతోషం.
మీరు ఈ రచనకి ఎన్నుకున్న వస్తువు బాగానే ఉంది కాని, మీ సమర్ధత ఇంతకన్నా ఎక్కువ కాబట్టి, వచ్చే సంచికల్లో మరిన్ని మీ “రాతలు” కోసం ఎదురు చూస్తూ, అంత వరకు ఒక్క సిటం ఆగుతాను.
మీ అభిప్రాయం చదివాక ఈ కధ చదివాను. మీరన్నట్టే వుంది. ఎటొచ్చీ అనువాదమని చాలా చోట్ల తెలిసిపోయింది. స్వేచ్ఛానువాదం చేస్తే ఇంకా బాగుండేది.
మీరు ఇలా రాశారు:
“సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను’’ అని తనకి వినబడేలా అరిచాను. — ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది.
శాల్, “అబ్బా విసిగించకు. వెళ్ళి క్షవరం చేయించుకో’’ అని అంటే, నేను అనే పాత్ర అలా అంటుంది. అంటే ఆ పాత్ర, “సున్నితమైన మనసుగల శాల్” అని అనడంలో వెక్కిరింత వుంది. ఆ వెక్కిరింత శాల్ కి అర్థం అయింది కూడా. అందుకే ఆమె అతనిపై ప్లాస్టిక్ సాసర్ ని విసిరింది. ఇది హాస్యంగా అర్థం అయింది నాకు.
మీరు, “ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది” అని అనడంలో అర్థం ఇదేనా? లేక నేను సరిగా అర్థం చేసుకోలేదా? మీ కామెంటు చదివినపుడు, మీరు సీరియస్ గా ఫీలయ్యారని అనిపించి, ఆ కధ చదివాను. అదొక హాస్య సంఘటనకి సంబంధించిన వాక్యంగా అర్థం అయింది నాకు. కానీ మీరలా అనడంలో ఏదో అర్థం వుందనిపిస్తొంది.
మీరు వేరే లాగా అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే వివరించండి. మీరు నా ఈ కామెంటుని పట్టించుకోక పోయినా ఏమీ అనుకోనులెండి. ఎటొచ్చీ మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనిపించింది.
Dear Surya,
I have read your comments with interest. I am not unfamiliar with the ideas you have presented. However, the perspective from which these articles have treated the subject is very different.
|Thanks a lot for reading the articles.
విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి,
మీ ప్రోత్సాహానికి చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు.
అసలు స్టొరి మీనింగ్ ఏంటో నాకు మాత్రం తెలియలేదు. పార్టి కి అమ్మాయికి సంబంధం ఏంటి? ఏందుకు ఏడుస్తుంది? పార్టి కొరకు హోటల్ కు వెళ్ళారు; ఏడిచే అమ్మాయిని మూడు సార్లు చూసారు; వచ్చారు. ఇది కూడా కథేనా? నాకు నచ్చలేదు.
మరో గుప్పెడు మొర్మొరాలు గురించి పాఠకుడు అభిప్రాయం:
09/04/2008 10:20 am
పిడకల వేట ఎక్కువైన ఈ వ్యాసంలో కనీసం పిడికెడు మొర్మరాలు కూడా దొరకలేదు. గందరగోళం ఎక్కువయ్యింది.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు గురించి sUryuDu అభిప్రాయం:
09/04/2008 10:01 am
కొడవళ్ళ హనుమంతరావు గారు,
ప్రమేయం అంటే ఒక ఫంక్షన్ కదా, ఫంక్షన్ అంటే కొన్ని విలువలని ఇన్పుట్ గా తీసుకుని ఒక అవుట్పుట్ ఇచ్చేది కదా, ఆ అవుట్పుట్ కి అవును కాదు అని ఎందుకు అవ్వాలి, అది బూలియన్ ఫంక్షన్ అయితే అయ్యే అవకాశం ఉంది కాని. మీరు చెప్పిన సూత్రం ప్రవచనాలకి సరిపోతుంది, ఏదైనా ప్రవచనం అవును కాని లేదా కాదు కాని తప్పక అయితీరాలి.
నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా?
సూర్యుడు 🙂
ధార గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
09/04/2008 9:44 am
శ్రీనివాస్ గారన్నట్టు, నాక్కూడా అసలు స్టోరీ మీనింగ్ ఏమిటో తెలియలేదు. ఆ అందమైన అమ్మాయి ఏడ్చే సీనుకీ, వీళ్ళ పార్టీకీ ఏమిటీ సంబంధం? ఏదో వుంది రచయిత దృష్టిలో. అది నాకర్థం కాలేదంతే అని అనిపిస్తుంది. ఒక పురుషుడి పెత్తనం వల్ల ఆ అమ్మాయి ఏడ్చిందని మాత్రం అర్థం అయింది. అయినా ఎవరన్నా అలా రెస్టారెంట్లో అంత బావురుమని ఏడుస్తారా? ఆ పురుషుడి పెత్తనం గురించి అప్పుడే మొదటిసారిగా తెలిసిందా, ఏమన్నానా?
ఆ కోటీశ్వరులకీ, ఆ పేద పంతులికీ మధ్య వున్న స్నేహం కూడా విచిత్రంగానే వుంది. ఆ తాగుళ్ళకీ, తిండికీ బిల్లు కట్టేది ఆ కోటీశ్వరులే కదా ఎప్పుడూ? ఇదేదో డబ్బున్న వారి వెంట లేని వారు తిరగడం లాగానే వుంది తప్ప, స్నేహం లాగా లేదు. ఇక, “దానికీ కారణం కేవీఆర్ మేష్టారే, మా నాన్న, మాస్కూల్లో టీచరు.” అన్న వాక్య నిర్మాణం వల్ల, విషయం మొదట్లో అర్థం కాలేదు.
ఈ కధని మెచ్చుకున్న వాళ్ళెవరైనా, దీనర్థం కాస్త విపులీకరిస్తే, బాగుంటుందనుకుంటున్నాను.
ఖరీదైన రెస్టారెంట్లో పడ్డ ఆ అమ్మాయి కష్టానికి వీళ్ళు చలించలేదనా?
రచయితా, ఈ కధని ఇష్ట పడ్డవాళ్ళూ క్షమించాలి. విషయం అర్థం కానివారు వుంటారని మాత్రం గ్రహించాలి.
– జె. యు. బి. వి. ప్రసాద్
బాలమురళీకృష్ణ గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/04/2008 8:46 am
శ్రీ బాలమురళి పై ఇంత సాధికారంగా రోహిణీప్రసాద్ గారు రాయగలరని నాకు తెలుసు. అయినా, “ఈమాట” కోసం రాసినందుకు ధన్యవాదాలు.
ఈ వ్యాసంలో ముచ్చటించిన ఒకటి, రెండు విషయాలను మళ్ళీ మీ ముందుంచాలని:
1. “గాయకుడిగా శ్రీబాలమురళీ దరిదాపులకు వచ్చేవాళ్ళు లేకున్నా, శ్రీ బాలమురళీకి మరిన్ని సుగుణాలు ఉంటే బాగుండేది” అన్న వ్యాసకర్త మాటలు, గమనించతగ్గవి. ఆలోచింపతగ్గవి. సంగీతంతో (పుస్తక జ్ఞానమేకాక) అన్ని రకాలుగా ఎంతో గాఢమైన పరిచయం, అనుభవం ఉంటే కాని ఇటువంటి వాక్యాలు రాయలేరు.
2. శ్రీ బాలమురళి సంగీతం, జీవితం తరవాత తరాల కోసం డాక్యుమెంటేషన్ విషయమై, రోహిణీప్రసాద్ గారు చేసిన సూచనలు ఆలోచించి, ఆచరణలో పెట్టవలసినవి. నాకు ఉన్న పరిచయంలో, తెలుగు సంఘాలకి గాని, సంస్థలకి గాని అటువంటి దమ్ము, ఆసక్తి ఉన్నాయని నే అనుకోను.
మోహనరావుగారికి:
మీ అభిప్రాయంలో, మీరిచ్చిన లింకులకి ధన్యవాదాలు.
విష్ణుభొట్ల లక్ష్మన్న
ధార గురించి Samata అభిప్రాయం:
09/04/2008 8:36 am
కథ ఇంకా వుంది అనుకున్నాను. మధ్య లొనే ఆగిపొయినట్టు వుంది.
మరో గుప్పెడు మొర్మొరాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
09/04/2008 8:13 am
బాబ్జీలు గారూ:
“ఈమాట రచయిత” గా మీకు స్వాగతం!
అడిగిన వెంటనే, “చెయ్యి” చేసుకున్నందుకు చాలా సంతోషం.
మీరు ఈ రచనకి ఎన్నుకున్న వస్తువు బాగానే ఉంది కాని, మీ సమర్ధత ఇంతకన్నా ఎక్కువ కాబట్టి, వచ్చే సంచికల్లో మరిన్ని మీ “రాతలు” కోసం ఎదురు చూస్తూ, అంత వరకు ఒక్క సిటం ఆగుతాను.
విష్ణుభొట్ల లక్ష్మన్న
సెన్సిటివిటీ ట్రెయినింగ్ గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:
09/04/2008 7:57 am
రానారె గారూ,
మీ అభిప్రాయం చదివాక ఈ కధ చదివాను. మీరన్నట్టే వుంది. ఎటొచ్చీ అనువాదమని చాలా చోట్ల తెలిసిపోయింది. స్వేచ్ఛానువాదం చేస్తే ఇంకా బాగుండేది.
మీరు ఇలా రాశారు:
“సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను’’ అని తనకి వినబడేలా అరిచాను. — ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది.
శాల్, “అబ్బా విసిగించకు. వెళ్ళి క్షవరం చేయించుకో’’ అని అంటే, నేను అనే పాత్ర అలా అంటుంది. అంటే ఆ పాత్ర, “సున్నితమైన మనసుగల శాల్” అని అనడంలో వెక్కిరింత వుంది. ఆ వెక్కిరింత శాల్ కి అర్థం అయింది కూడా. అందుకే ఆమె అతనిపై ప్లాస్టిక్ సాసర్ ని విసిరింది. ఇది హాస్యంగా అర్థం అయింది నాకు.
మీరు, “ఈ ఒక్క వాక్యం నన్ను కొంచెం సేపు నిలబెట్టింది” అని అనడంలో అర్థం ఇదేనా? లేక నేను సరిగా అర్థం చేసుకోలేదా? మీ కామెంటు చదివినపుడు, మీరు సీరియస్ గా ఫీలయ్యారని అనిపించి, ఆ కధ చదివాను. అదొక హాస్య సంఘటనకి సంబంధించిన వాక్యంగా అర్థం అయింది నాకు. కానీ మీరలా అనడంలో ఏదో అర్థం వుందనిపిస్తొంది.
మీరు వేరే లాగా అనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే వివరించండి. మీరు నా ఈ కామెంటుని పట్టించుకోక పోయినా ఏమీ అనుకోనులెండి. ఎటొచ్చీ మీ అభిప్రాయం తెలుసుకోవాలని అనిపించింది.
– జె. యు. బి. వి. ప్రసాద్
ధార గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:
09/04/2008 7:23 am
కథ కన్నా, కథనం భలే వుంది.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నాగమురళి అభిప్రాయం:
09/04/2008 7:01 am
Dear Surya,
I have read your comments with interest. I am not unfamiliar with the ideas you have presented. However, the perspective from which these articles have treated the subject is very different.
|Thanks a lot for reading the articles.
విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి,
మీ ప్రోత్సాహానికి చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు.
ధార గురించి srinivas అభిప్రాయం:
09/04/2008 3:54 am