పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. అసమర్థులు గురించి anuradha అభిప్రాయం:

    11/04/2008 9:28 pm

    చాలా బాగుంది.
    “కొందరు అదృష్టవంతులు ఆత్మలు చచ్చి మూసల్లా తయారవుతారు, సుఖపడతారు కూడా. మరి కొందరు అదృష్టవంతులు ఎదురు తిరిగి సొంత వ్యక్తిగా ఎదిగి తృప్తిగా జీవిస్తారు. నాలాంటి దురదృష్టవంతులు ఇటు సొంత ఆత్మ చావకా, అటు వారి ట్రెయినింగ్ తో కుదించుకుపోయీ అసమర్థుల్లా మిగిలి పోతారు.” ఈ వాక్యాలు ఇంకా బాగా నచ్చాయి.ఎందుకంటె నేను అలాంటి అసమర్థురాలినే. ధన్యవాదాలు ఇంత మంచి కథ అందించినందుకు.

  2. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి సగటు జీవి అభిప్రాయం:

    11/04/2008 9:02 pm

    నాకేం అనిపిస్తుందంటే, ఇదంతా తరాల మధ్య అంతరాలనిపిస్తుంది. ఈమాటలో ఈతరం వాళ్ళు తక్కువ. పత్రికలోని వ్యాసాలు కాచి వడబోసిన టీలాగా ఉండాలని అనుకుంటూన్నారు. తప్పేం లేదు. కానీ ఈ రోజుల్లో తెలుగు పత్రిక చదివేవాడ తక్కువైపోతుంటే ఇప్పుడు ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుందనిపిస్తుంది.

    ఇక నవతరంగం లో అంతా ఈ తరం వాళ్ళే.అక్కడ కాచి వడపోత లేదు. అంతా ఇన్స్టెంట్ టీ బ్యాగ్ టైపు. ఫట్ మని రాస్తారు. ఫట్ మని పబ్లిష్ చేస్తారు.ఒక విధంగా ఇది లాభం మరో విధంగా నష్టం. లాభమేంటంటే మరీ గొప్పగా రాయలేని వాళ్ళు సైతం రాసే అవకాశం పొందుతారు. అలాగే కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక నష్టమేంటంటే క్వాలిటీ. న.త లో వచ్చే అన్ని వ్యాసాలూ ఒకే నాణ్యత కలిగివుండవు.

  3. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    11/04/2008 12:24 pm

    ఎందుకు, ఎలా, అని అడక్కండి. నా దగ్గర నిజంగానే సమాధానం లేదు. కానీ యెందుకో పై కవిత చదవగానే సత్తసాయ్ (గాథాసప్తశతి) లోని “గాథలు” కొన్ని, అలాగే సుభాషిత రత్నకోశం, సుభాషిత రత్నభాండాగారాల్లోని కొన్ని ప్రకృతి వర్ణనలతో కూడిన సంస్కృత పద్యాలు గుర్తుకొచ్చాయి. లైలాగారన్నట్లు నిజంగా సరదాగా వుంది మీ కవిత. అభినందనలు.

    భవదీయుడు,
    శ్రీనివాస్

  4. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి lyla yerneni అభిప్రాయం:

    11/04/2008 12:06 pm

    భలే సరదాగా ఉంది కవిత. ఇంకా ఆ ఊళ్ళోకి వెళ్ళాలనే! ఎందుకు! 🙂

    ఇంతకు ముందు సంచికలో -తారామతి బిరాదరి- కూడా బహుత్ ఖూబ్. Haunting. Spell casting.

    ‘మబ్బు కొప్పు’ లోంచి బదులు, మబ్బు జుల్ఫ్ నుండి నీటిపూలు రాలి కొమ్మల్లో చిక్కుపడరాదా?

    మీ పొయెట్రీ లింకు ఇచ్చారు. చదువుకుంటాను. థేంక్యూ ఇంద్రాణీ!

    లైలా

  5. నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి Kameswara Rao అభిప్రాయం:

    11/04/2008 11:50 am

    నన్నెచోడుని, అతని చక్కని పద్యాన్ని పరిచయం చేసారు. మోహనగారన్నట్టు ప్రబంధపరమేశ్వరుడు బిరుదుకి నన్నెచోడుడు తగినవాడే!
    మీ వివరణకి చిన్న సవరణ. “ముత్తరంగలు” అంటే నాభిపై భాగమ్మీద ఏర్పడే సన్నని మూడు మడతలు అని అర్థం, మూడు పాయలని కాదు. ఈ “ముత్తరంగల”నే “త్రివళులు” అని కూడా అంటారు.
    “మడుగులు వారి” అంటే మడతలు పడి అని అర్థం. వాననీరు కుచఘట్టనతో వేగంగా కిందకి పారి, త్రివళులని చేరి, ఆ మడతలకి మడతపడి వేగంగా నాభిని చొచ్చాయి అని అర్థం. ఈ అర్థంలో నీరు మూడు పాయలుగానే ఎందుకు చీలింది అన్న సందేహానికి తావుండదు.

  6. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి mOhana అభిప్రాయం:

    11/04/2008 11:45 am

    నాకు తోచిన రెండు నయాపైసలు!
    విజ్ఞానశాస్త్ర పత్రికలలో రచనలను ప్రచురించడానికి ముందు పత్రికకు రచయిత కాపీరైటు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈమాట వంటి పత్రికలకు రచయితలు అలా కాపీరైటు అందివ్వడం
    లేదు. ఐనా కూడా రచయిత మళ్ళీ తన రచనను మరో చోట ప్రచురిస్తే అక్కడ మొట్ట మొదట ఆ రచన ఈమాటలో ప్రచురించబడినది అని తప్పక చెప్పాలి. ఆ రచనను తన
    ఒక పుస్తకంలో భాగంగా ఉంచినా ఈ విషయాన్ని విదితం చేయాలి. ఈ రెండు సమయాలలో ఈమాట పత్రికకు అలా చేస్తున్నానని తెలియబరచాలి. ఇలా చేస్తే ఈమాట హక్కుదారులు, సంపాదకులు తప్పక అంగీకరిస్తారనే అనుకొంటాను. అలా చేయకపోతే అంత బాగుండదని నా అభిప్రాయం. విధేయుడు – మోహన

  7. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    11/04/2008 11:08 am

    PP Rao గారూ,

    మంచి ప్రశ్న వేసారు. నాకో సందేహం.
    విలువలు / Ethics కేవలం రచయితలకే సంబంధించిన విషయమా? సంపాదకులకది వర్తించదా? ఎందుకిలా అడుగుతున్నానంటే, గతంలో ఒక వెబ్ పత్రికలో వచ్చిన కొన్ని కథలూ, వ్యాసాలూ ఇంకో పుస్తకంలో రచయితల ఆమోదమం లేకుండా వేసేసారు. ఆ పుస్తకాలు అమ్మకానికీ పెట్టారు.
    గతంలో నేనొక పత్రికకి కాలమ్ రాసేవాణ్ణి. నాకు ఏ రకమైన సమాచారం ఇవ్వకుండానే ఓ రెండు రోజులుంచి, ఆ మర్నాడు తీసేసారు. గట్టిగా అడిగితే మళ్ళీ పెట్టారు. అందుకే చాలా పత్రికలు హామీ పత్రం తీసుకుంటాయి. అది పాటిస్తే సంపాదకులకీ, రచయితలకీ ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం, ఏ పత్రికయినా రచయితలకి పారితోషికం చెల్లిస్తున్నారా? అదుంటే పత్రిక వాళ్ళు అడగడంలో అర్థం ఉంది. ఎదో ఒక వెబ్ పత్రిక పెట్టుకొని అందులో వచ్చే వ్యాసాలూ, కథలూ వేరే చోట ప్రచురణ కాకూడదని ఆ పత్రిక వారికనిపిస్తే అది చెప్పాలి. గతంలో ఈ మాటలో వచ్చిన కథలు కొన్ని ఆంధ్రజ్యోతిలోనూ, విపుల లోనూ వచ్చాయి. అలాగే అమెరికాలో అనేక సావనీర్లలో కథలు తిరిగి ప్రచురించబడుతున్నాయి. ప్రస్తుత సాహితీ రంగంలో Ethics నిర్వచనాలు ఎవరికి తగ్గట్లు వాళ్ళు చెప్తున్నారు. అంతే!
    ఇందులో రచయితల్ని Ethics అంటూ నిలదీయడం ఎంత వరకు సబబు? Ethics అందరికీ వర్తిస్తాయి కదా?

  8. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    11/04/2008 9:57 am

    రావు గారూ:

    మీకొచ్చిన సందేహం కొంతవరకు సబబే!

    అందుకు నా సమాధానం ఇది.

    ఈమాట ఒక నిర్ణీత కాలానికి వెలువడే పత్రిక. ప్రతి రెండు నెలలకి మెదటి తేదీన. నవతరంగం ఎప్పుడైనా ప్రచురించే పత్రిక. దీనికి ఒక నిర్దిష్ట కాలం లేదు. ఒకప్పటి ఈమాట సంపాదకుడిగా నా ఒక ప్రత్యేక లక్ష్యం ఈమాటే!

    నేను కొన్ని నెలల క్రితం ఈమాటలో రాసిన రషోమాన్ (జాపనీస్ సినిమా)లో కొంత భాగం (నా అనుమతి లేకుండా) నవతరంగంలో పెట్టి, నా వ్యాసానికి ఈమాట లింకులిచ్చారు. అది చూసి నేను బాధపడలేదు. మరి కొంతమందికి తెలుస్తుంది కదా అనుకొన్నా! ఆ తరవాత నేను నవతరంగంలో సభ్యుడనై, ఈమాటలో ప్రచురించని వ్యాసాలు రాసా.

    ఈ మధ్య నా కొచ్చిన ఆలోచనల్తో, రాయ్ సినిమాలొ “ఈమాట” పాఠకులకి పరిచయం చేద్దామనుకొని, వ్యాసాలు రాస్తూ, అవి ఈమాటలో ప్రచురించిన తరవాత నవతరంగంలో పెట్టటానికి నవతరంగం మోడరేటరుకి ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగి, లేదని తెలిసిన తరువాత ఈమాటలో ప్రచురితమైన తరవాత నవతరంగంలో ప్రచురించమని కోరుతూ (తేదీ ఎప్పుడో ఎవరికీ తెలియదు), ఈమాట కి రెఫెరెంస్ కోరాను. అది కపడక పోతే, నేనే ఆ విషయం చెప్పాను. ఉదాహరణకి ఈ క్రింది ఈరోజు నా అభిప్రాయం నవతరంగంలో చూడండి. అలాగే చారులత పై నా వ్యాసం, ఈమాటలో ప్రచురించిన తరవాతలోనవతరంగంలో ప్రచురించి, ఈమాట గురించి రెఫెరెన్స్ లేకపోతే, అది నేనే ఇచ్చా!
    *****************************************************
    నవతరంగం మిత్రులకి:

    నేను సినిమాల పై రాసే వ్యాసాలు ముందుగా,”ఈమాట” వెబ్‌మాగజీన్ (www.eemaaTa.com) లో ప్రచురిస్తున్నాను. అనేక విషయాలపై ఈమాట వెబ్ పత్రిక నడుపుతున్న విషయం చాలా మంది నవతరంగం మిత్రులకి తెలిసే ఉంటుంది.

    అయితే, ఇక్కడ ప్రత్యేకంగా సినిమాల పైనే దృష్టి కాబట్టి, ఇక్కడ కూడా ప్రచురించటం జరిగింది. ఇది పునఃప్రచురణ అయినా, ఎక్కువ మంది పాఠకుల దృష్టికి ఈ వ్యాసాలు తీసుకెళ్ళటం తప్ప మరే ఉద్దేశ్యమూ లేదు.

    లక్ష్మన్న

    *******************************************************

    ఇక్కడ కొన్ని చిక్కు ప్రశ్నలున్నాయని నా అభిప్రాయం.

    అంతకు ముందు ప్రచురించిన రచనలని ఈమాట ప్రచురించదని నాకు, ఒకప్పటి సంపాదకుడిగా, తెలుసు. ఒక సారి ప్రచురించాకా, ఈమాట తన హక్కును కొల్పోతుందా? అది పునఃప్రచురింపబడితే, అందులో రచయిత బాధ్యత, ప్రచురణ కర్తల బాధ్యత ఏమిటి? ఇందులో స్వలాభం ఎవరికైనా, ఎంతైనా ఉందా?ఇవి ఆలోచించ వలసిన విషయాలు.

    ఇందుకై పాఠకుల అభిప్రాయం తెలుసుకోటం మంచిది.

    అందరికీ నమస్సులతో,

    లక్ష్మన్న

  9. మరచిపొమ్మంటున్నారు గురించి katti ramdas అభిప్రాయం:

    11/04/2008 9:38 am

    బాగుంది. బాగా పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా వుంది. ప్రేమించి కష్టాలు పడినట్టు వున్నారు.ఇంతకీ మీ ప్రెమ ఫలించిందా?అమృతాన్నే జుర్రుకొంటాను అని అన్నారు , కొన్నారా????

    Good Luck

  10. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి Anveshi అభిప్రాయం:

    11/04/2008 9:33 am

    ఇది ఎథిక్స్ గురించిన ప్రశ్న అన్నారు రావు గారు.
    అయితే ఇలా రెండు చోట్లా ప్రచురించడం వల్ల జరిగే నష్టం కొంచెం వివరిస్తే బావుండేది.
    నవతరంగం లో పూర్తిగా సినిమాకి సంబంధించిన సమాచారం ఉంటుంది. అ సైట్లో ఈ వ్యాసం ఉంచితే ఆ సైటు కొచ్చి ఈ సైటు కు రాని పాఠకులు చదివి ఒక మంచి సినిమా గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇందులో ఏ నష్టమూ లేదు. చివరకి ఒక మంచి సినిమా గురించి ఎక్కువ మందికి తెలియచేయడమనే రచయిత లక్ష్యమైతే అది ఇలా చేయడం వల్ల లాభదాయకమే అనుకుంటూన్నాను. ఇక్కడ ఎథిక్స్ విలువల ప్రస్తావన నాకర్థం కాలేదు.