పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. సువర్ణభూమిలో … గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    12/06/2008 9:30 pm

    భూషణ్ గారి కవితా దృక్పథం గురించి కామేశ్వరరావు గారన్నది సరిగానే ఉంది. అయితే కవిలో థాయిలాండ్ యాత్ర కలిగించిన గొప్ప అనుభూతిలో అణుమాత్రమైనా చాలా మంది పాఠకులకి కలగడం లేదు. గొప్ప హృదయకంపన కలగకపోతే ఈ కవి రాసి ఉండేవాడు కాదు:

    “కవిత్వం భూకంపం లాంటిదే. పునాదులతో సహా పెళ్ళగించివేయడం దాని స్వభావం. నీ అస్తిత్వ మూలాలు కదిలితే గాని కవిత్వ ప్రకంపన నీలో మొదలు కాదు. వెరసి ప్రపంచాన్ని చేరదు. ఏ కారణాల వల్ల లోపలి పొరల రాపిడితో ఆవని హృదయం బద్దలవుతుందో ఇదమిత్థంగా చెప్పలేకున్నాం. నేడు వెలువడుతున్న కవిత్వాలు రోకలి పోటు లాంటివి. వాటి అదుటు పక్కింటి వసారాను కూడా తాకదు. నీలో భూకంపం వుందా? కలం పట్టు.. ఆదిమోద్రేకాల శిలాద్రవాలను ప్రవహించనీ .. ఘనీభవించనీ .. ఆత్మను భస్మీపటలం చేయగల భయానక సౌందర్యాన్ని ఆరాధించగల చేవగలవాడే కవిత్వం చెప్పగలడు .. తతిమ్మా అందరూ ఆటలో అరటిపళ్ళు .. పనికిరాని దండుగ్గణాలు .. హృదయ పరిపాకం లేకుండానే రచనకు ఉపక్రమించిన కరటకదమనకులు.” [1]

    అందుకనే గూడార్థం ఏదన్నా ఉండి ఉంటుదని వెతుకుతున్నారనుకుంటాను.

    మొదటి మూడు కవితలలో బుద్ధుని గొప్పతనం కళ్ళకు కట్టినట్టున్నదనీ, ఆ గొప్పతనాన్ని తెలుసుకోలేని పిల్లి, కుక్క (మనలాటి పాఠకుల్లాగే) కూడా ఉన్నారనీ, నాలుగవ కవితని, మనం కవిత్వం ఎలా చదవాలి అనే దానికి ఉపమగా తీసుకొవచ్చనీ అన్నారు గరికపాటి. సముద్రం అడుగున చేపల్ని చూసి ఆనందించమన్నది కవిత్వం ఎలా చదవాలి అన్నదానికి ఉపమా? దీనికి చాలా బుద్ధి బలం కావాలనిపించింది నాకు. అది భూషణ్ తత్వానికి వ్యతిరేకం:

    “పుస్తకానికి, జీవితానికీ మధ్య దూరం పెంచేది కవిత్వం కాదు. సరైన కవిత్వం చదివాక నీవు పఠిస్తూ వచ్చిన వంద పుస్తకాలను గోదాట్లో గిరవాటు వేయగల తత్వ నిశ్చయం కలగాలి. అంతరాత్మను ముంచెత్తేదే అసలు సిసలు కవిత్వం. హృదయవర్తనను సాకల్యంగా ఎరిగిన వాడే పదహారణాల కవి. బుద్ధి బలంతో మిడిసి పడేవాడు పుస్తకాలను మోసే గాడిద .. అధముల్లో అధముడు. గణుతి కెక్కడు, పైగా వాడికి కవిత్వం నిషిద్ధం.” [1]

    పాత కవిత్వంలో పదాల అర్థాలు తెలియకా, కొత్త కవిత్వంలో పద చిత్రాల అనుభూతి చేరకా, నలిగిపోయే వాళ్ళలో నేనొకణ్ణి.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] గరికపాటి పవన్ కుమార్ కవితా సంపుటి, “ఆ సాయంత్రం,” కి తమ్మినేని యదుకుల భూషణ్ రాసిన ముందుమాట, “ఒక్క క్షణం …” నుండి. 2003.

  2. సువర్ణభూమిలో … గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    12/06/2008 11:12 am

    దృశ్యానుభూతి కవిత్వ లక్షణాల గురించి ఒక వ్యాసంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఇలా అంటారు:

    “దృశ్యంలోకి అనుభవం, అనుభవంలోకి దృశ్యమూ పరావర్తనమయ్యే విశిష్ట గుణం అనుభూతి కవిత్వానికి మూలం. నువ్వు చెప్పేదేదయినా నీ అనుభవంలోంచి పలకడమే ఇక్కడ ప్రాధమిక సూత్రం. కవి అనుభవానికే కాదు, పాఠకుల అనుభూతిక్కూడా ప్రాధాన్యత ఉన్నప్పుడే అది నిలబడుతుంది. అస్పష్టం గా ఉన్న అనుభవం ఇంకొకరి అనుభూతిలోకి ప్రసరించదు.

    ఈ కవితలో ప్రధాన లోపం స్పష్టత. అనుభవమే కనిపిస్తోంది – అనుభూతి మాత్రం శూన్యం.

    -సాయి బ్రహ్మానందం

  3. సువర్ణభూమిలో … గురించి baabjeelu అభిప్రాయం:

    12/06/2008 7:46 am

    ఇప్పటిదాకా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రాసేరు ఈ కవిత మీద.
    ఆరి సీతారామయ్యగారి వ్యాఖ్య చదివేక మరీ విడ్డూరంగా వుంది.
    మొదట్లో మూలా వారు “ఆరో ఖండిక” అద్భుతం అన్నారు. ఆతరవాత నానాజాతి సమితీ చేతికొచ్చినట్టూ రాసేరు. మధ్యలో “గురుతుల్యులు” అలాక్కాదిలాగ, ఇలాక్కాదలాగ అని అందర్నీ దార్లో పెట్టడానికి నానా ప్రయాసా పడ్డారు. ఇప్పుడు ఆరి వారు “ఆరో ఖండిక” ఈ కవితని గొప్ప కవిత కాకుండా అడ్డీసిందని బాధ పడ్డారు.
    మహన్నభావుల్లారా!మీకందరికీ జవాబు తెలుసు. తెలిసీ చెప్పకపోతే మా(సాధారణ పాఠకుల) తలలు వేయి వ్రక్కలైపోతాయి.

    నాగులపల్లి శ్రీనివాస్ గారికి,
    మీ అంత చక్కగా, నిష్కర్షగా, నిస్సంకోచంగా, నిర్భయంగా,నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా అభిప్రాయాలు రాసేవాళ్ళని ఇంతవరకూ నేను చూళ్ళేదు. ధన్యోస్మి.

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    12/06/2008 5:43 am

    ఉపేంద్ర గారూ:

    నాగమురళి గారి వ్యాసం పై మీ అభిప్రాయాన్ని చూసాను. ముఖ్యంగా కవలలపై మీరు ఇచ్చిన లింకు చూసాను. అది చదివి నేను కొంచెం ఆశ్చర్యపోయి, ఆలోచనలో పడ్డాను. ఈ లింకులో ఇచ్చిన వివరాలపై నాగమురళి గారి అభిప్రాయం ఏమిటో!

    కవలల జాతకాల్లో తేడాలు గురించి చర్చలు చూసాను. ఒకే రకంగా ఉన్న కవలల జాతకాలు ఎక్కడన్నా ఉన్నాయా?

    మొత్తం మీద ఈ వ్యాసాలు వాటి పై అభిప్రాయాలు బాగున్నాయి.

    అభినందనలతో,

    లక్ష్మన్న

  5. మీరు కవిత్వం ఎందుకు రాస్తారు? గురించి k sekhar అభిప్రాయం:

    12/06/2008 12:02 am

    ముఖ్యంగా ఈమాట సంపాదకులకు నమస్కారాలు. చాలా, చాలా బాగుంది, చాలా కొత్త విషయాలు తెలిసాయి.

  6. కవిత్వం చేసే పని మనస్సులో దీపం వెలిగించడమే గురించి k sekhar అభిప్రాయం:

    12/05/2008 11:45 pm

    చాలా బాగుంది. ఇంకా ఉండి వుంటే బాగుండేది అనిపించింది.

  7. తెలుగు కథల పోటీ గురించి సుజాత అభిప్రాయం:

    12/05/2008 1:37 am

    ఆశాజీవి గారి ఆవేదన, బ్రహ్మానందం గారి వివరణ, రెండూ బాగున్నాయి.

  8. సువర్ణభూమిలో … గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    12/04/2008 11:39 pm

    ఆరి గారు
    కళ్ళకు కట్టినట్లు చెప్పారు. చూసింది రాయడం వేరు. కనపడేలా చూపించే రాయడం వేరు.

    I do not know why, but this brings to my mind words of Vivekananda when some one was very enthusiastic to show him wonderful sights and sceneries in West. His response,
    “Do not show me sights. I have seen the Himalayas! I would not go ten steps to see sights; but I would go a thousand miles to see a
    (true) human being.”
    ———-
    Regards
    -Srinivas

  9. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Upendra అభిప్రాయం:

    12/03/2008 10:54 pm

    నాగ మురళీ గారు,
    మీ వ్యాసం ఆసాంతము చదివాను. చాలా బాగుంది.

    కాని నాకు తోచిన విషయాలను చెప్పాలనే అత్యుత్సాహాన్ని మన్నిస్తారని ఆశిస్తూ

    1) చాలా మంది జ్యోతిష్యులు కేవలం రాశి, నవాంశ చక్రాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. కాని రాశి చక్రము లోని లగ్నము దాదాపు 2 గం|| , మరియు నవాంశ లగ్నము 13 ని|| పాటు మారకుండా స్ఠిరము గా ఉంటాయి. బృహత్ పరాశర హోరా శాస్త్రము లో వివిధ అంశ చక్రముల ప్రస్తావన మరియు ఏ ఏ సమయములలో ఏ చక్రమును ఉపయోగించాలి అని వివరణ ఉంది. ఆ అంశ చక్రాలలో నాఢ్యంశ ( 30 డిగ్రీలను 150 భాగాలు గా చేసి ఈ చక్రమును తయారు చేస్తారు) చక్రము ఒకటి. ఈ చక్రము లోని లగ్నము 1 ని|| కన్నా తక్కువ వ్యవధి లో మారిపోతుంది.

    నాకు తెలిసి ఈ ప్రపంచములో జాతకములను నాఢ్యంశ స్థాయి లో పరిశీలించేవారిని వేళ్ళ మీద లెక్కించవచ్చేమో?

    కవలల జాతకములను ఏ విధము గా పరిశీలించాలో ఈ వ్యాసం లో ఇచ్చారు http://www.vedicastrologer.org/050200.htm

    మరోసారి కలిసినప్పుడు మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం.

    ధన్యవాదములతో
    -మీ ఉపేంద్ర

  10. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    12/03/2008 9:04 pm

    కామేశ్వరరావు గారికి,

    సోదాహరణంగా విపులీకరించినందుకు థాంక్స్. నా శీర్షిక మో “పోలికలు” కవితని ఉద్దేశించి, సరదాగా పెట్టింది. పాత కవిత్వంతో పోల్చడానికి కాదు.

    వినీల్, శ్రీనివాస్ గార్లని ఉద్దేశించి మీరు రాసిన అభిప్రాయంలో, తనకర్థం కాని కవితని విమర్శించే హక్కు పాఠకుడికి లేదన్నారు. నా ఉద్దేశంలో పాఠకుడికి విమర్శించే హక్కు ఎప్పుడూ ఉండాలి, అర్థం కావడం లేదన్నదీ ఓ విమర్శే. కవిత్వం లో సత్తా ఉంటే ఆ విమర్శల ధాటికి నిలుస్తుంది.

    భూషణ్ గారికి,

    నేను ప్రస్తావించిన పొరబాట్లు ఎవరివల్ల జరిగినా చివరకి రచయితే బాధ్యుడు. నాకు ఇస్మాయిల్ వ్యక్తిగతంగా తెలియకపోయినా, ఈమధ్య ఆయన రచనలని చదివి, వాటితో పూర్తి అంగీకారం లేకపోయినా, ఉన్నత వ్యక్తిత్వం కలవాడన్న భావన కలిగింది. ఒక్క పొరబాటు మూలాన ఆయన మీద ఉన్న నా అభిప్రాయం మారదు.

    మో గురించి కూడా ఒక విషయం. “నిరాకారుడు” ఆయన మొదటి సంపుటి, “చితి-చింత” లోనిది. తరవాత వచ్చిన “రహస్తంత్రి” లో చాలా చోట్ల పాశ్చాత్య కవుల ప్రేరణ సూచిస్తాడు.

    కొడవళ్ళ హనుమంతరావు