పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Rohiniprasad అభిప్రాయం:

    12/23/2008 9:15 am

    ఈమని శంకరశాస్త్రిగారి గురించి మంచి వ్యాసం “ వైణిక సశాస్త్రీయం – శంకర నాద తరంగం

  2. అసమర్థులు గురించి J.ANJANEYULU అభిప్రాయం:

    12/23/2008 4:42 am

    మీ కథ చదువుతుంటే క్రమ శిక్షణ పేరు తో ఎంత మంది పిల్లలు ఇలాగ బాల్యంలో నలిగి పోతున్నారో కదా! అని చాలా బాధ వేసింది. చాలామంది అనుభవించిన ఈ సంఘర్షణని గుర్తుకు తెచ్చారు. మా పెద్దల కి ఎదురు చెప్పలేక నా భావాలను అణచుకొని సర్దుకు పోతున్న నా జీవితంతో పోల్చుకున్నాను.
    జమిలి ఆంజనేయులు,
    ఊర్మిళా నగరు, విజయవాడ-12

  3. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు గురించి rama అభిప్రాయం:

    12/23/2008 3:43 am

    హాయిగా డబ్బు సంపాదించకోడానికి వాళ్ళూ అంత చెత్త రాసి..దాన్నంతా సమాజం మీద రుద్ది ..అందులో భాగం అయి..ఇవాళ వేటూరికి ఈ అక్కర్లేని బాధ…ఈ ఘోష ఎందుకో..పాపం.

    రమ.

  4. తెలుగు భాష వయస్సెంత? గురించి Darla అభిప్రాయం:

    12/22/2008 8:59 pm

    మీ వ్యాసం చదివాను. బాగుంది. కానీ, “భారతదేశంలో ఆర్య, ద్రావిడ అని రెండు విభిన్నమైన జాతులు లేవన్న శాస్త్రజ్ఞుల అభిప్రాయాలని ధ్రువపరుస్తున్నవి ” అనే మీ వ్యాఖ్య తర్వాత వ్యాసంలో మరింత వివరిస్తే బాగుండేది. అభినందనలు.
    మీ,
    దార్ల

  5. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    12/22/2008 6:59 pm

    చెప్పడం మరిచాను. లూషన్ అంటే Lu Xun.

  6. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    12/22/2008 5:21 pm

    “లూషన్ చెప్పింది అక్షరలక్షలు కదా?”

    ఫెమినిజం ప్రస్తావనలో బాబ్జీలు గారన్న పై మాటలు నన్ను కొన్నాళ్ళు వెంటాడాయి – ఎవరీ లూషన్, ఏమా కథ? అని. Lution, Lotion, Lushan, లాంటి పేర్లతో ప్రయత్నించాను గాని ఫలితం లేదు..

    నాలుగయిదు రోజులుగా అమితమైన చలి మూలాన ఇంట్లో బందీనై, పుస్తకాలు తిరగేస్తుంటే, గుడిపాటి కిటికీ (సాహితీమూర్తుల తేజోరేఖలు) కనిపించింది. దాంట్లోని ఒక వ్యాసం, “చైనా అంతరాత్మ లూషన్”! హమ్మయ్య అనుకున్నాను.

    “సాహిత్యకారులకు చైనా పేరు చెప్పగానే లూషన్ స్ఫురణకొస్తారు. లూషన్ రచనలని చాలావరకు తెలుగులో చదువుకున్నాం. మనకు రష్యన్ సాహిత్యం తర్వాత విస్తృతంగా తెలుగులోకి అనువాదమైంది చైనా సాహిత్యం.”

    అన్న ప్రారంభం చదివి, కనీసం పేరయినా తెలియనందుకు సిగ్గేసిందనుకోండి. ఈ లూషన్ చైనాలో బాగా పేరున్నవాడట. ఇబ్సెన్ నాటకం, A Dollhouse వచ్చిన తర్వాత సంచలనమైన వ్యాసం, “What will Happen after Nora Leaves Home?” రాశాడట.

    ఇక్కడ ఆయన రచనలు అంత సులభంగా దొరికేటట్లు లేవు. విజయవాడలో జరగబోయే పుస్తకాల పండగలో దొరుకుతాయేమో చూడాలి. బాబ్జీలు గారికి కృతజ్ఞతలతొ,

    కొడవళ్ళ హనుమంతరావు

  7. తెలుగు భాష వయస్సెంత? గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    12/22/2008 5:12 pm

    రమగారు: మీరు చెప్పిందే కరెక్టు. “శూరుల జన్మంబు …” మహాభారతపు ఆదిపర్వంలోని ఆరవ ఆశ్వాసంలో అరవయ్యొవ పద్యం — కర్ణుడికి అంగరాజ్యాభిషేకం చేసే సమయంలో దుర్యోధనుని సమర్థింపు (DVSK సినిమాలో కూడా ఇలాంటి డైలాగే విన్నట్టు గుర్తు). దీనికి మూలం “శూరాణాంచ నదీనాంచ దుర్విదాః ప్రభవాః కిల”(ట). నేను పల్నాటి వీర చరిత్రలో చూసింది ఇలాంటిదే ఇంకో పద్యమైయుంటుంది. ఇటువంటి సామెతే మరాఠిలో ఉంది: “ఋషిచే కూళ్ ఆణి నదీచే మూళ్ శోధూ నయే”. మరాఠిలో లాగే తమిళంలో కూడా వినిపించే సామెత “ఋషి మూలం, నదిమూలం అరయక్కూడాదు/కేక్కకూడాదు”. విచారించి చూస్తే, “ఋషి మూలం, నదిమూలం న విచార్యమ్” అన్న సంస్కృత శ్లోకం ఈ సామెతలన్నింటికీ మూలమైయుండొచ్చని తోస్తోంది.

  8. తెలుగు భాష వయస్సెంత? గురించి rama అభిప్రాయం:

    12/22/2008 6:15 am

    సురేష్ గారు, “శూరుల జన్మంబు…” నన్నయగారి పద్యం. రమ.

  9. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు గురించి Sairamraju అభిప్రాయం:

    12/22/2008 5:23 am

    ఈనాటి సంగీత సాహిత్యాల గురించి వేటూరిగారు చెప్పిన విషయాలు కొంతవరకు నిజమే. కానీ, పంచభర్తృకలై కవులు పాటలెందుకు వ్రాయాలి? అసలు దర్శకుడు పాట ఏ సందర్భంగా కావాలో చెప్పకపొతే రచయిత ఏమి వ్రాస్తాడు? సంగీత దర్శకుడు ఏ స్వరాలు కూరుస్తాడు? గాయకుడేమి పాడుతాడు? నిర్మాత, దర్శకుల బావమరుదులు చెప్పటమేమిటి వీరు వ్రాయడమేమిటి? ఉన్నత శిఖరాలు అధిరోహించిన కవులు తమ ఔన్నత్యాన్ని తగ్గించుకొని ఎందుకు వ్రాయడం?

  10. తెలుగు కథల పోటీ గురించి Sairamraju అభిప్రాయం:

    12/22/2008 4:39 am

    తెలుగులో మంచి కథలు ఈమధ్య చాలా తక్కువగా వస్తున్నై. అందుకు కారణం కథకులలో సమకాలీన సమస్యలపట్ల సరియైన అవగహన లేకపొవటమే. అంతేగాక భాషమీద కూదా పట్టు ఉండడంల లేదు. ఉన్నవారికి తీరిక ఉండదు.