“పొరపాటున రెండు ఈగలు గనక ఒకేసారి లోపలికొస్తే, అటునించి ఇటు, ఇటునించి అటూ స్వేచ్చగా ఎగరడానికి కూడా స్థలం చాలదు. ఎదురుబొదురు గోడలకి తలకాయలు కొట్టుకొని వాటంతట అవ్వే చస్తాయి. మన ప్రమేయం అనవసరం.”
– :)) Good one!
కథ బాగుంది. I enjoyed reading it.
ఈ వ్యాసంపై తమ అభిప్రాయాలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు.
నేను “సాగరసంగమం” సినిమా పై సంధించిన ప్రశ్నకి సరైన సమాధానమే ఇచ్చారు. ఘంటసాల పాడిన “పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై…” అన్న పద్యం కూడా హంసానంది (దగ్గరగా సోహిని) రాగానికి చెందిందే!
నేను సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోలేదు అన్న విషయం మళ్ళీ మనవి చేసుకోక తప్పదు. సంగీతం కొత్తగా నేర్చుకొనే వారికై ఈమాట పాత సంచికల్లో కొన్ని పరిచయ వ్యాసాలున్నాయి. పాఠకులకి వచ్చే సందేహాలని అన్నీ ఈమాట అభిప్రాయ వేదిక ద్వారా తీర్చటం సాధ్యం కాదేమో! పైగా ఇది ఇతర పాఠక-శ్రోతలకి విసుగ్గా ఉండొచ్చు!
అందుకని నాతో ప్రత్యేకంగా అడిగి తెలుసుకొందామనుకున్న వారు నన్ను నా ఈమైల్ ద్వారా సంప్రదించండి. Lark_Vishnubhotla@yahoo.com
ఇప్పటికీ, ఎప్పటికీ అన్ని విషయాల్లోలాగే సంగీతంలో కూడా “సాధన” అతి ముఖ్యమైన విషయం. సంగీతంలో “దైవదత్తం” అంశం ఉండొచ్చు. కానీ, అది మన చేతుల్లో లేదుగా! అందుకే మన అధీనంలో ఉన్న “పరిశ్రమ” సంగీతంలో అతి ముఖ్యమైనది.
ఈమాట పాఠక-శ్రోతల కోసం వచ్చే సంచికల్లో మరికొన్ని వ్యాసాలు రాసే ప్రయత్నం చేస్తాను.
వేలూరి కథ చదివి ఉల్లసించిన వారు – మాలతి రాసిన కథ “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” గాని చదివితే మళ్ళీ రంజిస్తారు. నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం నెట్ లో ఉంది. మొదటగా 1987లో, ఆంధ్రప్రభ వార పత్రికలో వేశారట.ఆ కథ చదివి చాలా బాగుంది. శభాష్! అనుకున్నాక, మాలతి పుస్తకం –
“Telugu Women Writers 1950 -1975” -వెంటనే నా బుక్ షెల్ఫ్ నుండి బైటకు లాగాను.
వివరాలు కావాలంటే రచనలు చేసిన వారే సరిగ్గా చెపుతారు కదా.
కథని అర్థం చేసుకునే శక్తి నాకు లేదో ఏమో తెలియదు కానీ, — మొదటిసారి చదివితే నాకు ఈ కథ ఏమీ అర్థం కాలేదండీ. అర్థం కాలేదు కదా అని — రెండవసారి చదవడం ప్రారంభించాను. అలా మొదలుపెట్టగానే కథలోని మొదటి వాక్యం నన్ను వెక్కిరించినట్టు అనిపించి ఠక్కున ఆపేసాను. 🙁
నేను కూడా చాలాకాలం కథకి సన్నివేశాలూ, సంఘర్షణలూ, గట్రా వుంటాయన్న ఉద్దేశ్యంతోనే వ్యాఖ్యలు చేస్తూ వచ్చేను కానీ ఈమధ్య మాత్రం అది న్యాయం కాదనిపిస్తోంది నాకు. ముఖ్యంగా ఈరోజుల్లో కథలు అవునా కాదా అనిపించేవి చాలా వస్తున్నాయి. వాటిని చదివి ఆనందించే పాఠకులూ వుంటున్నారు.
వేలూరికథ చదివినప్పుడు నాకు రెండు కథలు గుర్తొచ్చాయి. Samuel Becket రాసిన Waiting for Godot, అదే నమూనాలో వివిన మూర్తిగారు రాసిన భగవంతునికోసం. ఇలాటిరచనల్లో పాఠకుడిని పట్టి ఊపేసే కథ వుండదు కనక కథనం -చెప్పేతీరు – బలంగా వుండాలి, ఈకథ నాకు ఎక్కడా విసుగనిపించలేదు. ఒకటి రెండు చోట్ల హాస్యం, చమత్కారం కూడా చోటు చేసుకున్నాయి.
పైన చెప్పిన రెండుకథల్లోనూ కేవలం ఒకపూట ఒకమనిషి ఆలోచనలు నమోదు చేయడమే రచయితలు చేసినపని. చెప్పుకోదగ్గ “కథ” ఏమీ లేదు, వేలూరివారిరచనలో కొంతవరకూ కథ వుంది.
సుందరం అనే ఒక ఉద్యోగిజీవితంలో ఒక సాయంసంధ్యవేళ. ఇందులో రెండు సన్నివేశాలున్నాయి. సుపూరఉత్తరాలు చదువుతున్నప్పటి గల్టీ ఫీలింగ్ అతను ఆమెతో పెట్టుకున్న అక్రమసంబంధంతాలూకు గిల్ట్ కావచ్చు. అవి చదువుతూ, తనని తాను సమర్థించుకోడం తన అక్రమసంబంధాన్ని సమర్థించుకుంటున్నట్టు కనిపిస్తుంది.
సుందరానికి భార్య అంటే గౌరవంలేదు. జాలో, హేళనో మరేదో కానీ గౌరవం మాత్రం లేదు.
శీర్షిక మాటకొస్తే, ప్రాచుర్యంలో వున్న అందాలమాట పక్కన పెట్టి చూడండి. ఒకరోజులో సాయంసంధ్య పగటినించి రాత్రివేపు నడిపించేది. సుందరానికి రెండుసంబంధాలలోనూ ఎదురయింది చీకటే. సుపూరా తాళం ఎక్కడుందో చెప్పి తనసుముఖతని వెల్లడించినా అతనికోసం ఇంట్లో ఎదురుచూస్తూ కూర్చోలేదు. తరవాతయినా రాలేదు! Red-eye flight తీసుకుని ఇంటికి వస్తే, ఇంట్లో సంధ్య లేదు. ఎలా చూసినా అతనికి మిగిలింది చీకటే, శూన్యం!
పీర్ రెవ్యూగురించిన సందేహం నాక్కూడా కలిగింది. ఈమాటవారు తమ అభిప్రాయాలని మరొకసారి రెవ్యూ చేసుకుంటున్నారు అనుకోవచ్చా?
లక్ష్మణ్ణ గారు ,
మీ వ్యాసమ్ చాలా బాగుంది, మొత్తం అంతా చదవగానే సంగీతం గురుంచి తెలుసుకోవాలని కుతూహలమ్ పెరిగిది. నాకు సంగీతం అంటీ బాగా ఇష్టం, శాస్త్రీయ సంగీతమ్ వినడమే కానీ ఇది యేమిటి అది యేమిటి అని పరి ప్రశ్నలకు సమాధానములు కనుక్కొవటమ్ చాలా కష్టము అనుకునేవాడిని, మీరు చెప్పినట్టు దానికి నిరంతరమైన కృషి ఉండాలి. నాకు తెలుసుకోవాలనే ఉంది కానీ తెలుసుకొనే ముందు సంగీతానికి సంబంధించిన ప్రాధమిక సూత్రాలు అర్ధమ్ చేసుకొవాలి. ఉ: పై మీ వ్యాసములొ నాకు తెలియని చాలా పదాలు “పంచమం, రుషభం,”. సంగీతమ్ లో అ,ఆ లు కూడా తెలియని నాలాంటి వారికి మీలాంటి వాళ్ళు మీకు తెలిసిన కొద్దో గొప్పో సంగీతమ్ కు సంబంధించిన ప్రాధమిక సూత్రాలు గురుంచి ఒక వ్యాసమ్ రాయవలసింది గా నా ప్రార్ధన.
నా ప్రార్ధనని మీరు మన్నగించగలరని ఒక ఆశతో,
ఇట్లు మీ భవధీయుడు
శివ
ఇక్కడ చర్చ పత్రికల మనుగడ. వెబ్ లో కొనక్కరలేకుండా “అప్పనంగా” దొరుకుతున్నప్పుడు పత్రికల్ని “కొని” ఎవరు చదువుతారని వాపోయిన వారు వేమూరి వారు. “అప్పనంగా” అన్నమాట free అన్న మాటకి దాదాపు సమానార్ధకమే అయినా విశాఖపట్ణం ప్రాంతంలో దాన్ని కాస్త ఉక్రోషంగానూ..కోపప్రకటన లోనూ ఉపయోగిస్తారు. ఈమాట వేమూరి వారు పత్రికల్ని కొని చదివి నిలబెట్టుకోని చందాలు కట్టని పత్రికల కృషిని గుర్తించని తెలుగుల పట్ల కోపప్రకటన గానే వాడేరు. ఆయన బాధ..లేదా కోపం నాకు అర్ధం అవుతాయి కూడా! అవి సమంజసమైనవేనని నేననుకుంటూనే..ఆ కోపానికి అటూ ఇటూ ఉన్న విషయాల్ని కూడా ఈ సందర్భంలో మరోసారి గుర్తు చేసాను. అంతేగానీ పత్రికలు ఇచ్చిన డబ్బుల్తోనే కవులూ రచయితలూ సంసారాలు చేస్తున్నారనీ కాదు. రేపు ఈ పత్రికలన్నీ ఆగిపోతే రాసేవాళ్ళ బతుకులు వీధిన పడిపోతాయనీ కాదు.
రాసే వారు లేందే..ఏ పత్రిక్కీ మనుగడ లేదు. అలా ఉంటుందని ఎవరైనా అన్నా..అనుకున్నా..అది వట్టి దబాయింపు..బుకాయింపు మాత్రమే!! పత్రికా నిర్వాహకులకందరికీ ఈ సంగతి బాగా తెలుసు. మాకు రచనల్తోనీ..రచయితల్తోనీ అవసరం లేదని ఏ పత్రికల్ వాళ్ళైనా అన గలరా?? అనలేరు. ఏనాడైనా రచయితలు పత్రికల మనుగడకి అంతే అవసరం. అదే రచయితలు[కొత్తకొత్తగా రాస్తున్న వారు తప్ప] డబ్బుల కోసం కాక పోతే పత్రిక్కి పంపనఖ్ఖర లేదు. బెంగాల్ లో రచయితల కోసం రచయితలే little magzines పేర చిన్న కరపత్రాల వంటివి న డిపిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. చాలా పెద్ద కవులు వాటిలోనే తమ కవిత్వాన్ని ప్రచురించారు. పత్రిక స్వభావాన్ని బట్టి దాని ఆశయాన్ని బట్టి..దాన్ని బతికించుకుందికి రచయితలే ముందుకొచ్చారు. ఇంక కొని చందాలు కట్టే పత్రిక ఉద్దేశ్యం బట్టీ..దాని పాఠక వర్గ స్వభావాన్ని బట్టీ అది ఎన్నాళ్ళు న డిచేదీ నిర్ణయమైపోతుంది మరి..
.రమ.
పడమట సంధ్యారాగం గురించి Sowmya అభిప్రాయం:
07/16/2009 2:36 am
“పొరపాటున రెండు ఈగలు గనక ఒకేసారి లోపలికొస్తే, అటునించి ఇటు, ఇటునించి అటూ స్వేచ్చగా ఎగరడానికి కూడా స్థలం చాలదు. ఎదురుబొదురు గోడలకి తలకాయలు కొట్టుకొని వాటంతట అవ్వే చస్తాయి. మన ప్రమేయం అనవసరం.”
– :)) Good one!
కథ బాగుంది. I enjoyed reading it.
పడమట సంధ్యారాగం గురించి మాలతి అభిప్రాయం:
07/15/2009 7:52 am
పైన నావ్యాఖ్యలో పొరపాటు. భగవంతునికోసం కథ రాసినవారు త్రిపురగారు. వివిన మూర్తిగారు కాదు. ఇద్దరు రచయితలకీ క్షమాపణలు. – మాలతి.
లైలా ఆ కథ 22 ఏళ్లక్రితం రాసేనని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు.
[కథ అసలు పేరు భగవంతం కోసం – సం.]
హాయిహాయిగా ఆమని సాగే గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
07/15/2009 7:00 am
ఈ వ్యాసంపై తమ అభిప్రాయాలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు.
నేను “సాగరసంగమం” సినిమా పై సంధించిన ప్రశ్నకి సరైన సమాధానమే ఇచ్చారు. ఘంటసాల పాడిన “పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై…” అన్న పద్యం కూడా హంసానంది (దగ్గరగా సోహిని) రాగానికి చెందిందే!
నేను సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోలేదు అన్న విషయం మళ్ళీ మనవి చేసుకోక తప్పదు. సంగీతం కొత్తగా నేర్చుకొనే వారికై ఈమాట పాత సంచికల్లో కొన్ని పరిచయ వ్యాసాలున్నాయి. పాఠకులకి వచ్చే సందేహాలని అన్నీ ఈమాట అభిప్రాయ వేదిక ద్వారా తీర్చటం సాధ్యం కాదేమో! పైగా ఇది ఇతర పాఠక-శ్రోతలకి విసుగ్గా ఉండొచ్చు!
అందుకని నాతో ప్రత్యేకంగా అడిగి తెలుసుకొందామనుకున్న వారు నన్ను నా ఈమైల్ ద్వారా సంప్రదించండి. Lark_Vishnubhotla@yahoo.com
ఇప్పటికీ, ఎప్పటికీ అన్ని విషయాల్లోలాగే సంగీతంలో కూడా “సాధన” అతి ముఖ్యమైన విషయం. సంగీతంలో “దైవదత్తం” అంశం ఉండొచ్చు. కానీ, అది మన చేతుల్లో లేదుగా! అందుకే మన అధీనంలో ఉన్న “పరిశ్రమ” సంగీతంలో అతి ముఖ్యమైనది.
ఈమాట పాఠక-శ్రోతల కోసం వచ్చే సంచికల్లో మరికొన్ని వ్యాసాలు రాసే ప్రయత్నం చేస్తాను.
అభినందనలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
గోవిందా! గోవిందా! గురించి raji అభిప్రాయం:
07/15/2009 6:46 am
కథ చాలా బాగుంది, తిరుపతి అనుభవం అంతా కళ్ళకు కట్టినట్టు రాసారు. చాలా బాగుంది.
పడమట సంధ్యారాగం గురించి lyla yerneni అభిప్రాయం:
07/15/2009 6:12 am
ఒకరోజులో సాయంసంధ్య పగటినించి రాత్రివేపు నడిపించేది. సుందరానికి రెండుసంబంధాలలోనూ ఎదురయింది చీకటే. -మాలతి అభిప్రాయం
సుందరానికి “కుడి ఎడమల కుసుమ పరాగం” దొరకలేదంటారు. 🙂
వేలూరి కథ చదివి ఉల్లసించిన వారు – మాలతి రాసిన కథ “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” గాని చదివితే మళ్ళీ రంజిస్తారు. నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం నెట్ లో ఉంది. మొదటగా 1987లో, ఆంధ్రప్రభ వార పత్రికలో వేశారట.ఆ కథ చదివి చాలా బాగుంది. శభాష్! అనుకున్నాక, మాలతి పుస్తకం –
“Telugu Women Writers 1950 -1975” -వెంటనే నా బుక్ షెల్ఫ్ నుండి బైటకు లాగాను.
వివరాలు కావాలంటే రచనలు చేసిన వారే సరిగ్గా చెపుతారు కదా.
లైలా
ఈ కానుకనివ్వలేను గురించి రాఘవ అభిప్రాయం:
07/15/2009 5:20 am
కథ ఈ మధ్య బాగా వినవస్తున్న సమస్య గురించినది కావడం, సహాయం చేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లకి కూడా నొచ్చుకోలు ఉంటుందని చెప్పడం… బావుందండీ. అభినందనలు.
పడమట సంధ్యారాగం గురించి రాఘవ అభిప్రాయం:
07/15/2009 2:55 am
కథని అర్థం చేసుకునే శక్తి నాకు లేదో ఏమో తెలియదు కానీ, — మొదటిసారి చదివితే నాకు ఈ కథ ఏమీ అర్థం కాలేదండీ. అర్థం కాలేదు కదా అని — రెండవసారి చదవడం ప్రారంభించాను. అలా మొదలుపెట్టగానే కథలోని మొదటి వాక్యం నన్ను వెక్కిరించినట్టు అనిపించి ఠక్కున ఆపేసాను. 🙁
ఎవరైనా కాస్త ఉప్పందించి సహాయం చేయగలరని ఆశిస్తూ…
పడమట సంధ్యారాగం గురించి మాలతి అభిప్రాయం:
07/15/2009 2:51 am
నేను కూడా చాలాకాలం కథకి సన్నివేశాలూ, సంఘర్షణలూ, గట్రా వుంటాయన్న ఉద్దేశ్యంతోనే వ్యాఖ్యలు చేస్తూ వచ్చేను కానీ ఈమధ్య మాత్రం అది న్యాయం కాదనిపిస్తోంది నాకు. ముఖ్యంగా ఈరోజుల్లో కథలు అవునా కాదా అనిపించేవి చాలా వస్తున్నాయి. వాటిని చదివి ఆనందించే పాఠకులూ వుంటున్నారు.
వేలూరికథ చదివినప్పుడు నాకు రెండు కథలు గుర్తొచ్చాయి. Samuel Becket రాసిన Waiting for Godot, అదే నమూనాలో వివిన మూర్తిగారు రాసిన భగవంతునికోసం. ఇలాటిరచనల్లో పాఠకుడిని పట్టి ఊపేసే కథ వుండదు కనక కథనం -చెప్పేతీరు – బలంగా వుండాలి, ఈకథ నాకు ఎక్కడా విసుగనిపించలేదు. ఒకటి రెండు చోట్ల హాస్యం, చమత్కారం కూడా చోటు చేసుకున్నాయి.
పైన చెప్పిన రెండుకథల్లోనూ కేవలం ఒకపూట ఒకమనిషి ఆలోచనలు నమోదు చేయడమే రచయితలు చేసినపని. చెప్పుకోదగ్గ “కథ” ఏమీ లేదు, వేలూరివారిరచనలో కొంతవరకూ కథ వుంది.
సుందరం అనే ఒక ఉద్యోగిజీవితంలో ఒక సాయంసంధ్యవేళ. ఇందులో రెండు సన్నివేశాలున్నాయి. సుపూరఉత్తరాలు చదువుతున్నప్పటి గల్టీ ఫీలింగ్ అతను ఆమెతో పెట్టుకున్న అక్రమసంబంధంతాలూకు గిల్ట్ కావచ్చు. అవి చదువుతూ, తనని తాను సమర్థించుకోడం తన అక్రమసంబంధాన్ని సమర్థించుకుంటున్నట్టు కనిపిస్తుంది.
సుందరానికి భార్య అంటే గౌరవంలేదు. జాలో, హేళనో మరేదో కానీ గౌరవం మాత్రం లేదు.
శీర్షిక మాటకొస్తే, ప్రాచుర్యంలో వున్న అందాలమాట పక్కన పెట్టి చూడండి. ఒకరోజులో సాయంసంధ్య పగటినించి రాత్రివేపు నడిపించేది. సుందరానికి రెండుసంబంధాలలోనూ ఎదురయింది చీకటే. సుపూరా తాళం ఎక్కడుందో చెప్పి తనసుముఖతని వెల్లడించినా అతనికోసం ఇంట్లో ఎదురుచూస్తూ కూర్చోలేదు. తరవాతయినా రాలేదు! Red-eye flight తీసుకుని ఇంటికి వస్తే, ఇంట్లో సంధ్య లేదు. ఎలా చూసినా అతనికి మిగిలింది చీకటే, శూన్యం!
పీర్ రెవ్యూగురించిన సందేహం నాక్కూడా కలిగింది. ఈమాటవారు తమ అభిప్రాయాలని మరొకసారి రెవ్యూ చేసుకుంటున్నారు అనుకోవచ్చా?
హాయిహాయిగా ఆమని సాగే గురించి SIVASANKAR AYYALASOMAYAJULA అభిప్రాయం:
07/14/2009 12:20 pm
లక్ష్మణ్ణ గారు ,
మీ వ్యాసమ్ చాలా బాగుంది, మొత్తం అంతా చదవగానే సంగీతం గురుంచి తెలుసుకోవాలని కుతూహలమ్ పెరిగిది. నాకు సంగీతం అంటీ బాగా ఇష్టం, శాస్త్రీయ సంగీతమ్ వినడమే కానీ ఇది యేమిటి అది యేమిటి అని పరి ప్రశ్నలకు సమాధానములు కనుక్కొవటమ్ చాలా కష్టము అనుకునేవాడిని, మీరు చెప్పినట్టు దానికి నిరంతరమైన కృషి ఉండాలి. నాకు తెలుసుకోవాలనే ఉంది కానీ తెలుసుకొనే ముందు సంగీతానికి సంబంధించిన ప్రాధమిక సూత్రాలు అర్ధమ్ చేసుకొవాలి. ఉ: పై మీ వ్యాసములొ నాకు తెలియని చాలా పదాలు “పంచమం, రుషభం,”. సంగీతమ్ లో అ,ఆ లు కూడా తెలియని నాలాంటి వారికి మీలాంటి వాళ్ళు మీకు తెలిసిన కొద్దో గొప్పో సంగీతమ్ కు సంబంధించిన ప్రాధమిక సూత్రాలు గురుంచి ఒక వ్యాసమ్ రాయవలసింది గా నా ప్రార్ధన.
నా ప్రార్ధనని మీరు మన్నగించగలరని ఒక ఆశతో,
ఇట్లు మీ భవధీయుడు
శివ
అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి rama bharadwaj అభిప్రాయం:
07/13/2009 11:17 pm