పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. “చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/18/2009 9:14 pm

    http://eenadu.net/htm/2vnewfeatureshow.asp?qry=2&reccount=14
    దాసరి సుబ్రహ్మణ్యంగారి గురించిన వివరాలకు పై లింక్ చూడండి.

  2. హాయిహాయిగా ఆమని సాగే గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/17/2009 8:44 am

    ఆదినారాయణరావుగారు ‘మానసికంగా’ హిందూస్తానీ సంగీతజ్ఞుడే. ఈ పాటలో కర్నాటక రాగాలుగాని, వాటి పోకడలుగాని వినబడే అవకాశమే లేదు. ఘంటసాల స్వరపరిచిన లలితభావ నిలయా (రహస్యం) వంటి పాటల్లో మనకు సంప్రదాయ దక్షిణాది రాగాలన్నీ అద్భుతంగా వినిపిస్తాయి.

  3. హాయిహాయిగా ఆమని సాగే గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/17/2009 8:10 am

    నచకి గారూ:

    వ్యాసంలో ఇచ్చిన వివరాలు + రోహిణీ ప్రసాద్ గారు ఇచ్చిన సమాచారం చూస్తే సోహిని రాగానికి దగ్గరగా కర్ణాటక సంగీతంలో ఉన్న హంసానంది రాగానికి మధ్య ఉన్న పోలికలు, తేడాలు తెలుస్తాయి. అందుకే పాట ఎత్తుగడలోనే తారస్థాయిలో “సా, ధనీ, ధమధ…” స్వరాలతో మొదలవుతుంది. ఇటువంటి treatment కర్ణాటక రాగాల్లో కనపడదు.

    ఇక నాల్గవ చరణం యమన్ రాగంకి దగ్గరగా ఉన్న “కల్యాణి” రాగం గురించి ఈమాట పాత సంచికల్లో కాస్త వివరంగానే సమాచారం ఉది. ఇకపోతే బహార్, జోన్‌పూరి రాగాలకు నాకు తెలిసి దగ్గరగా ఉన్న కర్ణాటక రాగాలు లేవు. జాగ్రత్తగా గమనిస్తే “హాయి హాయిగా…” పాటకి “కుహూ కుహూ బోలే కోయలియా…” పాటకి treatment లో తేడాలు కనపడతాయి. తెలుగు పాట కన్న హిందీ పాటలో నాకు హిందూస్తానీ రాగచ్ఛాయలు ఎక్కువ కనపడతాయి. అందుకేనేమో కొంతమదికి హిందీ పాటే నచ్చుతుంది! మళ్ళీ జాగ్రత్తగా వింటే మీరూ గమనించగలరు.

    ఒక లింక్ లో ఇవ్వటం వల్ల పై వ్యాసంలో (నాల్గవ పేరా) పాట మొదలవుతూనే వచ్చే సంగీతం, చరణానికి – చరణానికి మధ్య ఉన్న సంగీతంలోని స్వరాలను కొంతమంది గమనించి ఉండరు. ఈ రాగాల “ఒడుపు” పట్టుకోవాలంటే ఈ స్వరాలను కూడా సాధన చెయ్యాలి.

    భారతీయ సంగీతంలో రెండు పెద్ద శాఖలైన హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలపై “Raganidhi -Comparative Study of Hindustani & Karnatak Ragas” by B.Subba Rao Published by Madra Music Academy ఒక గొప్ప పుస్తకం. అమెరికాలో పెద్ద గ్రంధాలయాల్లో ఈ పుస్తకం దొరుకుతుంది.

    అన్ని కర్ణాటక రాగాలకు సమానమైన హిందూస్తానీ రాగాలు కనపడవు. అలాగే అన్ని హిందూస్తానీ రాగాలకు సమానమైన కర్ణాటక రాగాలు కూడా కనపడవు. ఏ సంగీతం అయినా విని ఆనందిచగలిగే పరిచయం, కొంత ప్రవేశం ఉంటే మనం అదృష్టవంతులమే!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. హాయిహాయిగా ఆమని సాగే గురించి NaChaKi అభిప్రాయం:

    07/17/2009 5:37 am

    లక్ష్మన్న గారూ,

    నమస్కారం! మీ వ్యాసం వివరణాత్మకంగానే ఉన్నా కూడా ఈ ప్రశ్న అడుగుతున్నందుకు క్షమించాలి. కానీ, నేను మొదటి నుంచి మా ఇంట్లో విన్న ప్రకారం వసంత, కానడ తదితర రాగాలు కర్ణాటక సంగీతంలో కూడా సామాన్యంగా వాడే రాగాల పేర్లే విన్నాను ఈ పాట నిండా దాదాపు. మీరు ఇచ్చిన రాగాలకు సరిపోయే కర్ణాటక సంగీతపు రాగాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ… ఈ పాట పూర్తిగా హిందూస్థానీ రాగచ్ఛాయలలోనే సాగినదని కొత్తగా తెలిసేసరికి …కొత్తగానే ఉంది! 🙂 దయ చేసి నా సందేహం తీర్చగలరు ముందుగానే నెనర్లు.

    విధేయుడు,
    నచకి

  5. రాగమాలిక గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    07/16/2009 3:46 am

    “29వ సంపుటం” కామిశెట్టి శ్రీనివాసులు గారి వెబ్ సైట్ అన్నమయ్యపేటికలో దొరుకుతుంది (ఇవాళ ఎందుకో ఈ సైటు “తెరుచుకోవటం లేదు”)

    అన్నమయ్య గారిదే మరో రాగమాలిక ఉన్నదట – దశావతార సూళాది అని. ఈ సూళాది ఓ పెద్ద శిలా లేఖనమట. ప్రథమోపలబ్ధ స్వర సహిత సంకీర్తన శిలాలేఖము అనే పేరుతో TTD వారు ప్రచురించారు (www.archives.org లో PDF ప్రతి ఉపలబ్ధము)

  6. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి bandla madhavarao అభిప్రాయం:

    07/16/2009 3:07 am

    అఫ్సర్ భయ్యా మా నాన్న ను ఒక్క సారి గుర్తుకు తెచ్చావు. నిజమే మనకళ్ల ముందే ఎన్నో ప్రయాణాలు ఆగిపోతూనే ఉంటాయి. సాగిపోవడం తప్ప నేర్చుకోలేని వాళ్లం. కనీసం పదాలలోనైనా తలుచుకొని తలుచుకొని కదిలిపోయే అవకాశం కల్పించావు. కృతజ్నతలు.

  7. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి Sowmya అభిప్రాయం:

    07/16/2009 2:54 am

    వ్యాసం ఇంకా పూర్తిగా చదవలేదు కానీ, ఇక్కడ్ “ప్రార్థన”, “దేవుడు” కవితలకి లింకులు లేవు. అంటే, అవి మళ్ళీ ఆ పేజీకే వస్తున్నాయి. దేవుడు కవిత ఉన్నా ప్రార్థన ఈమాటలో ఉందో లేదో నాకు తెలీదు 🙂

    [కవితలకి లింకులు వేరే పేజీకి తీసికెళ్ళవు. కవితలు రెండూ హైస్లయిడ్ పాప్ అప్ విండోలలో తెరుచుకుంటాయి వ్యాసం ఉన్న పేజీలోనే. ఫైర్‌ఫాక్స్ లోనూ ఐ.ఈ. లోనూ ప్రయత్నించాము. లింకులు సరిగ్గానే పని చేస్తున్నాయి. మీరు ఇప్పడికీ చూడలేకపోతే మాకు తెలియజేయండి – సం. ]

  8. నిద్రిత నగరం వైదేహి ప్రపంచం గురించి Sowmya అభిప్రాయం:

    07/16/2009 2:50 am

    నాకు కూడా ఇందులోని కొన్ని కవితలు చాలా నచ్చాయి… “నిశబ్దం నీకూ నాకు మధ్య” ఐతే ఈమాటలో వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా బోలెడు సార్లు చదివా, చదువుతూనే ఉంటా…అలాగే, కొన్ని కవితలు చదువుతూ ఉంటే, ఎంత హాయిగా అనిపించిందో…అయితే, ఈ సంకలనం మరీ చిన్నది అనిపించింది నాకు….

  9. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Sowmya అభిప్రాయం:

    07/16/2009 2:48 am

    “అనగలనా..దిగులు లేదు…అని
    అలవాటు కాని చీకటిలో
    నిలబడి. ”
    -బాగుంది.

  10. ఈ కానుకనివ్వలేను గురించి Sowmya అభిప్రాయం:

    07/16/2009 2:45 am

    కథనం చాలా నచ్చింది నాకు.
    ఇంకా, అసలీ కాన్సెప్ట్ కూడా – ఆలోచింపజేసింది.
    ఈ కథను నా స్నేహితూలకి కూడా చదవమని చెప్తున్నాను…