పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి vaseera అభిప్రాయం:

    09/26/2009 2:45 am

    You have translated the mood too. That’s a great poem. Great translation.

  2. జమ్మిబంగారం చెట్టు గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    09/26/2009 1:53 am

    రామాయణంలోని పాత్రలు:
    విభీషణుడు రావణుని సహోదరుడు. రావణుని ప్రాణాధారము నాభిలో వుందన్న రహస్యాన్ని తెలిసిన వాడు. పరిస్థితులు, ధర్మాధర్మాలు ప్రక్కన పెట్టి “రావణునికి శత్రువైన రాముని శిబిరంలో విభీషణుడు చేరకుంటే” అని ఆలోచిస్తే రావణుడు ఓడిపోయే అవకాశాలు లేవు. రామాయణ కథ ముగింపు మరోలా వూహించలేము కదా!
    అలాగే మన జీవితాన్ని, జీవిత లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి సొంత రక్తసంబందీకులే శత్రుశిబిరంలోకి చేరి మన రహస్యాలను బయటపెట్టి మన బలహీనతలపై దెబ్బతీయవచ్చు.
    బైబిలులోని పాత్రలు :
    సంసోను దేవుని అనుగ్రహంతో బలవంతుడుగా పుడతాడు. అతని బలం అతనికి నిరంతరం వుండాలంటే తలవెంట్రుకలను కత్తిరించకూడదు, మరియు ఈ రహస్యాన్ని ఎవ్వరికి చెప్పకూడదు. సంసోను చేతిలో అనేక మార్లు అవమానం పొంది ఓడిపోయిన వారు ఎలాగైనా అతనిని హతమార్చాలని సమయంకోసం ఎదురుచూసారు. అందులో భాగంగా అతని బలహీనతలను కనిపెట్టి, అతనికున్న స్త్రీ వ్యామోహానికి ఎరగా “దెలీలా” అనే స్త్రీని నియమించారు. అతడు అమెను మోహించి ఆమె మత్తులో పడ్డాడు. ఆమె తొలిప్రయత్నంలోనే అతని రహస్యాన్ని తెలుసుకోలేకపోయినా, ప్రయత్నిస్తూ వచ్చి చివరకు తెలుకోగలిగింది.
    తన దేవరహస్యాన్ని పదే పదే అడుగుతున్నప్పుడు “ఇలా ఎందుకు అడుగుతుంది, ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు కదా” అని సంసోను అలోచించివుంటే ముగింపు వేరేలా వుండేది.
    అలాగే మన జీవితాన్ని, జీవిత లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి మన బలహీనతల ఆధారంగా శత్రుశిబిరంలోని వారు దగ్గరకుచేరి మన రహస్యాలను తెలిసికొని, మనబలహీనతలపై దెబ్బతీయడానికి నియమింపబడతారు.

    బైబిలులోని మరో పాత్ర:

    యేసుకువున్న పన్నెండుగురు శిష్యులలో ఇస్కరియోతు యూదా ఒకడు. యేసు తన బోధనలలో ఒక రాజ్యాన్ని స్థాపిస్థానని చెపుతూ వచ్చాడు. అలాంటి రాజ్యము వస్తే తనకు కలిగే హోదాగురించి ఎప్పుడు ఆలోచనతో వుండేవాడు యూదా.
    మత పెద్దలు యేసును బంధించాలని ఆలోచనలు చేస్తున్నప్పుడు, యేసు ఎక్కడవుంటాడో, చీకటిలో అతనిని గుర్తించగలిగే రహస్యం కాసులకొరకు ఆమ్మివేసాడు.
    నేను ఎవరినైతే ముద్దుపెట్టుకుంటానో అతడె యేసు అని వారికి ఒక సంకేతాన్ని ఇస్తాడు. బహుశ మనం ఇప్పటి కాలంలో మాట్లాడుకునే “కోవర్టు” పని చేసాడు.

    కాలం ఏదైనా ఇలాంటి వాళ్ళు ఎదురౌతారు.
    వారి పట్ల అప్రత్తమంగా వుండగలగటం, పాత ప్రతీకలనుండి కొత్తవిధానాలను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

  3. కెంధూళి గురించి Sowmya అభిప్రాయం:

    09/25/2009 9:57 pm

    బాగున్నది…కథా, అనువాదమూ. nice read…!

  4. మన ఛాందసులు గురించి jayaprabha అభిప్రాయం:

    09/25/2009 2:53 pm

    [ఈ పద్యం సరిచేసాము. జయప్రభ గారికి కృతజ్ఞతలు. –సంపాదకులు]

    శా.”సాక్షాత్కారము జెంది నవ్వుచు గిరీశానుండు ధాత్రీధరా
    ధ్యక్షాపత్యము బ్రేమ నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమన్
    వీక్షించెన్ దరళాక్షియున్ మనమునన్ వ్రీడా ప్రమోద క్షమా
    దాక్షిణ్యంబులు సందడింప నిలిచెన్ దత్సన్నిధానంబునన్ ”

    శ్రీనాధుని “హర విలాసం”..చతుర్ధాశ్వాసం లోని 36 వ పద్యం ఇదీ! శార్దూల వృత్తం లోది దీని పరిష్కర్త శ్రీ విశ్వనాధ సత్యనారాయణ. పై వ్యాసంలో ఉదాహృతమైన ఇదే పద్యం చాలా తప్పుల్తో ఉంది. సరిచేసుకోండి.

    సత్యనారాయణ గారు పీఠికా కర్త మాత్రమే! పరిష్కర్తలు బొమ్మకంటి సింగరాచార్య, బాలాంత్రపు నళినీ కాంతారావుగారలు. ఎమెస్కో ప్రతిని సిధ్ధంచేస్తూ వీరు తాము 1901 లొ వచ్చిన బాలసరస్వతి వారి పుస్తకం మొదలు, 1968 లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారి ప్రతి దాకా పరిశీలించి ఈ ఎమెస్కొ వారి ప్రతిని సిధ్ధం చేసినట్టుగా తమ ”పరిష్కర్ణము-పాఠనిర్ణయము” అనే ముందుమాటలో చెప్పారు. ఈ హరవిలాసానికి పీఠికని మాత్రం శ్రీ విశ్వనాధ రాసేరు.
    జయప్రభ.

  5. మన ఛాందసులు గురించి V. Rao Mangipudi అభిప్రాయం:

    09/25/2009 11:11 am

    we used to recite the slokams by Kalidasa every morning before the first class started when I was in the high school, some 60 years back. Since I did not recite them after my education, I forgot them, except for bits and pieces. Now, because of your hard work collecting and posting them here again I recollected them.

    Thank You.

  6. చలంతో రజని ముఖాముఖి గురించి రానారె అభిప్రాయం:

    09/24/2009 6:46 pm

    నమస్తే శ్రీనివాస్‌గారూ. ఈ నెలలోనే చలం రచనలు జెలసీ, శశిరేఖ చదివాను. మైదానం చదువుతున్నాను. చలం గురించి చాలా వినడమేగానీ ఆయన రచనలు చదవడం ఇదే మొదలు. సరిగ్గా ఈ సందర్భంలో ఈ సంభాషణ వినడంతో చాలా తృప్తిగా వుంది. అసహ్యించుకోవడం, వెర్రిగా కావలించుకోవడం రెండూ కూడా దుఃఖభాజనాలేననుకుంటా. నాకేమనిపిస్తోందంటే, శశిరేఖ నవలలోని నాయిక పడిన అవస్థలే (అంటే కష్టాలేనని కాదు) చలం కూడా తన జీవితంలో అనుభవించినాడని. ఆశ్రమజీవితంలో చలం మారిపోయినాడనీ, పశ్చాత్తాపం చెందినాడనీ కొందరూ, అదేంకాదని కొందరూ అనుకోవడం అక్కడక్కడా చదివాను. ఇప్పుడు ఆయన మాటల్లోనే వినే అవకాశం కలిగించినందుకు, మీకూ ఈమాటవారికీ కృతజ్ఞతలు.

  7. ఇండియన్‌ వేల్యూస్‌ గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    09/23/2009 11:55 pm

    చెప్పాలనుకున్నది రచయితకు ముందే తెలుసు. కాబట్టి కథ బాగున్నా, కూసింత “ప్రీచీ” గా అనిపించింది.

  8. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/23/2009 2:52 am

    ముందు రమ గారు, రవికిరణ్ గారు, పురాణాల, కవిత్వాల ప్రస్తావనపై లేవనెత్తిన అభ్యంతరాల గురించి ఓ రెండు మాటలు. విశ్వం గురించి మానవుడు అనాదిగా ఆలోచిస్తూ ఉండాలి. ఆ భావనలు కొన్ని పురాణ గాథల్లో, మత గ్రంథాల్లో ఏదో ఒక రూపంలో ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాటి పరిణామం గురించి రాసేటప్పుడు ఆ కథలని ప్రస్తావించడంలో తప్పు లేదు. వాస్తవానికి ఇది పాపులర్ సైన్సులో వాడుక కూడాను. కాల స్వరూపం గురించి రాస్తూ Hawking ఏమంటాడో చూడండి [1]:

    “In Newtonian theory, where time existed independently of anything else, one could ask: What did God do before He created the universe? As Saint Augustine said, one should not joke about this, as did a man who said, “He was preparing Hell for those who pry too deep.” It is a serious question that people have pondered down the ages. According to Saint Augustine, before God made heaven and earth, He did not make anything at all. In fact, this is very close to modern ideas.”

    అంత మాత్రాన Saint Augustine సైంటిస్టయిపోడనుకోండి. కాని చరిత్రా, చమత్కారమూ కలిస్తే సైన్సు మీద ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది.

    అదే పుస్తకంలో, విశ్వానికి అనేక చరిత్రలు, ఒక దానిలో మరొకటి ఇమిడి ఉన్నాయనే సిద్ధాంతాన్ని వివరించడానికి, Hamlet మాటలు వాడుకున్నాడు: “I could be bounded in a nutshell and count myself a king of infinite space.” ఆ అధ్యాయాన్ని ముగిస్తూ, “In this chapter we have seen how the behavior of the vast universe can be understood in terms of its history in imaginary time, which is a tiny, slightly flattened sphere. It’s like Hamlet’s nutshell, yet this nut encodes everything that happens in real time. So Hamlet was quite right. We could be bounded in a nutshell and still count ourselves kings of infinite space.”

    Shakespeare కి modern physics తెలుసని కాదు; భావాల్లో కొంత సారూప్యం ఉంది; మనసుకి హత్తుకునేట్లు కవులకి మించి మరెవరూ చెప్పలేరు కనుక వాళ్ళ భాష వాడుకోవడం మంచిదే. ఏమాటకామాటే చెప్పాలి, వేమూరి గారిచ్చిన మన పురాణాలలోని వివరాలు Hawking సోదాహరణాల్లా హత్తుకునేటట్లు లేవు.

    ఇక అసలు విషయానికొస్తే, సైన్సు విషయాలని ఆసక్తికరంగా చక్కటి తెలుగులో రాసేవారిలో చెప్పుకోదగ్గవారు వేమూరి. ఈ వ్యాస విషయం సైన్సు చదివిన వాళ్ళకి కూడా అంత సులభంగా కొరుకుడు పడేది కాదు. అంత క్లిష్టమైన దానిని వివరించడం మెచ్చుకోదగ్గ ప్రయత్నం. దానిపై ఇంకాస్త విపులంగా తీరిక దొరికినపుడు రాస్తాను.

    కొడవళ్ల హనుమంతరావు

    [1] “The Universe in a Nutshell,” by Stephen Hawking. Bantam Books, 2001.

  9. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి jayaprabha అభిప్రాయం:

    09/21/2009 3:31 pm

    కొడవళ్ళ హనుమంతరావు గారూ!! మీరు చెప్పేదాకా నేను అన్ని ఆశ్చర్యార్ధకాలని గమనించననే లేదు సుమా!! ఆ పుస్తకం అచ్చువేస్తున్నప్పుడు నా మీదున్న పనిభారం..ఒక ముఖ్యకారణం. తొందర..తొందరగా..హడావుడిగా పుస్తకమ్ తేవడం ఇంకో కారణం..నా శైలిలోని నేను కూడా గుర్తించని ఒక అలవాటు మరోకారణం….ఇలా అనేకం ఆ అచ్చువెన్క ఉన్నాయి మరి.ఆ పుస్తకమ్ ఎప్పుడైనా పునర్ముద్రించే వాళ్ళుంటే.. మీలాంటి వారెవరైనా తప్పులు దిద్దగల్గితే నామీద ఉన్న భారం తగ్గుతుంది. మీకు కల్గిన అసహనం సమంజసమైనదే! [చూసేరా మళ్ళీ ఆశ్చర్యార్ధకం:). ఇటుపైన నేనంటూ ఏమైనా రాస్తే [ఇది ప్రస్తుతానికి సందేహం నాకు]..మాత్రం మీకు కల్గిన “అసహనాల” వంటివి కల్గకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ప్రయత్నం అని ఎందుకంటున్నానంటే..మీలాంటి వాళ్ళు పుస్తకం చదివే అనుభవమ్ వైపునుంచే చూసే వీలుంది. తెలుగున పుస్తక ప్రచురణ [editor లు..ప్రూఫ్ రీడర్లూ లాంటి వాళ్ళ పనికూడా ఇక్కడ పుస్తకమ్ రాసిన వాళ్ళే చేయాలి గనక] చాలా కష్టతరమైన వ్యవహారం. అందునా ఒక అభిరుచితో పుస్తకం తేవాలని గనక ఆలోచిస్తే అది ఇంకా కష్టం. ఇక్కడ ప్రూఫ్ రీడర్స్ ఉండరు. నా అచ్చుపుస్తకాలే మీలో అస హనాన్ని కల్గించాయీ అంటే మరి మిగతా పుస్తకాల సంగతిని నేను ఊహించలేను. ఇన్ని భారాలని వహిస్తూ పుస్తక ప్రచురణ చేసిన రచయితల పరిస్థితిని గురించి కూడా మీ వంటి విజ్ఞులు ఆలోచించగలిగి వుంటే నేను నిజంగా ఊపిరి పీల్చుకోగలిగి ఉండేదాన్ని. మరి ఎందుకనో మీ ఊహ అటుగా మళ్ళినట్టు లేదు. తెలుగున ఒక పుస్తకం రాయడం కోసం శ్రమ పడాలో..దాన్ని అచ్చు తప్పులు లేకుండా శ్రధ్ధగా తేడానికి శ్రమపడాలో..అలా తెచ్చిన పుస్తకాల్ని అమ్ముకుందికి శ్రమ పడాలో..నాకు ఇప్పటికీ బోధ పడలేదు. అలాగని నేను ఆ ఆశ్చర్యార్ధకాల్ని ఏ కోశానా ఒప్పుకోవటంలేదు. మీ అసహనాన్ని మీరు వ్యక్తపరచగలిగేరు. మరి నా అశక్తతనీ..నాకు కలిగిన “అసహనాల్నీ”..నేను ఎలానూ వ్యక్తం చేయలేనే!
    నేను చేయగలిగిన పని ఒక్కటే! రచన చేయకుండా ఉండటం!!

    జయప్రభ.

  10. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి Rajesh అభిప్రాయం:

    09/21/2009 12:23 am

    ఆహ! గుర్రం జాషువ గారి గురించి, వారు వ్రాసిన “పాపాయి” గురించి చాల చక్కటి వ్యాసం అందించినదుకు కృతఙ్ఞతలు.