పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి D.V.N.Sarma అభిప్రాయం:

    10/19/2009 7:53 pm

    ఒకే పద్యంలో శూర్పణఖను పొడుగైన మద్ది చెట్టుతోనూ పొట్టి చట్ట్టీత చెట్టుతోనూ
    పోల్చటం లోని ఔచిత్యం ఏమిటి?
    అంధారాధన పనికిరాదు.
    శర్మ.

  2. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    10/19/2009 12:21 pm

    ముక్కు సూటిగా లైలాగారు “ముకుపుటములు” ఎక్కడ, ముక్కేకోసిన తరువాత అన్నobservation కు ఆశ్చర్యంతో ముక్కుపైన వేలువేసుకోవడమే!

    పద్య సంధర్బాన్ని చక్కగా, ఆసక్తితో చదివేటట్లుగా వివరించినందుకు కామేశ్వరరావుగారికి కృతజ్ఞతలు.

    “పిడుగు పడి సగం కాలిన మద్ది చెట్టూ, సగం కాలిన కాష్ఠమూ, మట్టెలెండిన చిట్టీతా, పుట్టలోంచి వెళ్ళకొచ్చి గాలి కూగుతూ చెవికింపు గాని శబ్దాలు చేసే వెదురు పొదా – ఒళ్ళు జలదరించే ఈ ఉపమానాలతో విశ్వనాధ వర్ణించింది – ముక్కూ చెవులు తెగిన తర్వాత స్వీయ రాక్షస రూపంలో భోరున విలపించే శూర్పణఖను.

    వర్ణన బాగుంది. పద్యాన్ని విడమర్చి ఓపికతో సాయపడేటట్టు చెప్పారు కూడా.

    ఇంతైనా వాల్మీకి పద్దతే, కాదు, వాల్మీకి చూపిన ఔచిత్యమే నచ్చింది. దొరికాయి ఊహలు పదాలు అని, దొరికిపోయారు పాఠకులు అని ఏడ్చినట్టున్న శూర్పణఖ ఏడుపును వర్ణించడం, అదీ పలు ఉపమానాలతో, “రామ రామ” ఎందుకో! ఇంకెందుకు సరదాకే కదా!

    వేరే భాషల్లో ,కావ్యాల్లో ఏడుపుకు ఇంత వర్ణన, వివరణ ఉందో లేదో గాని, మనకు రాక్షసుల ఏడుపుకు సైతం సీసాలున్నాయి. పోనీ ఈ ఏడుపువల్ల కథకేమైనా పనికొచ్చే అంశం ఉన్నదా, ఇదిలేకపోతే కథాశిల్పానికి కలిగే లోటేమైనా ఉందా అంటే ఏమీ కనపడదు. అయినా సరదాగా ఉంది. రాక్షసి ఏడుపుకు సైతం ఇంత పెద్ద పద్యం, కాదు ఊహలుచేయడం, నిజంగానే ఎంతో పెద్ద మనసుంటేనే గాని, అంతకుమించి పెద్దపనులేమీ లేకుంటేనేగాని, మధ్యలో రాక్షస phone calls రాకుంటేనేగాని సాధ్యం కాదేమో అనిపిస్తుంది.
    ________
    విధేయుడు
    _Srinivas

  3. ఈ కానుకనివ్వలేను గురించి Mohan అభిప్రాయం:

    10/19/2009 10:40 am

    అరుణ గారి కథనం బాగుంది.
    ఈ కథలొ శాండిల్య ఎవరో నాకు తెలియదు కానీ, తానా ప్రవేశపెట్టిన TEAM Square ద్వారా కొన్ని సంఘటనల్లో నా అనుభవాన్ని ఈ కథలో చూడగలిగాను.
    మరిన్ని వివరాలకు ఈ Links :

    TEAM Square Activities
    TEAM Square Mission
    ఆరుణ గారికి అభినందనలు.

  4. కుతంత్రం గురించి Vasu అభిప్రాయం:

    10/18/2009 5:43 am

    బావుంది కథ. కాని ముగింపు నచ్చలేదు. ఇంకా ఎదో ఉందనుకుంటూంటే సడన్‌గా ఐపొయింది.

  5. పెదవి దాటనివి గురించి రామ అభిప్రాయం:

    10/17/2009 11:32 pm

    చాలా బాగుంది. ఐతే చక్కటి తెలుగు కథకి పొసగని ఇంగ్లీష్ కామెంట్స్ మాత్రం అస్సలు బాగోలేవు. కామెంట్స్ తెలుగు లో వ్రాయడానికి ప్రయత్నించండి.

  6. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి సర్పవరపు రమణి. అభిప్రాయం:

    10/17/2009 12:30 pm

    ముక్కుకోయడమంటే లైలా గారు “ఊహించినట్టు” మొదలుకంటా నరికిపారేయడము కాదు.దానికి ఒక పద్ధతి పాడూ ఉన్నాయి.మనతెలుగులో సామెతకూడా ఉంది.ముక్కు కోసి సున్నం పెడతాను అని;మొదలు కంటా నరికితే ఇంక సున్నం ఎక్కడ పెడతారు?? అంతే గాక Rhinoplasty (తెగిన ముక్కునతికే శస్త్ర చికిత్స) ప్రాచీన భారతంలో ప్రచలితమైన శస్త్రచికిత్సల్లో ఒకటి.(శుశ్రుత సంహిత లో విపులంగా వర్ణించారు). రావణుడు కూడా శూర్పణఖకు అటువంటి ముక్కు పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేయించాడు. ముక్కు పుటాలు లేకపోతే ఈ చికిత్స కుదరదు అన్న విషయం స్వయాన వైద్యులైన లైలా ఎర్నేని (ఈ పేరు చూసి గాభరా పడతాను. లైలా శుద్ధంగా హీబ్రూ పదము ,ఎర్నేని తెలుగు ఇంటిపేరు) గారికి తెలియని విషయం కాదు.

    “ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.) “
    కావున ,లైలా గారి రాతల్లో పసలేదు. ఏదో “ఒక ఠస్సా వేసి రంజింపజేద్దామనుకొన్నారు” కానీ అది కుదరలేదు. కామేశ్వరుల వ్యాఖ్యల్లో పొసగనిది శూర్పణఖ నిర్వీర్యురాలు (వీర్యముండేది పురుషులకు; నిశ్చేష్టురాలు అంటే బాగుండేది) కావడం,ఒక డాక్టర్గా లైలా గారు దీన్ని ఎత్తిచూపవలసింది.కానీ వితండవాదంలో తర్కం వెనుకబడుతుంది.కావున వారి బుద్ధి అటు పారలేదు.

    సర్పవరపు రమణి.

  7. హంస గీతం గురించి krishna అభిప్రాయం:

    10/16/2009 2:27 pm

    జీవిత సత్యాన్ని చాల చక్కగా చెప్పారు. ధన్యవాదములు.

  8. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి lyla yerneni అభిప్రాయం:

    10/15/2009 11:37 am

    విశ్వనాథ తరఫునో లేదా బృందావనరావుగారి తరఫునో వకాల్తా పుచ్చుకొని వాదించడానికి నేను రాలేదు. లైలాగారి అభిప్రాయాన్ని తప్పుపట్టాలన్న ఉద్దేశమూ లేదు. -Kameswara Rao

    ఈ పై వాక్యాల నిర్మాణం నాకు ఆసక్తిని కలిగించింది.
    విశ్వనాథ, బృందావనరావు, లైలా – వీరెవ్వరి తరుఫున నేను వాదించటానికి రాలేదు. ఎవరి అభిప్రాయాన్ని తప్పు పట్టాలని లేదు – అని వీరు వ్రాసి ఉండవచ్చును. కాని వారు అలా అనలేదు. ఎందువల్ల అలా అనలేదు. ఇలానే ఎందుకు అన్నారు? అన్న అనుమానం లీలగా కలుగుతుంది నాకు. 😉 కామేశ్వరరావు లాటి భాషాప్రవీణులు ఆషామాషీగా రాయరు. అంచేత నాకు అలాటి అనుమానం వస్తుంది.

    ఐతేయేం, పద్య సందర్భం విపులంగా వర్ణించారు. శూర్పణఖ, ఖరుని మనస్థితులను (పుస్తకంలో లేకున్నా) తెలియజెప్పారు. సంతోషంగా చదువుకున్నాను.
    కానీ, “శూర్పణఖని చూసిన ఖరుడు మొదటగా అనే పద్యం ఇది:” అంటూ ఇవ్వబడిన విశ్వనాధ ఈ క్రింది పద్యం కూడా నాకు నచ్చలేదు. 😉

    “ఇటులిది యేమమ్మా! ముకు
    పుటముల నెత్తురులు గారు? ముక్కుం జెవులుం..”

    ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.
    లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.)

    లైలా

  9. జనరంజని: మహానటి సావిత్రి గురించి Mahesh T అభిప్రాయం:

    10/14/2009 12:54 pm

    Thank you so much for giving us an oppurtunity to listen to Mahanati Savitri.

  10. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:

    10/14/2009 11:38 am

    ఖగోళ విశేషాలను గురించిన నా పుస్తకం ఈమధ్యనే విడుదల అయింది:
    http://rohiniprasadkscience.blogspot.com/2009/10/1.html