సైన్సు రచనలు తెలుగులో చెయ్యటానికి రెండు స్పష్టమైన లక్ష్యాలుంటాయి. మొదటిది తెలుగు మాధ్యమంలో నేర్పడానికి పాఠ్యపుస్తకాల కోసం. ఇందులో ప్రామాణిక భాషనూ, పదాలనూ వాడవలసివస్తుంది. ఇందుకోసం అధికారిక భాషాసంఘాలూ, అవి తయారుచేసే నిఘంటువులూ పనికొస్తాయి. ఈ మధ్య బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు తదితరులు పదకోశాలు తయారుచేశారు. ఈ పదాలు ఎంతవరకూ పనికొస్తాయో విద్యాసంస్థల ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. విమర్శకులూ, భాషాపండితుల స్పందన కూడా తీసుకోవాలి.
ఇక రెండోది పాప్యులర్ సైన్స్ రచనలు. ఇవి సామాన్యపాఠకులకూ, విద్యార్థులకూ పనికొస్తాయి. ఇంటర్నెట్ చదివేవారికన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగువారిలో వీటిని చదివేవారెక్కువ. ఇటువంటి ఆసక్తి ఉన్నవారందరికీ వివిధ సైన్సు విషయాలమీద దొరికే ఇంగ్లీషు పుస్తకాలనూ, పత్రికలనూ కొనే అవకాశాలుగాని, ఆర్థికవనరులుగాని ఉండకపోవచ్చు. అదీకాక మనకు అర్థమయే మామూలు భాషలో స్నేహపూర్వకంగా సులభశైలిలో వివరించే పని ఈ రచనలు చేస్తాయి. వీటిని చదివి ప్రభావితులయే విద్యార్థుల్లో కొందరైనా సైన్సుపట్ల ఆసక్తి పెంచుకుని మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
The article by Shri Vemuri is thought provoking and informative. However, the discussion as to writing of scientific subjects in Telugu is quite interesting. I am of the opinion that, Telugu language may not be compatible for Technical, Medical, Mathematics, Law, Science. My opinion may not be taken as contempt for Telugu language. I am also ardent fan of Telugu language. I take price in our rich Telugu literature, but, I feel rather uncomfortable while trying to attempt Technical and other scientific subjects in Telugu. Therefore, I fully agree with Mr.Ravikiran Timmireddy that no purpose would be served to trying to telugise everything in our over enthusiasm.
మా సంగీతం మేస్టారు (సంధ్యావందనం పూర్ణప్రజ్ఞారావుగారనీ, సంధ్యావందనం శ్రీనివాసరావుగారి అబ్బాయి) ఇలాంటి విషయాలు కూడా కొన్ని చెప్పేవారు. ఉదాహరణకి, సరళివరుసలలో “నీదాపా”కి బదులుగా నీ-దప్పా పాడడం ఒకటి. పైన మీరు ప్రస్తావించినవాటిలో సునాదవినోదిని గుఱించి మాత్రమే విన్నానండీ ఇంతవఱకూ.
ఇక, సాహిత్యం తెలియక చేసే ఖూనీలు మఱొకరకంగా నవ్వు తెప్పిస్తాయి!
సాహితీ మిత్రులందరికీ వందనాలు,
నేను చాలా కాలంగా ఇటువంటి వేదిక కోసం చూస్తున్నాను. కొంత ఆలస్యంగా నైనా ఈరోజు “ఈమాట” చూడడం జరిగింది. చాలా సంతోషం వేసింది. ఇంతమంది సాహితీ మిత్రులని ఒకచోట చూడడం చాలా సంతోషంగా వుంది. మన మాతృభాష ఇంకా పదికాలాలపాటు జీవిస్తుందని ధైర్యం కలిగింది. ,
నేను చిన్నతనం నుండి తెలుగు సాహిత్యం ఇష్టంగా చదివేవాడిని. కొంతకాలం కవితలు కూడా రాశాను. గత కొద్ది కాలంగా పలు కారణాల వల్ల సాహిత్య లోకానికి దూరంగా వున్నాను. ఈరొజు “ఈమాట” చూసిన తరువాత నేను కూడా ఈ సాహితీస్రవంతిలో భాగం కావాలని అనుకున్నాను.
ఇది నేను తెలుగులో రాసిన మొట్టమొదటి ఈమెయిల్. చాలా సంతోషంగా వుంది.
నేను రాసిన కొన్ని కవితలు మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఎలా పంపాలో తెలుపగలరు.
నేను ఆంగ్లంలో రాసిన వ్యాసం దీనికి ఆధారం మాత్రమే; ఇది దానికి అనువాదం కాదు. పోగా, నేను తెలుగులో రాసే సైన్సు వ్యాసాలు కేవలం తెలుగులో సైన్సు రాయగలమని రాసి చూపించే ఉద్దేశంతో రాసినవి. వీటిల్లో నా స్వకపోల కల్పితాలు ఏవీ లేవు. ఈ విషయాలన్నిటి మీదా ఇంగ్లీషులో మణుగులకొద్దీ సమాచారం దొరుకుతుంది. విశ్వం ఆకారం అర్ధం అవాలంటే మనకి బాగా పరిచయం ఉన్న భూమి ఆకారం గురించి సమీక్షించటం మొదటి మెట్టు కదా.
ఎప్పుడో జారిపోయిన బాల్యం గురించి వానలో ఎదురు చూడడం గొప్పగా వుంది. జీవితంలో మర్చిపోయిన వాటిని పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ఎదురు చూడొచ్చు. వాన ఎంతో మందిని ఉత్సాహపరిచింది. ఇది ఇలా కొనసాగుతూనే వుంటుంది. ఎదురు చూపులే జీవితానికి ప్రాణం.
సమంజసం కానిది విశ్వనాథ వారి కవితావైభవాన్ని చెప్పడానికి ఎన్నో గొప్ప పద్యరత్నాలున్న కావ్యంలోనుంచి “చున్‌కే చున్‌కే” ఈ పద్యాన్నేఎన్నుకోవడం. సమంజసం కానిది, సరదాకో దురదకో ఎక్కడో ఉన్న ఇట్లాంటి పద్యాన్ని పట్టుకొని విశ్వనాథ కవిత్వాన్ని, చాతుర్యాన్ని తెలుసుకోవడానికి ఇదొక మెతుకువంటిదని ఎత్తిచూపడం. సమంజసం కానిది, “నిర్వీర్యం” అన్న పదానికి లింగవివక్షతను ఆపాదించడం. సమంజసం కానిది, పద్యాన్ని వొదిలేసి ఇంకొకరి బుద్ధి ఎటు పారలేదో, పారాలో చర్చించడం.
“తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచు బ్రదుకులు తనవిగాన
చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెదనేనును, నా భక్తి రచనలు నావి గాన”
అని పదికాలాల పాటు గుర్తుండేటట్లుగా చెప్పిన విశ్వనాథ గారి పద్యం చదివిన తరువాత, అంతకంటే సమంజసమైనది,తలచినప్పుడల్లా పరవశింపజేసేది, ఆలోచనామృతాన్ని అందజేసేది, కలకాలం నిలిచిపోయే “రామచరితమానస”లో తులసీదాసు చెప్పిన మాటలు.
“నిజ గిరా పావని కరన కారణి రామ జసు తులసీకరో
రఘువీర చరిత అపార వారధి పార కవి కౌనేరయో”” నా వాక్కును (గిరా) పావనం చేసుకోవడం కోసమే రాముని చరితను చెప్పడం. అపారమైన సముద్రం వంటి రఘువీరుని చరితను ఏ కవి అయినా, కాదు, ఎందరు కవులైనా సరే, (వర్ణించి) దాటగాలరా?!”
__________
విధేయుడు
-Srinivas
మీరు ఆంగ్లం లో పైన రాసిన వ్యాసానికి అనువాదమేనా ఇది (కొద్దిపాటి మార్పులతో)? బాగుంది!
Not trying to be nitpicky , but tonnes of info is available on this “shape of the earth” question already – and inquiry into this question, if it doesn’t propose anything ground breaking, is rather primitive.
పిడుగు పడి సగం కాలిన మద్ది చెట్టు కాబట్టి ఔచిత్య భంగం కాలేదని నా అభిప్రాయం. ఒక చిన్న అనౌచిత్యాన్ని మాత్రమే చూపించి ‘అంధారాధన’ అని ముద్ర వేయడం సమంజసం కాదు.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:
10/28/2009 4:12 pm
సైన్సు రచనలు తెలుగులో చెయ్యటానికి రెండు స్పష్టమైన లక్ష్యాలుంటాయి. మొదటిది తెలుగు మాధ్యమంలో నేర్పడానికి పాఠ్యపుస్తకాల కోసం. ఇందులో ప్రామాణిక భాషనూ, పదాలనూ వాడవలసివస్తుంది. ఇందుకోసం అధికారిక భాషాసంఘాలూ, అవి తయారుచేసే నిఘంటువులూ పనికొస్తాయి. ఈ మధ్య బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు తదితరులు పదకోశాలు తయారుచేశారు. ఈ పదాలు ఎంతవరకూ పనికొస్తాయో విద్యాసంస్థల ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. విమర్శకులూ, భాషాపండితుల స్పందన కూడా తీసుకోవాలి.
ఇక రెండోది పాప్యులర్ సైన్స్ రచనలు. ఇవి సామాన్యపాఠకులకూ, విద్యార్థులకూ పనికొస్తాయి. ఇంటర్నెట్ చదివేవారికన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగువారిలో వీటిని చదివేవారెక్కువ. ఇటువంటి ఆసక్తి ఉన్నవారందరికీ వివిధ సైన్సు విషయాలమీద దొరికే ఇంగ్లీషు పుస్తకాలనూ, పత్రికలనూ కొనే అవకాశాలుగాని, ఆర్థికవనరులుగాని ఉండకపోవచ్చు. అదీకాక మనకు అర్థమయే మామూలు భాషలో స్నేహపూర్వకంగా సులభశైలిలో వివరించే పని ఈ రచనలు చేస్తాయి. వీటిని చదివి ప్రభావితులయే విద్యార్థుల్లో కొందరైనా సైన్సుపట్ల ఆసక్తి పెంచుకుని మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి harish అభిప్రాయం:
10/28/2009 12:51 pm
The article by Shri Vemuri is thought provoking and informative. However, the discussion as to writing of scientific subjects in Telugu is quite interesting. I am of the opinion that, Telugu language may not be compatible for Technical, Medical, Mathematics, Law, Science. My opinion may not be taken as contempt for Telugu language. I am also ardent fan of Telugu language. I take price in our rich Telugu literature, but, I feel rather uncomfortable while trying to attempt Technical and other scientific subjects in Telugu. Therefore, I fully agree with Mr.Ravikiran Timmireddy that no purpose would be served to trying to telugise everything in our over enthusiasm.
Hareesh
హా (స్యం) సం (గీతం) గురించి రాఘవ అభిప్రాయం:
10/28/2009 5:38 am
చచ్చానండీ నవ్వుకోలేక. భలే సంకలనం చేశారండీ.
మా సంగీతం మేస్టారు (సంధ్యావందనం పూర్ణప్రజ్ఞారావుగారనీ, సంధ్యావందనం శ్రీనివాసరావుగారి అబ్బాయి) ఇలాంటి విషయాలు కూడా కొన్ని చెప్పేవారు. ఉదాహరణకి, సరళివరుసలలో “నీదాపా”కి బదులుగా నీ-దప్పా పాడడం ఒకటి. పైన మీరు ప్రస్తావించినవాటిలో సునాదవినోదిని గుఱించి మాత్రమే విన్నానండీ ఇంతవఱకూ.
ఇక, సాహిత్యం తెలియక చేసే ఖూనీలు మఱొకరకంగా నవ్వు తెప్పిస్తాయి!
About eemaata గురించి Mahendra అభిప్రాయం:
10/25/2009 2:12 pm
సాహితీ మిత్రులందరికీ వందనాలు,
నేను చాలా కాలంగా ఇటువంటి వేదిక కోసం చూస్తున్నాను. కొంత ఆలస్యంగా నైనా ఈరోజు “ఈమాట” చూడడం జరిగింది. చాలా సంతోషం వేసింది. ఇంతమంది సాహితీ మిత్రులని ఒకచోట చూడడం చాలా సంతోషంగా వుంది. మన మాతృభాష ఇంకా పదికాలాలపాటు జీవిస్తుందని ధైర్యం కలిగింది. ,
నేను చిన్నతనం నుండి తెలుగు సాహిత్యం ఇష్టంగా చదివేవాడిని. కొంతకాలం కవితలు కూడా రాశాను. గత కొద్ది కాలంగా పలు కారణాల వల్ల సాహిత్య లోకానికి దూరంగా వున్నాను. ఈరొజు “ఈమాట” చూసిన తరువాత నేను కూడా ఈ సాహితీస్రవంతిలో భాగం కావాలని అనుకున్నాను.
ఇది నేను తెలుగులో రాసిన మొట్టమొదటి ఈమెయిల్. చాలా సంతోషంగా వుంది.
నేను రాసిన కొన్ని కవితలు మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఎలా పంపాలో తెలుపగలరు.
ధన్యవాదాలు,
మహేంద్ర గొట్టిపాటి
[దయ చేసి ఈమాట ముందుపేజీలో రచయితలకు సూచనలు చదవగలరు – సం.]
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rao Vemuri అభిప్రాయం:
10/23/2009 8:06 am
నేను ఆంగ్లంలో రాసిన వ్యాసం దీనికి ఆధారం మాత్రమే; ఇది దానికి అనువాదం కాదు. పోగా, నేను తెలుగులో రాసే సైన్సు వ్యాసాలు కేవలం తెలుగులో సైన్సు రాయగలమని రాసి చూపించే ఉద్దేశంతో రాసినవి. వీటిల్లో నా స్వకపోల కల్పితాలు ఏవీ లేవు. ఈ విషయాలన్నిటి మీదా ఇంగ్లీషులో మణుగులకొద్దీ సమాచారం దొరుకుతుంది. విశ్వం ఆకారం అర్ధం అవాలంటే మనకి బాగా పరిచయం ఉన్న భూమి ఆకారం గురించి సమీక్షించటం మొదటి మెట్టు కదా.
వానకూడా వింతే! గురించి అవేంశర్మ అభిప్రాయం:
10/23/2009 5:02 am
ఎప్పుడో జారిపోయిన బాల్యం గురించి వానలో ఎదురు చూడడం గొప్పగా వుంది. జీవితంలో మర్చిపోయిన వాటిని పిల్లల ద్వారా తీర్చుకోవడానికి ఎదురు చూడొచ్చు. వాన ఎంతో మందిని ఉత్సాహపరిచింది. ఇది ఇలా కొనసాగుతూనే వుంటుంది. ఎదురు చూపులే జీవితానికి ప్రాణం.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Ranjeeth అభిప్రాయం:
10/23/2009 3:41 am
In the above comment, read “shape of the universe” instead of “shape of the earth”
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
10/22/2009 9:32 pm
సమంజసం కానిది విశ్వనాథ వారి కవితావైభవాన్ని చెప్పడానికి ఎన్నో గొప్ప పద్యరత్నాలున్న కావ్యంలోనుంచి “చున్‌కే చున్‌కే” ఈ పద్యాన్నేఎన్నుకోవడం. సమంజసం కానిది, సరదాకో దురదకో ఎక్కడో ఉన్న ఇట్లాంటి పద్యాన్ని పట్టుకొని విశ్వనాథ కవిత్వాన్ని, చాతుర్యాన్ని తెలుసుకోవడానికి ఇదొక మెతుకువంటిదని ఎత్తిచూపడం. సమంజసం కానిది, “నిర్వీర్యం” అన్న పదానికి లింగవివక్షతను ఆపాదించడం. సమంజసం కానిది, పద్యాన్ని వొదిలేసి ఇంకొకరి బుద్ధి ఎటు పారలేదో, పారాలో చర్చించడం.
“తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచు బ్రదుకులు తనవిగాన
చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెదనేనును, నా భక్తి రచనలు నావి గాన”
అని పదికాలాల పాటు గుర్తుండేటట్లుగా చెప్పిన విశ్వనాథ గారి పద్యం చదివిన తరువాత, అంతకంటే సమంజసమైనది,తలచినప్పుడల్లా పరవశింపజేసేది, ఆలోచనామృతాన్ని అందజేసేది, కలకాలం నిలిచిపోయే “రామచరితమానస”లో తులసీదాసు చెప్పిన మాటలు.
“నిజ గిరా పావని కరన కారణి రామ జసు తులసీకరో
రఘువీర చరిత అపార వారధి పార కవి కౌనేరయో””
నా వాక్కును (గిరా) పావనం చేసుకోవడం కోసమే రాముని చరితను చెప్పడం. అపారమైన సముద్రం వంటి రఘువీరుని చరితను ఏ కవి అయినా, కాదు, ఎందరు కవులైనా సరే, (వర్ణించి) దాటగాలరా?!”
__________
విధేయుడు
-Srinivas
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Ranjeeth అభిప్రాయం:
10/22/2009 11:28 am
@ Author of this post
http://www.cs.ucdavis.edu/~vemuri/EngPopsci/Universe.htm
మీరు ఆంగ్లం లో పైన రాసిన వ్యాసానికి అనువాదమేనా ఇది (కొద్దిపాటి మార్పులతో)? బాగుంది!
Not trying to be nitpicky , but tonnes of info is available on this “shape of the earth” question already – and inquiry into this question, if it doesn’t propose anything ground breaking, is rather primitive.
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి Ramana అభిప్రాయం:
10/22/2009 2:33 am