పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    01/31/2010 4:42 am

    జీవితంలో అనుకోకుండా ఎదురయిన విరామం.

    పనీ పాటా లేకుండా కూర్చోవలసి రావటంతో తెలుగు సాహిత్యంలో ఏం జరుగుతోందో తెలుసుకో వాలని కుతూహలం పుట్టుకొచ్చింది. ఎక్కడో వీపుమీద చీమ పాకినట్టు మొదలయి, జరజరా పాకి మాడులోకి అంటుకుంది.

    తెలుగులో రెండు రకాల పత్రికలు వున్నాయి. సౌలభ్యం కోసం వాటిని గబ్బు పత్రికలు, వెబ్బు పత్రికలుగా వర్గీకరించుకోవచ్చును. గబ్బు పత్రికలు మళ్ళీ రెండు రకాలు. సమస్త జ్ఞాన రంధ్రాలనీ మూసుకుంటే తప్ప భరించ లేనివి కొన్ని. ముక్కు వొక్కటీ మూసుకుంటే చడవగలగినవి మరి కొన్ని. ఈ రెండో రకం పత్రికలలో మురుగుతో పాటు అడపా దడపా బంగారమ్ముక్కలు కూడా కొట్టుక వస్తవి. వాటిని జల్లెడ పట్టి ఏడాదికో రెండేళ్ళకో ఎవరో వొకరు సంకలనాలు ప్రచురిస్తూ వుంటారు. అటువంటి సాహిత్య కార్మికులకి మన సమాజంలో తగిన గుర్తింపు లేదు.

    వెబ్బు పత్రికలు గబ్బు పత్రికల చావుకి వచ్చాయా అన్నది పై వ్యాసమూ దాని మీద చర్చకూ మూలాంశము. దీనివలన తెలుగు సాహిత్యానికి ఏదో మేలు జరుగుతుందని నమ్మటానికి నాకేమీ అభ్యంతరం లేదు. అదేంటో నాకు సరిగా తెలియక పోవటం వలన ఆ విషయాన్ని విజ్ఞులకే వదిలేస్తాను.
    వెబ్ పత్రికల వలన ప్రచురణా సంస్కృతులలో రాగల పరిణామాలు, వాటిని ఎట్లా ప్రయోజనకరంగా దిద్దుకోవచ్చును అన్న విషయం ఎవరూ ప్రస్తావించలేదు. (రమా భరద్వాజ్ గారూ – ఇది వుతుకుడు కాదు).

    1. ప్రచురణ అన్నది ఒక కాల చక్రానికి లోబడి వుంటుంది. టెక్నాలజిలో మార్పుల వలన ఆ కాల చక్రం మారిపోతుంది. పాఠకుల అభిప్రాయాలు వెంట వెంటనే ప్రచురితమవుతాయి. పేజీల పరిమితి వుండదు. మధ్యలో పోస్ట్ ఆఫీసు ప్రమేయం వుండదు కాబట్టి రచయితల కృషి ఫలం కూడా సంపాదకులకీ , విమర్శకులకీ, ఆపైన పాఠకులకీ తొందరగా అందుతుంది.

    2. వెబ్బు పత్రికలు అందరికీ అందుబాటులో వుండవు. పుస్తకం చేతిలో పట్టుకుని , పక్క మీద బోర్లా పడుకునో, దిండుమీద చేరబడో, వరండా లోనో బాల్కనీలోనో బస్సులోనో చదువుకునే వెసులుబాటు వుండదు. (నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న కొనుకున్నవో, లైబ్రరీ నుంచి తెచ్చుకున్నవో పుస్తకాలు ఎవరూ చూడకుండా మంచం కింద దూరి చదువుకొనే అవకాశం లేక పోయి వుంటే నేను ఎంత అజ్ఞానిని అయివుందునో తలచుకుంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది).

    ఈ రెండు విషయాలనే తీసుకున్నా వెబ్బు పత్రికలు తెలుగు సాహిత్యంలో వొక ప్రయోజనకరమైన దిశా నిర్దేశం చెయ్యగాలవని ఆశించవచ్చు. గబ్బు పత్రికలలో ప్రచురించబడటానికి ప్రస్తుతం తెలుగులో సాహిత్య కృషికన్న ఎక్కువగా సంపాదకులతో, విమర్శకులతో, వునికివాద రాజకీయ సంఘాలతో, ఎన్.జి. వో. లతో, ఒక్క మాటలో చెప్పాలంటే నానా రకాల మఠాలతో, ముఠాలతో, పీఠాలతో సంబంధాలు ఏర్పరచుకోవాల్సి వస్తోంది.

    ఈ విష సంస్కృతిలో నిలదొక్కుకోవాలంటే , రచయిత (త్రు) లు అసాధారణమైన ప్రజ్ఞావంతులు, అసామాన్యమైన నైతిక స్థైర్యం కలిగి వున్న వాళ్ళూ, దార్శనికులూ అయి వుండాలి. కొత్త తరం సాహిత్య కర్షకులపైన ఇంత భారం మోపటం భావ్యం కాదు. అందుకే వెబ్బు పత్రికలు – అనుకోకుండా, మన చేతిలో పడ్డ కొబ్బరి కాయలుగా భావించి, కోతి సాయంగా కొత్త వారధులు కట్టడానికి శ్రమించడం మంచిది.

    చాకిరేవు ఉపేంద్ర

    పి.ఎస్.
    కొబ్బరి కాయనించి వారధికి ఎట్లా వచ్చానని ఎవరూ అడగరు అనే నమ్మకం, పొగరు బోతు తనం నాకు రావటానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో వచ్చిన తలా తోకా లేని అనేకానేక తెలుగు రచనలే అని గమనించగలరు.

  2. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి రవిశంకర్ అభిప్రాయం:

    01/30/2010 7:30 pm

    శ్రీశ్రీ కవిత్వం పై థీసిస్ రాసింది రామకృష్ణగారే. ప్రసంగంలో రామకృష్ణగారి గురించి, ఆయనకు డాక్టరేటు రావటం మీద శ్రీశ్రీ చేసిన చమత్కారం గురించి చెప్పానుగాని, వ్రాతప్రతిలో పేరు రాసేటప్పుడు పొరపాటు దొర్లింది. క్షంతవ్యుణ్ణి. – రవిశంకర్

  3. శ్రీశ్రీ ఉపన్యాసం గురించి నారాయణ జి. అభిప్రాయం:

    01/30/2010 5:58 pm

    మద్దిపాటి కృష్ణారావు, వడ్లమూడి బాబు గార్లకు ధన్యవాదాలు.

    శ్రీ శ్రీ గారిని చూడటంతో పాటూ, పురాణేతిహాసాల సాహిత్యం పట్ల వారి ఆశక్తి, విశేష ప్రతిభ ఎంతటివో తెలిశాయి.
    నేల నుండి సాము చేసి మహాకవి అయ్యారని అని నిరూపించుకున్నారు.

    నారాయణ జి.

  4. కలైన గోర్వెచ్చని పాట గురించి v v b rama rao అభిప్రాయం:

    01/30/2010 9:11 am

    this is a good poem – nostalgia for joyful times that would never come again. Contentment and hard work were the qualities of that bygone era. Send me the telugu poem in pdf and i’d render it into english when find a little free time.

    good wishes
    rama rao, noida-7

  5. “చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/29/2010 2:51 pm

    దాసరి సుబ్రహ్మణ్యంగారు మరణించిన వార్తను ఈ కథనంలో ప్రచురించారు. మా నాన్న కుటుంబరావుగారు మరణించాక 1980 నవంబర్ తరవాత మాత్రమే ఆయన బేతాళ కథలు రాయడం మొదలుపెట్టారు.

  6. పండిన మొగలిరేకుల ఏకాంత ప్రవాహం: “సముద్రం” గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/29/2010 1:13 pm

    చాకిరేవు ఉపేంద్ర గారూ!! ఏం ఉతుకు ఉతికారండీ!!

  7. “చందమామ” జ్ఞాపకాలు గురించి కె.రాజశేఖర రాజు అభిప్రాయం:

    01/29/2010 12:50 pm

    బుదవారం -27-01-2010- కనుమూసిన చందమామ ధారావాహికల రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారితో రోహిణీ ప్రసాద్ గారి జ్ఞాపకాలను ఈ లింకులో చూడండి.

    అలాగే దాసరి గారి అస్తమయంపై చందమామలో వచ్చిన మరో కథనాన్ని ఇక్కడ చూడండి.

    దాసరి గారి కనుమూత తదనంతర పరిణామాలపై శివరాం ప్రసాద్ గారు రాసిన కథానికను ఇక్కడ చూడండి

    దాసరి గురించి వేణు గారు పంచుకున్న జ్ఞాపకాలను ఇక్కడ చూడండి.

  8. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి mani అభిప్రాయం:

    01/29/2010 11:08 am

    Rao vemuri అభిప్రాయముతో నేను ఎకీభవిస్తాను. తెలుగు పద మహిత్యము మనకు అర్థమవ్వాలంటె అవధానము ఒక ఉదాహరణము.

  9. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    01/29/2010 2:33 am

    రెండు మూడు తెలిసీ తెలియని విషయాల గురించి నాలుగు మాటలు.

    శ్రీశ్రీ మీద థీసిస్ చేసింది మిరియాల లక్ష్మీపతి గారన్నారు; రామకృష్ణ గారని గుర్తు.

    “నిరాశ అన్నది తాత్కాలికమైన మానసిక పరిస్థితేగాని, కవులతోబాటు ప్రతిఒక్కరు దీనికి లోనుకావటం సహజమే. మహాప్రస్థానం తరువాతి శ్రీశ్రీ పద్యాల్లో ఎక్కడా ఇటువంటి ఉదాహరణలు కనిపించవు. ఎప్పుడైనా నిరాశ వ్యక్తిగతమే.”

    శరచ్చంద్రిక రాసింది మహాప్రస్థానం తర్వాతేననుకుంటాను. దాంట్లో నిరాశ తోనే మొదలెడతాడు కాని ఆశాభావంతో ముగిస్తాడు. ఇక్కడే కాక కొన్ని ఇతర పద్యాలలో కూడా ఈ నిరాశా నిస్పహలకి కారణం తన వ్యక్తిగత జీవితం కాదు, సామాన్యుని వాస్తవ జీవితం.

    “నువ్వో … కావాలంటే ముందుగా కమ్యూనిస్టువి కావాలి,” అన్నదానిని చవకబారు కవిత్వమంటే ఒప్పుకోవచ్చు కాని, “నిజానికి ఏ సందేహానికైనా నిశ్చయమైన, ఖచ్చితమైన సమాధానం లభించిందని సంతృప్తిపడితే రచన ఆగిపోవటమే జరుగుతుంది,” అన్నదానికి ఇంకాస్త ఆధారాలు కావాలి. “కలడు కలండెడు వాడు కలడొ లేడో” అన్న కవి “ఇందుగలడందు లేడను సందేహము వలదు” లాంటిది రాస్తే అది కవిత్వం కాకుండా పోతుందా?

    శ్రీశ్రీ జీవితాంతమూ కవిగా అన్వేషణ తోనే గడిపానని చెప్పుకున్నాడు. ఏదో ఒక సిద్ధాంతాన్ని నమ్మినంతనే, ఇక తన జీవితంలో వేరే అన్వేషణే లేదనడం సరికాదు.

    ఇస్మాయిల్ గారు కూడా, మహాప్రస్థానంలోని గీతాలన్నీ శ్రీశ్రీ మార్క్సిజం గురించి తెలుసుకోక మునుపు రాసినవే నన్నారు. కాపిటల్ చదవలేదేమో కాని, 1930 ప్రాంతాల్లో ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలో చదవదగ్గ పుస్తకాలన్నీ చదివానని చెప్పుకున్న కవికి మార్క్సిజం గురించి తెలియదంటే నమ్మడమెలా? కాస్తోకూస్తో తెలియకుండానే “దేశచరిత్రలు” రాసి ఉంటాడా?

    మహాప్రస్థానం తర్వాత శ్రీశ్రీ రాసినవన్నీ మరీ దసరా పద్యాల స్థాయిలో ఉన్నాయనుకోను. వాటిల్లో చెప్పుకోదగ్గవీ, మహాప్రస్థానం గీతాలతో పోల్చదగ్గవీ, వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చునంటే ఒప్పుకంటాను. మరి డెబ్భై ఏళ్ళకి పైగా బ్రతికి, చివరిదాకా ఏదో ఒకటి రాస్తూ ఉన్నశ్రీశ్రీ కవిత్వంలో చెప్పుకోదగ్గది దాదాపు అంతా మూడు పదులు నిండక ముందే రాయడానికి కారణం, ఆ తర్వాత ఆయన మార్క్సిజం తీర్థం పుచ్చుకోవడమేనని రవిశంకర్ గారు స్పష్టంగా చెప్పకపోయినా సూచనప్రాయంగా అన్నారు.

    సృజనా శక్తి వయసుతో, అనుభవంతో, జ్ఞాన సముపార్జనతో పెరుగుతుందా? ఇది సాహిత్యంలోనేనా, అన్ని రంగాల్లోనూ సహజమా? అన్న సందేహముంది నాకు. హార్డీ తన “సంజాయిషీ” లో [1] రామానుజన్ ముప్ఫై రెండేళ్ళకే చనిపోవడాన గణితానికి వచ్చిన నష్టమేమీ లెదన్నాడు! ఆ వయసు తర్వాత ఏ గణితవేత్తయినా పెద్దగా సాధించేదేమీ లేదని హార్డీకి గట్టి నమ్మకం.

    S. చంద్రశేఖర్ కి సృజన తీరు మీద కుతూహలం కలిగి ఓ మంచి ఉపన్యాసం [2] ఇచ్చాడు. షేక్స్పియర్, బీథోవన్ ల సృజనా కౌశల్యం పెరుగుతూ జీవిత చరమదశ దాకా పరిపక్వత చేరిందంటాడు. వాళ్ళతో పోలిస్తే, సృజనా పరంగా మహోన్నతమైన గురుత్వాకర్షణ సూత్రాల ని న్యూటన్ కనుగొన్నది పాతికేళ్ళ వయసు లోపలే!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “A Mathematician’s Apology,” by G. H. Hardy. Cambridge University Press, 1967. గణితమంటే ఇష్టమున్నా లేకపోయనా, కవత్వమంటే ఆసక్తిగల వాళ్ళు చదవాల్సిన పుస్తకం.

    [2] Shakespeare, Newton, and Beethoven, or Patterns of Creativity. Nora and Edward Ryerson lecture delivered at the University of Chicago, Center for Public Policy on 22 April 1975. Published in “Truth and Beauty: Aesthetics and Motivations in Science,” by S. ChandraSekhar. The University of Chicago Press, 1987.

  10. కృష్ణం వందే జగద్గురుం గురించి Narayana అభిప్రాయం:

    01/29/2010 1:32 am

    ధన్యవాదాలు రోహిణీ ప్రసాద్ గారు.
    ప్రజాసాహితి లోని వ్యాసాలకి నేను ఎప్పటి నుండో ఇష్టంగా చదువుతున్నాను.

    In other words, I am your fan (admirer).

    Thank you,
    Narayana.