పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. జీలకర్ర – బెల్లం గురించి baabjeelu అభిప్రాయం:

    05/13/2010 11:45 am

    ఇదేటమ్మా ఇలా రాస్సేవూ?
    నువ్వు రోకలి వి కాదు తల్లీ. రోకళ్ళకి చివుర్లు తొడిగించీదానివి తల్లీ.
    కళ్ళ్ళు తుడిచీసుకుని పాపిష్టి పీడకలని మర్చిపో.
    ఇలా ఇంకెప్పుడూ రాయకు.

    బాబ్జీలు

  2. కవితావిర్భావం గురించి baabjeelu అభిప్రాయం:

    05/13/2010 11:37 am

    సాహితీ మిత్రులు వైదేహి గారికి,
    మీరు బాగా రాస్తారు. తిరుగులేదు.
    కానీ రాసిందే రాస్తారు. రకరకాలుగా అదే రాస్తారు. బావుంటాయి. కానీ ఏదో వెలితి. ఠుమ్రీలు మానీసి పూర్తి రాగవేఁ రాయాలి మీరు.
    బాబ్జీలు

  3. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి baabjeelu అభిప్రాయం:

    05/13/2010 11:06 am

    ఉపేంద్ర గారూ,
    సంభాషణని తెలుగులో “డైలాగు” అంటారని మర్చిపోయేను. క్షమించండి.
    కానీ “డైలాగు” ఇద్దరి మద్దెనే కదా నడుస్తుంది? ఇదీ వొదిలీయండి.
    మీరిచ్చిన లింకులు చూసేను. మంచి లింకులు.

    1. గులాబీ ఛూడియాఁ: బాబా కవిత చదవడం మొదలెట్టకముందే ఆ పిల్ల తల్లి చనిపోయిందని చెప్పీసేరు. దాంతో “మున్నీ కా అమానత్” అంటే కొంచెం అర్ధఁవయ్యింది. ఇది మీరిచ్చిన లింకు చూడక ముందు “క్రిస్టల్ క్లియర్” గా అర్ధవఁవ్వలేదు. ఇది చూసేక ఈ మాట లొ ప్రచురించీ కవితలని పాత భారతి టైపులో కాకుండా ఆడియో వో వీడియొ వో ఇస్తే, అందులో ఆ కవి పూర్వా పరాలు చెప్పి కవిత చదివితే లేపోతే ఇంకోళ్ళతో చదివిస్తే బాగుంటుందేమో? ఇదీ వొదిలీయండి. ఇది వేవే గారు చూసుకోవాలి.

    2.బాలగోపాల్ గారి లింకు(లు): చరిత్ర గట్రాల వేపు వెళ్ళలేదు, దమ్ము లేక. రెండో దాంట్లో (ఎవరో శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ) కన్యాశుల్కం మీద ఆయన అభిప్రాయం (తెలుగులో కామెంటు) మీద మీ అభిప్రాయం? అంటే మీరేవంటారూ అని. ఏదో ఒకటి అనండి దయచేసి. మనద్రుష్టవేఁవిఁటంటే మనం కన్యాశుల్కాన్నీ, మహాప్రస్ఠాన్నీ దాటి కరెన్సీ లోకి రాకపోవడం. లేపోతే ఆ రెండూ ఇంకా కరెన్సీ గా చెలామణీ లో వుండడం. సరిగ్గా రాయలేకపోతున్నాను. సాధన చేస్తాను, సరిగ్గా రాయడం. కానీ అర్ధం చేసుకుని ఈ “తీరని దాహాన్ని” తీర్చడానికి ప్రయత్నించండి అంటే తెలుగులో ట్రై చెయ్యరూ, మరోసారి దయచేసి!

    3. మీరు మామూలుగా నాగార్జున గారి కవిత్వాన్ని పరిచయం చేసి వుంటే ఈ వ్యాసం మరోలా వుండును. దానిని ” ఆ రెండు డైలాగు” లతో ముడి పెట్టి పీట ముడి వేసేరని అనుకుంటున్నాను. కాదని మీరనుకుంటే మా అద్రుష్టం.

    4. మిగిలిన భారతీయ భాషల్లోని కవులు: మీరన్నట్టు తెలుగు లెస్స అన్న గీర కాదు వాళ్ళని పట్టించుకోపోవడం. వారందరికన్నా మన తెలుగు కవులు; అస్మదీయులైనా, తస్మదీయులైనా; ఒకాకు ఎక్కువే. కాదని నిరూపించండి. దండగ అని వొదిలీకండి దయచేసి.

    5. చివరగా: బతుకునీ, కవిత్వాన్నీ మారని మార్క్సిస్టుల ద్రుక్పధం తోనో, మారిన మార్క్సిస్టుల ద్రుక్పధం తోనో చూడ్డం తప్ప వేరే దారి లేదా?
    బాబ్జీలు

  4. భవబంధాల సాక్షిగా… గురించి శేఖర్ పెద్దగోపు అభిప్రాయం:

    05/13/2010 10:36 am

    liked it….you took a different point…..nice….

  5. కవితావిర్భావం గురించి Satya అభిప్రాయం:

    05/13/2010 9:44 am

    కవికి కవిత్వం, రచయితకు కథ, ఆటగానికి మైదానం, నాట్యానికి పాటగానికి వేదిక… దేనికైనా అవకాశం, సమయం, సందర్భం కావాలి…అప్పటిదాకా సుషుప్తావస్థలో వున్నవి వెలుగులోకి రావాలి. వచ్చిన అవకాశం చేజారనీయకూడదు, చేజారినా పట్టు విడవకూడదు.

    కవిత చాలా బాగుంది.

    –సత్య

  6. *ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి kranthi అభిప్రాయం:

    05/13/2010 7:06 am

    Alleging that “The Da’ vinci Code” has no research at the back of it is pure obliviousness to the amount of effort Dan Brown has put in.! And advertising a sentence from one guy in a certain new york is one more step ahead in that!

  7. కళావసంతము గురించి Dr Tatiraju Venugopal అభిప్రాయం:

    05/13/2010 3:54 am

    సాహిత్యం వరకే వసంత ఋతువును పరిమితం చేయాల్సింది. వ!సంతోషంగా ఉండేది. జ్యోతిష (లాజీ కాదు, నామీ) విషయ ప్రస్తావనలో అస్పష్టత కనిపిస్తోంది. అతిగా అన్నీ వడ్డించిన విస్తరి –అజీర్తియే కద తదుపరి.
    -వేగోతారా

  8. నిశ్శబ్దం లో నీ నవ్వులు గురించి ravi అభిప్రాయం:

    05/12/2010 6:26 am

    చాలా బాగున్నాయి.

  9. కీబోర్డ్ మీద రాగాలు గురించి krishna అభిప్రాయం:

    05/12/2010 4:23 am

    రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం నాకు చాలా నచ్చింది. రాగాలని గుర్తు పట్టేంత సంగీత జ్ఞానం లేక పోయినా ఏ పాటనైనా స్వల్ప ప్రయత్నంతో వాయించగల సామర్ధ్యం వున్న నాకు వారి వ్యాసం ద్వారా కొన్ని రాగాలను తెలిసికొని పలికించగలిగిన జ్ఞానం అబ్బింది. ధన్యవాదాలు. వారి నుండి సంగీతసంబంధమైన మరికొన్ని వ్యాసాలను ఆశిస్తాము.

  10. ‘వికృతి’ ఉగాది గురించి ijswamy( achary ) అభిప్రాయం:

    05/12/2010 2:10 am

    శారదా పూర్ణ శొంఠిస
    హొదరుడే వ్రాయుచున్నహార్దిక కందం
    బేరీతి నడచునో యని
    సహృదయుండాచార్యుడు సంశయమందెన్