పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    07/07/2010 9:57 am

    రమగారు: అర్ధ శతాబ్దం పైగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్య స్వరూపాల గురించి — ముఖ్యంగా కృష్ణదేవరాయల గురించి, ఆ మధ్యయుగంలోని సాహిత్యం గురించి — వెల్చేరు నారాయణరావు, ఆయన సహపరిశోధకులు, ఇంకా ఇతర పరిశోధకులు చేసిన పరిశోధనలను ఈ ప్రత్యేక సంచికలో ప్రచురించడం (మీ భాషలో కీర్తించడం) కేవలం యాదృచ్ఛికం కాదు, సముచితం కూడానూ. నా దృష్టిలో ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం వ్యక్తుల్ని ప్రముఖంగా ప్రస్తావించడం కాదు, విజయనగర చరిత్రలో ప్రకటించబడిన పుస్తకాల్ని, వ్యాసాల్ని ఒక క్రమంలో పరిచయం చెయ్యడం. ఇవి కాక ఉన్నత ప్రమాణాలతో ప్రచురించబడిన పుస్తకాలు, పరిశోధనలు ఉంటే వాటిని గురించిన వివరాలు ఈమాట పాఠకులకు అందజేస్తే ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఉన్న పుస్తకాలని వ్యాసాలని పరిచయం చేసినందుకు శ్రీనివాస్ పరుచూరిని తప్పుపట్టడంతో కలిగే ప్రయోజనం ఏమిటో నాకు బోధ పడలేదు.

    “ప్రతికూల పవనాలు” అన్న పుస్తకంలో జయప్రభ గారు ఇలా అంటారు: “కనీసం కొంతవరకైనా తమ జాతినించి ప్రభవించిన మేధావులని గురించి, కవి పండితుల గురించి, సంస్కర్తల గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ప్రతిజాతిలోనూ, ప్రతి తరంలోనూ ఉండి తీరాలి. అప్పుడే వారి భాషా సంస్కృతులకు ఒక కొనసాగింపు సాధ్యమౌతుంది. లేకపోతే, ఒక తరాన్ని, ఇంకో తరంతో కలిపే సూత్రబంధం ఎక్కడో ఒకచోట తెగిపోయే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదాన్ని నివారించడానికే వెనుకటి కాలాన్ని గురించి, ఆ కాలంలో బతికి ఆ కాలం మీద తమ ప్రభావాన్ని ప్రసరించిన వారిని గురించి అటు తరువాత తరాలు తెలుసుకోవాలి!”

    మీరేమంటారు?
    సురేశ్.

  2. నువ్వు గురించి Bharath Yadlapalli అభిప్రాయం:

    07/07/2010 9:10 am

    నిజంగా మీ కవిత చాలా బాగుంది. కానీ ఒక చిన్న సలహా. “సితా చిలుక” అనడం కంటే “సితాకోక చిలుక” అనడం మరింత బాగుంటుందని భావిస్తున్నాను. నేను కవిని కాదు, కేవలం నా అభిప్రాయం వ్యక్త పరుస్తున్నాను అంతే!

    (ఇది పొరపాటు. సీతాకోకచిలుకగా తప్పు సరిదిద్దాము. పట్టించినందుకు కృతజ్ఞతలు. – సం.)

  3. శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి Sowmya అభిప్రాయం:

    07/07/2010 7:22 am

    మోహనరావు గారు: ధన్యవాదాలు.

  4. కృష్ణదేవరాయలు గురించి Sowmya అభిప్రాయం:

    07/07/2010 7:21 am

    మాధవ్ గారికి: థాంక్స్‌. స్పెల్లింగులు, పలుకులు ఇలా వేరుగా ఉంటాయనే అడిగింది 🙂

  5. నువ్వు గురించి Meghadhutha అభిప్రాయం:

    07/07/2010 4:30 am

    బాగుంది. కాని అది విరహమా, వ్యామోహమా, వైరాగ్యమా, విరక్తా, ప్రేమా, పారవశ్యమా లేక యీ అన్ని భావనలు కలబోసుకున్న అయోమయమా అన్నది మాత్రం తెలియడంలేదు. కవిత్వం లోతయిన భావాలను సరళతరం చేయాలని నా అభిప్రాయం.

  6. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Syamala Rao అభిప్రాయం:

    07/07/2010 3:59 am

    వ్యాసం బాగుంది. శ్రీకృష్ణదేవరాయలు గురించి గాని, విజయనగరసామ్రాజ్యం గురించి గాని తెలుగు వాళ్ళలో విపరీతమైన ఆరాధనాభావం ఉండటంలో వింతలేదు కాని, ఈమధ్య కాలంలో ఈ విషయాలలో యేమీ పరిశోధన జరగక పోవటం చాలా విషాదకరం.

    టీనేజ్ ప్రాయంలో (తూ.గో.జిల్లా) కొత్తపేట గ్రంధాలయంలో పదహరు సంపుటాలుగా ఉన్న ‘విజయనగర సామ్రాజ్య నవలామాలిక’ చదివాను. అది కన్నడ మూలానికి తెలుగుసేత. అనువాదకులు యెవరో సరిగా గుర్తుకు రావటంలేదు. నాకు తట్టినంతవరకు కేవలకాల్పనిక చారిత్రక దీర్ఘనవల. సత్యాసత్యాల పాళ్ళ సంగతి పక్కన పెడితే యేకబిగిని చదివించే రచన.

    తాడిగడప శ్యామలరావు, హైదరాబాదు.

  7. నువ్వు గురించి deepu అభిప్రాయం:

    07/07/2010 3:55 am

    This is very nice. Keep it up.

  8. అ, న్యాయం గురించి గన్నవరపు వరాహ నరసింహ మూర్తి అభిప్రాయం:

    07/06/2010 10:35 pm

    ఈ కధ ఫక్తు తెలుగు సినిమా లాగ కొన సాగింది. అవిఙ్ఞానం, కల్పితంతో మేళవించి,దానిని విఙ్ఞానంగా చూపించి చదువరులను అనుమానం,భయ భ్రాంతులలో ముంచి ఏదో గొప్పగా వ్రాసామనుకోవడంలో ప్రయోజనమేమిటి?
    (1) బ్లాకు విడో సాలిపురుగు విషానికి, ఆత్మహత్యా ప్రయత్నంగా తీసుకొనే విషాలకు రసానయన పరిశోధనాశాలలు తేడా గ్రహించలేవా ?
    (2) శవ పరీక్ష చేసే వైద్యుడుకి పరిశొధనా ఫలితాలను అమెరికా దేశంలో మార్చ గలిగే అవకాశము ఉంటొదా? వ్యవస్ఠలో మిగిలిన వారు కళ్ళు మూసుకొని ఉంటారా
    (3) శవ పరీక్షయే కాకుండా పోలీసు విభాగం వాళ్ళ పరిశోధన చేయరా ? విషం కొన్నాడా, శరీరంలో ఉన్న విషం, కొన్న విషం, ఒకటేనా, కుటుంబ సభ్యులతో సంభాషణలు వారి తీరు పరిగణించరా ?
    (4) ఓ వ్యక్తి మరణించిన రెండు దినములలోనే భీమా సంస్ఠకి మరణ వివరాలు అంది, వారు అంత త్వరగా కుట్రకు పన్నాగం పన్నుతారా ? లేక భార్య డబ్బుల కోసము అంత త్వరగా భీమా సంస్ఠని అడిగి వారి కుట్రకు అవకాశం కలుగ చేస్తారా?
    కధ రచయిత ఏ వృత్తిలో ఉన్నారో గాని కధ వ్రాసే ముందు వైద్యులతో గాని,భీమాసంస్థలతో అనుబంధము కలవారితోను గాని, అమెరికా దేశంలో పోలీసు వ్యవస్థతో సంబంధము గల వారితో గాని పరిశోధన చేసి కధను వాస్తవికతకు దగ్గరలో ఉంచడానికి ప్రయత్నం చేసారా, లేక కృత్రిమంగా పాఠకులకు అనుమానాలు పెంచడానికి ప్రయత్నం చేసారా ?
    కధకు కాళ్ళుండవు, ముంతకు చెవులుండవంటారు. ఈ కధకు,కాళ్ళు,చెవులు,కళ్ళు ఏమీ లేవు.

  9. గాలిపటం గురించి Amar Kondla అభిప్రాయం:

    07/06/2010 3:21 pm

    Hi Sameer,

    Great to see ur poetry on web.

    Thanks & Regards
    Amar Kondla

  10. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/06/2010 1:30 pm

    చాలా disappointing గా ఉన్న పరిచయ వ్యాసం ఇది. హిస్టరీ కి సంబంధించి ..వెల్చేరు త్రయం[ మిగిలిన వారిద్దరూ సంజయ్ సుభ్రహ్మన్యం..దేవిడ్ షుల్మన్ లని వేరుగా చెప్పనఖ్ఖరలేదనుకుంటాను. ఈ వ్యాసం చదివాకా వాళ్ళ పేర్లు ఎటూ పాఠకులకి కంఠతా వచ్చేస్తాయి. వ్యాసకర్త ఉద్దేస్యమే అది అయినట్టూ తెలిసేలా..] వారి రచనల మహిమని కీర్తించడం లా అన్పించేది గా ఉంది తప్ప ఇంకేమీ అదనపు సమాచారం లేదు. అసలీ సంచికలో “పరిశోధనాత్మక వ్యాసాలన్నీ” వీరివే కావడం కేవలం యాదృచ్చికం కాదు.

    పరుచూరి శ్రీనివాస్ ఒకసారి ” వెంకటరమణయ్య” అనీ ఒకసారి “నేలటూరి” అనీ ప్రస్తావన చేసారు. robert sewell ని robert అని పిలిస్తే ఎలా అన్పించగలదో అలా అన్పించింది.

    రమ.