కోనసీమకథ అంటే ఉత్సాహంకొద్దీ చదివాను. చదివాక, ఊఁ… సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతానండీ. ఇది కథా కల్పనా?
బహుశా నాకు మా ఊళ్లో (అదే అమలాపురంలో) ఇలాంటి సంగతులు తెలిసి ఉండకపోవచ్చు. కానీ నాకు ఇది కల్పనగానే అనిపిస్తోంది. వంశీగారి పసలపూడి కథలు కూడ కొంచెం ఇలాంటి విషయాలతోనే ఉంటాయని అనగా విన్నాను.
రవిశంకర్ గారు,
చాలా బావుంది. ఇంత క్లుప్తంగా ఒక పెద్ద చక్కని కథనే చెప్పారు.
ఓ పదేళ్ళ తర్వాత తెలుగు కూడా సుదూర ఆకాశంలో ఉండి అందుకోమంటుందేమో!
రవి వీరెల్లి
కనక ప్రసాదు గారూ, మీ అందరి ప్రయత్నమూ మెచ్చుకోతగ్గది. చారుకేశి రాగం వల్లనేమో వినడానికి సొంపుగా వుంది కానీ పాడుకోడానికి సులువుగా సాహిత్యం లేదు. బలవంతాన ఇరికించినట్లుగా అనిపించింది. చరణాల వరకూ వెళ్ళనవసరం లేదు. పల్లవే సజావుగా నడవలేదు. పల్లవే సులభంగా, సరళంగా లేకపోతే ఎంత మంచి వరసయినా ఎక్కదని నా అభిప్రాయం. సంగీతం చెవుల్ని మెలేస్తే సాహిత్యం నాలిక మడతేయించాలి. వరసలు కట్టేటంత సంగీతం రాదు కానీ విని పాట స్థాయి చెప్పగలను.
పద్మావతి గారి గొంతు మాత్రం భలే వుంది. పూర్తి వాయిద్య సహకారంతో ఆవిడ పాడిన పాటలుంటే చెప్పండి. మీ పాటక్కూడా పక్కవాయిద్యం లోటు కొట్టచ్చినట్లు కనిపించింది.
మీరు జవాబు చెప్పకుండా దాటవేసే ప్రశ్నే మరోసారి. స్వరకల్పనకీ, స్వరరచనకీ భేదం ఏమిటి? ఏఏ సందర్భాలలో అవి వాడతారు? మీరు జవాబు చెప్పకపోయినా పరవాలేదు. నాకు విక్రమార్కుడు స్పూర్తి కాదులెండి.
ముందుగా మీకు నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. ఈమాట లో ‘మధ్యంతర రచనలకు’ స్థానాన్ని కల్పిస్తున్న వైనం బాగుంది. అలాగే- నెలకో, రెణ్నెల్లకో, ఒక చిన్న నవల కానీ, ఒక పెద్ద కథకు కానీ వీలు కల్పిస్తే మరింత బాగుంటుందనుకుంటున్నా.(చిన్న చిన్న ఇమేజెస్ తో).
అదే విధంగా, ఈ రెండు నెలల వ్యవధిలో వచ్చే – మన తెలుగు పండగలకు సంబంధించిన ప్రత్యేక వ్యాసాలు, ప్రముఖులు పొందే ప్రతిష్టాత్మకమైన పురస్కారాల విశేషాలు,ఇంకా..తెలుగు సాహితీ వన వృక్షాలను వీడి వెళ్తూ… పరిమళాలను వెదజల్లి పోయేవారిని సంస్మరించుకునే వీలూ కల్పిస్తే మరింతగా బావుండొచ్చేమోనని ఒక చిన్న ఊహ. ..అంతే.
(ఈమాటలో- ముళ్ళపూడి గారి మంచిని, మల్లెపూల సాహిత్య సేవని చదవాలనుంది.)
శుభాభివందనాలతో-
ఆర్.దమయంతి.
[మీ అభిమానానికి కృతజ్ఞతలు. పెద్ద కథలకు ఈమాటలో ఎప్పుడూ చోటు ఉంది. నవలా సాహిత్యాన్ని ప్రోత్సహించాలని మాకూ ఎంతగానో ఉంది. కానీ సమీక్ష కోసం, నవల మొత్తం ఒకేసారి పంపమనడం, రచయితలకు కుదిరే పని కాదు. అలా అని, సమీక్ష ఏమీ లేకుండా ప్రచురించలేము కూడాను. నవలను సమీక్షించే పద్ధతిపై ఒక అవగాహనకు రాగానే తెలియజేస్తాము.
ఇకపోతే, గత రెండేళ్ళుగా కొంతలో కొంతగా నిన్నటి ప్రముఖులనూ, వారి సాహిత్యాన్ని పునఃపరిచయం చేసే ప్రయత్నం చేశాం. అయితే, ఏదో ఒక సందర్భం వస్తేనే కాకుండా, కేవలం ఒక స్మరణ గానే కాకుండా, మన సాహిత్యాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తూ, మంచి చెడ్డలు ఎంచి చూస్తూ చేసే విమర్శనాత్మక రచనల కోసం ఈమాట ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటుంది. ఈ సాహిత్య పునర్మూల్యాంకనం గురించిన కృషి ఈమాట ప్రయత్నాల్లో ఎప్పుడూ ఒక ముఖ్యభాగమే. ఈమాట రచయితలు అందుకు మరింతగా సహకరిస్తే ఈ ప్రయత్నం సఫలమవుతుంది – సం.]
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి రాఘవ అభిప్రాయం:
03/03/2011 6:38 am
కోనసీమకథ అంటే ఉత్సాహంకొద్దీ చదివాను. చదివాక, ఊఁ… సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతానండీ. ఇది కథా కల్పనా?
బహుశా నాకు మా ఊళ్లో (అదే అమలాపురంలో) ఇలాంటి సంగతులు తెలిసి ఉండకపోవచ్చు. కానీ నాకు ఇది కల్పనగానే అనిపిస్తోంది. వంశీగారి పసలపూడి కథలు కూడ కొంచెం ఇలాంటి విషయాలతోనే ఉంటాయని అనగా విన్నాను.
భాషల ఋతువు గురించి రవి వీరెల్లి అభిప్రాయం:
03/02/2011 7:59 pm
రవిశంకర్ గారు,
చాలా బావుంది. ఇంత క్లుప్తంగా ఒక పెద్ద చక్కని కథనే చెప్పారు.
ఓ పదేళ్ళ తర్వాత తెలుగు కూడా సుదూర ఆకాశంలో ఉండి అందుకోమంటుందేమో!
రవి వీరెల్లి
కాలనీ భోగి గురించి sudha అభిప్రాయం:
03/02/2011 2:53 pm
chala bagundi. I really enjoyed reading each and every line.
Please write some more stories.
సామాన్యుని స్వగతం: మంచి స్నేహితురాలు గురించి భావకుడన్ అభిప్రాయం:
03/02/2011 2:04 pm
నా స్నేహితురాలిని గుర్తు చేసారు…….మళ్ళీ గర్వం వచ్చింది…..థాంక్స్.
మీకు మీ స్నేహితురాలికి అభినందనలు.
నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి సూర్యుడు అభిప్రాయం:
03/02/2011 1:42 pm
ఈ పద్యాలు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
కాలనీ భోగి గురించి Subba Reddy Meka అభిప్రాయం:
03/02/2011 10:30 am
సత్య గారు,
చితక కొట్టారు. అదిరినది. I thouroughly enjoyed it. It reminded my Bhogi days. The way you wrote this story, it shows your great talent.
Please keep up doing this good work.
భవదీయుడు
మీ “సుబ్బా”
తవ్విపోత గురించి perugu.ramakrishna అభిప్రాయం:
03/02/2011 2:27 am
మంచి కవిత, John.
ఇల్లు విడిచి పోతావా రమణా? గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
03/02/2011 2:17 am
కనక ప్రసాదు గారూ, మీ అందరి ప్రయత్నమూ మెచ్చుకోతగ్గది. చారుకేశి రాగం వల్లనేమో వినడానికి సొంపుగా వుంది కానీ పాడుకోడానికి సులువుగా సాహిత్యం లేదు. బలవంతాన ఇరికించినట్లుగా అనిపించింది. చరణాల వరకూ వెళ్ళనవసరం లేదు. పల్లవే సజావుగా నడవలేదు. పల్లవే సులభంగా, సరళంగా లేకపోతే ఎంత మంచి వరసయినా ఎక్కదని నా అభిప్రాయం. సంగీతం చెవుల్ని మెలేస్తే సాహిత్యం నాలిక మడతేయించాలి. వరసలు కట్టేటంత సంగీతం రాదు కానీ విని పాట స్థాయి చెప్పగలను.
పద్మావతి గారి గొంతు మాత్రం భలే వుంది. పూర్తి వాయిద్య సహకారంతో ఆవిడ పాడిన పాటలుంటే చెప్పండి. మీ పాటక్కూడా పక్కవాయిద్యం లోటు కొట్టచ్చినట్లు కనిపించింది.
మీరు జవాబు చెప్పకుండా దాటవేసే ప్రశ్నే మరోసారి. స్వరకల్పనకీ, స్వరరచనకీ భేదం ఏమిటి? ఏఏ సందర్భాలలో అవి వాడతారు? మీరు జవాబు చెప్పకపోయినా పరవాలేదు. నాకు విక్రమార్కుడు స్పూర్తి కాదులెండి.
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
03/02/2011 1:55 am
నాగరత్నమ్మ గారు త్యాగరాజు మీద తెలుగులో స్వయంగా రాసిన ఒక వ్యాసం నావద్ద వుంది. ఇక్కడ జత చేస్తే బావుంటుదనిపిస్తే స్కాన్ చేసి పంపగలను.
– సాయి బ్రహ్మానందం గొర్తి
[మీరు పంపితే మేము ఒక నిర్ణయం తీసుకోగలం. ఏ వివరాలు తెలియకుండ ఎలా చెప్పగలం? – సం.]
ఈమాట ప్రచురణలో చిన్న మార్పు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
03/02/2011 1:20 am
గౌరవనీయులైన సంపాదకులకు, నమస్తే!