నాకు పన్నెండేండ్ల వయసు వచ్చేవరకు తెలుగు తప్ప మరో భాష నేను ఎరగను. తరువాత వరుసపెట్టి హిందీ, ఆంగ్ల, తమిళ, కన్నడ, మళయాళ, ఉర్దూ భాషల్లో మాట్లాడగలిగే సామర్థ్యం సంపాదించాను. నేను ఇతర భాషలు నేర్చుకుంది నిజానికి ఇతర భాషా చానెళ్ళ ప్రసారాలు చూడటానికి. 2006 మాతృభాషా దినోత్సవంనాడు “ఆంద్ర జ్యోతి”లో తెలుగు భాషా ప్రాచీనత, వైభవము, ఉన్నతి, నేటి స్థితివంటి అంశాలపై వచ్చిన వ్యాసము నాలో తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించింది. దాని తరువాత నేను మళ్ళీ ఆ స్థాయి వ్యాసాన్ని తెలుగులో ఇదే చూడటము.
ఒక భాష కాల నిర్ణయము చేయటం అనవసరం అని నా అభిప్రాయము. ఆ భాషలో భావ వ్యక్తీకరణ, సౌందర్యము, సౌలభ్యము, కొత్తపదాల సృష్టి ఇలాంటివి ముఖ్యమైనవి అని నేను భావిస్తున్నాను. నేటి తెలుగు దౌర్భాగ్యము ఏమంటే ఆంగ్ల/సంస్కృత/పారశీక/ఉర్దూ పదాలు లేకుండా ఒక్కనిముషం అయినా మాట్లాడలేకపోవటం. నా మాతృభూమిని వదిలిన తరువాత నాకు మరింత దిగులు పట్టుకుంది తెలుగు దుస్థితిని చూసి. పాఠకులు మన్నించాలి నా ఆవేదన వెళ్ళగక్కినందుకు.
బాగుంది. త్యాగరాజు పాటల్లో భావంతో బాటు భాష అద్భుతంగా పెనవేసుకుని ఉంటాయి. నాకు బాగా నచ్చిన ఓ ప్రయోగం ఇక్కడ గుర్తు చేసుకుంటాను.
రామా వందనము రఘునందనా పాటలో
వేగ రా
కరుణా సాగరా
శ్రీ త్యాగరాజనుత … అంటాడు ఈ పాట చివర్లో…
ఇందులో ”గరా” అనే రెండక్షరాల సముదాయాన్ని తీసుకోండి. (ప్రత్యేకమైన అర్థం లేదు కాబట్టి… పదం పదబంధం అని పేర్లు వాడడం లేదు) ఒక్కో లైన్లో ఈ అక్షరాల్ని ఒక్కో అర్థంలో వాడడం విశేషం. ఒక్కోచోట ఈ అక్షరాలు ఒక్కోలా విరుగుతాయి. వేగ -రా అనే చోట మధ్య గ్యాప్ వస్తుంది. కరుణాసాగరా అన్నచోట విశేషణంలో భాగంగా వస్తుంది, శ్రీ త్యాగరాజనుత అన్నచోట మకుటంలో భాగంగా వస్తుంది. అక్కడే నిజంగా ఓ గొప్ప అనుభూతి కలుగుతుంది. అలాంటి చోట ఇలాంటి ప్రయోగం వాడడం ఎంతో నచ్చింది నాకు.
( త్యాగరాజు తన కీర్తనల్లో చివర తన పేరుని మకుటంగా వాడుకుంటాడు. తన చేత స్తుతింపబడినవాడిగా దేవుణ్ణి స్తుతిస్తాడు. తెలియనివాళ్లకి ఇది అహంకారంలాగా తోచినా… ఒక భక్తుడు భగవంతుడికి చేరువయ్యే కొద్దీ… అతనిలో సాత్వికమైన ఆత్మగౌరవం ఎలా ఇనుమడిస్తుందో త్యాగరాజు మకుటాల్లో కనిపిస్తుంది. )
అర్థవంతమైన పదాల్ని రిపీట్ చేస్తే ఆ అనుప్రాసలకి వృత్తి, ఛేక, లాట అని పేర్లున్నాయి. మరి ఇదీ ఆ జాబితాలోకి వస్తుందా? లేక శబ్ద ప్రయోగం గానే గుర్తింపు పొందుతుందా నాకు ఐడియా రావడం లేదు. తెలుగు వ్యాకరణం చదివి చాలా రోజులైపోయింది. ద్విరుక్త టకారసంధి సూత్రం లాంటి కొన్ని తప్ప … మళ్లీ చదివితేగానీ గుర్తురావు. చెప్పగలిగితే ఈ ప్రయోగాన్ని గురించి వ్యాకరణ భాషలో చెప్పండి.
“హల్లకములుల్లసిల్లగ” పద్యంలో “శయ్యకు” అని ఉంచండి. చివరి లైన్ లో అచ్చుతప్పు పడింది “శుయ్యకు” అని. గమనింపగలరు. మంచి పద్యమ్ . దాని అందాన్ని ఆ అచ్చుతప్పు అడ్డుకుంటోంది.
రమ.
“సృజన “ని గురించి సృజనాత్మకులని గురించీ ఇంత అమాయకమైన విశ్లేషణ ని నేను ఇంతవరకూ చదవలేదు. ఈ వ్యాసం లో ఎక్కడా చదివించే గుణమ్ కనిపించలేదు. నస చాలా ఉంది. అయోమయమ్ బోలెడుంది. విషయ వివరణలో కనకప్రసాద్ శైలి ఒక అడ్డంకి కాగా… ఆయన చెప్పదలుచుకున్న విషయంలో విస్తృతంగా కన్పించే అనేకమైన ఖాళీలూ …కప్పదాట్లూ మరో అడ్డంకి. సహనాన్ని పరీక్షించే చాటభారతమ్ లా నడవడమ్ ఈ వ్యాసమ్ లోని ప్రధాన మైన లోపమ్ . ఇందువలన ఆయన చెప్పే విషయమ్ మీద ఆసక్తి కలగడమ్ లేదు .రాళ్లపల్లి గడుసో భోళానో కనకప్రసాద్ చెప్పిన తీరు నవ్వు తెప్పించేలా ఉంది. ఇందుకు కూడా బిపిన్ గారిదో లేక కార్ల్ యుంగ్ గారిదో పోనీ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారిదో ఒక కొటేషన్ ని కనకగారు ఎందుకో మరి ఇవ్వలేదే?? అన్నీ ఇంగ్లీషులోనే అన్నోటి మహత్తరమైన విషయాలుంటే అసలు ఇంక తెలుగు లో నించి తెలుగు వాళ్ళకి చెప్పేందుకు ఏమున్నాయో?? ఈ వ్యాసమ్ కూడా ఇతర సృజనలలోని విశ్లేషణ ప్రకారమ్ కలిసికట్టుగా రచయితా_ పాఠకుల సమిష్టి కృషి ఫలితమే అయితే గనక … ___ఇందులోంచి పాఠకురాలిగా నా వాటాని నేను ఉపసంహరించుకుంటున్నాను.
మీరు చెప్పమన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం చెప్పుకుని ముందుకి వివరంగా చెప్పాలి. ఒకటోది చూడండి – వీళ్ళు తమ వ్యక్తిత్వ పరిణామ క్రమంలో చిన్న పిల్లలకుండే మౌలికమైన స్వభావాన్ని సాంతం పోగొట్టుకోకుండానే పెద్దవాళ్ళవుతారట. దీనికి జంతుశాస్త్రం నుండి, మనస్తత్వం నుండి మంచి చర్చ ఉంది. అది వివరంగానే చెప్పాలి, ఇక్కడ అవకాశం లేదు. రెండోది – వీళ్ళు వెర్రివాళ్ళు, అంటే ఒకరకమైన eccentrics. వెర్రిని అర్ధం చేసుకోడం సమస్యే గాని అసాధ్యం ఏమీ కాదు. మరి దీనిమీదా ఎన్నో మంచి విషయాలున్నాయి. దురదృష్టవశాత్తు ఇవన్ని ఇంగ్లిష్ లోనే ఉన్నాయి. శ్రీశ్రీగారిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చాలామంది అన్నారు. త్రిపుర ఇంతే. గద్దర్ గార్ని, వేటూరి సుందరరామ్మూర్తి గార్ని టీవీలో చూసినా బోధపడుతుంది, ముఖ్యంగా వాళ్ళు పాటల సంగతి ఎత్తుకున్నప్పుడు. వేలూరి శివరామశాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని గురించి ఎక్కువ ఏమీలేవు. ఉన్నమటుక్కి చదివితే ఈ సంగతే బోధపడుతుంది. వాళ్ళు బోళా మనుషులని…
ఈ వ్యాసపరంపరలోని వ్యాసాలకోసం ఎదురు చూసే వాళ్ళల్లో నెనొకణ్ణి.
ఈ భాగంలో చెప్పిన రెండు విషయాల మీద సందేహాలు వచ్చాయి, వీటి గురించి కొంచెం వివరిస్తారా:
1. “రెండవది ఏమంటే నికార్సైన సృజన, దాన్ని అనివార్యంగా ప్రేమించే సృజనశీలురు కూడా సున్నితంగా, మృదు స్వభావులై ఉంటారు”
ఎందుకు? దీనికి ఆధారాలేమైనా ఉన్నాయా?
2. “దీనికి కావలసిన ముడి సరుకు (experimental subjects) ఎవరంటే స్వయంగా సృజనశీలురైన వాళ్ళ సృజనలు, వాళ్ళు చెప్పుకున్న మాటలు, వాళ్ళ ప్రవర్తన, హావభావాలు, జీవితాలు, వాటిని స్వీకరిస్తున్న పాఠకులు – ఇవి”
ఈ “సృజనశీలురు” ఎవరన్న ప్రశ్న దగ్గరే పెద్ద సమస్య ఎదురుకాదా?
తెలుగు భాష వయస్సెంత? గురించి అరుణ్ చంద్ర గడ్డిపాటి అభిప్రాయం:
03/04/2011 6:31 am

త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి వక్కలంక కిషోర్ అభిప్రాయం:
03/04/2011 4:33 am
బాగుంది. త్యాగరాజు పాటల్లో భావంతో బాటు భాష అద్భుతంగా పెనవేసుకుని ఉంటాయి. నాకు బాగా నచ్చిన ఓ ప్రయోగం ఇక్కడ గుర్తు చేసుకుంటాను.
రామా వందనము రఘునందనా పాటలో
వేగ రా
కరుణా సాగరా
శ్రీ త్యాగరాజనుత … అంటాడు ఈ పాట చివర్లో…
ఇందులో ”గరా” అనే రెండక్షరాల సముదాయాన్ని తీసుకోండి. (ప్రత్యేకమైన అర్థం లేదు కాబట్టి… పదం పదబంధం అని పేర్లు వాడడం లేదు) ఒక్కో లైన్లో ఈ అక్షరాల్ని ఒక్కో అర్థంలో వాడడం విశేషం. ఒక్కోచోట ఈ అక్షరాలు ఒక్కోలా విరుగుతాయి. వేగ -రా అనే చోట మధ్య గ్యాప్ వస్తుంది. కరుణాసాగరా అన్నచోట విశేషణంలో భాగంగా వస్తుంది, శ్రీ త్యాగరాజనుత అన్నచోట మకుటంలో భాగంగా వస్తుంది. అక్కడే నిజంగా ఓ గొప్ప అనుభూతి కలుగుతుంది. అలాంటి చోట ఇలాంటి ప్రయోగం వాడడం ఎంతో నచ్చింది నాకు.
( త్యాగరాజు తన కీర్తనల్లో చివర తన పేరుని మకుటంగా వాడుకుంటాడు. తన చేత స్తుతింపబడినవాడిగా దేవుణ్ణి స్తుతిస్తాడు. తెలియనివాళ్లకి ఇది అహంకారంలాగా తోచినా… ఒక భక్తుడు భగవంతుడికి చేరువయ్యే కొద్దీ… అతనిలో సాత్వికమైన ఆత్మగౌరవం ఎలా ఇనుమడిస్తుందో త్యాగరాజు మకుటాల్లో కనిపిస్తుంది. )
అర్థవంతమైన పదాల్ని రిపీట్ చేస్తే ఆ అనుప్రాసలకి వృత్తి, ఛేక, లాట అని పేర్లున్నాయి. మరి ఇదీ ఆ జాబితాలోకి వస్తుందా? లేక శబ్ద ప్రయోగం గానే గుర్తింపు పొందుతుందా నాకు ఐడియా రావడం లేదు. తెలుగు వ్యాకరణం చదివి చాలా రోజులైపోయింది. ద్విరుక్త టకారసంధి సూత్రం లాంటి కొన్ని తప్ప … మళ్లీ చదివితేగానీ గుర్తురావు. చెప్పగలిగితే ఈ ప్రయోగాన్ని గురించి వ్యాకరణ భాషలో చెప్పండి.
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
03/03/2011 6:47 pm
కథలో కొన్ని ప్రదేశాలూ, పేర్లూ, పాత్రలూ మాత్రం కల్పితం. మూల కథకి సంబంధించిన కొన్ని నిజాలకి కథా రూపం అంతే! ఏ కథా నూటికి నూరు పాళ్ళూ వాస్తవం కానేరదు.
మేఘాంగన గురించి lyla yerneni అభిప్రాయం:
03/03/2011 5:28 pm
“ధాతృకుటుంబిని మాదుమేలుకే
యీ పథకంబుఁ బన్నెనని యెంచి, ”
ఏమి మేలు కవివరా! ఏమి మేలు చేసిందామె? ‘సేవా ధర్మము, మోత ధర్మము’ ఏదో అలవాటై పోయి ఉండాలి. లేకుంటే, మళ్ళీ ఆమె సేవకే ఎందుకు వెళ్ళటం?
రమణీయమైన పొయెట్రీ రాస్తారు.:-) ఇంతకుముందు ఒకసారి, వసుచరిత్రములో శుక్తిమతీ కోలాహలుల వృత్తాంతము రామరాజభూషణుడు భలేగా రాశాడన్నారు. ఆ విచిత్రం సంగతి తర్వాత.:-)
ముందు ఇందులోని ధర్మ సూక్ష్మమేదో చెప్పగలరు.
లైలా
కాలనీ భోగి గురించి sivalenka అభిప్రాయం:
03/03/2011 2:52 pm
చాలా బాగా రాశారు. నేను ఆ వూరి వాడిని పైగా ఆ పక్క కాలనీ వాడిని. ఒక్కసారిగా బెజవాడ వీధులన్ని కళ్ళకి కట్టినట్టు కనిపిచ్చాయి.
భవదీయుడు
శివలెంక
మేఘాంగన గురించి rama bharadwaj అభిప్రాయం:
03/03/2011 2:14 pm
“హల్లకములుల్లసిల్లగ” పద్యంలో “శయ్యకు” అని ఉంచండి. చివరి లైన్ లో అచ్చుతప్పు పడింది “శుయ్యకు” అని. గమనింపగలరు. మంచి పద్యమ్ . దాని అందాన్ని ఆ అచ్చుతప్పు అడ్డుకుంటోంది.
రమ.
[ధన్యవాదాలు. సవరించాం… సం.]
మూడు లాంతర్లు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:
03/03/2011 1:54 pm
“సృజన “ని గురించి సృజనాత్మకులని గురించీ ఇంత అమాయకమైన విశ్లేషణ ని నేను ఇంతవరకూ చదవలేదు. ఈ వ్యాసం లో ఎక్కడా చదివించే గుణమ్ కనిపించలేదు. నస చాలా ఉంది. అయోమయమ్ బోలెడుంది. విషయ వివరణలో కనకప్రసాద్ శైలి ఒక అడ్డంకి కాగా… ఆయన చెప్పదలుచుకున్న విషయంలో విస్తృతంగా కన్పించే అనేకమైన ఖాళీలూ …కప్పదాట్లూ మరో అడ్డంకి. సహనాన్ని పరీక్షించే చాటభారతమ్ లా నడవడమ్ ఈ వ్యాసమ్ లోని ప్రధాన మైన లోపమ్ . ఇందువలన ఆయన చెప్పే విషయమ్ మీద ఆసక్తి కలగడమ్ లేదు .రాళ్లపల్లి గడుసో భోళానో కనకప్రసాద్ చెప్పిన తీరు నవ్వు తెప్పించేలా ఉంది. ఇందుకు కూడా బిపిన్ గారిదో లేక కార్ల్ యుంగ్ గారిదో పోనీ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారిదో ఒక కొటేషన్ ని కనకగారు ఎందుకో మరి ఇవ్వలేదే?? అన్నీ ఇంగ్లీషులోనే అన్నోటి మహత్తరమైన విషయాలుంటే అసలు ఇంక తెలుగు లో నించి తెలుగు వాళ్ళకి చెప్పేందుకు ఏమున్నాయో?? ఈ వ్యాసమ్ కూడా ఇతర సృజనలలోని విశ్లేషణ ప్రకారమ్ కలిసికట్టుగా రచయితా_ పాఠకుల సమిష్టి కృషి ఫలితమే అయితే గనక … ___ఇందులోంచి పాఠకురాలిగా నా వాటాని నేను ఉపసంహరించుకుంటున్నాను.
రమ.
మూడు లాంతర్లు – 2 గురించి kanakaprasAd అభిప్రాయం:
03/03/2011 10:45 am
మీరు చెప్పమన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం చెప్పుకుని ముందుకి వివరంగా చెప్పాలి. ఒకటోది చూడండి – వీళ్ళు తమ వ్యక్తిత్వ పరిణామ క్రమంలో చిన్న పిల్లలకుండే మౌలికమైన స్వభావాన్ని సాంతం పోగొట్టుకోకుండానే పెద్దవాళ్ళవుతారట. దీనికి జంతుశాస్త్రం నుండి, మనస్తత్వం నుండి మంచి చర్చ ఉంది. అది వివరంగానే చెప్పాలి, ఇక్కడ అవకాశం లేదు. రెండోది – వీళ్ళు వెర్రివాళ్ళు, అంటే ఒకరకమైన eccentrics. వెర్రిని అర్ధం చేసుకోడం సమస్యే గాని అసాధ్యం ఏమీ కాదు. మరి దీనిమీదా ఎన్నో మంచి విషయాలున్నాయి. దురదృష్టవశాత్తు ఇవన్ని ఇంగ్లిష్ లోనే ఉన్నాయి. శ్రీశ్రీగారిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చాలామంది అన్నారు. త్రిపుర ఇంతే. గద్దర్ గార్ని, వేటూరి సుందరరామ్మూర్తి గార్ని టీవీలో చూసినా బోధపడుతుంది, ముఖ్యంగా వాళ్ళు పాటల సంగతి ఎత్తుకున్నప్పుడు. వేలూరి శివరామశాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారిని గురించి ఎక్కువ ఏమీలేవు. ఉన్నమటుక్కి చదివితే ఈ సంగతే బోధపడుతుంది. వాళ్ళు బోళా మనుషులని…
మూడు లాంతర్లు – 2 గురించి Madhav అభిప్రాయం:
03/03/2011 10:33 am
[రచయిత ప్రస్తావించిన మాలిఖ – వెల్చేరు నారాయణరావు వ్యాసం – ఈమాట జనవరి 2000 సంచికలో ప్రచురించబడింది – సం.]
మూడు లాంతర్లు – 2 గురించి Kameswara Rao అభిప్రాయం:
03/03/2011 9:17 am