ఆంధ్రభారతి ద్వారా అంధ్రభారతి కి శేషతల్పశాయి గారు మంచి సేవ చేస్తున్నారు. వారి సైటుని ఇప్పుడే చూసాను. నేను చెప్పిన ” శబ్దార్ధ దీపిక” చాలా ముఖ్యమైన నిఘంటువు. శబ్దరత్నాకరం కన్నా కూడా… చాలా ఉపయుక్తమైనదీను. దానిని ఎవరూ పునర్ముద్రించడమూ లేదు. ఎవరైనా ఈ నిఘంటువుని గురించి తప్పక వెతికి కంప్యూటరైజ్ చేసేందుకు ప్రయత్నించాలి. శాయి గారూ !! దీనిని నేను చూసాను. ఎన్నో నిఘంటువులకన్నా ఇది ఎంతో మేలైనది. దీనిని కూడా మీరు చేర్చండి. మీ ఆంధ్రభారతిలో. అప్పుడు ఎక్కువ మేలు కలుగుతుంది అర్ధాలు తెలుసుకోదలిచిన వారికి. ముసునూరి వేంకటశాస్త్రి గారు ఈ నిఘంటువుని రూపొందించిన వారు. సికింద్రాబాదులో అచ్చయ్యింది 1957 లో. సుమారు ఒక 1500 పేజీల ఉద్గ్రంధం ఇది. ఇదివరకు ఒక సారి నేను దీని ప్రస్తావన ఈమాట లో చేసాను కూడాను. అయితే ఇవాళ ఇది ఎక్కడ దొరుకుతుందో నాకు కూడా తెలియదు. మీరు తప్పక ప్రయత్నించ గలరు. ఆంధ్రభారతిని గురించి చెప్పిన మోహనగారికీ..శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. గొర్తి బ్రహ్మానందం గారూ, “శబ్దార్ధ దీపిక” మీ దగ్గర తప్పక ఉండాల్సిన నిఘంటువు సుమా !!
శ్రుతిపేయంగా మార్చమని సంపాదకులకి మనవి చేసుకుంటున్నాను.
శ్రుతపేయం అని రాసాను. అది నా పొరపాటే! ఈ చర్చ వల్ల రాళ్ళపల్లి వారి వ్యాసాలన్నీ మరలా తిరగేసాను. ఆయన శ్రుతిపేయమనే రాసారు.
తప్పును సరిదిద్దినందరికీ కృతజ్ఞతలు!
రమగారు, శ్రీ శేషతల్పశాయిగారి కృషివలన తెలుగు నిఘంటువును పదాలకు, వాటి ప్రయోగాలకు పరిశోధించడానికి వీలవుతుంది. వారి ఆంధ్రభారతి సైటులో ( http://www.andhrabharati.com/dictionary/index.php ) ఈ పరిశోధనను చేయవచ్చును. విధేయుడు – మోహన
1. కఱ్ఱ చట్రంబు పద్యము తేటగీతి, ఉపజాతియైన తేటగీతికి ప్రాస ఐచ్ఛికము, నియతము కాదు. 2. ఱ-కారానికి, ర-కారానికి ప్రాస చెల్లుతుంది. నన్నయ, నన్నెచోడుని లాటి కవులు మాత్రమే రఱల ప్రాస సాంకర్యము చేయలేదు. తరువాతి కవులు ఈ ప్రాసను అంగీకరించారు. ప్రస్తుతము రఱల ఉచ్చరణ భేదము లేదనే చెప్పాలి. విధేయుడు – మోహన
నేను ఒక సాహిత్య విద్యార్థిని. 1984లొ ,అమృతం కురిసిన రాత్రి-వాక్యలయ భావపోషణ అన్న అంశంపై ఎంఫిల్ కేంద్రవిశ్వవిద్యాలయం నుండి పొందాను. ఆధునిక కవిత్వంలో ‘నేను’ అనే అంశంపై 1990 లో అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశాను. నావద్ద ఈ చర్చకు సంబంధించి నేను రాసినవి, మంచి వ్యాసాలు, మీ సందేహాలను తీర్చగలవి ఉన్నాయి. నాఅచ్చైన పుస్తకాల నుండి మీకు ఎలా పంపాలో నాకు తెలియటం లేదు. ముఖ్యంగా వచన కవిత్వంలో పాదవిభజనకు సంబంధించి నా గమనింపులు కొన్ని ఉన్నాయి. నా లాప్‌టాప్ లో కీమాన్, ఐలీప్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఆ వ్యాసాలను పంపటం సాధ్యమేనా?
పద్యం అనే మాట ను నేను కవితలోని స్టాంజాగా స్వీకరించాను. కవితలో కొన్ని పద్యాలు ఉండటంలో ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను. పాదవిభజన సాధారణంగా భావ విశ్రాంతిని అనుసరించి ఉండటం నేను గమనించాను. ఇక ఒక పాదాన్నో, మాటనో, పునరావృతం చేసి, హైఫన్ ను ఉపయోగించి, లేక ఒకేపదాన్ని ఒకపాదంగా చేసి , కవులు తాము చూపదలచుకొన్నప్రభావాన్ని చూపుతున్నారు. బైరాగి ‘నాక్కొంచం నమ్మకమివ్వు లో హైఫన్ను ఉపయోగించుకొన్నాడు ఆ కాలంలోనే. ఇక కవిత్వంలో శబ్దం నిశ్శబ్దం అనే వ్యాసంలో నేను వచనకవి వాడుతున్న ఎన్నో సాంకేతిక విన్యాసాలను చర్చించాను. ఆ వ్యాసాన్ని మీకు ఎలా పంపాలో నాకు తెలియటంలేదు. వ్యాసంలో అయితే ఒక్కొక్కొక్క విషయం క్రమపద్ధతిలో ఉంటుంది.
డా.వై. కామేశ్వరి.
[ఒకసారి ప్రచురితమైన సమకాలీన రచనలకు సామాన్యంగా ఈమాటలో స్థానం లేదు, కొన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో తప్ప. మీ వ్యాసాలను ఈమాట చర్చావేదికలో పంచుకోండి. ఈ విషయంలో మీకు సహాయం కావాలంటే editors@eemaata.com చిరునామావద్ద మాతో సంప్రదించండి … సం.]
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
03/23/2011 2:10 pm

రమ.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
03/23/2011 12:55 pm
అందరికీ,
శ్రుతిపేయంగా మార్చమని సంపాదకులకి మనవి చేసుకుంటున్నాను.
శ్రుతపేయం అని రాసాను. అది నా పొరపాటే! ఈ చర్చ వల్ల రాళ్ళపల్లి వారి వ్యాసాలన్నీ మరలా తిరగేసాను. ఆయన శ్రుతిపేయమనే రాసారు.
తప్పును సరిదిద్దినందరికీ కృతజ్ఞతలు!
-బ్రహ్మానందం
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి మోహన అభిప్రాయం:
03/23/2011 12:11 pm
రమగారు, శ్రీ శేషతల్పశాయిగారి కృషివలన తెలుగు నిఘంటువును పదాలకు, వాటి ప్రయోగాలకు పరిశోధించడానికి వీలవుతుంది. వారి ఆంధ్రభారతి సైటులో ( http://www.andhrabharati.com/dictionary/index.php ) ఈ పరిశోధనను చేయవచ్చును. విధేయుడు – మోహన
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
03/23/2011 12:11 pm
ఆంధ్రభారతి నిఘంటువు శోధన లింకు ఇక్కడ.
శబ్దార్థ దీపిక నిఘంటువు ఇంకా కంప్యూటరీకరించబడలేదు.
మేఘాంగన గురించి మోహన అభిప్రాయం:
03/23/2011 12:05 pm
1. కఱ్ఱ చట్రంబు పద్యము తేటగీతి, ఉపజాతియైన తేటగీతికి ప్రాస ఐచ్ఛికము, నియతము కాదు. 2. ఱ-కారానికి, ర-కారానికి ప్రాస చెల్లుతుంది. నన్నయ, నన్నెచోడుని లాటి కవులు మాత్రమే రఱల ప్రాస సాంకర్యము చేయలేదు. తరువాతి కవులు ఈ ప్రాసను అంగీకరించారు. ప్రస్తుతము రఱల ఉచ్చరణ భేదము లేదనే చెప్పాలి. విధేయుడు – మోహన
అన్నీ చెప్పగల భాష గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
03/23/2011 1:11 am
ఈ కవిత అనేక పదేళ్ళ కవిత్వ సంకలనంలో చోటు చేసుకున్నది.
అభినందనలు
బైపోలార్ భూతం గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
03/23/2011 1:04 am
ఈ కవిత అనేక పదేళ్ళ కవిత్వ సంకలనంలో వచ్చినది.
అభినందనలు
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి yaddanapudi kameswari అభిప్రాయం:
03/22/2011 1:22 pm
నేను ఒక సాహిత్య విద్యార్థిని. 1984లొ ,అమృతం కురిసిన రాత్రి-వాక్యలయ భావపోషణ అన్న అంశంపై ఎంఫిల్ కేంద్రవిశ్వవిద్యాలయం నుండి పొందాను. ఆధునిక కవిత్వంలో ‘నేను’ అనే అంశంపై 1990 లో అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశాను. నావద్ద ఈ చర్చకు సంబంధించి నేను రాసినవి, మంచి వ్యాసాలు, మీ సందేహాలను తీర్చగలవి ఉన్నాయి. నాఅచ్చైన పుస్తకాల నుండి మీకు ఎలా పంపాలో నాకు తెలియటం లేదు. ముఖ్యంగా వచన కవిత్వంలో పాదవిభజనకు సంబంధించి నా గమనింపులు కొన్ని ఉన్నాయి. నా లాప్‌టాప్ లో కీమాన్, ఐలీప్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఆ వ్యాసాలను పంపటం సాధ్యమేనా?
పద్యం అనే మాట ను నేను కవితలోని స్టాంజాగా స్వీకరించాను. కవితలో కొన్ని పద్యాలు ఉండటంలో ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను. పాదవిభజన సాధారణంగా భావ విశ్రాంతిని అనుసరించి ఉండటం నేను గమనించాను. ఇక ఒక పాదాన్నో, మాటనో, పునరావృతం చేసి, హైఫన్ ను ఉపయోగించి, లేక ఒకేపదాన్ని ఒకపాదంగా చేసి , కవులు తాము చూపదలచుకొన్నప్రభావాన్ని చూపుతున్నారు. బైరాగి ‘నాక్కొంచం నమ్మకమివ్వు లో హైఫన్ను ఉపయోగించుకొన్నాడు ఆ కాలంలోనే. ఇక కవిత్వంలో శబ్దం నిశ్శబ్దం అనే వ్యాసంలో నేను వచనకవి వాడుతున్న ఎన్నో సాంకేతిక విన్యాసాలను చర్చించాను. ఆ వ్యాసాన్ని మీకు ఎలా పంపాలో నాకు తెలియటంలేదు. వ్యాసంలో అయితే ఒక్కొక్కొక్క విషయం క్రమపద్ధతిలో ఉంటుంది.
డా.వై. కామేశ్వరి.
[ఒకసారి ప్రచురితమైన సమకాలీన రచనలకు సామాన్యంగా ఈమాటలో స్థానం లేదు, కొన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో తప్ప. మీ వ్యాసాలను ఈమాట చర్చావేదికలో పంచుకోండి. ఈ విషయంలో మీకు సహాయం కావాలంటే editors@eemaata.com చిరునామావద్ద మాతో సంప్రదించండి … సం.]
కాలనీ భోగి గురించి Murthy Akella అభిప్రాయం:
03/21/2011 4:23 am
కథ బాగుంది, మొదట్లో మరేందిరా సతీష్ గా, హైదరాబాద్ పదప్రయోగంలాగా లేదూ? విజయవాడ బేక్ డ్రాప్ లో కథ కదా !
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి Murthy Akella అభిప్రాయం:
03/21/2011 4:08 am
కథ బాగంది, కాని ఎందుకో డ్రై గా, కృతకంగా అనిపించింది,బహుశా సత్యవతి పాత్ర చిత్రణలో, పాప్యులర్ తెలుగు సీరియల్ ఛాయలున్నాయేమో !