పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి R.P.Sharma అభిప్రాయం:

    07/07/2011 7:18 pm

  2. చిట్ట చివరిది గురించి Lakshmi అభిప్రాయం:

    07/07/2011 4:26 pm

    కథ చాలా సరళం గ ఉంది.కథ చెప్పిన తీరు కథ లా కాకుండా సొంత అనుభవం లా అనిపించింది.

  3. వేటూరి పాట గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:

    07/07/2011 7:04 am

    వ్యాసం మొత్తం మీద అభిప్రాయం తరవాత సంగతి గానీ,చంటి సినిమాలోని అన్నులమిన్నల అన్నపాట నాకు తెలిసినంతవరకూ సాహితి రాసింది.వ్యాసకర్త ఆపాటను వేటూరి కోటాలో వేసారు.

  4. రాగలహరి: మోహనం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/07/2011 6:18 am

    గోపాలకృష్ణ గారికి:

    గత ఆరు మాసాలుగా వృత్తి పని మీద జర్మనీలో ఉంటున్న నేను “ఈమాట” చూట్టం లేదు. శుద్ధ మోహనం అన్న రాగం లేదు అన్నది మీకూ తెలుసు కదా. మోహన రాగంలో వాడాల్సిన స్వరాలు మాత్రమే వాడాలి అన్న అర్థంతో మాత్రమే “శుద్ధమోహనం” అన్నది వాడాను. అంతకు తప్ప మరే అర్ధమూ లేదు. మరెవరో “శుద్ధ హిందోళం” కూడా ఇలా వాడినదే!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా? గురించి m.srinivas అభిప్రాయం:

    07/07/2011 6:16 am

    ఇప్పుడొస్తున్న సాహిత్యంలో కొన్ని మంచి రచనలు లేకపోలేదు. వస్తువు విషయంలో గానీ, వ్యక్తీకరణలో గానీ, తెలుగు రచయితలు ఇదివరకటికన్నా గాఢతనూ, పరిపక్వతనూ సాధించారు. మూస పోసినట్లు కాకుండా భిన్న కోణాల్లోంచి జీవితాన్ని చూడడం చూపించడం ఇటీవలి రచనలలోనే ఎక్కువ కనబడుతోంది. Post Modernism , magic realismవంటి ధోరణుల ప్రభావం తెలుగు సాహిత్యం మీద కొంత మేరకు పడి మనకు కొంత మంచి సాహిత్యాన్నిచ్చింది. అలాగే వ్యక్తిగత అనుభవాలనూ, అనుభూతులనూ కథల్లోనూ కవిత్వంలోనూ బలంగా చిత్రించడం ఇటీవల బాగా ఎక్కువగా కనబడుతున్న పరిణామం. అనుభూతివాదులు ఎప్పట్నుంచో ఈ ధోరణిలో రాస్తున్నా, 90వ దశకం వచ్చే వరకూ దానికి తగినంత గుర్తింపులేదు. వైయక్తిక అనుభవాలను తమ సిద్ధాంతాలకు వాహకంగా దళిత స్త్రీవాద సాహిత్యకారులు వాడడం వల్ల వాళ్ళ సాహిత్యంలో ఒక గాఢత, ఒక చిక్కదనం కనబడ్డాయి. అందువల్లే ఇవాళ ఈ తరహా సాహిత్యానికి ఒక కొత్త ప్రాముఖ్యత ఉంది.

  6. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి రాణి. అభిప్రాయం:

    07/07/2011 4:58 am

    ఇందులోని కథాంశం సామాన్యమైనది కాదు. రెండు విభిన్నమైన ప్రపంచాలు రెండు విభిన్నమైన ఆర్ధిక పరమైన అంతరాలు రెండు విభిన్నమైన సామాజిక అస్తిత్వాలు వీటి మధ్య నలిగిపోతున్న బాల్యం. దీన్ని కథగా మలచడం అంత సామాన్యమైన విషయం కాదు. ఆ అసామాన్యతని సాధించినందుకు అభినందనలు.

    అయితే, కథా వస్తువుని కథగా మార్చే కళపేరే కథా శిల్పం. దాన్ని సాధించడానికి కేవలం మాండలికం మీదా మరీ ముఖ్యంగా అటు వచ్చీరాని ఇంగ్లీషు ఇటు తెలిసీ తెలియని తెలుగు తీపిదనం ఈ రెండింటి మధ్యా నలిగిపోయే పిల్లల భాషని పట్టుకోవడంమీదా దాన్ని పాఠాల్లో ప్రయోగించడంమీదా పట్టు సాధించగలిగితే చాలదు. ఈ పట్టుని ఉపకరణంగా వాడుకుని కథా వస్తువుని వికసింపజేయడం అవసరం. కథా వస్తువులోని సంఘర్షణాయుతమైన చైతన్యాన్ని కలగా పులగమ్ భాషద్వారా వ్యక్తం చెయ్యడం కూడా అంత సులభం కాదు. ఆ విషయంలో కూడా ఈ కథ అభినందించదగినదే. కానీ దాని ద్వారా కథావస్తువుకి తగిన పుష్టిని చేకూర్చాలి. ఈ విషయంలో ఈ వస్తువుకి ఫోటోగ్రాఫిక్ కథాకథన సంవిధానం పనికి రాదు. కేవలం ఒక సంఘర్షణాయుతమైన దృశ్యాన్ని ప్రదర్శించడం ద్వారా వస్తువుకి తగిన న్యాయం చెయ్యడం అసాధ్యం. కథా వస్తువుని కళగా మార్చే క్రమంలో రచయితకి తెలిసి కొంతా తెలియకపోయినా చుట్టూవున్న పరిసరాలూ చదివిన సాహిత్యమూ ఆలోచింపజేసిన సంఘటనలూ సన్నివేశాలూ తారసపడిన వ్యక్తులూ వ్యక్తిత్వాలూ మొదలయినావాటి ప్రభావం వల్ల మరికొంతా కసరత్తు జరుగుతుంది. జరగాలి. అలా జరగకపోతే ఎంత గొప్ప కథాశిల్పరహస్యాలు తెలిసిన రచయిత అయినా భాషాశాస్త్రవేత్త అయినా సౌష్ఠవమైన కథ రాయలేడటానికి ఈ కథని కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రచయిత మనసులో జరిగే కసరత్తుని ఎప్పటికప్పుడు పువ్వు పిందె కాయ దోర పండు ఈ దశలన్నింటినీ దాటి మిగలముగ్గిన విషయాన్ని గ్రహించగలిగే నేర్పూ పక్వమయ్యేంతవారకూ నిగ్రహం వహించగల ఓర్పూ చాలా అవసరం. అది లేకపోతే మంచిమంచి కథా వస్తువులకి అన్యాయంచేసినట్టవుతుంది. రచయితలందరికీ ఈ ఎరుక వుండవలసిందే.

  7. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి nagamurali అభిప్రాయం:

    07/07/2011 3:37 am

    నాకు తెలిసిన యాస కాబట్టి బోరు కొట్టకుండా చదవగలిగేను. టెరిఫిక్ రీడ్. కదిలించే కథ.

  8. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి yasasvi అభిప్రాయం:

    07/06/2011 11:46 pm

    కనకప్రసాద్ గారూ!!

    తప్పేం లేదు లెండి. ఒక ముఖమ్ అనేక పేర్లూ అయితే. విష్ణుసహస్రమ్ లేదూ? పారాయణ చేస్తాం గానీ.. పట్టించుకోకుండా ఉండలేం కదా? ఎవరైతే ఏం లెండి. రూపం కాదు నామమూ కాదు. మాటల్లోని సారం ముఖ్యం ఎప్పుడైనా. అవునా?? మీలాగే నాకూ మా అమ్మే “ధిషణ” గురించి నేర్పింది. అందువల్ల అమ్మలంతా ప్రాతహ్స్మరణీయులే !అయినా సత్యాసత్యాల విచికిత్స వైపు వెళ్ళడం ఖచ్చితంగా మంత్రనగరి సరిహద్దులు ముట్టుకోవడమే! దానివల్ల తేలిందీ లేదు తేలేదీ లేదు. త్రిపుర చెప్పినా.. నామిని చెప్పినా జయప్రభ చెప్పినా లేదూ ఇమ్మన్యుయేల్ కాంట్ చెప్పినా నోంచాంస్కీ చెప్పినా.. లేదూ బుధ్ధుడూ… శంకరుడూ చెప్పినా !!

    అయితే సత్యాన్వేషణ ఆగిపోతుందా?? పోదు. ప్రయాణం ప్రయాణమే!! కాకపోతే మళ్ళీ సత్యం ఏదన్నదే సమస్య. ప్రతిరోజు పొద్దుపొడుపూ ఏ ఒక్కలా ఉండనప్పుడు..మనం ఏ పొద్దుపొడుపు గురించి ఇదే సత్యమైనదని అనుకోగలం నమ్మగలం ఆవిష్కరించగలం?? ప్రస్తుతానికి ఒక సూర్యుడుని విశ్వసించి బతకాల్సిందే. నాకు తెలిసి మరి వేరు దారిలేదు.

    యశస్వి.

  9. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    07/06/2011 9:25 pm

    బాగా గుర్తు చేసారు. థాంక్యూ!
    నమస్సుల తో-
    ఆర్.దమయంతి.

  10. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి కనకప్రసాదు అభిప్రాయం:

    07/06/2011 6:33 pm

    యశస్వి గారు, మీరు చెప్పొద్దు అని గట్టిగా అంటే చెప్పుకోవాలని ఉన్నాది. ఉండబట్టదు. నా ఏడుపేదో నేనేడుస్తుంటే చాల నవ్విస్తారు మీరు. నవ్వాపుకోలేక మరి మంత్ర నగరి సరిహద్దులు ముట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు ఊరుకున్నా ప్రశాంత్ గుండవరమ్ గారు, రమా భరద్వాజ గారు ఏమైనా అనుకుంటారేమో అని తెగించి. తప్పైతే మరి మీ ముగ్గుర్లో ఎవరో ఒకరూ గుండేసి కొట్టీయండి. అన్నీ అబద్ధాలే కాదు యశస్వి గారు. ఉదాహరణకు మీకు, ప్రశాంత్ గారికి, రమా భరద్వాజ గారికీ జయప్రభ గారంటే గొప్ప అభిమానమ్. అది కళ్ళెదుటి వాస్తవమ్. జూటా కాదు. అలాటి అసలీ అభిమానులుండటమ్ గొప్ప విషయమ్. ‘జో అసలీ మోతీ హోతే హైఁ వో బినా రంగ్ కే హోతే హైఁ’ అని కవిగారన్నారు కదా. నాకేమో త్రిపురంటే నామిని సుబ్రమణ్యం నాయుడు గారంటే అభిమానం. అదీ జూటా కాదు. మీ ముగ్గురి మాటలు చదివినప్పుడల్లా నేను మా అమ్మని తల్చుకుని, ఆవిడి కాళ్ళకి మనసులోనే మొక్కుకుంటాను. ‘ధిషణ’ అంటే ఏమిటో మా అమ్మే నాకు విడమర్చి చెప్పేది, చూపించేది. అది నాకు అర్ధం కానే కాదు. అయినంతమాత్రాన జూటా అయిపోదు. కొందరికి అలాగుంటాది కాబోలు అనుకున్నాను; కోపగించుకోను. మీరు ఆవిడతో సమానం; మీతో ఎక్కువ ఇగటాలాడితే కళ్ళు పోతాయి. మీ ఉపదేశమ్ జ్ఞాపకమ్ పెట్టుకుంటాననే అనుకుంటున్నాను గాని మనిద్దరం ఒప్పుకుంటున్నట్టు – కికారపు బుద్ధి. మాయ చేస్తుంది. ఆట్టే నవ్వకుండా నా ఏడుపేడుస్తాను మళ్లీ: జూటాల్లో చాలా రకాలుంటాయమ్మ – shades of truth లాగ. వాటన్నిట్నీ తవ్వి తవ్వి తలపోసుకుంటే కొందరికి చాల ఆనందంగా ఉంటుంది, Kant, Chomsky, Derrida ఇలాగ వందలాదిమంది. మీరన్నట్టు సత్యాసత్యాల నిగ్గు తేల్చుకుందామని చిలకట్లెగ్గట్టుకోని బయల్దేరేరు. అన్నీ అందరికీ ‘సత్తెం’ కావు అని. అలాటి వాళ్ళ చరిత్రలు, వాళ్ళన్న మాటలంటే నాకు పిచ్చి ఇష్టం, తవ్వుతున్నకొద్దీ ఆనందం. త్రిపుర, నామిని అలాటి మనుషులు – నాకు… ఈమాట వాళ్ళు ఒద్దు ఒద్దన్నా వేస్తున్నారు. అంతకంటే ఏమీ లేదు.