పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి k.v.rama krishna అభిప్రాయం:

    09/20/2011 9:42 am

    శ్రీశ్రీ రాతకి బాపూ గీత తెలుగువాడి అదృష్టం.

  2. కోనసీమ కథలు: సత్తెవతి గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    09/19/2011 6:18 pm

    బ్రహ్మానందం గారూ…కథ చాలా బావుందండీ. చల్లని సాయంత్రం మంచి కథ చదివిన అనుభూతి కలిగింది. కథ ముగి౦పు మానవతను ప్రతిబింబించేలా చాలా బావుంది.

  3. రావణుడి తలలు గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    09/19/2011 6:02 pm

    గిరి గారూ…కొత్త ప్రయత్నం చేసినట్లున్నారు. మీ కథలు ఎక్కువగా అమెరికా నేపద్యం లోనివే చదివాను.
    కథ బావుంది. కథ పేరు వైవిద్యంగా వుంది.

  4. శ్రీపాదరాయలు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    09/19/2011 12:03 am

    జడమైన గుండె కి ‘స్పర్శ’ మణిప్రభవం – సంకీర్తనం!
    **********

    గౌరవ నీయులైన శ్రీ మోహన గారికి !
    నమస్తే.

    హరి నామ సంకీర్తనములకు మూల పురుషు డైన శ్రీ పాద రాయలు గురించి మీరు వ్రాసిన వ్యాసాన్ని పొల్లు పోకుండా చదివివించిందీ.. అంటే అందుక్కారణం -. మీ రచనా విధానం! ఆ వాగ్గేయ కారుని భక్తి, తత్వజ్ఞాన పద సంపదాసమూహం, సమ్మోహనం!
    శ్రీ పాద రాయల బాల్యం, ..అతర్వాత సంఘటనలు ..అంతా కళ్ళ కట్టినట్టు ఒక కథలా చెప్పారు. కన్నడంలో రాసిన ఆ మహానుభావుని కృతులకు మీ తెలుగు అనువాదం రస రమ్యంగా వుంది. అక్షరాలు చక్కని సొగసు తేలాయి. మనసుని భక్తి భావంలో ముంచి తేల్చాయి. భగవంతుని పట్ల జడ మైన గుండె కి ఒక స్పృహని, స్ప ర్శ ని కలిగించే వైద్యం – వాగ్గేయ కారుల భక్తి పదం, పథం – హరి నామ సంకీర్తనం!

    హరిపాదోదక మీ కావేరి
    విరజానది స్నానముజేసి

    అని చదవంగానె, భక్తి నదిలో మునకేసినట్టుంటుంది. అక్షరాల అంచుల్లోంచి ఒక పవిత్రతా భావం జాలు వారుతూ… తీపితేనెవాన తుంపరలు చిమ్ముతున్నట్టు… అనిపిస్తుంది. ఎంత మధురంగా వుందీ భావం!

    కాలికి యందము హరియాత్రలె
    ఆలయపు టందము తులసి బృందావవనము
    చాల యందము చెవికి విష్ణు కథలు

    ఇక్కడ ప్రహ్లాదుడు కనిపిస్తాడు..చేతులు జోడించి హరిని సంకీర్తిస్తున్నట్టు! ‘మస్తకమున పర వస్తు’ అని అంటున్న ఈ వాగ్గేయ కారుని మాటలకు ప్రత్యేక విశ్లేషణ ఏదైనా వుండి వుండాలేమో ననిపిస్తుంది. అలాగే.. ‘మనసిజపితునికై..’ అంటున్నప్పుడు కూడా!

    దయకై తనుమనధనమ్ము లన్నిటి
    నీదు పదకమలములం దుంచితిని
    మఱిక నన్ను మాయ జేసెదవె
    సరకు నొసగితిని పిదప సుంక మేల నయ్యా..

    చదువుతూ వుంటేనే, కళ్ళు చెమ్మ గిల్లుతాయి. భగవంతుని పాదారవిందాలు దర్శనమౌతాయి. భక్తుని ఆవేదన, గళం లో ఆర్ద్రత అంతా కలసి ‘ సరుకు నొసగితిని కదా, మరి సుంకమేల నయ్యా!’ అని బేలగా అడుగుతున్నప్పుడు..ఆయన గొంతు జీర బోయి వుండెనేమో!…అన్న భావన నాకెంతో గొప్ప అనుభూతినిచ్చింది. భగవంతుణ్ని ప్రేమించి , తపించి, వెత చెందే హృదయం లోంచి పొంగే భక్తి రస భావ తరంగా లే.. వాగ్గేయ కారుల కీర్తనలు. అవి సజీవ నదులు. సంగీత స్వరాలను దారులు గా చేసుకుని, అమృత ధార లై ప్రవిహిస్తూ వుంటా యి ! అందుకే, ఎంత పానం చేసినా గానాన్ని, ఇంకా దాహం గానే వుంటుంది. కారణ జన్ములు. తపో ధనులు, భక్తి జ్ఞాన సంపన్నులు – వాగ్గేయ కారులు. సృష్టి కర్తకు, సంసార బంధులకు,బందీలకు మధ్య వారు సంధాతలు!

    కాకుంటే, ఎంత తపిస్తే దక్కేను సామాన్యులకు! ఈ కావేరినది తీరాన ఈ విఠలుని సందర్శనం !?

    మీ రచనలో మరి కొన్ని సరి కొత్త విషయాలను కూడా చదివి తెలుసుకోవచ్చు. ‘సావి రహే..’ పాటకి ముందు యమునా తీర.. శ్లోకాన్ని పాడాలని మీరొక నిజాన్ని తెలియ చేసారు. (కాని,సినిమా పాటలో ఈ సాంప్రదాయం అనుసరించినట్టు లేదు. కదూ!) అలాగే, ఉగా భోగము అంటె ఒక రాగా లాపన అని, ఐతె, అది అర్థవంతమైన పదాలతో కూడి వుంటుందనే కొత్త విషయం కూడా తెలుసు కోవచ్చు.

    ఇక వృత్త మాలిక, దండకము, భ్రమర గీతం, వేణు గీతము.. వీట్లకి తెలుగు అనువాదం చాలా బాగుంది.

    నిజమే! కన్నడం వచ్చిన వారికి శ్రీపాద రాయల వారు రాసిన కన్నడం సులభంగానె వుండొచ్చు! అయితే, ఆ భాష రాని మన వారికి మాత్రం, తెలుగు లో మీ అనువాదాలు రసరమ్యంగా వున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరిక్కడ పేర్కొన్న సంగీత సూచనలను అనుసరిస్తూ.. కీర్తనలను ఆలపించే అవకాశాన్ని ఈమాట పాఠకులకు కలగ జేసారు. స్వరార్చన చేసుకునే హరి గాన ప్రియులు – ఇదొక అదృష్టంగా భావిస్తారు.

    సొంపుచూపుల సొబగు సోగ కనులకు శరణు
    సంపంగి కుసుమంపు నాసికకు శరణు
    గుంపు రత్నపు కర్ణకుండలములకు శరణు
    ఇంపుటద్దమొ యను కపోలములకు శరణు

    ఇక్కడ నాకు అన్నమాచార్యుల కీర్తన లోని పదాలు చటుక్కున గుర్తుకొచ్చాయి

    కులికెడి మురిపెపు కుమ్మరిపు తన
    సళుపు చూపులకు చాంగు భళా
    పలుకుల సొలపుల పతితో కసిరెడి
    చలముల యలుకకు …” .

    ‘కర్ణాటక సంగీతానికి పటిష్ఠ మైన పునాది వేసిన వారు శ్రీపాదరాయలు’ అని అన్నారు. నేనూ కర్ణాటక సంగీతం వింటూ వుంటా అప్పుడప్పుడు.! మీరన్నట్టు వాగ్గేయకార త్రయం లా.. వీరి పేరు ఎక్కువ గా నేను విన లేక పోయా మరి!
    ఈ సాహిత్య వ్యాసాన్ని విపులీకరించి, విశదీకరించి రాయడంలో గల మీ కృషిని, శ్రధ్ధా సక్తులను మనఃస్ఫూర్తి గా ప్రశంసిస్తూ… కర్ణాటక సంగీత సాహిత్య పద పితామహుడైన శ్రీ పాద రాయల వారికి వందనములిడుతూ…

    గౌరవాభినందనలతో –
    ఆర్.దమయంతి.

  5. మీరు కవిత్వం ఎందుకు రాస్తారు? గురించి k.v.rama krishna అభిప్రాయం:

    09/18/2011 9:15 am

    There is a lot of clarity in Mr. Esmail’s thought and speech. It is very much required for the contemporary poets.

  6. మన సంస్థలు – మన సంస్కృతి గురించి Saradhi Motamarri అభిప్రాయం:

    09/17/2011 8:19 am

    Well said Veluri garu. Sometime ago I had interacted with a world event organizer. I told the gathering that its not enough we Telugus meet talk Telugu is blah blah. If we atleast get one non-Telugu to attend and make him appreciate our language and culture, then we are really achieving something. Then the organizers tried to convince me that the purpose is to enhance personal network, not to worry much about Telugu!

  7. మన సంస్థలు – మన సంస్కృతి గురించి ranichintam అభిప్రాయం:

    09/17/2011 2:25 am

    This reminds me good old write up Tana Thandana-Rani

  8. రావణుడి తలలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/16/2011 1:46 pm

    అబ్బా!! ఎంత నెగిటివ్ స్టోరీ. ఒక సిక్ మైండ్ అమ్మాయి కధ ఇది అనుకున్నా.. కధ ఏమీ చదవనివ్వలేదు సరి కదా చికాగ్గా అనిపించింది. ఒకే వేపు నించి అన్యాయంగా అకారణమైన ద్వేషాన్ని చూపించుకుంటూ- ఒకే ఒక పాత్ర తనని తాను నిందించుకుంటూ తన ద్వేషాన్ని తాను అలా సదా భరిస్తూ.. సదా చెడ్దగా ఉండాలని అనుకోడం.. ఇదేం కధ?? కధ అంతా మోనోలోగ్ ధోరణి పైగా! ఆ పాత్రలో అంత నిరాశ అంత కోపమ్ అంత విపరీతమైన ద్వేషమ్ ఎందుకబ్బా?? మిగతా అందరూ మచివాళ్ళే అయి శారద ఒక్కతే ఎందుకు కుళ్ళిపోయిన మనసుతో ఉందో కధకుడు ఎక్కడా చెప్పలేదు. ఆ అమ్మాయి పుట్టుకే అంతేమో?? కధ మీదా.. పాత్ర మనసుని విశ్లేషణ చేయడమ్ మీదా రచయిత కి ఏమీ శ్రధ్ధ లేదని ఈ కధ చెబుతుంది.

    రమ.

  9. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/16/2011 12:35 pm

    “నూ(గుదోస” “నూదోస’ మీరిన్కా చెప్పందే?? ఇక్కడి సంగతి ఏమి??

    రమ.

  10. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/16/2011 9:41 am

    అతడు ఇచ్చిన విషయము ప్రకారము నూగారు నూంగు + కారు లేక నూఁగు + కారు లేక నూన్ + కారు అవుతుంది.

    మోహనరావు గారు, మీ శ్రమకు కృతజ్ఞతలు. కారు గురించి ఆలోచించాలి.

    rama bharadwaj గారు ఇలా అన్నారు:

    అలాగే ‘నూ(క” అన్నపదం అర్ధానుస్వారమ్ తోనూ అలాగే అక్కడ అరసున్న లేకుండానూ కూడా నిఘంటువులు ఎందుకు పేర్కొంటున్నాయీ? ఇక్కడ అర్ధం ఒకటే మూలధాతువు కూడా ఒకటే అయిన్నీ … ఇలా రెండు రూపాలు– ఒకటి అరసున్న ఉండిన్నీ. ఇంకోచోట లేకపోవడానికిన్నీ కారణం ఏమిటంటారూ??

    మంచి ప్రశ్నే అడిగారు. ఇక్కడ అర్థం, మూలధాతువు ఒకటే కాదండోయ్. (అరసున్న లేని) నూక అన్న పదానికి మూల ధాతువు *నూఱు- అన్న క్రియాపదం. నూఱు అన్న ధాతువుకు విరగకొట్టు, ముక్కలు చేయు అన్న అర్థాలున్నాయి. నూఱుక్క/నూక అంటే విరిగిన ధాన్యం(బియ్యం).

    అరసున్న ఉన్న నూఁక అన్న పదానికి నూంక/నూన్క అంటే నువ్వుల చెట్టు.

    నూనె అన్నది నువ్వు + నెయ్యి అన్న పదాల కలయికే. నువ్వు పదానికి నూఁవు, నూఁబిండి అని అరసున్న రాసిన ప్రయోగాలు ఉన్నాయండి. నూనెలో అరసున్న లేదు అంటే సున్నతోనో, అనునాసికమైన అచ్చుతో ఉండే ఉచ్చారణ ఈ పదబంధం ఏర్పడే నాటికే లుప్తమయ్యుండచ్చని అనుకోవచ్చు.