“రమా భరద్వాజ్ గారు చెప్పినట్టుగా […] నూన్ +కారు అని విరవడం సరైనది కాదు” అన్న వాక్యానికి నేను అలా విరవమన్నాననే అర్ధం చప్పున స్పురిస్తుంది. దాని తరవాతి వాక్యం అయిన ‘నూఁగు+ఆరు= నూఁగారు” అన్న విరుపు నేను చెప్పింది అన్న భావం మీ వాక్యం వెంటనే ఇవ్వడం లేదు. తెలుగు వాక్యాలలో ఎత్తుకోలు మొత్తమ్ భావాన్ని మార్చే ప్రమాదం ఉంది మరి :).
ఏమండీ లైలా గారూ! ఇన్నాళ్ళూ ఈ “నూఁగారు” పాతకాలలోని కవులచేత పద్యాలు రాయించుకుంది. ఇవాళ మీ చేత రాయించుకుంది. మొత్తానికి ఇది అటు కవులక, ఇటు భాష లోని వారికీ బాగానే పని పెట్టింది.
వర్ణ వ్యత్యయం వల్ల “చయన్” “ఏను” గాను,”యెరడు” “రెండు” గానూ అలాగే ఏడు కూడా ఈ విధానం లోనే తెలుగున ప్రవేశించినవి. కన్నడం లోని “హ” తెలుగులో “ప” గా పరివర్తనం చెందినది. వాళ్ళ “హళ్ళి” మన ” పల్లి” అయినట్టు. ఇంకా ఇలా “హత్తి” మన “పది” అట్లా! తెలుగు, ముఖ్యంగా పాత తెలుగు, కన్నడం నించి తన రూపాల్ని గ్రహించింది.
మూలద్రావిడ భాషలనించి దేశి భాషా రూపాల వివరణ, పట్టిక ఇస్తే బాగుంటుందేమో? కనీసం ముఖ్యమైనవీ, నలుగురికీ పరిచయం ఉన్నవీను. తిరుమల రామచద్ర గారి “నుడి- నానుడి” ఇంకా “తెలుగు దాని పుట్టు పూర్వోత్తరాలు” వంటి పుస్తకాలు తెనుగు పాఠకుల మదిని దోచుకున్నవి. అలాంటి ప్రయత్నం మరొకటి చేసే వీలుంది కదా కొలిచాలా??
పెసరు (=పేరు), పెసఱు (పెసలు = greengram) ఒకే ధాతువు నుండి రాలేదు. ఉత్తర ద్రావిడ భాషలైన బ్రాహియిలో పిన్, మాల్తోలో పిన్జె అంటే పేరు. మధ్య ద్రావిడ భాషలైన పర్జీ, గదబ, ఒల్లరీలో పిదిర్ అంటే పేరు అని అర్థం. తమిళంలో పెయర్, కన్నడలో పెసరు/హెసరు. ఇవన్నిటి ఆధారంగా పేరు *పిచర్/*పిసర్- నుండి వచ్చిందని నిరూపించడం సులభం.
పెసఱు (greengram) మాత్రం తమిళంలో పయఱు అని, కన్నడలో పెసఱు/హెసరు అని, నాయికీలో పెసళ్ అని అంటారు. దీనికి పచ/పచ్చ- = green అన్న ధాతువుకు ఏమైనా సంబంధం ఉండవచ్చునేమో కాని పేరుకు సంబంధించింది కాదు.
తెలుగులోని పెసఱు, ఉసిరు/ఉసురు మూలద్రావిడ మాతృకల నుండి కాకుండా కన్నడ నుండి వచ్చాయని మోహనరావు గారు అనడానికి ఆధారాలేమిటో నాకు బోధ పడటంలేదు. అచ్చుల మధ్య స- కార లోపం తెలుగులో సంపూర్ణమైన ధ్వని పరిణామం కాదు. ఒకే ధాతువుకు సంబంధించిన కొసరు, కోరు అన్న పదాలు కూడా తెలుగులో ఉన్నాయి.
సంఖ్యావాచకాల విషయంలో *చయ్‌న్ అన్న మూల ద్రావిడ ధాతువు తెలుగు శాసనాల కాలంలో ఏనుగా మాత్రమే కనిపించి, తరువాత ఆ రూపానికి ఏ మాత్రం సరిపోని అయిదు గా కనిపిస్తోంది కాబట్టి ఆ అయిదు తరువాతి రోజుల్లో కన్నడ నుండి అరువు తెచ్చుకున్నదిగా వివరించరించాల్సివస్తుంది.
తెలుగులో పెసఱు, ఉసురు,కొసరు మొదలైన పదాలు పుట్టుకతోనే తల్లి ద్రావిడభాష నుండి సంక్రంచిన పదాలుగా కాక, తరువాతి కాలంలో కన్నడ నుండి స్వీకరించిన పదాలుగా ప్రతిపాదించడానికి ఆధారాలు ఏవైనా ఉంటే వివరించగలరు.
పెసరు, హెసరుతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హెసరు(ఱు) నుండి వచ్చినదే పెసలు, పెసర కూడ. అంటే ఒకే హెసరునుండి పేరు, పెసలు వచ్చాయి. కన్నడములోని ఉసిరు, ఉసురు నుండి వచ్చినదే తెలుగు ఉసుఱు(రు) కూడ. విధేయుడు – మోహన
“నుసుగు” అన్న పదం ఇప్పటికీ వ్యవహారం లో ఉంది అదే అర్ధం లో!! హమ్మయ్య !!
ఏం చేస్తాం! శంఖంలో పోస్తేనే కదా తీర్థం! కొలిచాల లో ఉత్సాహం చాలా కనిపిస్తుంది. జిజ్ఞాస కూడాను. ఓర్పు కొంచెం ఉండవలసిన విషయం.:) ముఖ్యంగా భాష మీద పనిచేసేటప్పుడు. తగినంత శ్రధ్ధ పెడితే, సమయం పెడితే, తెనుగు భాషా రంగానికి సురేష్ ఏ కోణం నించైనా చెప్పుకోగలిగిన పని చేయగలడు అన్నది నా ఆశ. నా ఆకాంక్షాను. అస్తు.
నూఁగు అన్న పదం వ్యుత్పత్తి గురించి నేను ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారితో గత రెండు రోజులుగా జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా నేను నేర్చుకున్న విషయాలు:
1. నూఁగు అన్న పదానికి నున్- [DEDR 3700] అన్న ధాతువుకు అంతగా సంబంధం లేదు. నున్- అన్న ధాతువు ద్వారా నూఁగు అన్న పదంలోని ప్రథమాచ్చు అయిన దీర్ఘ ఊ- కారాన్ని వివరించలేము.
2. నూఁగు అన్న పదానికి తమిళంలోని నూంగు అన్న పదానికి సంబంధం లేదు.
Tamil lexicon ఆధారంగా: நூங்கு¹ (నూఙ్కు¹) nūṅku, n. cf. ஊங்கு (ఊఙ్కు). 1. Greatness; பெருமை (పెరుమై). (అక. ని.) 2. Abundance, intenseness; மிகுதி (మికుతి). (W.)
3. రమ భరద్వాజ్ గారు చెప్పినట్లుగాచెప్పినట్లుగానే నూఁగారు ను నూన్ + కారు అని విరవడం సరైనది కాదు. వెంట్రుకలకు సంబంధించి నూఁగు పదం తెలుగులో ఇప్పటికే ఉంది కాబట్టి నూఁగు + ఆరు అని విరవడమే సబబు.
4. నూఁగు అన్న పదానికి *నుసి/*నుసు [DEDR 3779] అన్నది సరైన ధాతువు. తెలుగులో -న్‌గు అమహత్వాచకాలకు తగిలించే ప్రత్యయం (ఉదా: *నాలు > నాలుఁగు (four); ఎలు > ఎలుఁగు (bear); పీణ > పీనుఁగు (corpse)). స- కార లోపం వల్ల నుసుఁగు నూఁగు అయ్యింది. ఇట్టి స- కార’ లోపానికి ఇతర ఉదాహరణలు:
కాబట్టి నూఁగారు అన్న పదం నూఁగు + ఆరు నుండే నిష్పన్నమయ్యింది.
నూఁగారు < నూఁగు + ఆరు
నూఁగు < నుసిఁగు < *నుసి < *నుచి (small, minute).
ఇక్కడ క్రియావాచకాలకు, విశేషణాలకు మాత్రమే వాడే "ఆరు" అన్న ప్రత్యయం నామవాచకమైన నూఁగారుకు వాడడం కొంత అరుదైన విశేషమనే చెప్పాలి. బహుశాః నూఁగారు ముందుగా క్రియాపదంగా గాని , విశేషణంగా గాని ఉండి తరువాత అదే పదం నామ్నీకరింపబడి ఉండవచ్చునని చెప్పవచ్చు.
నాకు ఓపిగ్గా ఈ విషయాలు వివరించిన భద్రిరాజు గారికి, చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నా కృతజ్ఞతలు.
I enjoy reading of music articles written by Sri Rohini prasad garu in his unique style, giving the audio and video links of the great
musicians. I am more benifitted by listening to the music links presented by him. I expect more of such articles from Prasad garu
Raja gopal
మహా ప్రస్థానం అప్పుడెప్పుడో చదివాను.
అప్పుడే నా మనసులో రకరకాల చిత్రాలను చిత్రించుకున్నాను.
ఇదేమిటీ ఈ బొమ్మలు
నా ఊహలను దాటి విస్తరించాయి.?
ఓ అదా సంగతి,
బాపు కుంచె కదిలిందా
కదిలిందా కదిలిందా
స్వప్నాలని వదిలిందా ?
వదిలిందా మదినిండా మెదిలిందా
మరల మరల మోగిందా
మరఫిరంగి రంగరించి
రంగ రంగ వైభవమై…
మదినిండా మరకల మొలకల కులుకుల కలకలం..!
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:
09/24/2011 1:18 am
“రమా భరద్వాజ్ గారు చెప్పినట్టుగా […] నూన్ +కారు అని విరవడం సరైనది కాదు” అన్న వాక్యానికి నేను అలా విరవమన్నాననే అర్ధం చప్పున స్పురిస్తుంది. దాని తరవాతి వాక్యం అయిన ‘నూఁగు+ఆరు= నూఁగారు” అన్న విరుపు నేను చెప్పింది అన్న భావం మీ వాక్యం వెంటనే ఇవ్వడం లేదు. తెలుగు వాక్యాలలో ఎత్తుకోలు మొత్తమ్ భావాన్ని మార్చే ప్రమాదం ఉంది మరి :).
ఏమండీ లైలా గారూ! ఇన్నాళ్ళూ ఈ “నూఁగారు” పాతకాలలోని కవులచేత పద్యాలు రాయించుకుంది. ఇవాళ మీ చేత రాయించుకుంది. మొత్తానికి ఇది అటు కవులక, ఇటు భాష లోని వారికీ బాగానే పని పెట్టింది.
వర్ణ వ్యత్యయం వల్ల “చయన్” “ఏను” గాను,”యెరడు” “రెండు” గానూ అలాగే ఏడు కూడా ఈ విధానం లోనే తెలుగున ప్రవేశించినవి. కన్నడం లోని “హ” తెలుగులో “ప” గా పరివర్తనం చెందినది. వాళ్ళ “హళ్ళి” మన ” పల్లి” అయినట్టు. ఇంకా ఇలా “హత్తి” మన “పది” అట్లా! తెలుగు, ముఖ్యంగా పాత తెలుగు, కన్నడం నించి తన రూపాల్ని గ్రహించింది.
మూలద్రావిడ భాషలనించి దేశి భాషా రూపాల వివరణ, పట్టిక ఇస్తే బాగుంటుందేమో? కనీసం ముఖ్యమైనవీ, నలుగురికీ పరిచయం ఉన్నవీను. తిరుమల రామచద్ర గారి “నుడి- నానుడి” ఇంకా “తెలుగు దాని పుట్టు పూర్వోత్తరాలు” వంటి పుస్తకాలు తెనుగు పాఠకుల మదిని దోచుకున్నవి. అలాంటి ప్రయత్నం మరొకటి చేసే వీలుంది కదా కొలిచాలా??
రమ.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
09/23/2011 11:22 pm
పెసరు (=పేరు), పెసఱు (పెసలు = greengram) ఒకే ధాతువు నుండి రాలేదు. ఉత్తర ద్రావిడ భాషలైన బ్రాహియిలో పిన్, మాల్తోలో పిన్జె అంటే పేరు. మధ్య ద్రావిడ భాషలైన పర్జీ, గదబ, ఒల్లరీలో పిదిర్ అంటే పేరు అని అర్థం. తమిళంలో పెయర్, కన్నడలో పెసరు/హెసరు. ఇవన్నిటి ఆధారంగా పేరు *పిచర్/*పిసర్- నుండి వచ్చిందని నిరూపించడం సులభం.
పెసఱు (greengram) మాత్రం తమిళంలో పయఱు అని, కన్నడలో పెసఱు/హెసరు అని, నాయికీలో పెసళ్ అని అంటారు. దీనికి పచ/పచ్చ- = green అన్న ధాతువుకు ఏమైనా సంబంధం ఉండవచ్చునేమో కాని పేరుకు సంబంధించింది కాదు.
తెలుగులోని పెసఱు, ఉసిరు/ఉసురు మూలద్రావిడ మాతృకల నుండి కాకుండా కన్నడ నుండి వచ్చాయని మోహనరావు గారు అనడానికి ఆధారాలేమిటో నాకు బోధ పడటంలేదు. అచ్చుల మధ్య స- కార లోపం తెలుగులో సంపూర్ణమైన ధ్వని పరిణామం కాదు. ఒకే ధాతువుకు సంబంధించిన కొసరు, కోరు అన్న పదాలు కూడా తెలుగులో ఉన్నాయి.
సంఖ్యావాచకాల విషయంలో *చయ్‌న్ అన్న మూల ద్రావిడ ధాతువు తెలుగు శాసనాల కాలంలో ఏనుగా మాత్రమే కనిపించి, తరువాత ఆ రూపానికి ఏ మాత్రం సరిపోని అయిదు గా కనిపిస్తోంది కాబట్టి ఆ అయిదు తరువాతి రోజుల్లో కన్నడ నుండి అరువు తెచ్చుకున్నదిగా వివరించరించాల్సివస్తుంది.
తెలుగులో పెసఱు, ఉసురు,కొసరు మొదలైన పదాలు పుట్టుకతోనే తల్లి ద్రావిడభాష నుండి సంక్రంచిన పదాలుగా కాక, తరువాతి కాలంలో కన్నడ నుండి స్వీకరించిన పదాలుగా ప్రతిపాదించడానికి ఆధారాలు ఏవైనా ఉంటే వివరించగలరు.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:
09/23/2011 7:47 pm
పెసరు, హెసరుతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హెసరు(ఱు) నుండి వచ్చినదే పెసలు, పెసర కూడ. అంటే ఒకే హెసరునుండి పేరు, పెసలు వచ్చాయి. కన్నడములోని ఉసిరు, ఉసురు నుండి వచ్చినదే తెలుగు ఉసుఱు(రు) కూడ. విధేయుడు – మోహన
ఇద్దరు దుర్మార్గులు గురించి Bhaskar Sharma అభిప్రాయం:
09/23/2011 5:18 pm
The story is simple and good.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి lyla yerneni అభిప్రాయం:
09/23/2011 1:18 pm
నైస్! వెరీ నైస్!
సో:-) a verse:
సింగారి!
నీ బంగారు నూఁగారు
నేనంటి నా నానాడు
పొంగారె అంగాలు
పొదలె భోగాలు
ముందు ముందేముందొ
కద! యని నాకెంతొ కంగారు!
లైలా
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:
09/23/2011 12:47 pm
“నుసుగు” అన్న పదం ఇప్పటికీ వ్యవహారం లో ఉంది అదే అర్ధం లో!! హమ్మయ్య !!
ఏం చేస్తాం! శంఖంలో పోస్తేనే కదా తీర్థం! కొలిచాల లో ఉత్సాహం చాలా కనిపిస్తుంది. జిజ్ఞాస కూడాను. ఓర్పు కొంచెం ఉండవలసిన విషయం.:) ముఖ్యంగా భాష మీద పనిచేసేటప్పుడు. తగినంత శ్రధ్ధ పెడితే, సమయం పెడితే, తెనుగు భాషా రంగానికి సురేష్ ఏ కోణం నించైనా చెప్పుకోగలిగిన పని చేయగలడు అన్నది నా ఆశ. నా ఆకాంక్షాను. అస్తు.
రమ.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
09/23/2011 9:47 am
నూఁగు అన్న పదం వ్యుత్పత్తి గురించి నేను ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారితో గత రెండు రోజులుగా జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా నేను నేర్చుకున్న విషయాలు:
1. నూఁగు అన్న పదానికి నున్- [DEDR 3700] అన్న ధాతువుకు అంతగా సంబంధం లేదు. నున్- అన్న ధాతువు ద్వారా నూఁగు అన్న పదంలోని ప్రథమాచ్చు అయిన దీర్ఘ ఊ- కారాన్ని వివరించలేము.
2. నూఁగు అన్న పదానికి తమిళంలోని నూంగు అన్న పదానికి సంబంధం లేదు.
Tamil lexicon ఆధారంగా:
நூங்கு¹ (నూఙ్కు¹) nūṅku, n. cf. ஊங்கு (ఊఙ్కు). 1. Greatness; பெருமை (పెరుమై). (అక. ని.) 2. Abundance, intenseness; மிகுதி (మికుతి). (W.)
3. రమ భరద్వాజ్ గారు
చెప్పినట్లుగాచెప్పినట్లుగానే నూఁగారు ను నూన్ + కారు అని విరవడం సరైనది కాదు. వెంట్రుకలకు సంబంధించి నూఁగు పదం తెలుగులో ఇప్పటికే ఉంది కాబట్టి నూఁగు + ఆరు అని విరవడమే సబబు.4. నూఁగు అన్న పదానికి *నుసి/*నుసు [DEDR 3779] అన్నది సరైన ధాతువు. తెలుగులో -న్‌గు అమహత్వాచకాలకు తగిలించే ప్రత్యయం (ఉదా: *నాలు > నాలుఁగు (four); ఎలు > ఎలుఁగు (bear); పీణ > పీనుఁగు (corpse)). స- కార లోపం వల్ల నుసుఁగు నూఁగు అయ్యింది. ఇట్టి స- కార’ లోపానికి ఇతర ఉదాహరణలు:
*పిచర్ (name) > పెసర్ > హెసర్ (కన్నడ)
> పెయర్ (తమిళ)
> పేరు (తెలుగు)
*ఉచిర్ (life/breath) > ఉసిర్ > ఉసిరు (కన్నడ)
> ఉయిరు (తమిళ)
> ఊర్చు/ఊర్పు/ఊరడిల్లు (తెలుగు)
కాబట్టి నూఁగారు అన్న పదం నూఁగు + ఆరు నుండే నిష్పన్నమయ్యింది.
నూఁగారు < నూఁగు + ఆరు నూఁగు < నుసిఁగు < *నుసి < *నుచి (small, minute). ఇక్కడ క్రియావాచకాలకు, విశేషణాలకు మాత్రమే వాడే "ఆరు" అన్న ప్రత్యయం నామవాచకమైన నూఁగారుకు వాడడం కొంత అరుదైన విశేషమనే చెప్పాలి. బహుశాః నూఁగారు ముందుగా క్రియాపదంగా గాని , విశేషణంగా గాని ఉండి తరువాత అదే పదం నామ్నీకరింపబడి ఉండవచ్చునని చెప్పవచ్చు. నాకు ఓపిగ్గా ఈ విషయాలు వివరించిన భద్రిరాజు గారికి, చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నా కృతజ్ఞతలు.
రావు బాలసరస్వతీదేవి గురించి T.Raja gopal అభిప్రాయం:
09/22/2011 12:11 pm
I enjoy reading of music articles written by Sri Rohini prasad garu in his unique style, giving the audio and video links of the great
musicians. I am more benifitted by listening to the music links presented by him. I expect more of such articles from Prasad garu
Raja gopal
శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి రాణి. అభిప్రాయం:
09/22/2011 6:54 am
మహా ప్రస్థానం అప్పుడెప్పుడో చదివాను.
అప్పుడే నా మనసులో రకరకాల చిత్రాలను చిత్రించుకున్నాను.
ఇదేమిటీ ఈ బొమ్మలు
నా ఊహలను దాటి విస్తరించాయి.?
ఓ అదా సంగతి,
బాపు కుంచె కదిలిందా
కదిలిందా కదిలిందా
స్వప్నాలని వదిలిందా ?
వదిలిందా మదినిండా మెదిలిందా
మరల మరల మోగిందా
మరఫిరంగి రంగరించి
రంగ రంగ వైభవమై…
మదినిండా మరకల మొలకల కులుకుల కలకలం..!
తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి Chinni అభిప్రాయం:
09/21/2011 12:34 am
Too good that you are maintaining this site. Please add more old songs / poems from the great writers.