పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16480

  1. ఊర్మిళాదేవి నిద్ర గురించి Sowmya అభిప్రాయం:

    01/02/2012 5:16 am

    ఓహ్, ఈ వ్యాసానికి రాయబోయిన వ్యాఖ్య మరో ఆడియోకి రాసాను.
    మా తెలుగు పాఠ్యాంశంగా ఉండేది … గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

  2. అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి Sowmya అభిప్రాయం:

    01/02/2012 5:13 am

    ఇందులో కొంత మాకు స్కూల్లో ఉండేది!! మా తెలుగు టీచర్ సరిగ్గా ఇలాగే పాడి వినిపించారు క్లాసులో…దాదాపుగా. నాకు అంత గుర్తు లేదు కానీ – శ్రీరామభూపాలుడు, పట్టాభిషిక్తుడై కొలువుండగా…అనే మొదలైనట్లు గుర్తు మా పాఠం కూడా.
    గుర్తు చేసినందుకు ఈమాటకు ధన్యవాదాలు 🙂

  3. ఉరి: కధ నచ్చిన కారణం గురించి Sowmya అభిప్రాయం:

    01/02/2012 5:09 am

    -ఈ కథ విశ్వనాథ పావనిశాస్త్రి గారి గొంతులో ఆడియో ఫైల్ ఈ బ్లాగులో కొన్నాళ్ళ క్రితం చూశాను. ఈ లంకె కూడా వీలైతే వ్యాసానికి జత చేస్తారని ఇక్కడ వ్యాఖ్య వదులుతున్నాను.

  4. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు గురించి Sowmya అభిప్రాయం:

    01/02/2012 5:02 am

    ఓహో, ఇలా కూడా భాషల్ని వర్గీకరిస్తారా! చక్కటి పరిచయం అందించారు. ధన్యవాదాలు.
    మీరు చెప్పిన వర్గీకరణలు గల భాషల ఉదాహరణ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. హవాయియన్, సుడానీస్,ఎస్కిమో వంటి వాటికి పేర్లోనే ఉదాహరణలు ఉన్నాయి కానీ, క్రో, ఇరుక్వా అంటే ఏమిటో తెలీని నా లాంటి వాళ్ళకి కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఉంటే సౌకర్యంగా ఉండేదేమో.

    మరొక్క సందేహం: ద్రవిడ బంధుత్వాలకి ఆంగ్ల పదం ఏదన్నా ఉందా?? ద్రవిడియన్ కిన్షిప్ అనే అంటారా?

    ఇక, నాలాంటి పామర జనాలకి, మరింత సమాచారం కావాలి అంటే… ఆంగ్ల వికీ లంకె.

  5. కినిమా పత్రికనుంచి గురించి Sowmya అభిప్రాయం:

    01/02/2012 4:29 am

    చాలా ఆసక్తికరంగా ఉన్నాయండీ మీరు చెప్పిన విశేషాలు. ఇలాగే కొనసాగించగలరు. మరోలా మాబోటి వాళ్ళకి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు ఎలాగో!

  6. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Rama Prasad అభిప్రాయం:

    01/01/2012 11:50 pm

    Rohini Prasad garu,

    Thanks for the information about the raagam. I always thought the song in kashmir ki kali and ‘mujhe dekh kar’ in ek musafir ek hasina sounded similar. Now you have confirmed it indirectly. ‘o cheli kopama’ is indeed based on ‘mujhe dekh kar’.

    One more song from Shakuntala ‘madilo maunamuga’ by Ghantasala is also said to be in Khamas.
    Regards,

  7. కినిమా పత్రికనుంచి గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/01/2012 9:21 pm

    Bhavanarayana garu,

    I happen to have with me a few copies of the rare and defunct monthly Kinema. I just have enough tech knowhow to scan its pages and send them across to the editorial board of http://www.eemaata.com that has been kind enough to post the stuff.

    I feel that such archival material provides a glimpse for the present generation into our recent past and increase the general awareness of our journalistic past. I am glad at lease some readers are able to enjoy the experience.

  8. పొదుపు సమీకరణాలు గురించి sarma అభిప్రాయం:

    01/01/2012 8:18 pm

    చదువుతున్నంత సేపు నోరు మూసుకోవడం కష్టమైపోయింది. పొదుపు చేయకపోతే ఎలా!!

  9. కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు గురించి జె. యు. బి. వి. ప్రసాద్‌ అభిప్రాయం:

    01/01/2012 3:43 pm

    ఈమాట సంపాదకులకు,

    మీరు, “ఈ మాటలో ప్రచురించబడ్డ కథలు, కవితలు, వ్యాసాలు ఆంధ్రదేశంలో అచ్చుపత్రికలలోను, తిరిగి పుస్తక రూపంలోనూ అచ్చు వేయించుకునే రచయితలు, ఈ మాట పీర్లు చేసిన మార్పులని తిరిగి మార్చివేసో, లేదా పూర్తిగా తీసివేసో ప్రచురించుకుంటున్నట్టుగా మాకు చూచాయగా తెలియవచ్చింది. ఇది ఎంతమాత్రమూ సహించరాని నైతిక నేరం.” అని రాశారు.

    నేను ఒక యేడాది కిందట, ఒక కధా సంకలనం ప్రచురించాను. అందులో, ‘ఈమాట’లో వచ్చిన నా కధలు కూడా కొన్ని వున్నాయి. స్పష్టంగా అదీ, ఇదీ అని చెప్పలేను గానీ, నా కధలని తిరిగి ప్రచురించేటప్పుడు, వాటిని మళ్ళీ చదవడమూ, తప్పులు దిద్దుకోవడమూ, కొన్ని మార్పులు చెయ్యడమూ చేశాను. అలా చెయ్యడానికి, రచయితగా నాకు నైతిక హక్కు వుంది. అది ఎంత మాత్రమూ ‘నైతిక నేరం’ కాదు. ఒక రచన మీద నైతికంగా పూర్తి హక్కులు ఎప్పుడూ ఆ రచయితకే వుంటాయి. అయితే, ప్రతీ కధ కిందా, అది మొదటి సారి ఎప్పుడు, ఎక్కడ ప్రచురించారో చెప్పడం సంస్కారవంతమైన నైతిక బాధ్యత. దాన్ని నిర్వరించాను. అంతే గానీ, ఒక రచయితకి, తన రచనను పునర్ముద్రించేటప్పుడు, దాన్ని దిద్దుకునే హక్కు లేదనడం నిరంకుశత్వమే.

    అయితే, ‘ఈమాట” పత్రిక్కి ఒక హక్కు వుంది. “ఇక ముందు నుంచి, మీరు పంపే హామీ పత్రంలో అటువంటి మార్పులు ససేమిరా చెయ్యం అని సంతకం చేయాలి. అంతే!” అని రాశారు. అది మీ నియమం. దాన్ని ఇష్టపడే వాళ్ళే, మీకు రచనలు పంపుతారు. లేని వాళ్ళు వూరుకుంటారు. పంపరు. ఇలాంటి నియమం పెట్టడానికి మీకు హక్కు వుంది. అయితే, అలా ఒప్పుకోని వాళ్ళని, ‘నైతిక నేరం’ చేశారని అనడానికి మీకు హక్కు లేదు.

    ఒక రచయిత, తాను రాసింది ఎప్పుడూ తిరిగి చూసుకుంటూ వుండాలి. తప్పు విషయాలు చెప్పినట్లయితే మార్చుకోవాలి. దిద్దు కోవాలి. కావాలంటే, చిన్న సంఘటనలు కలుపుకోవచ్చు, లేదా తీసెయ్యొచ్చు. ఇతరులు ఇచ్చిన సలహాలు సరి కాదనుకున్నప్పుడు, వాటిని మార్చుకునే హక్కు, ఆ రచయితకి ఎప్పుడూ వుంటుంది. వీలైతే, ఈ విషయాలన్నీ తన ముందు మాటలో ఆ రచయిత చెప్పుకోవచ్చు. ఇలా మార్చుకోవడం ఎప్పుడూ అభివృద్ధికరమైన విషయం. దాన్ని ‘నైతిక నేరం’ అని అనకూడదు. మొదటి సారి ప్రచురించినప్పుడు ఎలా వుందో, అచ్చు అలాగే ఎప్పుడూ వుండాలని అని అనడమే ‘నైతిక నేరం’ అవుతుంది.

    – జె. యు. బి. వి. ప్రసాద్‌

  10. కినిమా పత్రికనుంచి గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    01/01/2012 2:27 pm

    RohiniPrasad garu,
    it seems your repertoire as to vintage cinema trivia is on par with that of a veteran professional film journalist of the old dispensation.I thank you for the information on Talat Mohammed’s visit, of his duet and the parallel number. Is the music director , referd as Dattu different from N .Datta?
    Siddineni Bhavanarayana