1. ఈ విషయం లో పరుచూరి శ్రీనివాస్ గారి భావనే సబబనుకుంటున్నాను.
పదునాలుగేళ్ళు నిద్రలో ఉన్న ఊర్మిళతో లక్ష్మణుడు ‘సంభాషణా చాతుర్యం’ చూపిస్తూ సమాధానాలు చెప్పాడనడం అంత బావోలేదు. ఏ మగవాడికైనా పదునాలుగేళ్ళ తర్వాత భార్యను నిద్రలేపి మాట్లాడించేప్పుడు నేను “నీ భర్తను ఫలానా వాణ్ణి” అని నేరుగా చెప్పుకోవడం ఊహాపరంగా ఇబ్బందికరమే.
ఇది కొన్ని ప్రాంతాల సాంప్రదాయం కూడానూ. మా ఇంట ఈ సాంప్రదాయం ఉంది. భర్త భార్యకు నేను నీ భర్తను అని చెప్పడు. సూచిస్తాడు. (దురదృష్టవశాత్తూ :)). మౌఖికము, పైగా స్త్రీల పాటలలో వస్తువైచిత్రి, సంభాషణాశబలత కన్నా స్త్రీ మనసుకు నచ్చిన ఊహలు కల్పించుకోవడంలో ఉన్న ఆనందమే గణనీయమని నేననుకుంటున్నాను.
2. శ్రీరాము తమ్ముండనే!
అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే?
భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో
సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
సృష్టిలో నేను యెరుగ
స్త్రీల పాటలకు, పురుషుల నిస్సహాయత ను వారు ఊహించి ఆనందించే మౌఖిక సాహిత్యం లో అన్వయాన్ని వస్తుతః లేదా రచనా సంవిధానపరంగా కాక, పాడుకునే వారికి కలిగే ఆనందాన్ని అనుసరించి ఊహించడం సబబేమో.
ఆ పాటలలో ఊర్మిళ ఆక్షేపణ ఇచ్చినంత ఆనందం, సరసమైన లక్ష్మణుడి సమాధానం వల్ల కలిగే అవకాశం పాడుకునే వారికి లేదనుకుంటున్నాను.
“…..తహతహగారి వ్యాఖ్య చూసాక నాకు కనిపించిన మరొక చిన్న గందరగోళం:”
కామేశ్వర రావు గారూ గందరగోళం ఏమీ లేదు. ఒక సిద్ధాంతాన్నో , ఆలోచననో ప్రతిపాదిస్తున్న వ్యాసకర్త /ఉపన్యాసకుడు నిరాధారంగా ‘మనం’, మనకు తెలుసు’ అనటం తార్కికంగా నేరం. ఏ మూడు వందల రామయణాలో కాక కేవలం వాల్మీకి రామాయణం మాత్రమే ఆధారంగా ఊర్మిళను గురించి వ్యాసకర్త రాస్తున్నట్టుగా తోపింప జేసేటట్లుగా వ్యాసోపక్రమణిక ఉంది కాబట్టి ‘వాల్మీకి మనకేమీ చెప్పలేదు’ అంటూనే వ్యాసకర్త ‘మనకు తెలుసు’ అనటం నిరాధారంగా ‘మనం’, ‘మనకు తెలుసు’ అంటే ఎంత నేరమో అంత కన్నా ఎక్కువ నేరం. ఈ విషయమే నేను మరో రకంగా చెప్పాను.[ఇది రమ (భరద్వాజ్) గారు గమనించారని ఆమె వ్యాఖ్య ద్వారా నాకు అర్థమయింది ]
2012 సంవత్సరము వచ్చింది. ఈ సారి “ఈ మాట” తెలుగు పత్రిక ముందుమాట మారుతుందా? మారుతుంది అని 🙂 ఒకరు నాతో అంటే, నే నవ్వుకున్నా.
అంతకు ముందు చచ్చిన మగవారి బొమ్మలూ, వారిని స్మరించమని ఆదేశాలతో ముందు మాట మొదలెట్టేవారు. ( “Remember me. Adieu. Adieu” అన్న Hamlet’s Father’s Ghost) లాగా.
ఈ సారి సంచిక రిలీజ్ టైం కి ఎవరూ సాహితీ – సంగీత ప్రముఖులు మరణించలేదేమో, ఏమో మరి – సంచిక ముఖ చిత్రంగా ఒక భారతీయ ఇతిహాసము నుండి 14 సంవత్సరాలు నిద్రలో గడిపిన ఒక స్త్రీ పాత్ర – బొమ్మ, ఆ పురాణ స్త్రీ ద్వారా (తెలుగువారి 16 వ శతాబ్దపు ఆధునికత) తెలిపే రాతలు ఎన్నుకున్నారు.
ఇది ప్రోగ్రెస్సేనా? అని నేను ఇతర పత్రికల ఫేమిలీ డాక్టర్లనడిగితే, చావు సంస్మరణ వదిలి కోమా లాటి నిద్రమాటలు /పాటలలోకి వచ్చింది కదా, బహుశా ఇక, ఈ పత్రిక ‘ముందుమాట’ మెల్లిగా బ్రతుకు వైపు పయనిస్తుందేమో. ఇప్పటి ప్రపంచంలో పడుతుందేమో అని ఆశా భావం వెలిబుచ్చారు.
ఇంతలో, ఈ మాట ముందుమాటలో 🙂 వచ్చిన ఆకస్మిక మార్పు, ఇది.
1. “భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా?”
మా పెద్దవాళ్ళని అడిగాను. ఇలాంటి ఆచారమేదీ (భర్త తన పేరు భార్యకి చెప్పకపోవడం) వారికి తెలియదు. రాజులలో ఉందేమో, లేదా కొన్ని ప్రాంతాలలో ఉన్నదేమో. అయినా నా పాయింటు అది కాదు. అక్కడ లక్ష్మణుడన్న మాటలని వివరించడానికి అసలు దాని ప్రసక్తే అనవసరం అన్నది నా అభిప్రాయం. “దశరథకుమారుడను” అనో, “సుమిత్రానందనుడను” అనో చెప్పుకొని ఉంటే ఆ వివరణ అవసరముండేదేమో. కాని అతను చెప్పిన విధానం చూస్తే, కచ్చితంగా ఊర్మిళ ప్రస్తావించిన వాళ్ళనే తాను ప్రస్తావించడమన్నదే ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అది సంభాషణలో చాతుర్యం.
2. ఇక్కడ నేనిచ్చిన అన్వయం ఒక్కటే సరైనదని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. నారాయణరావుగారు కూడా తన అన్వయం గురించి అలా అంటారని నేననుకోను. ఎందుకంటే మీరన్నట్టుగా నేపథ్యాన్ని బట్టి, దృక్పథం బట్టి అన్వయించుకోడంలో తేడాకి చాలా అవకాశం ఉంది యిక్కడ. ఉదాహరణకి మీరు ప్రస్తావించిన ఇల్లిందుల సరస్వతీదేవిగారి పుస్తకంలో ఆ పాటకి వారిచ్చిన వ్యాఖ్యానం కూడా నారాయాణరావుగారి వ్యాఖ్యానం కన్నా చాలా వేరుగా ఉంది. 1940లో దేవేంద్ర సత్యార్థి యీ ఊర్మిళాదేవి నిద్ర పాటని ఇంగ్లీషులో అనువదించి Modern Review జర్నల్‌లో ప్రచురించారు (ఇల్లిందల సరస్వతీదేవిగారి పుస్తక పీఠికలో సురవరం ప్రతాపరెడ్డిగారు దీని గురించి ప్రస్తావించారు). ఆ అనువాదంలో వారు నాకు తోచిన అన్వయాన్నే తీసుకున్నారు. ఇది కూడా డిజిటల్ లైబ్రరీలో లభ్యమవుతోంది [ఈమాటలో అనుబంధంగా ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – సం.]
నేను చెప్పదలుచుకున్నదల్లా, సరళమైన అన్వయం ఉన్నప్పుడు దాన్ని కాకుండా క్లిష్టాన్వయాన్ని తీసుకోడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని. అందులోనూ అలాంటి అన్వయాన్ని ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగానో ఉదాహరణగానో తీసుకుంటున్నప్పుడు.
మీ 2A వివరణతో నేను ఏకీభవిస్తాను.
4. “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” అనే పదాల వాడుకలో నాకు బాధపడాల్సిన అంశమేదీ కనిపించడం లేదు. ఒకరి వివరణో వ్యాఖ్యానమో విపరీతమనో అతిశయోక్తి అనో అనిపించడం నేరం కాదు కదా. అది చెప్పడం వారిని కించపరచడమూ అవ్వదు. (ఆ మాటకొస్తే నా అభిమాన కవి విశ్వనాథవారి వ్యాఖ్యానం కూడా కొన్ని చోట్ల అతిశయోక్తి, విపరీతమూ అనిపిస్తూ ఉంటుంది!). నాకు చేతనైనంత వరకూ నా అభిప్రాయానికి కారణాలుకూడా చెప్పాను.
వాల్మీకి రామాయణం ప్రసక్తి వచ్చింది కాబట్టి, తహతహగారి వ్యాఖ్య చూసాక నాకు కనిపించిన మరొక చిన్న గందరగోళం: “మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హా లక్ష్మణా అని మాత్రమే అంటాడు.” అన్న వాక్యం. ఇక్కడ నారాయణరావుగారి ఉద్దేశంలో “మనకి తెలిసిన రామాయణం” ఏమిటో నాకు తెలియదు కాని, వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు “హా సీతా! హా లక్ష్మణా!” అనే అరుస్తాడు. అంచేత అది స్త్రీ హృదయానికి ఉదాహరణగా ఇవ్వడం సమంజసం కాదు. విశ్వనాథ కల్పవృక్షంలో మాత్రం మారీచుని పాత్రని ఔన్నత్యం పెంచడానికి, అతనికి అనృతదోషం కలగకుండా అతను “లక్ష్మణాగ్రజా!” అని అరిచాడనీ, అది దూరానికి “లక్ష్మణా” అని మాత్రమే వినిపించిందని ఒక తమాషా మార్పు చేసారు.
ఈమాట పాత వ్యాసాలపై నా కామెంట్స్ ఇప్పుడు పోస్ట్ చెయ్యవచ్చా?
[Yes! నిరభ్యంతరంగా ఏ వ్యాసం మీద, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చును. దయచేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే రాయండి. తెంగ్లీషు వాడకండి. – సం.]
“నియమ కవిత్వం” అని అన్నప్పుడు పాటించవలసిన నియమాలు అందులోనే ఉన్నై కదండి. ఛందోభంగం సూచించడమే పీర్ల ఉద్దేశ్యం అయితే మంచిదే, కానీ రివ్యూ పేరిట కవిభావంలో ఇతరులు కల్పించుకోవటం భావస్వాతంత్ర్యానికి అడ్డుచెప్పటమే అవుతుంది.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి రవి అభిప్రాయం:
01/10/2012 8:30 am
కామేశ్వరరావు గారు సూచించిన అంశాలకు నా ఊహలు.
1. ఈ విషయం లో పరుచూరి శ్రీనివాస్ గారి భావనే సబబనుకుంటున్నాను.
పదునాలుగేళ్ళు నిద్రలో ఉన్న ఊర్మిళతో లక్ష్మణుడు ‘సంభాషణా చాతుర్యం’ చూపిస్తూ సమాధానాలు చెప్పాడనడం అంత బావోలేదు. ఏ మగవాడికైనా పదునాలుగేళ్ళ తర్వాత భార్యను నిద్రలేపి మాట్లాడించేప్పుడు నేను “నీ భర్తను ఫలానా వాణ్ణి” అని నేరుగా చెప్పుకోవడం ఊహాపరంగా ఇబ్బందికరమే.
ఇది కొన్ని ప్రాంతాల సాంప్రదాయం కూడానూ. మా ఇంట ఈ సాంప్రదాయం ఉంది. భర్త భార్యకు నేను నీ భర్తను అని చెప్పడు. సూచిస్తాడు. (దురదృష్టవశాత్తూ :)). మౌఖికము, పైగా స్త్రీల పాటలలో వస్తువైచిత్రి, సంభాషణాశబలత కన్నా స్త్రీ మనసుకు నచ్చిన ఊహలు కల్పించుకోవడంలో ఉన్న ఆనందమే గణనీయమని నేననుకుంటున్నాను.
2. శ్రీరాము తమ్ముండనే!
అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే?
భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో
సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ]
సృష్టిలో నేను యెరుగ
స్త్రీల పాటలకు, పురుషుల నిస్సహాయత ను వారు ఊహించి ఆనందించే మౌఖిక సాహిత్యం లో అన్వయాన్ని వస్తుతః లేదా రచనా సంవిధానపరంగా కాక, పాడుకునే వారికి కలిగే ఆనందాన్ని అనుసరించి ఊహించడం సబబేమో.
ఆ పాటలలో ఊర్మిళ ఆక్షేపణ ఇచ్చినంత ఆనందం, సరసమైన లక్ష్మణుడి సమాధానం వల్ల కలిగే అవకాశం పాడుకునే వారికి లేదనుకుంటున్నాను.
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి TahaTaha అభిప్రాయం:
01/10/2012 5:07 am
కామేశ్వర రావు గారూ గందరగోళం ఏమీ లేదు. ఒక సిద్ధాంతాన్నో , ఆలోచననో ప్రతిపాదిస్తున్న వ్యాసకర్త /ఉపన్యాసకుడు నిరాధారంగా ‘మనం’, మనకు తెలుసు’ అనటం తార్కికంగా నేరం. ఏ మూడు వందల రామయణాలో కాక కేవలం వాల్మీకి రామాయణం మాత్రమే ఆధారంగా ఊర్మిళను గురించి వ్యాసకర్త రాస్తున్నట్టుగా తోపింప జేసేటట్లుగా వ్యాసోపక్రమణిక ఉంది కాబట్టి ‘వాల్మీకి మనకేమీ చెప్పలేదు’ అంటూనే వ్యాసకర్త ‘మనకు తెలుసు’ అనటం నిరాధారంగా ‘మనం’, ‘మనకు తెలుసు’ అంటే ఎంత నేరమో అంత కన్నా ఎక్కువ నేరం. ఈ విషయమే నేను మరో రకంగా చెప్పాను.[ఇది రమ (భరద్వాజ్) గారు గమనించారని ఆమె వ్యాఖ్య ద్వారా నాకు అర్థమయింది ]
ఈమాట జనవరి 2012 సంచికకు స్వాగతం గురించి lyla yerneni అభిప్రాయం:
01/09/2012 11:03 pm
2012 సంవత్సరము వచ్చింది. ఈ సారి “ఈ మాట” తెలుగు పత్రిక ముందుమాట మారుతుందా? మారుతుంది అని 🙂 ఒకరు నాతో అంటే, నే నవ్వుకున్నా.
అంతకు ముందు చచ్చిన మగవారి బొమ్మలూ, వారిని స్మరించమని ఆదేశాలతో ముందు మాట మొదలెట్టేవారు. ( “Remember me. Adieu. Adieu” అన్న Hamlet’s Father’s Ghost) లాగా.
ఈ సారి సంచిక రిలీజ్ టైం కి ఎవరూ సాహితీ – సంగీత ప్రముఖులు మరణించలేదేమో, ఏమో మరి – సంచిక ముఖ చిత్రంగా ఒక భారతీయ ఇతిహాసము నుండి 14 సంవత్సరాలు నిద్రలో గడిపిన ఒక స్త్రీ పాత్ర – బొమ్మ, ఆ పురాణ స్త్రీ ద్వారా (తెలుగువారి 16 వ శతాబ్దపు ఆధునికత) తెలిపే రాతలు ఎన్నుకున్నారు.
ఇది ప్రోగ్రెస్సేనా? అని నేను ఇతర పత్రికల ఫేమిలీ డాక్టర్లనడిగితే, చావు సంస్మరణ వదిలి కోమా లాటి నిద్రమాటలు /పాటలలోకి వచ్చింది కదా, బహుశా ఇక, ఈ పత్రిక ‘ముందుమాట’ మెల్లిగా బ్రతుకు వైపు పయనిస్తుందేమో. ఇప్పటి ప్రపంచంలో పడుతుందేమో అని ఆశా భావం వెలిబుచ్చారు.
ఇంతలో, ఈ మాట ముందుమాటలో 🙂 వచ్చిన ఆకస్మిక మార్పు, ఇది.
“09 జనవరి: ఆకస్మిక ప్రచురణ – వేణునాదం ఆగింది! ఏల్చూరి విజయరాఘవరావుగారికి రోహిణీప్రసాద్ నివాళి.”
అదండి సంగతి.
ఇప్పుడు అసలు సిసలు నివాళి జేర్చారు. ‘ఈ మాట’ ‘ముందు మాట’ కు మునుపటి ( ప్రేత) కళ వచ్చింది.
Ritual జిందాబాద్ !
ఆ ‘ఎవరో’ నాకు చెప్పింది పొల్లు. ఆ వైద్యులు తప్పు. “ఈ మాట” పత్రిక ముందుమాట మారలేదు. నే మళ్ళీ డాలర్ బెట్ గెలుచుకున్నా.
లైలా
ఉరి: కధ నచ్చిన కారణం గురించి madhukar అభిప్రాయం:
01/09/2012 4:10 pm
The writing style, narration and plot seems a bit similar to Mark Twain with putting irony of life as theme.
వేటూరి పాట గురించి అల్లకలలాంలం అభిప్రాయం:
01/09/2012 1:27 pm
మొదటి నుంచి చివరిదాకా చదివాను. దిమాక్ తిరిగిపొయ్యింది. మరీ ఇంత analysis ఈ కాలంలో కూడా జనాలు చేస్తున్నారని expect చెయ్యలేదు!
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
01/09/2012 12:56 pm
శ్రీనివాస్ గారు,
మీ వివరణకు కృతజ్ఞతలు.
1. “భర్త తన పేరు భార్యకి చెప్పడం అనేది మనకు ముందునుంచీ ఉన్నదే అని మీరనుకుంటున్నారా?”
మా పెద్దవాళ్ళని అడిగాను. ఇలాంటి ఆచారమేదీ (భర్త తన పేరు భార్యకి చెప్పకపోవడం) వారికి తెలియదు. రాజులలో ఉందేమో, లేదా కొన్ని ప్రాంతాలలో ఉన్నదేమో. అయినా నా పాయింటు అది కాదు. అక్కడ లక్ష్మణుడన్న మాటలని వివరించడానికి అసలు దాని ప్రసక్తే అనవసరం అన్నది నా అభిప్రాయం. “దశరథకుమారుడను” అనో, “సుమిత్రానందనుడను” అనో చెప్పుకొని ఉంటే ఆ వివరణ అవసరముండేదేమో. కాని అతను చెప్పిన విధానం చూస్తే, కచ్చితంగా ఊర్మిళ ప్రస్తావించిన వాళ్ళనే తాను ప్రస్తావించడమన్నదే ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. అది సంభాషణలో చాతుర్యం.
2. ఇక్కడ నేనిచ్చిన అన్వయం ఒక్కటే సరైనదని చెప్పడం నా ఉద్దేశం ఎంత మాత్రమూ కాదు. నారాయణరావుగారు కూడా తన అన్వయం గురించి అలా అంటారని నేననుకోను. ఎందుకంటే మీరన్నట్టుగా నేపథ్యాన్ని బట్టి, దృక్పథం బట్టి అన్వయించుకోడంలో తేడాకి చాలా అవకాశం ఉంది యిక్కడ. ఉదాహరణకి మీరు ప్రస్తావించిన ఇల్లిందుల సరస్వతీదేవిగారి పుస్తకంలో ఆ పాటకి వారిచ్చిన వ్యాఖ్యానం కూడా నారాయాణరావుగారి వ్యాఖ్యానం కన్నా చాలా వేరుగా ఉంది. 1940లో దేవేంద్ర సత్యార్థి యీ ఊర్మిళాదేవి నిద్ర పాటని ఇంగ్లీషులో అనువదించి Modern Review జర్నల్‌లో ప్రచురించారు (ఇల్లిందల సరస్వతీదేవిగారి పుస్తక పీఠికలో సురవరం ప్రతాపరెడ్డిగారు దీని గురించి ప్రస్తావించారు). ఆ అనువాదంలో వారు నాకు తోచిన అన్వయాన్నే తీసుకున్నారు. ఇది కూడా డిజిటల్ లైబ్రరీలో లభ్యమవుతోంది [ఈమాటలో అనుబంధంగా ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – సం.]
నేను చెప్పదలుచుకున్నదల్లా, సరళమైన అన్వయం ఉన్నప్పుడు దాన్ని కాకుండా క్లిష్టాన్వయాన్ని తీసుకోడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని. అందులోనూ అలాంటి అన్వయాన్ని ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగానో ఉదాహరణగానో తీసుకుంటున్నప్పుడు.
మీ 2A వివరణతో నేను ఏకీభవిస్తాను.
4. “విపరీత వ్యాఖ్యానం”, “అతిశయోక్తి” అనే పదాల వాడుకలో నాకు బాధపడాల్సిన అంశమేదీ కనిపించడం లేదు. ఒకరి వివరణో వ్యాఖ్యానమో విపరీతమనో అతిశయోక్తి అనో అనిపించడం నేరం కాదు కదా. అది చెప్పడం వారిని కించపరచడమూ అవ్వదు. (ఆ మాటకొస్తే నా అభిమాన కవి విశ్వనాథవారి వ్యాఖ్యానం కూడా కొన్ని చోట్ల అతిశయోక్తి, విపరీతమూ అనిపిస్తూ ఉంటుంది!). నాకు చేతనైనంత వరకూ నా అభిప్రాయానికి కారణాలుకూడా చెప్పాను.
వాల్మీకి రామాయణం ప్రసక్తి వచ్చింది కాబట్టి, తహతహగారి వ్యాఖ్య చూసాక నాకు కనిపించిన మరొక చిన్న గందరగోళం: “మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హా లక్ష్మణా అని మాత్రమే అంటాడు.” అన్న వాక్యం. ఇక్కడ నారాయణరావుగారి ఉద్దేశంలో “మనకి తెలిసిన రామాయణం” ఏమిటో నాకు తెలియదు కాని, వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు “హా సీతా! హా లక్ష్మణా!” అనే అరుస్తాడు. అంచేత అది స్త్రీ హృదయానికి ఉదాహరణగా ఇవ్వడం సమంజసం కాదు. విశ్వనాథ కల్పవృక్షంలో మాత్రం మారీచుని పాత్రని ఔన్నత్యం పెంచడానికి, అతనికి అనృతదోషం కలగకుండా అతను “లక్ష్మణాగ్రజా!” అని అరిచాడనీ, అది దూరానికి “లక్ష్మణా” అని మాత్రమే వినిపించిందని ఒక తమాషా మార్పు చేసారు.
వెంటాడుతున్న ఊడుగపూత పరిమళం గురించి srinivas అభిప్రాయం:
01/09/2012 11:33 am
Dear sir,
ఈమాట పాత వ్యాసాలపై నా కామెంట్స్ ఇప్పుడు పోస్ట్ చెయ్యవచ్చా?
[Yes! నిరభ్యంతరంగా ఏ వ్యాసం మీద, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చును. దయచేసి తెలుగు లేదా ఇంగ్లీష్‌లోనే రాయండి. తెంగ్లీషు వాడకండి. – సం.]
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి Bharadwaz అభిప్రాయం:
01/09/2012 8:34 am
చాలా చాలా బాగుందండి!!
కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు గురించి రవి అభిప్రాయం:
01/09/2012 7:03 am
“నియమ కవిత్వం” అని అన్నప్పుడు పాటించవలసిన నియమాలు అందులోనే ఉన్నై కదండి. ఛందోభంగం సూచించడమే పీర్ల ఉద్దేశ్యం అయితే మంచిదే, కానీ రివ్యూ పేరిట కవిభావంలో ఇతరులు కల్పించుకోవటం భావస్వాతంత్ర్యానికి అడ్డుచెప్పటమే అవుతుంది.
పొదుపు సమీకరణాలు గురించి Peram Kiran Kumar అభిప్రాయం:
01/09/2012 6:02 am
చాలా బాగా వ్రాశారు బులుసు సుబ్రహ్మణ్యం గారు.