పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి మోహన అభిప్రాయం:

    03/02/2012 11:33 am

    స్త్రీలందరు శశివదనలు, పద్మినులు కారు, పురుషులందరు ఆజానుబాహులు, అరవిందదళాయతాక్షులు కారు. ప్రపంచములో కుబ్జులు, స్థూలకాయులు, వక్రదంతులు కూడ ఉన్నారు. వీళ్లకు కూడ అందరి లాగే అనుభూతులు, ఆకర్షణలు, అవసరాలు ఉన్నాయి. కన్నబాబు కోనసీమకు మాత్రమే పరిమితుడు కాదు. ఇలాటి కన్నబాబులను ఎన్నోమందిని మనము చూస్తుంటాము, కొన్ని వేళలలో మనమే ఆ కన్నబాబు కూడ. వినాయకుడు చిత్రములా ఈ కథ కూడ ఈ విషయాన్ని చక్కగా ఎత్తి చూపింది. రచయితకు జోహారులు, వందనాలు. విధేయుడు – మోహన

  2. పిలూ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/02/2012 11:00 am

    భావనారాయణగారూ, ఋణం తీర్చుకోవడం మాట ఎలా ఉన్నా ఇటువంటి మంచి సంగీతం విని ఆనందించడం నేర్చుకోమని మీ ఇతర తెలుగు మిత్రులను ప్రోత్సహిస్తే అది అభినందనీయమవుతుంది. నేను మార్చ్ చివరి వారంలో విజయవాడ వెళ్ళి అక్కడ కొన్ని సంగీతసమావేశాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నాను. అందులోని ఉద్దేశం కూడా ఇటువంటిదే.

  3. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Mani Murthy అభిప్రాయం:

    03/02/2012 10:46 am

    కన్నబాబు అలా కళ్ళలొ మెదులుతున్నడు. చాల బావుంది కధ. మంచి కధ చదివామూ అన్న తృప్తి కలిగింది.

  4. పిలూ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/02/2012 10:13 am

    శారదగారు చెప్పిన తెల్లారే దాకా, ఏ దివిలో పిలూ అనే అనుకోవచ్చు. తక్కినవి నాకు తెలియవు కనక వింటేగాని చెప్పలేను. నేను రాసే ఇటువంటి వ్యాసాలన్నీ పాఠకులకూ, శ్రోతలకూ రాగాలని పరిచయం చేసి, గుర్తుపట్టేలా చెయ్యాలనే.
    ఒక ఇంటర్వ్యూలో ప్రసిద్ధ గాయకుడు కుమార్ గంధర్వ 12 స్వరాలున్న భైరవీకన్నా అయిదే స్వరాలున్న భూపాలీ (మోహన) పెద్ద రాగమని అన్నాడు. అందులోని గాఢత, depth వగైరాల దృష్ట్యా ఆయన అలా అన్నాడు. పిలూ కూడా కాస్త light రాగమే. పెద్ద విద్వాంసులు కలగజేసుకునేదాకా!

  5. ఏకైక కథాయానా – మెడికో శ్యామ్ కథలు గురించి chavakiran అభిప్రాయం:

    03/02/2012 10:01 am

    ఈ పుస్తకం ఈ-పుస్తకంగా కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ లింకు చూడండి శ్యాంయానా

  6. తెలుగు భాష వయస్సెంత? గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    03/02/2012 8:55 am

    సుrEష్ గారికి, తః తః గారికి నా దొక మనవి..

    నేను విష్ణు సహస్రనామం చదవను అందులో “చాణూరాంధ్ర నిషూదనః ” అని ఉందని

    నా పరిమితులు మన్నిస్తూ ఈ విషయం కూడా చూడ ప్రార్ధన. The following paragraphs I submit for for your kind perusal.

    Romance branch of languages of the Indo European family like French, have flexible word order as to the relation of noun and adjective. As is the case in the syntactical structure of the majority of this family of languages. This flexibility is attributed to the inflectional capabilities of the particular lexicon of each of these languages. Here a nominative, singular, masculine noun, an accusative plural feminine noun and a dative neutral singular pronoun can be transposed with each other without changing the basic meaning of the expression, yet shifting the emphasis.

    Moulin rouge [a dance hall in the Montmartre section of Paris], means red wind mill. Moulin, the noun precedes rouge, the adjective. As is the case with jambuka vruddham [vrudddha jambukam] of Panchatantram. By this analogy ChaNura may be an accusative noun. The other part of the samasa, “Andhra” may be an adjective rather than be a second accusative noun being governed by the transitive verb.

    N.B. I especially supplicate to Ta.Ta. garu to pardon if a cynic should be so brash as to apprehend. ”A language is more prone to commit suicide rather than to have been slain by an external agent.”

    yours humbly,
    S B N

  7. స్నానాల గదిలో గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    03/02/2012 4:34 am

    విలాసంగా దేవతావస్త్రాలను
    తొడుగుతూన్నది
    ఈల పాట
    …..
    మునివేళ్ళతో నీళ్ళని తాకి చూస్తాను
    తేనీటి కప్పుని పెదవులకి ఆనించినట్టు.

    అభినందనలకు మాటలు లేవు.

  8. భయం గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    03/02/2012 4:29 am

    పూర్ణిమ గారికి,

    పత్రికలో కనిపిస్తున్నందుకు మొదట అభినందనలు. కథ ఆద్యంతమూ అనువాదమని అనిపించలేదు. బాగా రాసారు. అభినందనలు.

  9. పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/02/2012 4:22 am

    తమిళం కూడా మాట్లాడగలిగిన తెలుగు పడుచులు అని మాత్రం ఎందుకని అనుకోకూడదూ కొలిచాలా? వారు కన్నడ స్త్రీలు అన్న ఊహకి అక్కడ ఆధారం ఏమి?? జయకొండర్ మూలభావం గానీ పుట్టపర్తి అనువాదం గానీ అందుకు ఆస్కారం ఇవ్వడం లేదే? సురేశ్ నమ్మకం లాంటిది నారాయణాచార్యుల వారికి సైతం ఎందుకని ఉండకూడదూ? “వడుగరు” అంటె తమకి “ఉత్తరాన ఉన్నవారు” అన్న అర్ధమ్లో తెలుగు వారిని గురించి తమిళులు భావించిన వారు. కరునాడు అంటే నల్లటి భూభాగం అని అనుకున్నా నల్లమలలు ఉన్న ప్రాంతం ఆంధ్రదేశమే కదా? నల్ల కొండలు అన్న అర్ధానికి వీలులేదా? అదటుంచి.. నారాయణాచార్యుల వారు విద్వత్తూ, అనుభవమూ కూడా మెండుగా ఉన్నవారు. పైగా భాషలో అఖండులూనూ! ఆయన అంత నిరాధారంగా మాట్లాడి ఉండరు. సంగీతంలో కర్ణాటకానికి ప్రాంతీయత కన్నా సంగీత పరంగా “శ్రావ్యత” కే పెద్ద పీట వెయ్యవలసి ఉంటుంది. పైగా దానిని గురించి ఎక్కడా అది “ప్రాంత సంబంధిగా” వాడిన ఉదాహరణ మనం ప్రాచీన సంగీత గ్రంధాల నించి ఒక్కటీ చూపించకుండా కేవలం భాషా పరిధిలోనే గిరిగిళ్ళు తిరుగుతూ వ్యాఖ్యానం చేసుకోవడం లో సంపూర్ణత గానీ, బలం గానీ లేదు. ఇన్ని వందల ఏళ్ళలో జరిగిన సంగీత పరిణామ దశలలో దీనిని గురించి ఒక్క ప్రస్తావనా లేకుండానే ఈ పదం సంగీత పరంగా ప్రాచుర్యానికి రాగల వీలులేదు. అందువలన మరిన్ని స్పస్టమైన ఆకరాలు లేకుండా కేవలం ఊహల ఆధారంగా భావనలు చేయడానికి ఇక్కడ శాస్త్రం ఒప్పదు. అది తేలేదాకా బాలమురళీ చెప్పినట్టూ సంగీతపరంగా శ్రావ్యమైన గానంగానే గ్రహించడం, కర్ణాటకం అనే అనడం ఇక్కడ సముచితం. మనకి సంగీత శాస్త్ర పరిణామం చెప్పే శాస్త్ర గ్రంధాల లిస్టు చాలానే ఉంది. అవన్నీ ఎంత దొరుకుతున్నాయివాళ అన్నది సంగీత రంగం లోని వారెవరన్నా చెప్పాలి. ఆ పుస్తకాలు ఏమైనా దీని గురించి చెప్పేయా? అన్నది కూడా తెలుసుకోవలసి ఉంది. కాకపోతే మన దగ్గర గాన విద్య తెలిసిన వారే తప్ప సంగీత శాస్త్రాన్ని గురించి విపులంగా విశదీకరించి చెప్పగల వారెవ్వరూ కనిపించడం లేదు. కనీసం పుస్తకాలని రాసిన వారు ఎక్కువలేరు. ఒకవేళ వీటిని గురించి రాసిన పుస్తకాలంటూ ఏమన్నా ఉన్నా అవి బహుశా చర్చింపబడక పోయి ఉండవచ్చు. వాటిని గురించిన చింత తమకు సంగీతం తెలుసని చెప్పుకునే వారికి ఉన్నట్టు కనిపించదు కూడా! ఇది చాలా విచారించవలసిన విషయమే! చాలా పెద్ద లోటు ఇది. కాకపోతే తెలిసినంత వరకైనా “సప్రమాణంగా” ముఖ్యంగా సంగీత రంగంలో ఇందుకు చాలిన వారెవరైనా మాట్లాడటమే ఎక్కువ బాగుంటుంది.

    రమ.

  10. భయం గురించి Indrajit అభిప్రాయం:

    03/02/2012 2:13 am

    పూర్ణిమ గారు,
    మూల కధ చదవక పోయినా చదివినంత భావన కలిగేటంత చక్కగా అనువదించారు. ముఖ్యంగా భయాన్ని వర్ణించిన తీరు చాలా బాగుంది. కేవలం ఒకరి అనువాదాలనే కాకుండా ఇతరుల అనువాదాలను పరిచయం చేస్తే చదువరులు సంతోషిస్తారు.