పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. పహాడీ రాగం అందాలు గురించి Snkr అభిప్రాయం:

    03/26/2012 10:35 pm

    ప్రసాద్ గారు,
    కొండగాలి తిరిగింది,
    గుండెవూసులాడింది
    గోదావరి వరదలా కోరిక చెల రేగింది ఆ..ఆ..
    ఇది ఖచ్చితంగా పహాడీ అయివుంటుందనిపిస్తోందండి. ఎంత హాయిగా వుంటుందో.

  2. 88 ఏళ్ళ యువకులు గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/26/2012 7:49 pm

    భావనారాయణగారూ,
    మా అమ్మ చిన్నప్పుడు పాడేది. సంగీతమేమీ నేర్చుకోలేదు.

  3. నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    03/26/2012 2:06 pm

    బృందావనరావు గారూ,
    శ్రీనాథుడి సీసం, తిక్కన కందం, Wordsworth Daffodils, హైస్కూలు రోజూలూ…. You steered the sketch in such way that the evocative pull has rendered us to turn again to Haravilasam and to Naishadham. You have driven me to feel nostalgic and in my case, the preference for the single most memorable high school piece from the same poet is another seesam.
    ” రాయంచ యంచు చీరకు జొక యగు గాక పచ్చి ఏనిక తోలు పచ్చడంబు ”
    Thank you for retrieving the volition for Sreenatha. by your deft handling of undercurrent in the selection of the poet from the indigenous lexicon and the native prosody.

    ..Yours
    Siddineni Bhava Narayana

  4. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి తః తః అభిప్రాయం:

    03/26/2012 2:03 pm

    శ్రీ రోహీణీప్రసాద్ ఘంటసాల పాడినట్లుగా రాసేసినట్లున్నారు.
    “అకటా దయలేనివారు మీ యాడవారు”లో ‘అకట’ అని ఉండాలి. దయ చేసి దీన్ని కూడా సవరించండి. పద్యాలని పాడేవాళ్ళు ఇవి గమనించరనిపిస్తుంది. నిజానికి పద్యాలను పాడకూడదు. ‘అకట’ అని ఉన్న దాన్ని అలాగే ఉంచి పాడ(లే)క పోవటం తప్పే.

  5. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి తః తః అభిప్రాయం:

    03/26/2012 10:12 am

    యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మ

    అన్న పాదం లొ ‘ఆ పయి’ అని ఉండాలి , ‘ఆపై’ అని కాదు. రొహిణీ ప్రసాద్ గారికి అక్షరాలు చూసే వాళ్ళంటే చిరాకయినా అలా రాయకపోతే కవికి చందస్సు తెలీదనిపించే ప్రమాదముంది.

    [సవరించాము. కృతజ్ఞతలు – సం.]

  6. రచయితలకు సూచనలు గురించి dasthagiri అభిప్రాయం:

    03/26/2012 8:13 am

    నమస్తే, రచనలు పంపడానికి మీరు ఇచ్చిన ఈ మైల్ submissionsATeemaata.com not recognized అని వస్తున్నది. తగు సలహా ఇవ్వగలరు.

    -దస్తగిరి

    [AT కి బదులుగా @ అని ఉంచి మెయిల్ పంపండి. – సం.]

  7. బిచ్చగత్తె శిశువు గురించి Uma Pochampalli అభిప్రాయం:

    03/26/2012 7:10 am

    అందాల అలరారు బంగారు బాలుని గని,
    అందించితివీవు అర్ద్రతతొ ఒక రూక
    వెలగట్టలేదులే వెలతి చెందకు మదిన,
    పాల్దాగు పసివాడి తల్లెట్ల తిరుపమయె
    తీర్పు చెప్పగ రావె ఆది భిక్షుక, పాహి!

  8. చేపలార్బరు దినాలు గురించి Uma Pochampalli అభిప్రాయం:

    03/26/2012 6:51 am

    Your poem is so melodious and in fact if we read the original, it surpasses the quality and content of it. తెలుగు లోని చక్కదనం తొంగిచూస్తుంది మీ అందమైన పదావళి చాలా బావుంది.

  9. స్నానాల గదిలో గురించి సురేష్ అభిప్రాయం:

    03/26/2012 6:43 am

    ఆడపిల్లా, అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిల్లా కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు, బావుంది
    మీ కవితా వస్తువూ, ప్రేంకుమార్ చమక్కు.

    సురేష్

  10. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/26/2012 6:37 am

    SBN garu,

    Emani was certainly one of the many Telugus that SS Vasan had managed to stifle. In spite of his efforts Emani’s name does not appear as MD for Avvayyar. As for your query, Paruchuri Sreenivas garu may be able to throw some light.